సుప్రీమ్ కోర్టు సుప్రిమెసీకి బీటలువారుతున్నాయా?

సుప్రీమ్ కోర్ట్... భారతీయులందరికీ దీనిపై ఇప్పటికీ చాలా విశ్వాసం, భయ, భక్తులు వున్నాయి. సుప్రీమ్ లో విషయం తేలిపోతే ఇక మరో దిక్కుండదని అంతా భావిస్తారు. ఆఖరుకు ఉరి శిక్ష అయినా సరే సుప్రీమ్ వరకూ ఒక్కో కోర్టులో ప్రశ్నిస్తూ వెళ్లవచ్చు. కాని, అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చాక ఎవ్వరైనా చేసేదేమీ వుండదు. క్షమాభిక్షలు పెట్టే అవకాశం రాష్ట్రపతికి వున్నా ఆయన కూడా సుప్రీమ్ కోర్టు మాటను తక్కువ చేస్తూ ఇష్టానుసారం క్షమాభిక్షలు పెట్టరు! అంతలా దేశంలోని ప్రతీ ఒక్కరూ అత్యున్నత న్యాయస్థానాన్ని గౌరవిస్తారు. అందుకు తగ్గట్టే చాలా సార్లు న్యాయం వైపు తీర్పులు ఇస్తూ మన సుప్రీమ్ చరిత్ర సృష్టించింది...  చిన్న చిన్న ఆస్తి గొడవలు మొదలు అయోధ్య రామ మందిర వివాదం వరకూ ఎన్నో కేసులు సుప్రీమ్ గడప తొక్కుతుంటాయి. అక్కడైతే న్యాయం దక్కుతుందన్న విశ్వాసం అందరిలోనూ వుంది. కాని, రాను రాను మన దేశంలో అన్ని వ్యవస్థల్లాగే సుప్రీమ్ కు కూడా ప్రమాదం పొంచి వున్నట్టు కనిపిస్తోంది! గత కొన్ని రోజుల్లో రెండు సార్లు సుప్రీమ్ కోర్టు ఆర్డర్స్ ధిక్కరణకు గురయ్యాయి. అదీ ఏ విదేశీ కంపెనీల వల్లనో, లేక ఉగ్రవాదుల వల్లనో కాదు.. మన దేశంలోని సంస్థలు, ప్రభుత్వాలే అత్యున్నత న్యాయస్థానాన్ని అవమానపరుస్తున్నాయి! సుప్రీమ్ కోర్టుకు బీసీపీఐకి ఇప్పుడు ఇంచుమించూ వార్ నడుస్తోంది. వేల కోట్ల విలువైన బీసీసీఐ రాజకీయాల పుట్ట. ఇది అందరికీ తెలిసిందే. అందుకే, అందులో సంస్కరణలు రావాలని, నిజమైన క్రికెటింగ్ టాలెంట్ వెలుగు చూడాలని, ప్రపంచ క్రికెట్లో మన భారత టీం మరింత సమర్థంగా రాణించాలని చాలా మంది అంటుంటారు. మరీ ముఖ్యంగా బీసీపీఐ నిర్వహణ, నిధుల వినియోగం, టీమ్ సెలక్షన్స్, ఐపీఎల్ లాంటి అంశాల్లో ఈ మధ్య తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. గోల్ మాల్ ఎక్కువైందని అంటున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐని భారీగా సంస్కరించేందుకు లోథా కమిటీ వేశారు. ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సులు చాలా వరకూ బీసీసీఐ పెద్దలకు నచ్చలేదు. అవ్వి అంగీకరిస్తే తమ పప్పులు ఇక మీద ఉడకవని వారి భయం, బాధ. కాని, ఈ మొత్తం వ్యవహారంలోకి సుప్రీమ్ కోర్టు కూడా ఎంటర్ అయింది. బీసీసీఐని లోథా కమిటీ సిఫార్సులు అంగీకరించి పారదర్శకత పెంచమని న్యాయస్థానం ఆదేశించింది. అయితే, విచిత్రంగా దేశపు అత్యున్నత న్యాయస్థానం చెప్పినా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ధిక్కరించేసింది. ఓ మీటింగ్ పెట్టుకుని లోథా కమిటీ సిఫార్సులు దాదాపుగా తిరస్కరిస్తున్నట్టు చెప్పేసింది! కోర్టు ఆర్డర్స్ కూడా బేఖాతరు చేసేసింది! సుప్రీమ్ మాటని కాదని షాక్ ఇచ్చిన మరో వ్యవస్థ... కర్ణాటక ప్రభుత్వం. ఈ మధ్య తమిళనాడుకి కావేరీ నీళ్లు ఇవ్వమని పదే పదే న్యాయస్థానం సిద్దరామయ్య సర్కార్ కు చెబుతోంది. అయినా ససే మీరా అంటోంది అక్కడి కాంగ్రెస్ గవర్నమెంట్. తమ రాష్ట్రానికి నీళ్లు సరిపడా స్టోర్ అయ్యాకే తమినాడుకి వదులుతామని తేల్చి చెప్పేస్తున్నారు! ఏకంగా మాజీ ప్రధాని దేవేగౌడ నిరాహార దీక్షకు కూర్చుని కోర్టుని అవమానిస్తున్నారు! న్యాయం ఆధారంగా తీర్పునిచ్చే కోర్టును కూడా మన రాజకీయ నేతలు పట్టించుకోకుంటే... ఇక వివాదాలు తేలేది ఎలా?  బీసీసీఐ, కర్ణాటక ప్రభుత్వం సుప్రీమ్ తీర్పుల్ని ధిక్కరించటం వెనుక బలమైన కారణాలే వుండొచ్చు. అవ్వి సరైనవా కాదా అనేది చర్చ కాదు. రీజన్స్ ఎన్ని వున్నా ఇలా ఎవరికి వారు మొండిగా అత్యున్నత న్యాయస్థానాన్ని ధిక్కరిస్తే... ఆ వ్యవస్థ వుండటం ఎందుకు? మామూలు జనం మాత్రం సుప్రీమ్ ని ఎందుకు గౌరవిస్తారు? ఎందుకు విశ్వాస్తారు? ఇప్పటికే కోర్టుల్లో తీర్పులు కొనుక్కోవచ్చని కొంత మంది ఆరోపణలు చేస్తుంటారు. ఇప్పుడు వచ్చిన సరైన తీర్పుల్ని కూడా పాటించకపోతే.... న్యాయ స్థానాలకి వున్న ప్రతిష్ఠ పూర్తిగా పోతుంది. అది దేశంలో అరాచకానికి దారి తీసే ప్రమాదం వుంది. కాబట్టి సుప్రీమ్ కోర్టుని ప్రతీ ఒక్కరూ గౌరవించాల్సిందే! ప్రవైట్ సంస్థ అయిన బీసీసీఐ అయినా... ప్రజలు ఎన్నుకున్న కర్ణాటక సర్కార్ అయినా...

యుద్ధంలో... వాళ్లు సైనికులు కాని సైనికులు!

మొన్న ఉడీ ఉగ్రదాడి. తరువాత అనూహ్యంగా భారత్ మెరుపు దాడి. మొత్తంగా ఇప్పుడు యుద్ధ వాతావరణం! ఇండియా, పాకిస్తాన్ రెండు దేశాలూ ట్రిగ్గర్లపై వేలు పెట్టి నొక్కటానికి సిద్ధంగా వున్నాయి. ఇక మన దేశంలో అయితే యుద్దం చేయాల్సిందేనన్న నినాదాలు మార్మోగిపోతున్నాయి. ఇప్పటికే సర్జికల్ స్ట్రైక్స్ తో మన ఆర్మీ సత్తా చాటడంతో పాక్ పని పట్టాల్సిందేనంటున్నారు 125కోట్ల జనం! కాని, ఈ సమయంలో మనమందరం పట్టించుకోని అసలు సిసలైన ఆయుధాలు పట్టని జవాన్లు కొందరున్నారు! వారెవరో మీకు తెలుసా?  యుద్ధం జరిగితే అటు పాక్ మిలటరీ మోహరిస్తుంది. ఇటు భారత్ సైన్యం సర్వసన్నద్ధంగా వుంటుంది. భారీగా బుల్లెట్ల వర్షం కురిపిస్తూ పోరాటం చేస్తారు. కాని, వీరి మధ్యలోనే ఆయుధాలు లేకుండా యుద్ధం చేసే లక్షల మంది జవాన్లు వున్నారు! వాళ్లే సరిహద్దు గ్రామాల ప్రజలు! మరీ ముఖ్యంగా, కాశ్మీర్, పంజాబ్ ప్రాంతాల్లోని వందల గ్రామాల జనం ఇప్పుడు యుద్ధంలో భాగమైపోతున్నారు. మనందరిలా వీళ్లు టీవీల్లో దాడుల దృశ్యాలు చూసి ఆవేశపడిపోరు! ప్రత్యక్షంగా కాల్పుల్ని చూస్తారు! పేలుళ్ల శబ్దాలు వింటూ హడలిపోతుంటారు! తమ పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని జాగ్రత్తగా చూసుకునేందుకు నానా యాతన పడుతుంటారు! అయినా, దేశ సరిహద్దుల్లో వున్న లక్షల మంది సామాన్య జనం మనందరిలాగే పాక్ పై కాలుదువ్వుతున్నారు! తమకు ఎంత ఇబ్బంది కలిగినా సమరం సాగాల్సిందే అంటున్నారు. పక్క దేశం నక్క జిత్తులు శాశ్వతంగా నశించాలని కోరుకుంటున్నారు...  పంజాబ్, కాశ్మీర్లలో పాక్ సరిహద్దు వెంట వుండే అనేక గ్రామాలకు రోజూ ఆర్మీ కవాతులు, పేలుళ్ల చప్పుడూ మామూలే. కాని, ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకోవటంతో మరింత ఉద్రిక్తంగా పరిస్థితుల్లో మారిపోయాయి. కొన్ని చోట్ల అయితే మన రైతులకి పొలం సరిహద్దుకి అటు వేపు కొంచెం, ఇటు వేపు కొంచెం వుంటుంది! ఆ రైతులు ఇటు భారత సైనికులకి, అటు పాకిస్తాన్ సైనికులకి తమ ఐడెంటిటి కార్డులు చూపించి పొలంలోకి వెళ్లాల్సి వస్తుంది! యుద్ధం మన మీద కేవలం మానసిక ఒత్తిడి మాత్రమే . వాళ్లకు ప్రత్యక్ష సంక్షోభం!  పాక్ మన సైనిక చర్య తరువాత లోలోపల ఉడికిపోతోంది. ఎలాగైనా దెబ్బ కొట్టాలని చూస్తోంది. అందుకే, మన ఆర్మీ పంజాబ్ రాష్ట్రంలోని వందల గ్రామాల్ని ఖాళీ చేయిస్తోంది. బార్డర్ కి దూరంగా సురక్షిత ప్రాంతాల్లో శిబిరాలు వేసి అక్కడ వుంచుతోంది! ఇందుకోసం స్వంత గ్రామాల్ని వదిలి అక్కడి సామాన్య జనం కట్టుబట్టలతో వళ్లిపోతున్నారు. భార్య, బిడ్డల్ని పట్టుకుని పని, పాటా వదిలేసి బిక్కుబిక్కుమంటూ మరోచోట వుండాల్సి వస్తోంది వారు! అందుకే, వాళ్లు యుద్ధంలో పాలు పంచుకున్నట్టే! జవాన్ల మాదిరిగా దేశం కోసం నిద్దుర లేని రాత్రులు గడుపుతున్నట్టే! అలాంటి బ్రేవ్ కామన్ ఇండియన్స్ కి జై కోట్టాల్సిందే!  జై హింద్... భారత్ మాతాకీ జై!

ఆ మినిస్టర్స్ కి సంక్రాంతి సంబరాలు లేనట్టేనా?

ఏపీ క్యాబినేట్లో ఇప్పుడంతా టెన్సన్ టెన్షన్ గా వుంది! కారణం సీఎం చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ నిర్ణయమే! విస్తరణ అంటే కొత్త ముఖాలు వుంటాయి అని హాయిగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేదు అమాత్యులకి! ఇప్పుడున్న వారిలో కొందరికి ఉద్వాసన కూడా తప్పదని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదీగాక క్యాబినేట్ ఏర్పాటై రెండున్నరేళ్లు కావొస్తోంది కాబట్టి మార్పులు, చేర్పులు, తీసివేతలు, ఏరివేతలు మామూలే కూడా...  టీమ్ చంద్రబాబులో ప్రస్తుతం ఆయనతో సహా ఇరవై మంది మంత్రులు వున్నారు. అయితే, వీరిలో కొందరికి ఎగ్టిట్ తప్పదని ఈ మధ్య చంద్రబాబే స్వయంగా సూచించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పర్ఫామెన్స్ బాగా వున్నా వారికి ప్రమోషన్ వుంటుందనీ... లేని వారికి మంత్రి పదవి ఊడుతుందని ఆయన అటుఇటుగా చెప్పేశారు. కాబట్టి, ఎన్నికలు పూర్తయ్యాక , అంటే, జనవరిలో కొందరు మంత్రులపై వేటు వుండే అవకాశం వుంది. అయితే, వారెవరో ఆల్రెడీ బాబు నిర్ణయించుకున్నారని కూడా టాక్ నడుస్తోంది. మొత్తం అయిదుగురు మినిస్టర్స్ బ్యాగ్ లు సద్దుకోవాల్సి రావచ్చని టీడీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు. వాళ్లెవరో ఇంకా క్లారిటీ లేకున్నా ఒక లేడీ మినిస్టర్ కూడా పదవి కోల్పోయే పరిస్థితిలో వుందంటున్నారు! నిజానికి దసరా టైం కల్లా మంత్రవర్గ విస్తరణ వుంటుందని తొలుత అనుకన్నారు. కాని, త్వరలో ఎన్నికలు వచ్చిపడటంతో క్యాబినేట్ రీషపుల్ జనవరి దాకా వాయిదా పడింది. అయితే, అప్పుడు మాత్రం ఇప్పుడున్న వారిలో ఒక అయిదు మంది ఔటై కొత్త వారు పది మంది దాకా ఇన్ అవుతారంటున్నారు. వీళ్లను కులాలు, ప్రాంతాలు, జిల్లాల ఆధారంగా అన్నీ లెక్కలు సరిచూసుకుని ముఖ్యమంత్రి టీమ్ లోకి తీసుకుంటారని చెబుతున్నారు. వీళ్లలో వైసీపీ నుంచి వచ్చిన వలస ఎమ్మేల్యేలు కూడా వుండే ఛాన్స్ వుందట!  

సర్జికల్ స్ట్రైక్స్... అంటే ఏంటి?

పర్జికల్ స్ట్రైక్స్... ఇప్పుడు దేశంలో ఎక్కడ విన్నా వినిపిస్తోన్న పదం ఇది! ఇండియన్స్ అంతా గర్వంగా చెప్పుకుంటున్నారు మన ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేసిందని! కాని, ఇంతకీ సర్జికల్ దాడులంటే ఏంటి? ఇది చాలా మందికి తెలిసినట్టు లేదు. తెలిసినా పూర్తిగా అవగాహన వున్నట్టు లేదు. చాలా మంది సర్జికల్ స్ట్రైక్స్ అంటే పూర్తి స్థాయి యుద్ధం లాంటి పరిస్థితులు అనుకుంటున్నారు. కాని, అది నిజం కాదు...  సర్జికల్ స్ట్రైక్స్ అంటే... ఒక నిర్ధిష్ట గమ్యాన్ని ఎంచుకుని అక్కడికి వెళ్లి శత్రువుల్ని అంతం చేయటం, వారి స్థావరాల్ని ధ్వంసం చేయటం. దీని వల్ల వీలైనంత తక్కువ ప్రాణ , ఆస్తి నష్టం జరుగుతుంది. మరీ ముఖ్యంగా సాధారణ పౌరుల్ని చనిపోయే అవకాశం అస్సలు వుండదు. కాకపోతే, సర్జికల్ స్ట్రైక్స్ మామూలు దాడుల కంటే చాలా ఎక్కువ ప్రతిభ, నైపుణ్యంతో కూడుకున్న విషయాలు. చాలా పక్కగా లెక్కలు వేసుకుని, టెక్నాలజీ సాయంతో ఆర్మీ ముందుకు పోతుంది. ఎక్కడా తేడా రాకూడదు. అప్పుడే టార్గెట్ నాశనమయ్యేది! ఇండియా తాజాగా చేసిన సర్జికల్ దాడుల్లో... టార్గెట్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలు. అక్కడ టెర్రరిస్టులకి నివాసం, ట్రైనింగ్ ఇస్తుంటుంది పాకిస్తాన్ ఐఎస్ఐ. మొన్న జరిగిన ఉడీ దాడుల్లాంటి వాటిల్లో పాల్గొన్న ఉగ్రమూకలు ఇక్కడ్నుంచి వచ్చినవే. జైషే మహ్మద్, లష్కరే తోయిబా లాంటి టెర్రరిస్టు సంస్థలు ఇక్కడ తిష్టవేశాయి. వాటికి రక్షణగా పాకిస్తాన్ మిలటరీ వుంటుంది.  పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని టెర్రర్ క్యాంపులపై దాడి చేయాలనుకున్న ఇండియన్ ఆర్మీ ఎగ్జాక్ట్ గా ఏం చేసిందో మనకు తెలియదు. అది బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే, సీక్రెట్ ఆపరేన్స్ ఎలా జరిగాయో స్పష్టంగా ఎవ్వరూ చెప్పరు. కాకపోతే, సర్జికల్ స్ట్రైక్స్ అన్న పదం వాడకంతో ఒకటి మాత్రం క్లియర్. మన స్పెషల్లీ ట్రైన్డ్ ఆర్మీ కమాండోస్ మొదటగా హెలికాప్టర్స్ లో వెళ్లి సరిహద్దుల కావల దిగారు. తరువాత కంట్రోల్ రూం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం ముందుకు పోతూ టార్గెట్స్ రీచ్ అయ్యాక శత్రవుల్ని మట్టుబెట్టారు. అయితే, ఇక్కడ మనం చెప్పుకున్నంత సింపుల్ గా వుండదు దాడులు జరుగుతున్న సమయంలో. అదీ రాత్రి వేళ దాడి జరిగింది కాబట్టి చాలా ప్రమాదకరంగా ఆపరేషన్ నడిచి వుంటుంది. ఏ మాత్రం తేడా వచ్చిన మన సైనికుల ప్రాణాలకు ప్రమాదమే! సర్జికల్ స్ట్రైక్స్ సక్సెస్ లో ఆర్మీదే కీలక పాత్ర అయినప్పటికీ ఎక్స్ టర్నల్ ఇంటలిజెన్స్, ఇంటలిజెన్స్, రా ఏజెంట్ల పాత్ర కూడా ఎంతో ముఖ్యం. అనేక విభాగాల ఇంటలిజెన్స్ సమాచారంతోనే ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుంది. పక్కా ప్లానింగ్, పక్కా సమన్వయం చాలా ముఖ్యం... సర్జికల్ దాడుల్ని మోదీ ఎంచుకోవటానికి మరో కారణం వీటి వల్ల పూర్తి స్థాయి యుద్దం జరిగే అవకాశాలు లేకపోవటమే. పాక్ ఫుల్ లెంగ్త్ వార్ జరిగితే న్యూక్లియర్ వెపన్స్ అంటోంది కాబట్టి ఈ సర్జికల్ స్ట్రైక్స్ వల్ల ఆ దేశానికి అణు బాంబులు వేసే అవకాశం వుండదు. ఈ దాడులు అధికారికంగా పాక్ మీద కాదు. కేవలం టెర్రరిస్టుల మీదే. కాబట్టి అంతర్జాతీయంగా ఎదురయ్యే ఒత్తిడితో పాక్ అణు ఆలోచనలు పక్కన పెట్టాల్సి వస్తుంది. మొత్తానికి సర్జికల్ స్ట్రైక్స్ తో ఇండియా పాక్ ని షాక్ చేసిందనే చెప్పొచ్చు!     

ప్రతీకారం మొదలైంది...

సెప్టెంబర్ 28... భగత్ సింగ్ జయంతి! అదే రోజు రాత్రి భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కాలుమోపింది! దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఆ అమరవీరుడికి నివాళి అన్నట్టు నిప్పుల వర్షం కురిపించింది. దేశం కోసం భారతీయులు ఎంతకైనా తెగిస్తారని చరిత్రకి మరోసారి ఋజువు చేసింది!  ఇంతకాలం ఉగ్రవాదంతో భారత్ ను గిల్లుతూ వచ్చిన పాక్ కు ఎట్టకేలకు ప్రతి దాడి రుచి ఎలా వుంటుందో తెలిసొచ్చింది. స్వయంగా భారత్ ఆర్మీ అంగీకరించిన దాని ప్రకారం మన సైనికులు పీఓకేలోకి చొచ్చుకుపోయి ఉగ్ర స్థావరాలపై దాడులు చేశారు. ఈ వేటలో దాదాపు 40మంది టెర్రరిస్టులు హతమైనట్టు ప్రాథమిక అంచన. మన వైపు ఎలాంటి నష్టం జరగనప్పటికీ పాక్ సైనికులు ఇద్దరు కాల్పుల్లో మరణించినట్టు తెలుస్తోంది. ఇక్కడ విశేషం ఏంటంటే, ఇండియన్ ఆర్మీ ఈ సర్జికల్ స్ట్రైక్స్ చెప్పి మరీ చేసింది. పాక్ ఆర్మీకి సమాచారం ఇచ్చాకే తాము ఉగ్రవాదులపై విరుచుకుప్డడామని భారత ఆర్మీ అధికారులు చెప్పారు. పాకిస్తాన్ మాత్రం భారత్ భీకర దాడితో టోటల్ కన్ ఫ్యూజన్ లో పడినట్టు కనిపిస్తోంది! ఒకవైపు ప్రధాని నవాజ్ షరీఫ్ దాడుల్ని ఖండిస్తున్నామని అంటే పాక్ మిలటరీ అసలు దాడుల్లాంటివేం జరగలేదని చెబుతోంది! ఐఎస్ఐ తన వద్ద ఎలాంటి సమాచారమే లేదని అంటోంది! ఇలా పాకిస్తాన్ గందరగోళంలో వున్నట్టు స్పష్టమైపోతోంది...  మోదీ సర్కార్ నిజంగా దాడులు చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అందరూ పాక్ పై ఆవేశంతో యుద్ధం చే్ద్దామని అన్నా లోలోన ఇండియా అందుకు సిద్ధపడదని భావించారు. కొందరు మేధావులు, అభ్యుదయవాదులు తమదైన రీతిలో ఎప్పటిలాగే యుద్ధం వద్దని శాంతి వచనలు చెప్పారు. కాని, మోదీ, పారికర్, అజిత్ ధోవల్ త్రయం అర్థ రాత్రి పూట అందర్నీ ఆశ్చర్యపరిచింది. శత్రుదేశం స్వాధీనంలో వున్న ఉగ్ర నేలపైకి చొచ్చుకుపోయి మన వారు సత్తా చాటారు! దీనికి పాక్ ప్రతీకారం తీర్చుకునే అవకాశాలు కూడా మెండుగానే వున్నాయి. కాని, అలా పాకిస్తాన్ ప్రతి దాడులకి దిగితే మరింత భీకర యు్ద్ధ వాతావరణం నెలకొనే ప్రమాదం వుంది. దాని వల్ల మనకు నష్టం. పాక్ కు మరీ ఎక్కువ నష్టం...  కొన్ని రోజులుగా సింధూ జలాల ఒప్పందం రద్దు, పాకిస్తాన్ కు వున్న మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాపై పునరాలోచన  లాంటి మాటలు బలంగా వినిపించాయి. దానికి తోడు పాక్ లో జరగాల్సిన సార్క్ సమావేశాన్ని భారత్ తన పలుకబడితో రద్దు చేయగలిగింది. ఇండియా పాకిస్తాన్ లో జరిగే సార్క్ సమావేశానికి వచ్చేది లేదనటంతో బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, భూటాన్ లు కూడా నో చెప్పాయి. ఈ కారణంగా సార్క్ సమావేశమే రద్దైంది. ఇది పాక్ కు నిజంగా పెద్ద ఎదురుదెబ్బ. ఇక అటు రష్యా, అమెరికా లాంటి దేశాలు కూడా స్పస్టంగా భారత్ అనుకూల వైఖరి అవలంబిస్తున్నాయి. పాక్ ను ఉగ్రవాదంపై నిజమైన పోరాటం చేయమని గట్టిగా హెచ్చరిస్తున్నాయి. పాకిస్తాన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న చైనా కూడా పదే పదే కాశ్మీర్ అంశంపై స్పస్టత ఇస్తోంది. అది ఇండియా, పాక్ తేల్చుకోవాలని , దాంట్లో చైనా ప్రమేయం వుండదని కుండ బద్దలు కొడుతోంది! పైగా ఇప్పుడు చైనా భారత్ పై వాణిజ్యపరంగా చాలా ఎక్కువ ఆధారపడుతుండటంతో పాక్ ను ఏకపక్షంగా సపోర్ట్ చేసే అవకాశాలు లేవు. ఒకవేళ మాట వరసకు మద్దతు తెలిపినా యుద్ధంలో పాక్ తరుఫున నిలిచే సాహసం చైనా చేయకపోవచ్చు. ఇప్పుడు ఈ కారణాలతోనే పాక్ ఏకాకి అయిపోయింది. ఇండియా పూర్తిస్తాయిలో విరుచుకుపడితే దాన్ని ఆదుకునే శక్తంటూ కనిపించటం లేదు! అఖరుకు మొన్న ఐక్యరాజ్య సమితి కూడా పాకిస్తాన్ ను పెద్దగా పట్టించుకోలేదు. యూరోపియన్ యూనియన్ అయితే బలూచిస్తాన్ విషయంలో ఆ దేశంపై సీరియస్ గా వుంది. ఆర్దిక ఆంక్షలు విధించే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది! ఉరీ మారణకాండ సృష్టించి ఎప్పటిలాగే తప్పించుకుందామనుకున్న పాక్ కు అది కాస్తా ఇప్పుడు ఉరి తాడులా మారింది. ముందు ముందు మోదీ గవర్నమెంట్ ఇంకే స్థాయిలో దాడులు చేస్తుందో చూడాలి. పాక్ లోని ఉగ్రవాదుల్ని ఊడ్చిపెట్టేసే క్రమంతో ఆ దేశ ఆర్మీతో కూడా మనం తలపడాల్సి రావచ్చు. అదే జరిగితే అపార నష్టం ఖాయం. కాని, పాక్ లాంటి ఉన్మాద దేశానికి దానికి అర్థమయ్యే భాసలోనే ఏదో ఒక సమయంలో జవాబు ఇవ్వాల్సి వుంటుంది. ఆ సమయం ఇప్పుడు వచ్చినట్టే కనిపిస్తోంది!

లోకేష్... లో పర్ఫామెన్స్ ప్రదర్శిస్తున్నారా?

లోకేష్.... టీడీపీలో తిరుగులేని పేరు! చంద్రబాబు తరువాత అంత పవర్ ఫుల్ కూడా! కాని, లోకేష్ పార్టీ కోసం చురుగ్గా పని చేయటం లేదా? ఈ మాట స్వయంగా చంద్రబాబే అన్నారా? అవును అన్నారు! లోకేష్ కూడా ముందులా చురుగ్గా పని చేయటం లేదు. ఏదైనా పని చెబితే వెంటనే పూర్తి చేయటం లేదు అన్నారట ముఖ్యమంత్రి! ఇలా ఎందుకు అన్సాల్సి వచ్చిందీ అంటే... పార్టీ నేతల్ని ఉద్దేశించి ఆయన దిశా నిర్దేశనం చేస్తు అలా అన్నారు. అంతే కాదు, లోకేష్ ను కూడా మన్నించనప్పుడు మిగతా ఎవ్వర్నీ క్షమించేది లేదని చంద్రబాబు ఈ రకంగా తేల్చేశారు! రాష్ట్ర విభజన తరువాత తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసింది టీడీపీ. అయితే, మొదటి రెండున్నర ఏళ్లు చంద్రబాబు కొత్త రాష్ట్రం, కొత్త రాజధాని వంటి అంశాల మీదే దృష్టి పెట్టారు. పార్టీపై సరిగ్గా కాన్సన్ ట్రేషన్ చేయలేదు. కాని, 2019 ఎన్నికలకి ఒక్కో నెలా తగ్గుతుండటంతో ఇప్పుడు ఆయన పార్టీ పటిష్టతపై కూడా దృష్టి సారిస్తున్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే చంద్రబాబు పదే పదే పార్టీ మీటింగ్ లు పెడుతున్నారు. చిన్న , పెద్దా నేతలందరితో చర్చలు జరుపుతూనే వున్నారు.  త్వరలో నగర, పుర పాలక ఎన్నికలు కూడా నిర్వహించాల్సి వుండటంతో అందు కోసం కూడా పార్టీని సిద్ధం చేస్తున్నారు బాబు. అధికారంలో వుండి మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటకపోతే అది తప్పుడు సంకేతాలు పంపుతుంది. అలాగే, పార్టీ వచ్చే సాధారణ ఎన్నికలకి ఎంతలా తయారుగా వున్నది కూడా ఈ ఎన్నికల్లో తెలుస్తుంది. అందుకే, టీడీపీ చీఫ్... కార్యకర్తల్ని, నేతల్ని అందర్నీ ఏక కాలంలో ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు...  లోకేష్ గతంలో లాగా చురుగ్గా వుండటం లేదన్న చంద్రబాబు మాటని మరి యువనేత ఎలా తీసుకుంటారో చూడాలి. ఇప్పటికే ఆయన్ని నెక్స్ట్ టీడీపీ చీఫ్ అండ్ ఆంద్రా చీఫ్ మినిస్టర్ గా చూస్తున్నారు పార్టీలోని వారు. ఆ ఎక్స్ పెక్టేషన్స్ ని , తండ్రి అంచనాల్ని లోకేష్ అందుకోవాలంటే మరింత కష్టపడాల్సిందే...    

కాంగ్రెస్ ని... గాంధీల సొత్తు కాకుండా పీవీ అడ్డుకున్నారా?

పీవీ నరసింహా రావు... ఈ పేరు పేలుడు పదార్థం లాంటిది! ఎవరు పీవీ గురించి మాట్లాడినా అది ఆటోమేటిక్ గా బ్లాస్టింగ్ న్యూస్ అయిపోతుంది! అలాంటి వివాదాస్పద, విలక్షణ వ్యక్తిత్వం మన మాజీ ప్రధానిది! పీవీ ప్రధాన మీడియా సలహాదారు సంజయ్ బారు. వృత్తి రిత్యా జర్నలిస్ట్ అయిన ఆయన తాజాగా ఓ పుస్తకం రాశారు. దేశ ప్రధాని అయిన మన తెలుగు వాడు పీవీ గురించి చాలా విషయాలు అందులో చర్చించారు. అసలు పుస్తకం పేరే ఎంతో ఆసక్తికరంగా... 1991 : హౌ పీవీ నరసింహారావ్ మేడ్ హిస్టరీ... అని నామకరణం చేశారు. ఇందులో పీవీని అత్యంత దగ్గరగా చూసిన వాడిగా అనేక కోణాలు చర్చించారు బారూ...  సంజయ్ బారూ 2014లో కూడా ఇలాగే ఒక పుస్తకం రాశారు. దాంట్లో మన్మోహన్ తాలూకూ ప్రధాని కార్యాలయాన్ని సోనియా రిమోట్ కంట్రోల్ చేసేదని పేర్కొన్నారు. అప్పట్లో అది పెద్ద చర్చకు దారి తీసింది. విచిత్రం ఏంటంటే, సంజయ్ బారూ చెప్పిన విషయాల్ని మన్మోహన్ పెద్దగా ఖండించకపోవటం! తన గత పుస్తకంతో సోనియాను టార్గెట్ చేసిన సంజయ్ బారూ మరోసారి అదే పని చేశారంటున్నారు విశ్లేషకులు. ఆయన పుస్తకంలో పీవీ కంటే ముందు సోనియా శంకర్ దయాళ్ శర్మను ప్రధానిని చేయాలని అనుకున్నారని రాశారు. కాని, శంకర్ దయాళ్ ఆరోగ్య కారణాల రిత్యా ప్రధాని ఆఫర్ ను తిరస్కరించటంతో పీవీకి అవకాశం వచ్చింది! సంజయ్ బారూ రాజీవ్ గాంధీపైన కూడా కొన్ని మాటలు రాశారు. ఆయన చంద్రశేఖర్ ప్రభుత్వంపై అనుమానంతోనే మద్దతు విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. అందుకే, చంద్రశేఖర్ కనీసం పూర్తిస్తాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోయారని తెలిపారు. దాని వల్లే భారత్ ఇంధనం కోసం బంగారు నిల్వలు తాకట్టు పెట్టాల్సి వచ్చిందని వివరించారు. దేశం బంగారు నిల్వలు కూడా తాకట్టు పెట్టిన క్లిస్ట సందర్భంలో పీవీ ప్రధాని అయ్యి సమర్థంగా పాలించాడని సంజయ్ బారూ పుస్తకంలో రాశారు. ఆయన తన ఆర్దిక మంత్రిగా ఇప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కావాలనే ఎంచుకోలేదన్నారు. ఆర్దిక రంగ నిపుణుడే కావాలని పట్టుబట్టి అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఐజీ పటేల్ కోసం ప్రయత్నించారట. కాని, ఆయన తిరస్కరించటంతో మన్మోహన్ ను ఆర్దిక మంత్రిని చేశారట! 1991వ సంవత్సరంలో చోటు చేసుకున్న అనేక కీలకమైన అంశాలపై సంజయ్ బారూ తన పుస్తకంలో ఎన్నో ఆసక్తికర అంశాలు తెలిపారు. అయితే, అన్నిటికంటే ముఖ్యంగా, పీవీ తాత్కాలికంగా కాంగ్రెస్ ను ఒక కుటుంబం స్వంత ఆస్తిగా మారిపోకుండా కాపాడారని ఆయన వ్యాఖ్యానించారు. కాని, తరువాత పీవీ తప్పుకోగానే కాంగ్రెస్ ... సోనియా కాంగ్రెస్ గా రూపాంతరం చెందిందని బారూ అన్నారు!   

కూలిస్తేనే... నగరం నిలబడేది!

వాన వెలిసింది. వరదలు వెనక్కి తగ్గాయి. అయితే, ఇప్పుడు హైద్రాబాద్ లో దుమ్మూ, ధూళీ పైకి లేస్తున్నాయి! అయితే, ఇదేదో ఆందోళన పడవల్సిన ప్రకృతి విపత్తు కాదు. అక్రమ కట్టడాలు కట్టుకున్న వారికి ఏర్పడ్డ పాలక విపత్తు! సీఎం కేసీఆర్ చెప్పినట్టుగానే భాగ్యనగరంలో కూల్చివేతలు మొదలయ్యాయి..  గత కొన్ని రోజుల పాటూ కురిసిన భీభత్సమైన వర్షాల కారణంగా ఏమైందో అందరికీ తెలిసిందే. హైద్రాబాద్ అతలాకుతలం అయిపోయింది. విశ్వనగరం అనిపించుకునే మన హైటెక్ సిటీ విశ్వ ప్రయత్నం చేసినా వాన దెబ్బ తట్టుకోలేకపోయింది. మరీ ముఖ్యంగా నాలాలు, చెరువుల్ని ఆక్రమించి కట్టిన కాలనీలు, ఇళ్లలోకి నీరు ఉప్పొంగి వచ్చేసింది. దీనిపై మీడియా రాత్రింబవళ్లు కవరేజ్ చేస్తూ హడావిడి చేసింది. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం ఎక్కడలేని ఒత్తిడి వచ్చింది. దాని ఫలితమే ఇప్పుడు సిటీలో జరుగుతోన్న కూల్చివేతలు...  అసలు అక్రమ నిర్మాణాలు కూల్చటం అనేది మున్సిపాలిటి వారి బాధ్యత. దాన్ని సక్రమంగా నిర్వహించకే పరిస్థితి ఇంత విషమించింది. ప్రపంచంలోని ఏ టాప్ సిటీని తీసుకన్నా టౌన్ ప్లానింగ్ పక్కగా వుంటుంది. ఏ నిర్మాణం జరగాలన్నా, కూల్చాలన్నా సంబంధిత అధికారుల పర్మిషన్ తప్సనిసరి. కాని, మన దేశంలో రాత్రికి రాత్రి కట్టడాలు ఒళ్లు విరుచుకుని లేచి నిలబడతాయి. తరువాత వాట్ని కూల్చే ప్రయత్నం మున్నిపల్ అధికారులు చేసినా జనం మొదలు ఎమ్మేల్యేలు, ఎంపీల దాకా అందరూ కలిసి తిరగబడతారు. వారు చేసేది లేక ఊరకుండిపోతారు. మరీ తెలివైన గవర్నమెంట్ బాబులైతే దొరికినంత నొక్కేసి కట్టడాల్ని చూసి చూడకుండా వదిలేస్తారు! హైద్రాబాద్ లో అక్రమ కట్టడాల వల్ల వాటిల్లో వుంటోన్న సామాన్య జనం, వాళ్ల ఓట్లను ఆశించే ప్రజా ప్రతినిధులు, లంచాలు తీసుకుంటోన్న కొందరు మున్సిపల్ అధికారలు... ఇలా అందరూ లాభపడుతున్నారు. అందుకే, దశాబ్దాలుగా నాలాలు, చెరువులు, మూసి లాంటి నది కూడా కనిపించకుండా పోతూ వచ్చింది! కాని, వర్షం పడ్డప్పుడు, వరద పొటెత్తినప్పుడు మాత్రం నగరం నరకం అయిపోతోంది. 3వేల చెరువులు ఒకప్పుడు వుండేవని చెప్పే హైద్రాబాద్ లో ఇప్పుడు కేవలం 4వందలున్నాయంటే దుస్థితి అర్థం చేసుకోవచ్చు...  మొన్న వచ్చిన వరదలకి స్పందనగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. అక్రమ కట్టడాలు తొలిగించే ప్రయత్నం చేశారు. కాని, విచిత్రంగా బాధితుల తరుఫున మున్సిపల్ అధికారులకి వ్యతిరేకంగా నిలిచింది ఆ పార్టీ కార్పోరేటరే! మూసాపేట నుంచి ఎన్నికైన టీఆర్ఎస్ కార్పోరేటర్ అక్రమ కట్టడాల తొలగింపును అడ్డుకున్నారు. అయితే, ఇలాగయితే ఎలా అంటూ కేటీఆర్ సీరియస్ అయ్యారట. జనం మనల్ని నమ్మి గ్రేటర్ హైద్రాబాద్ మేయర్ పీఠం కట్టబెడితే సిటీని వరదల్లో వదిలేస్తామా అన్నారట!పైగా జనం నీళ్లలో మునిగి ఇబ్బందులు పడుతుంటే నేతలు ఇళ్లలో హాయిగా కూర్చున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట!  కేటీఆర్ తమ స్వంత పార్టీ నేతల్ని కూడా పట్టించుకునే ప్రసక్తే లేదని చెప్పటం నిజంగా సంతోషకరమైన విషయమే. ఎవ్వరి కోసం అక్రమ కట్టడాలు కూలకపోయినా అది నగర భద్రతకే ప్రమాదం. కాబట్టి అన్ని అక్రమ నిర్మాణాలు కూల్చాల్సిందే! కాకపోతే, గతంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో అయ్యప్ప సొసైటి నిర్మాణాల విషయంలో ఇలాగే హడావుడి జరిగింది. తరువాత అంతా సద్దుమణిగిపోయింది. మరి అదే తంతు హైద్రాబాద్ వ్యాప్తంగా వున్న వేలాది నిర్మాణాల విషయంలో జరిగితే, లాభం శూన్యమే! మరో సారి వర్షం వస్తే కథ మళ్లీ మొదటికొస్తుంది!  

బాలీవుడ్లో భీభత్సంగా ఆడుతోన్న 'పాకిస్తానీ' సినిమా!

పాకిస్తాన్ తో యుద్ధం, పాకిస్తాన్ కి సింధూ నది నీళ్లు ఆపేయాలి, పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ విడదీయాలి... ఇలా ఇప్పుడు దేశం మొత్తం పాకిస్తాన్ గురించే ఆలోచిస్తోంది! పాకిస్తాన్ లో ఇంతగా ఇండియా గురించి ఆలోచిస్తున్నారో లేదోగాని ఇండియాలో మాత్రం పాకిస్తాన్ మార్మోగిపోతంది! దాని వెనుక వున్న ఆవేశం, ఆక్రోశం, అసహనం అన్నీ మనం అర్థం చేసుకోవచ్చు. కాని, పాకిస్తాన్ పేరుకి మన దేశంలో ఎంతగా ఎమోషన్స్ రెచ్చగొట్టే శక్తి వుందో అంతే రాజకీయాల్ని రాజేసే పవర్ కూడా వుంది. మరీ ముఖ్యంగా మహారాష్ట్రాలో పాకిస్తానీ రాజకీయాలు టైం టూ టైం బుస్సుమని పడగ ఎత్తుతుంటాయి...  మహారాష్ట్రా రాజధాని ముంబై. ఆ ముంబై బాలీవుడ్ కి ఫేమస్. ఇండియన్ సినిమాగా ప్రపంచం గుర్తించే హిందీ సినిమాలు మొత్తం ఇక్కడే తయారవుతుంటాయి. అయితే, ఇక్కడే వీర శివాజీ వారసులమని చెప్పుకునే వీర పాకిస్తానీ ద్వేషులు మనకు కనిపిస్తుంటారు. కాకపోతే, వీళ్లు నిజంగా జాతీయ భావంతో రోడ్డు మీదకొస్తే బావుండేది. కాని, అలా కాకుండా ఎప్పటికప్పుడు రాజకీయ డ్రామా కోసం హంగామా చేస్తుంటారు! మహారాష్ట్రా జనం కోసం పుట్టిన పార్టీలు శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన. ఈ రెండూ మరాఠీల హక్కులు, శ్రేయస్సు కోసం పోరాడటం కాకుండా ఎప్పటికప్పుడు పాకిస్తాన్ పై చెలరేగిపోవటంలో ముందుంటాయి. పాకిస్తాన్ ను తిట్టడం తప్పేం కాకపోయినా శివసేన, ఎంఎన్ఎస్ ల వాలకం మాత్రం అభ్యంతరకరంగా, అనుమానాస్పదంగా వుంటుంది. అప్పుడప్పుడూ ఈ రెండూ పార్టీలు పాకిస్తాన్ క్రికెటర్లని, సింగర్లని టార్గెట్ చేస్తుంటాయి. ఇక్కడికి వారు రావొద్దంటూ ఆందోళనలు, దాడులు చేస్తుంటాయి. అయితే, ఇదంతా కాంగ్రెస్, ఎన్సీపీ లాంటి లౌకికవాద పార్టీలు అధికారంలో వున్నప్పుడు ఓకే! కాని, తమకు భావ సారూప్యం వున్న బీజేపి అధికారంలో వున్నప్పుడు కూడా చేయటం ఎలా అర్థం చేసుకోగలం? సాధారణంగా ఎప్పుడూ పాకిస్తానీ నటుల్ని దేశం నుంచి వెళ్లగొట్టమని శివసేన అంటుటుంది. కాని, ఈసారి అధికారంలో వున్న బీజేపితో ఆ పార్టీకి పొత్తు వుండటంతో కాస్త మెత్తటి స్టాండ్ తీసుకుంది. ఈ గ్యాప్ ఎంఎన్ఎస్ తనకు అనుకూలంగా వాడుకుంటూ బాలీవుడ్లో వున్న పాకీ నటులు, నటీమణులు అందరూ తిరిగి వెళ్లాలని అల్టిమేటం ఇచ్చింది. 48గంటలు అని డెడ్ లైన్ పెడితే ఫవాద్ ఖాన్ అనే పాకిస్తానీ హీరో ఇప్పటికే స్వదేశానికి రవాణా అయిపోయాడు! ఎంఎన్ఎస్ దెబ్బకు ఒక పాకీస్తానీ యాక్టర్ ఇంటి ముఖం పట్టడం చాలా మంది భారతీయులకి ఆనందం కలిగించేదే! పైగా ఇక మీదట పాకిస్తానీ ముఖాలు హిందీ సినిమాల్లో కనిపించకుంటే మరింత సంతోషిస్తాం. కాని, సమస్యల్లా ఎంఎన్ఎస్ లాంటి పార్టీల హింసాత్మక శైలే! అసలు పాకిస్తానీల్ని ముంబైకి ఎవరు రానిస్తున్నారు? కేంద్రం ప్రభుత్వం! అలాగే, వారికి రక్షణ కల్పించి ముంబైలో షూటింగ్ లు ఎవరు చేయించుకోనిస్తున్నారు? మహారాష్ట్ర ప్రభు్త్వం! ఈ రెండూ బీజేపీ లాంటి జాతీయ వాద పార్టీవే! మరి అటువంటి బీజేపిని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని వదిలి పెట్టి రోడ్లపైకి రావటం ఎంత వరకూ సబబు? ఇక్కడే మరాఠీ పార్టీల చిత్తశుద్దిపై అనుమానాలు కలిగేది! నిజంగా పాకిస్తాన్ మీద ఆగ్రహం కంటే పొలిటికల్ మైలేజే వీరికి ఎక్కువగా కావాలన్నట్టు అనిపిస్తుంది...  ఒకవైపు శివసేన, ఎంఎన్ఎస్ లాంటి పార్టీలు పాకిస్తాన్ కు వ్యతిరేక రాజకీయం నడిపితే మరో వైపు సమాజ్ వాది, కాంగ్రెస్ పార్టీ, నితీష్, మమతా బెనర్జీల పార్టీలు పాకిస్తాన్ అనుకూల పాలిటిక్స్ ప్లే చేస్తుంటాయి. మన ఎంఐఎం సంగతి చెప్పే పనే లేదు. ఇండియన్ ముస్లిమ్ లను సమర్థించే పనిలో భాగంగా పాకిస్తాన్ ను కూడా వెనకేసుకు వచ్చేస్తుంటారు వీళ్లంతా!  పాకిస్తాన్ విషయంలో దేశంలోనే రెండు వర్గాలు తయారైతే బాలీవుడ్లో కూడా రెండు వర్గాలు వున్నాయి. సింగర్ అభిజిత్ సావంత్ లాంటి వాళ్లు కరుడుగట్టిన పాకిస్తాన్ ద్వేషులు! అభిజిత్ గతంలో పాకిస్తానీ సింగర్ గులామ్ అలీ భారత్ కు వస్తే భీకరంగా తిట్టిపోశాడు. సిగ్గుండాలి అన్నట్టు ట్వీట్స్ చేసి సంచలనం సృష్టించాడు. ఇప్పుడు కూడా అభిజిత్ సావంత్ పాకిస్తానీ యాక్టర్స్ కు మద్దతుగా నిలిచిన కరణ్ జోహర్, మహేష్ భట్ లాంటి వాళ్లను ఏకిపారేశాడు. నీచాతి నీచమైన పదజాలంతో ట్వీట్స్ చేసి కసి తీర్చుకున్నాడు! కరణ్ గే కాబట్టి పాకిస్తానీ పఠాన్ లు నచ్చుతారంటూ దాడి చేశాడు! కరణ్ జోహర్, మహేష్ భట్ లాంటి ఫిల్మ్ మేకర్స్, షారుఖ్ ఖాన్ లాంటి టాప్ యాక్టర్స్ పాకిస్తానీ టాలెంట్ మీద ఎక్కడలేని మక్కువ చూపటం కూడా విడ్డూరమే! ఇంత పెద్ద దేశంలో వాళ్లకి ఎక్కడా తగిన హీరోలు, హీరోయిన్స్, సింగర్స్ దొరకనట్టు పాకిస్తాన్ వెళ్లి తెచ్చుకుంటారు. లక్షలు గుమ్మరించి ఎంకరేజ్ చేస్తారు. ఇంత అతి అవసరమా? నేపాల్ నుంచో, బంగ్లాదేశ్ నుంచో, శ్రీలంక నుంచో తెచ్చుకోలేని టాలెంట్ పాకిస్తాన్ నుంచే ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఎవరికైనా అనుమానం రావటం సహజమే! ఇప్పటికి ప్రూవ్ కానప్పటికీ పాకిస్తానీ మాఫియా సొమ్ము మన బాలీవుడ్లోకి వస్తుండటం తోసిపుచ్చలేని వాదన...  ఒకవైపు పాకిస్తాన్ ని తిట్టే పార్టీలు, మరో వైపు పాకిస్తాన్ ని నెత్తిన పెట్టుకునే పార్టీలు, ఇంకో వైపు ఎందుకో అర్థం కాకుండా పాకిస్తాన్ పట్ల స్వామి భక్తి ప్రదర్శించే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్లు... వీళ్లందరి మధ్య పాకిస్తాన్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయిపోయింది! అసలు చర్చించాల్సిన కాశ్మీరీలు, ఉగ్రవాదులు, అమర జవాన్లు ఎటో పోయారు!  

హైద్రాబాద్ లో రాజసం... అమరావతిలో రాజకీయమా?

హైద్రాబాద్ పదేళ్ల దాకా ఉమ్మడి రాజధాని. కాబట్టి హైద్రాబాద్ లో ఆంద్రా సీఎం వున్నా, మంత్రులున్నా తప్పేం కాదు. కాని, తప్పు కాదు కదా అని ఇక్కడే వుంటే నవ్యాంధ్రలో పాలన ఎట్లా సాగుతుంది? ఈ ఆలోచనతోనే చంద్రబాబు ఇంకా బోలెడు టైమున్న అప్పుడే పూర్తిగా విజయవాడకి మకాం మార్చారు. ప్రభుత్వ ఉద్యోగుల్ని కూడా సర్ది చెప్పి అమరావతికి చేర్పించారు. తాత్కాలిక సచివాలయం నుంచి పాలన నడుపుతున్నారు. సీఎం ఇంత చేస్తున్నా ప్రతిపక్ష నేతకి మాత్రం భాగ్యనగరంపై ప్రేమ తగ్గినట్టు లేదు! ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిపక్ష నేత జగన్. అంటే ముఖ్యమంత్రి తరువాత అంతటి ప్రాముఖ్యత వున్న నాయకుడు. పైగా జనంలో వుండాల్సిన అవసరం వున్నావాడు. పాలన చేయాల్సింది అధికార పక్షం కాబట్టి అసెంబ్లీ, సెక్రటేరియల్, వివిధ ప్రభుత్వ శాఖల బిల్డింగ్ లు... వీటన్నటితో చంబ్రాబు అండ్ టీమ్ కి అవసరం వుంటుంది. కాని, ప్రతిపక్ష నేతకి ఏం అవసరం? జనం, జనం సమస్యలు వుంటే చాలు కదా? కాని, జగన్ మాత్రం ఎందుకో ఇంకా హైద్రాబాద్ నే పట్టుకుని వేలాడుతున్నాడు! తనని , తన ఎమ్మేల్యేల్ని, ఎంపీల్ని గెలిపించిన వాళ్లు ఆంధ్రాలో వుంటే మన సార్ వారు మాత్రం తెలంగాణ శాశ్వత రాజధాని వదిలి రావటం లేదు! జగన్ హైద్రాబాద్ వదిలి పెట్టకుండా అమరావతికి చుట్టు చూపు కోసం వస్తే తప్పేంటి? ఈ ప్రశ్న కూడా సబబే! కాని, సీఎం పూర్తి స్థాయిలో అమరావతిలో వుంటూ జనం సాదకబాదకాలు చూస్తుంటే ప్రతిపక్ష నేత ఎక్కడో పక్క రాష్ట్రంలో వుంటే ఎలా? ఈ కోణంలో జనం ఆలోచించే పరిస్థితి ఇప్పుడిప్పుడే వస్తోంది! పుష్కరాలు మొదలు భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల దాకా జనం సంతోషంలో వున్నా, ఇబ్బందుల్లో వున్నా జగన్ వాళ్ల సమక్షంలో వుండటం లేదు. వున్నట్టుండీ నిరాహార దీక్ష అనో, ఓదార్పు యాత్ర అనో వస్తాడు, హడావిడి చేస్తాడు, వెళ్లిపోతాడు! ఇదీ వరస...  సమైక్యాంధ్ర వున్నప్పుడు హైద్రాబాద్ లో భారీగా ఆస్తులు కూడపెట్టినప్పటికీ, అక్కడే భారీగా వ్యాపారాలు వున్నప్పటికీ, తెలంగాణ సీఎం కేసీఆర్ తో జగన్ కు మంచి సంబంధాలే వున్నప్పటికీ... వైసీపీ అధినేత ఆలోచించాల్సింది ఆంధ్రా ప్రజానీకం గురించి! వారికి అందుబాటులో వుంటేనే రేపు కాకపోతే మరునాడైనా అమరావతి పీఠం దక్కేది! లేదంటే హైద్రాబాద్ లో బిజినెస్ లు చేసుకోవాల్సిందే...     

'చైనా' స్నాచింగ్ కు పాల్పడుతున్న మోదీ!

మోదీ అధికారంలోకి వచ్చాక భారతీయుల గుండెల్లో మోదం వచ్చిందా? ఆయన విధానాలకు అన్ని వర్గాల నుంచీ ఆమోదం వచ్చిందా? డౌటే! ఇప్పటికీ మోదీని వెనకేసుకొచ్చే ఆయన భక్తులు బోలెడుమంది వుండొచ్చు. కాని, అంతే స్థాయిలో విమర్శకులు వున్నారు. మోదీ వచ్చాక ఉద్యోగాలు రాలేదు, ధరలు తగ్గలేదు, మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా లాంటివన్నీ ఒట్టి నినాదాలే అనే వారు బోలెడు. రోజు రోజుకి పెరుగుతున్నారు కూడా! కాని, మోదీ సెగ మనకంటే ఎక్కువగా చైనాకు తగులుతోంది! చైన్ స్నాచింగ్ లాగా మన నమో చైనా స్నాచింగ్ మొదలుపెట్టారు..  చైనాలోని ఒక ప్రముఖ పత్రిక గ్లోబల్ టైమ్స్. దాంట్లో తాజాగా ఓ ఆర్టికల్ వచ్చింది. దాని సారాంశం ఏంటంటే... చైనా కంపెనీలు ఇండియాకి తరలుతున్నాయి. ఇక్కడ మోదీ ప్రకటించిన మేకిన్ ఇండియా విధానం వాళ్లకు తెగ నచ్చుతోంది. దాంతో స్వంత దేశం చైనాను కాదని ఇండియా బాట పడుతన్నారు అక్కడి పారిశ్రామికవేత్తలు. ఈ మధ్యే ఒక పెద్ద స్మార్ట్ ఫోన్ కంపెనీ తన ప్రొడక్షన్ యూనిట్ ఇండియాకి మార్చేసింది. ఆ దెబ్బకి చైనాలో ఆ కంపెనీపై ఆధారపడ్డ చాలా మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఇంకా కొన్ని కంపెనీలు కూడా భారత్ వచ్చేద్దామాని ఆలోచిస్తున్నాయట! చైనా నుంచి భారత్ వస్తోన్న కంపెనీల మెయిన్ టార్గెట్ మన మార్కెట్టే. ఇక్కడ కావాల్సినంత మంది కస్టమర్లు వుండటంతో ఇక్కడే తయారీ చేసి అమ్ముకునే ఆలోచనలో వున్నాయి. మరో వైపు చైనాలో మార్కెట్ ఈ మధ్య కాలంలో నిరాశజనకంగా వుంటోంది. ఆ దేశ జీడీపి తగ్గుతూ వస్తోంది. ఇవన్నీ కారణాలతో చైనీస్ కంపెనీలు ఇండియన్ ఫ్లైట్స్ ఎక్కి రయ్ మని ఇటుగా వచ్చేస్తున్నాయి. చైనీస్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లు ఇండియా తరలటంపై ఆందోళన వ్యక్తం చేసిన మీడియా ప్రభుత్వానికి అవ్వి వెళ్లకుండా చూసుకోవాలని సూచించింది. లేదంటే లక్షల మంది నిరుద్యోగులు అవుతారని చెప్పింది. అలా ఉత్సాహంగా చైనానుంచి హిమాలయాలు ఎక్కి ఇటు దూకేస్తోన్న కంపెనీలకు కూడా ఇండియన్ చట్టాలు, రూల్సు సరిగ్గా చూసుకోమని చెప్పింది! తరువాత ఇబ్బందులపాలవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది! చైనీస్ మీడియా గొంతులోని ఆందోళన చూస్తుంటే.. మోదీ మొదలుపెట్టిన మేకిన్ ఇండియా మనం ఆశించినంత కాకపోయినా చైనా లాంటి ప్రత్యర్థి దేశాలు ఇబ్బందిపడేంతగా మాత్రం సక్సెస్ అవుతోందని చెప్పొచ్చు!

కేసీఆర్ చేసిందే జగన్ చేస్తే... వర్కవుట్ అవుతుందా?

చలికాలంలో రోగమొస్తే వేసుకున్న మందే ఎండాకాలంలో వచ్చిన మరో రకం రోగానికీ ఎవరైనా వేసుకుంటలారా?వైఎస్ జగన్ అలాంటి ఘనకార్యమే చేయాలనుకుంటున్నట్టు కనిపిస్తోంది!అసలు విషయం అర్థం కావాలంటే మనం ఒకసారి రాష్ట్ర విభజన ముందు నెలకొన్న పరిస్థితుల్లోకి వెళ్లాలి... కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో పదే పదే ఒక అస్త్రం ప్రయోగించే వారు.అదే రాజీనామా అస్త్రం.ఓ సారి తాను ఒక్కడే చేస్తే మరోసారి పార్టీ ఎమ్మేల్యేలు,ఎంపీలు అందర్నీ రాజీనామా చేయించేవాడు.ఇలా ఆయన ఎప్పటికప్పుడు తన రెసిగ్నేషన్ స్ట్రాటజీతో జనంలో వుండే వారు. ఉద్యమం సెగ తగ్గకుండా చూసుకునే వారు! వైఎస్ జగన్ కేసీఆర్ అప్పట్లో వాడిన అస్త్రం ఇప్పుడు ప్రయోగిద్దామనుకుంటున్నాడు!ఇదే అసలు సమస్య.అప్పుడు రాజీనామాల ప్లాన్ వర్కవుట్ అయింది కాబట్టి ఇప్పుడు అవుతుంది అనుకోవటం అవివేకం.అందుకు కారణం మారిపోయిన పరిస్థితులు,మారిపోయిన డిమాండ్లే! కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే ఎమోషనల్ అంశం ఆసరా చేసుకుని ఓట్ల కోసం వెళ్లారు.అయినా కూడా కొన్ని సార్లు బొక్కబోర్లా పడ్డాల్సి వచ్చింది.కాని,ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ అంత ఎమోషనల్ టాపిక్ ప్రత్యేక హోదా కాదు.జనానికి హోదా రావాలని వున్నా ప్రత్యేక ప్యాకేజీతో ఆల్రెడీ కేంద్రం కొంత సాటిస్ ఫై చేసేసింది.మరో వైపు ప్రత్యేక హోదా ఇక మీదట సాధ్యం కాదని క్లియర్ గా చెప్పేసింది.కేవలం ఆంధ్రాకే కాదు దేశంలో ఎవ్వరికీ ఇవ్వబోమని ఢిల్లీ పాలకులు చెప్పేశారు.మరి ఇటువంటి సమయంలో వైఎస్ జగన్ రాజీనామా అస్త్రం ఎంత వరకూ పని చేస్తుంది? కేసీఆర్ ఆంధ్రా వాళ్లని టార్గెట్ చేసినట్టు జగన్ ఎవ్వర్ని టార్గెట్ చేసి ఓటర్లని ఆకర్షిస్తాడు? కేంద్రాన్ని బలంగా విమర్శించే ఛాన్స్ లేదు.అంత దైర్యం అనేక కేసుల్లో ఇరుక్కున్న జగన్ కు వుంటే ఈపాటికే ఎన్నో సార్లు విమర్శలు చేసి వుండేవాడు!కాని, ఇంతవరకూ మోదీని,కేంద్రాన్ని పల్లెత్తు మాట ఆయన అనట్టు ఎక్కడా కనిపించలేదు. ఇక మిగిలింది చంద్రబాబుని, టీడీపిని తిట్టిపోయటం! దీని వల్ల ప్రత్యేక హోదా రాదని తెలుసుకోలేనంత పిచ్చి వాళ్లా జనం? టీడీపి ఒత్తిడి వల్ల రావాల్సిన ప్యాకేజ్ వచ్చింది. ఇంకా తెగేదాకా లాగితే అసలుకే మోసమని మెజార్జీ జనం భావిస్తున్నారు. మరి ఇటువంటప్పుడు జగన్ తన ఎంపీల చేత రాజీనామా చేయించి ఏం సాధిస్తాడు? ఎవరి మీద పోరాడతాడు? జగన్ తన ప్రత్యేక హోదా పోరాటంలో అంతిమ దశలో ఎంపీల చేత రాజీనామా అంటూ ప్రకటించాడు.నిజంగా ఎంపీల చేత ఆయన రీసైన్ చేయిస్తారో లేదో మనకు తెలియదుగాని దాని వల్ల ప్రజలకు మాత్రం తీరని నష్టమే.త్వరలో మున్సిపల్ ఎన్నికలు వున్నాయి. అవ్వి అయ్యే వరకూ ప్రభుత్వ పథకాలు అమలు కాకుండా ఆగిపోతాయి. ఇలా లబ్ది పొందకుండా వున్న జనం జగన్ రాజీడ్రామాలతో మరికొంత కాలం సంక్షేమ పథకాలకి ముఖం వాచిపోవాల్సి వస్తుంది. పైగా జగన్ ఎంపీల రాజీనామా స్టేట్మెంట్లో హోదాపై ప్రేమ కన్నా పొలిటికల్ కాలిక్యులేషన్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఆయనకు వున్న ఎంపీలంతా రాయలసీమ జిల్లాల్లోనూ, ప్రకాషం, నెల్లూరు జిల్లాల్లోనూ వున్నారు. వాళ్ల చేత రాజీనామా చేయించినా తిరిగి గెలుచుకునే అవకాశాలు ఎక్కువ. అక్కడ చంద్రబాబు ప్రభావంగాని, టీడీపీ బలంగాని పెద్దగా టెన్షన్ పెట్టే సూచనలు కనిపించటం లేదు. ఈ భరోసాతోనే జగన్ రాజీనామా అస్త్రం అంటున్నాడని మనం అంచనాకి రావొచ్చు.పైగా ఉప ఎన్నికల్లో గెలవటం ద్వారా ప్రజలు టీడీపీ పాలనని వ్యతిరేకిస్తున్నారని ఋజువు చేయవచ్చు.ఇదీ జగన్ వ్యూహం...  ఇక ఫైనల్ గా జగన్ తన ఎంపీల చేత రాజీనామా చేయిస్తే ఆయనకున్న మరో లాభం ఓదార్ప యాత్ర న్యూ సీజన్! అవును... తండ్రి పోయాడన్న కారణంతో జగన్ నెలల తరబడి రోడ్లపై వున్నాడు. ఓదార్చి ఓదార్చి జనం తనని మరవకుండా జాగ్రత్తపడ్డాడు. కాని, ఇప్పుడు మరోసారి వీదుల్లోకి వెళ్లాలంటే అలాంటి కారణం ఏం దొరకటం లేదు. ఈ సమస్యకి చక్కటి పరిష్కారం రాజీనామానే! ఎంపీల రాజీనామా అంటే బోలెడన్ని ఊళ్లూ, పట్టణాలు చాలా రోజుల వరకూ చుట్టి రావచ్చు. మీడియాలోనూ తప్పనిసరి పబ్లిసిటీ. ఇంతకంటే ప్రతిపక్ష నేతకి కావాల్సింది ఏముంటుంది?  ఇప్పటికైతే జగన్ కన్ ఫర్మ్ గా ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని చెప్పలేదుగాని అదే జరిగితే జగన్ కు వచ్చే లాభం ఎక్కువ. జనానికి వచ్చే లాభం శూన్యం. ఎందుకంటే, హోదా ఇవ్వటం అనేది వైసీపీ ఎంపీలు కాదు మొత్తం ఆంద్రా ఎంపీలు అంతా రాజీనామా చేసినా ... 14వ ఆర్దిక సంఘం చెప్పేసింది కాబట్టి... కుదరని పని! అంతకు మించి ఉప ఎన్నికలు జరిగే దాకా నెలల తరబడి ఎలక్షన్ కోడ్ అమలు కావటంతో సామాన్య జనం సంక్షేమ పథకాలకి దూరం అవుతారు. ఇదీ జగన్ రాజడ్రామాతో కలిగే ప్రయోజనం! 

ఒక ఐసిస్ ఉగ్రవాది శాడిస్టిక్ కోరికలు…

ఐసిస్… ఈ పేరు మనకు కొంత మామూలుగా వినిపించవచ్చు. కాని,సిరియా లాంటి దేశాల ప్రజలకు వెన్నులో చలి పుట్టిస్తుంది! ఐఎస్ఐఎస్ హింసకి, దుర్మార్గానికి, అమానుషానికి మరో పేరు! అసలు ఇస్లామిక్ ఉగ్రవాదం ప్రపంచం అంతటా వున్నా ఐసిస్ మాత్రం అత్యంత కరుడుగట్టింది! మరే ఉగ్రవాద సంస్థ అయినా దాని తరువాతే.   ఇండియాలో లష్కరే తయ్యబా, జైషే మహ్మద్, సిమీ లాంటి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు వున్నాయి. కాని, వీళ్లు అప్పుడప్పుడూ బాంబులు పెట్టి ప్రాణాలు బలితీసుకోవటం వరకే పరిమితం. మొన్నటికి మొన్న మన జవాన్లను చంపింది కూడా ఇండియా, పాకిస్తాన్ లాంటి దేశాల్లో తిష్టవేసిన లోకల్ టెర్రరిస్టులే. కాని, మన దగ్గర అరాచకం సృష్టించే ఉగ్రవాదులు ఐసిస్ వారి ముందు నథింగ్. కెమెరాల్లో షూట్ చేస్తూ బందీల తలలు నరకటం, పన్నెండేళ్ల అమ్మాయిల్ని కూడా రేప్ చేయటం, స్త్రీలని బహిరంగ మార్కెట్లో బానిసలుగా అమ్మటం… ఇలాంటి దారుణాలు వారికి రొటీన్! అందుకే, ఐసిస్ అంటే ప్రపంచం ఉలిక్కిపడుతోంది!. ఐఎస్ఐఎస్ కేవలం సిరియా, ఆ చుట్టుపక్కల దేశాల ఉన్మాదుల సమూహం కాదు. అమెరికా, బ్రిటన్, అస్ట్రేలియా లాంటి అగ్రదేశాల నుంచి పారిపోయిన సైకోల స్థావరం. ప్రజాస్వామ్య వ్యవస్థలో వుంటే తమ ఉన్మాదం శాంతించదన్న ఆలోచనతో ఈ యువకులు జిహాదీలుగా మారుతున్నారు. ఐఎస్ఐఎస్ నడిపే రాక్షస పాలనలో తమ ఇష్టానుసారం హింస, శృంగారాలకి పాల్పడుతున్నారు. ఈ ఉగ్రవాద శాడిస్టుల అరాచకానికి తాజా ఉదాహరణ ఒమర్ హుస్సేన్ అనే టెర్రరిస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూ!   బై బర్త్ బ్రిటన్ పౌరుడైన ఒమర్ మంచి జీవితాన్ని వదులుకుని ఉన్మాదంతో ఐసిస్ లో చేరాడు. అంతే కాదు, తన కొడుకుని కూడా పట్టుకుపోయాడు. ఓ సారి ఒక వీడియోలో కనిపించి అప్పటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ క్యామరూన్ కు యుద్దానికి రమ్మని సవాల్ విసిరాడు!. మరోసారి ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒమర్ దారుణమైన మాటలు మాట్లాడాడు. అసలు ఒక ఐసిస్ ఉగ్రవాది మెంటాలిటి ఎలా వుంటుందో కళ్లకు కట్టాడు! తనకు మనుషుల్ని చంపటం అంటే ఇష్టం అన్నాడు. అదీ బ్రిటన్ సైనికుల్ని చంపటం మరింత ఇష్టమట! ఇక తన కొడుకు చేత బందీల తలలు నరికించిన ఈ నర రూప రాక్షసుడు అది కూడా గొప్ప పనిగా చెప్పుకొచ్చాడు. తన సుపుత్రుడు ఎలాంటి భయం లేకుండా మనుషుల్ని చంపటం ఆనందం కలిగించిందట! వాడు పిరికిపంద అవ్వకుండా ఉండాలనే మర్డర్లు చేయించినట్టు ఒమర్ చెప్పాడు! ఈ మాటతో ఐసిస్ తన ఆధీనంలోని పిల్లల్ని ఎలా నాశనం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు…   ఒకప్పటి బ్రిటన్ పౌరుడైన ఈనాటి ఐఎస్ఐఎస్ ఉగ్రవాది, ఒమర్…. కోరినట్టు బ్రిటన్ తన సైనికుల్ని పోరాడేందుకు పంపుతుందో లేదో మనకు తెలియదు. కాని, ఇలాంటి ఘోరమైన ఒక ఉగ్రవాద సంస్థని మనం ఉపేక్షిస్తూ వుండటం మానవత్వానికే పెద్ద మచ్చ!   

ఉండవల్లి, జైపాల్ రెడ్డి, ఓ రాష్ట్ర విభజన బిల్లు!

దేశంలో ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చిన కాంగ్రెస్ మార్కు కాంగ్రెస్ దే! ఆ పార్టీలో నేతలు ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాదు. అధికారంలో వున్నా లేకపోయినా కాంగ్రస్ నేతల తీరు మాత్రం మారదు. ఒకే పార్టీలో వుంటూ ఒకర్నొకరు వ్యతిరేకిస్తారు. కాదంటే పబ్లిగ్గా తిట్టుకుంటారు కూడా. అదేమంటే అంతర్గత ప్రజాస్వామ్యం అంటారు!. తెలంగాణ ఏర్పాటు జరిగి ఇప్పటికి రెండున్నరేళ్లు గడిచిపోయాయి. ఇచ్చింది మేమే అంటూ కాంగ్రెస్ నేతలు చెబుతూ వుంటారు. తెచ్చింది మేమే అంటూ టీఆర్ఎస్ నాయకులు కూడా ప్రచారం చేసుకుంటూ వుంటారు. కాని, ఎన్నికల్లో జనం టీఆర్ఎస్ నే నమ్మినట్టు క్లియర్ అయిపోయింది. కాంగ్రెస్ ను టీ అసెంబ్లీలో ప్రతిపక్షానికే పరిమితం చేశారు. అటు ఆంద్రా అంసెబ్లీలో అయితే మరీ దారుణం. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ ను నవ్యాంధ్ర అసెంబ్లీలో కాలేపెట్టనివ్వలేదు! సమీప భవిష్యత్ లో అలాంటి ఉద్దేశ్యం కూడా జనానికి వున్నట్టు కనిపించటం లేదు!   రాష్ట్ర విభజన మంటను రాజేసి చివరకు తన ఒళ్లు తానే కాల్చుకున్న కాంగ్రెస్ ఇప్పటికీ తెలివి తెచ్చుకున్నట్టు కనిపించటం లేదు. ఆ పార్టీ నేతలు అనవసర చర్చలకు తెర తీస్తూ కాంగ్రెస్ మార్కు కయ్యానికి కాలు దువ్వుతున్నారు! హస్తం పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లే ఇందుకు కారణం!. ఉండవల్లి ఈ మధ్య విభజన కథ గురించి ఓ పుస్తకం రాసిన సంగతి తెలిసిందే కదా… దాంట్లో ఆయన ఏకంగా తెలంగాణ ఏర్పాటు బిల్లే సభలో పాస్ కాలేదని ఆరోపించారు. పార్లమెంట్లో గందరగోళం చెలరేగటంతో ఓటింగ్ కాలేదని ఆయన అంటున్నారు. కాబట్టి తెలంగాణ ఏర్పాటుకు సభ అమోదం అధికారికంగా రాలేదని ఉండవల్లి అభిప్రాయం.   ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన దానికి వ్యతిరేకంగా ఆయన పార్టీకే చెందిన జైపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. బిల్ పెట్టడంపై, దాన్ని పాస్ చేయించటంపై  అందరూ చేతులెత్తేస్తే తానే రంగంలోకి దిగానని ఆయన చెప్పారు. తన పార్టీ మంత్రి కమల్ నాథ్, బీజేపి నేత సుష్మా స్వరాజ్ ల మధ్య సయోధ్య కుదిర్చి బిల్ పెట్టించానని జైపాల్ చెప్పుకొచ్చారు. ఓటింగ్ కి కుదరదు కాబట్టే హెడ్ కౌంట్ పద్ధతి ద్వారా బిల్ అమోదం చేయించమని స్పీకర్ కి కూడా చెప్పానని ఆయన అన్నారు! అంతే కాదు, ఓటింగ్, బిల్ అమోదం పొందటం వంటి విషయాల్లో కేసీఆర్ కు ఎలా ప్రమేయం లేదని కూడా తేల్చేశారు!   ఇంతకీ తెలంగాణ బిల్ పాసైందా? లేదా? తెలుగు ప్రాంతం రెండుగా విడిపోయి రెండున్నరేళ్లు గడిచిపోయాక ఈ ప్రశ్నకి అసలు వాల్యూనే లేదు. ఎందుకంటే, ఇప్పుడు ఎవ్వరు మాత్రం చేసేదేముంది? తిరిగి రెండు రాష్ట్రాల్ని కలిపేసి సమైక్యాంధ్ర తీసుకువస్తారా? అలా తెచ్చే వీర సాహసం ఎవరు చేస్తారు? అయినా అదసలు సాధ్యమా? వాంఛనీయమా? ఎన్నో ప్రశ్నలు… సమాధానాలే లేని ప్రశ్నలకి జవాబులు వెదుక్కునే స్థితి తీసుకొచ్చారు కాంగ్రెస్ నాయకులు ఉండవల్లి, జైపాల్ రెడ్డి! అందుకే, ఈ మొత్తం వ్యవహారంలో టీఆర్ఎస్ నేతలుగాని, కేసీఆర్ గాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇలాంటి వింత కొట్లాటలు కాంగ్రెసోళ్లకు మామూలే అనుకుని సైలెంట్ గా వుండిపోయారు! జనం ఉద్దేశ్యం కూడా అలానే వున్నట్టు కనిపిస్తోంది…

చెరువులోకి మనిషి వెళ్లాడు...మనిషిపైకి చెరువొచ్చింది!

సోషల్ మీడియాలో ఇప్పుడు చెరువుల మీద చాలా చర్చ నడుస్తోంది!అందుక్కారణం హైద్రాబాద్ ను ముంచెత్తిన వరదలే.సిటీలోని చాలా కాలనీల్లో సెల్లార్లు నీట మునిగిపోయాయి.కొన్ని చోట్ల ఇళ్లలోంచి జనం బయటకి కూడా రాలేక సతమతం అవుతున్నారు.అయితే,ఇందుకు కారణం చెరువుల ఆక్రమణే అని నెటిజన్ల అభిప్రాయం.పాలకులు సమయానికి స్సందిచారా లేదా లాంటి విషయాలు పక్కన పెడితే చెరువుల కబ్జాలు మాత్రం నిజమే!అదే హైద్రాబాద్ లాంటి చాలా నగరాల దుస్థితికి కారణం...  చెరువు గుండెలో మనం పోయి తిష్ఠవేస్తే... ఆ చెరువు పెద్ద వర్షం పడ్డప్పుడు మన ఇంట్లోకి వచ్చి తిష్ఠ వేస్తుంది!ఇప్పుడు అదే జరిగింది. అసలు ఆదునిక మానవుడు ప్రకృతిని తన ఇష్టానుసారం నాశనం చేస్తున్నాడు గత కొన్ని శతాబ్దాలుగా.అందులో నగరాల్లో దారుణంగా  బలైపోయిన ప్రకృతి వనరులు చెరువులు.భూమ్మీది ప్రతీ చోటా నదులు,వంకలు,వాగులు వుండవు.అవ్వి లేని ప్రాంతాల్లో మనిషికి నీటి వనరుగా నిలిచేది చెరువే.దాన్ని వాడుకునే ఒకప్పుడు ఊరు ఊరంతా బతికేది.రైతులు పొలాలకు నీళ్లు పెట్టుకోవటం మొదలు జనం తాగు నీరు తీసుకుపోవటం,బట్టలు పిండుకోవటం,పశువుల్ని కడుక్కోవటం... ఇలా అన్నీ చెరువు చుట్టూనే చేసేవారు!కాని,ఇప్పడు ఆ చెరువే బరువనిపిస్తోంది మనుషులకి! చెరువులు ప్రతీ సంవత్సరం వానలు పడితేనే బాగా నిండుతాయి.లేకపోతే అవ్వి ఎండిపోయి ఇసుక తేలుతాయి.ఇక్కడే నగరాల్లోని మనిషిలో దుర్బుద్ది బయలుదేరుతోంది.తాను వుండటానికి ఇల్లు,ఆ ఇల్లు కట్టుకోవటానికి ఇసుక రెండూ ఖాళీ అయిన చెరువులోనే చూసుకుంటున్నాడు నగరజీవి.ఫలితంగా చెరువులు క్రమంగా కబ్జా అయిపోతున్నాయి.మిగిలిన చోట్ల ఇసుక తరలించుకుపోతున్నారు.ముందు ముందు ఎప్పుడైనా వర్షం పడ్డా కూడా నీళ్లు నిల్వ వుండకుండా చేస్తున్నారు. మనిషి చెరువులపై పడి వాటిని చెరిచేయటమే హైద్రాబాద్ లో ప్రస్తుత దుస్థితికి కారణం.ఒకప్పుడు తెలంగాణాలోని అన్ని ప్రాంతాల్లో లాగే ఇక్కడా అనేక చెరువులు వుండేవి.నదులు లేని చోట్లలో అంతా చెరువులే తెలంగాణ ప్రజలకి జీవనాధారం.ప్రస్తుత గ్రేటర్ హైద్రాబాద్ లోని ఆనాటి అనేక పల్లెలు కూడా తమ ఊరి చెరువుతోనే హాయిగా జీవించాయి.కాని,అభివృద్ధి పేరున గత అరవై ఏళ్లలో జరిగిన విధ్వంసమే చెరువుల అదృశ్యానికి కారణం.ఇందుకు ఏ ఒక్క రాజకీయ పార్టీనో,రాజకీయ నేతనో కారణం చేయటం కూడా వృథానే.నగరాల్లో చెరువుల ఆదృశ్యం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోంది.ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్ లో మరీ ఎక్కువ.డెవలప్ మెంట్ స్పాంజీలా చెరువుల్ని పీల్చిపారేస్తుంది! గతంలో ఏం జరిగినా ఇప్పుడు నవ తెలంగాణ ఆవిర్భావం జరిగింది కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం హైద్రాబాద్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.అసలు కనిపించకుండా మిస్సైపోయిన చెరువులు ఏమయ్యాయో ఆరాతీసి పునరుద్దరించాలి. ఇందుకోసం కొంత వరకూ జనాగ్రహం కూడా తప్పక పోవచ్చు.కాని,నగర క్షేమం దృష్ట్యా అది తప్పుదు.అలాగే,వర్షం కురిస్తే నీరు వేగంగా సిటీ బయటకు వెళ్లేలా డ్రైనేజ్ వ్యవస్థను ఆధునీకరించాలి.నిజాం కాలం నాలాల హైద్రాబాద్ ను నిజమైన పోస్ట్ మాడన్ మెట్రోపాలిస్ గా తీర్చిదిద్దాలి.ఇది బృహత్తర కార్యక్రమం.కేసీఆర్ సర్కార్ ఎంత వరకూ విజయవంతం అవుతుందో చూడాలి...  

స్వంత దేశంలో హిందువులు శరణార్థులు అవుతున్నారా? 

  మన దేశంలో హిందూ అతివాదులు వున్నారు నిజమే. వాళ్ల నుంచి మైనార్టీలకు ప్రమాదం వుంటే వుండొచ్చు కూడా! కాని, మన దేశంలో కుహనా లౌకికవాదం కూడా వుంది. ఈ సూడో సెక్యులరిజమ్ మనం గుర్తించలేనంత పెద్ద ప్రమాదం. పైగా దీనికి కారణం ఏ ముస్లిమ్ లో, క్రిస్టియన్లో కాదు. వ్యక్తిగతంగా హిందువులే అయిన మన అతి సెక్యులర్ నేతలు!    ఎన్నికల సమయంలో మైనార్టీలు మూకుమ్మడిగా ఓటు వేస్తారు. అందుకే, వాళ్లను ప్రసన్నం చేసుకోటానికి మన నాయకులు బోలెడన్ని జిమ్మిక్కులు చేస్తుంటారు. నిజంగా మైనార్టీల జీవితాల్ని బాగు చేసే పనులు కాకుండా వింత వింత హామీలు ఇస్తుంటారు. ఇఫ్తార్ విందుల్లో ఫోటోలు దిగటం మొదలు హజ్ యాత్రకు సబ్సిడీ వరకూ మన నాయకులు చేయని మైనార్టీ అపీస్ మెంట్ లేదు. కాని, కొన్ని రాష్ట్రాల్లో ఇది మరీ దారుణంగా తయారవుతోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో నేతల సెక్యులర్ ఛాందసవాదం మరీ మితిమీరుతోంది. ఇందుకు తాజాగా వెలువడిన జాతీయ మానవ హక్కుల కమీషన్ నివేదికే మంచి ఉదాహరణ. ఉత్తర్ ప్రదేశ్ లో సమాజ్ వాది పార్టీ అధికారంలోకి వస్తే ఆజం ఖాన్ లాంటి ముస్లిమ్ నేతల అరాచకం పెరిగిపోతుంది. సామాన్య పేద ముస్లిమ్ లకు ఏం చేయకున్నా హిందువులపై దాడులు చేసేస్తుంటారు సమాజ్ వాది గుండాలు. దాని ఫలితమే గత నాలుగేళ్లలో వందల సంఖ్యలో జరిగిన మత కలహాలు. ఉత్తర్ ప్రదేశ్ లో ముజఫర్ నగర్ మత కలహాలు సహా ఎన్నో జరిగాయి ఈ మధ్య. అయితే , అవేవీ చాలా వరకూ ప్రధాన స్రవంతిలోని మీడియా దాకా రాలేదు. చాలా సార్లు మీడియాలో కూడా వున్న ఆదర్శవాద, అభ్యుదయవాద, లెఫ్ట్ జర్నలిస్టులు వాట్ని చూసీ చూడకుండా వదిలేశారు. దాంతో ఉత్తర్ ప్రదేశ్ లో అరాచకం అడ్డు లేకండా పోయింది!   కొన్నాళ్ల కింద బీజేపి ఎంపీ హుకుమ్ సింగ్ ఉత్తర్ ప్రదేశ్ లోని కైరానా ప్రాంతం నుంచి హిందువులు వలసపోవాల్సి వస్తోందని ప్రకటన చేశాడు. వందల సంఖ్యలో హిందూ కుటుంబాలు స్థానిక మైనార్టీ రౌడీల భయంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయని ఆయన అన్నాడు. సమాజ్ వాది నేతల అండతో మైనార్టీ గూండాలు రెచ్చిపోతున్నారని చెప్పుకొచ్చాడు. కాని, అప్పుడు మీడియా, మేధావులు అంతా అతడ్ని తిట్టిపోశారు. వెటకారం చేశారు. బీజేపి ఎంపీ కాబట్టి హిందూ ఓట్ల కోసం అలా మత భావనలు రెచ్చగొడుతున్నాడని ఆరోపించారు!    కైరానాలో నిజంగా హిందువులు మైనార్టీ వర్గానికి చెందిన సంఘ వ్యతిరేక శక్తులకి భయపడి వలసపోయారా? ఈ ప్రశ్నకి సమాధానం కనుక్కునేందుకే జాతీయ మానవ హక్కుల కమీషన్ విచారణ జరిపింది. తన రిపోర్ట్ సిద్ధం చేసింది. దాంట్లో కైరానాలో హిందువుల వలసలు నిజమేనని తేల్చింది!    ఉత్తర్ ప్రదేశ్ లోనే కాదు బెంగాల్ లోనూ మమతా బెనర్జీ మార్కు లౌకికవాద ఓటు బ్యాంకు పాలన నడుస్తోంది. అక్కడి మాల్డా ప్రాంతంలో ఆ మధ్య మైనార్టీలు భీకరంగా హిందువుల ఆస్తులపై దాడులు చేశారు. అయినా మమతా బెనర్జీ ఎటువంటి గట్టి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. నిజానికి బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్ల కారణంగా బెంగాల్లో అనేక చోట్ల మైనార్టీలే మెజార్జీలుగా మారిపోతున్నారు. ఇలా జనాభాలో అసహజంగా మార్పులు చేసుకుంటే అది దేశ భవిష్యత్తు కే ప్రమాదం. కాని, మన ఓటు బ్యాంకు రాజకీయ నేతలకు అవేవీ పట్టటం లేదు!    ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన హిందువుల వలసల కారణంగా దేశంలోని ముస్లిమ్ లను తప్పు పట్టటానికి ఏం లేదు. వాళ్లు ఎప్పటిలాగే పేదరికంలో మగ్గిపోతున్నారు. కాని, వాళ్లను, వాళ్ల ఓట్లను, వాళ్ల భయాన్ని అడ్డుపెట్టుకుని స్వార్థ రాజకీయ నేతలు పబ్బం గడుపుకుంటున్నారు! ఇదే విషాదం. అటు మైనార్టీలు, ఇటు మెజార్జీలు ఇద్దరూ ఇబ్బందుల్లో, భయాల్లో మునిగిపోతుంటే ... నేతలు మాత్రం అధికారం మరుగుతున్నారు! 

పాకిస్తాన్ కు ఇక 'మోది'నట్టే!

  పాకిస్తాన్ కు భారత్ ని కవ్వించటం ఇప్పుడు కొత్త కాదు. అసలు అది ఏర్పడ్డప్పటి నుంచే ఇండియాని టార్గెట్ చేసుకుని బతికేస్తోంది. 1947లో రెండూ స్వతంత్ర దేశాలుగా ఉనికిలోకి వస్తే అదే సంవత్సరం కాశ్మీర్ ఆక్రమణ కారణంగా పాక్ తో యద్ధం చేయాల్సి వచ్చింది భారత్. అప్పట్నుంచి మొదలైన పాక్ కవ్వింపులు మొన్నటి యూరి అమానుషం దాకా కొనసాగుతూనే వున్నాయి. కాని, ఇలాంటి కవ్వింపులు పాతవే అయినా... మోదీ మార్కు జవాబు పాకిస్తాన్ కు కొత్తగా వుంది. దాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది నమో దండోపాయం!   పాక్ ఎప్పటిలాగే నలుగురు ఉగ్రవాదుల్ని పంపి మన జవాన్లు ఇరవై మందిని పొట్టన పెట్టుకుంటే కొన్నాళ్లకు అంతా సర్దుకుంటుందని భావించింది. కాని, ఈ సారి ఇటు జనం , అటు ప్రభుత్వం రెండు వైపులా ఆగ్రహంతో వున్నారు. అందుకే, మోదీ మౌనంగా పాక్ ను అధః పాతాళానికి తొక్కే ప్రయత్నం మొదలు పెట్టాడు! అంతా భావించినట్టుగా ప్రత్యక్ష యుద్ధం జోలికి పోకుండా అంతర్జాతీయ సమాజంలో పాక్ ను ఒంటరిని చేసే కార్యక్రమం మొదలు పెట్టింది మోదీ సర్కార్. యూఎస్ మొదలు బంగ్లాదేశ్ వరకూ దాదాపు అన్ని దేశాలు ఇప్పుడు పాక్ ని ఛీకొడుతున్నాయి. అమెరికా అయితే ఏకంగా పాక్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటిస్తూ బిల్లు కూడా పాస్ చేసే ఆలోచనలో వుంది. మరో వైపు రష్యా పాకిస్తాన్ తో మిలటరీ విన్యాసాలు మానుకుంది. ఇలా అన్ని దేశాల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది పాక్ కి.    పాకిస్తాన్ కి తాజాగా జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మీటింగ్లో కూడా దిమ్మ తిరిగిపోయింది. ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఎప్పటిలాగే బూతు మాటలు మాట్లాడాడు తన స్పీచ్ లో. మరీ దిగజారిపోయి హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ నాయకుడైన బుర్హాన్ వనీని కాశ్మీరీ ఉద్యమకారుడంటూ పేర్కొన్నాడు. ఒక దేశ ప్రధాని ఇలా నిస్సిగ్గుగా ఉగ్రవాదిని వెనకేసుకు రావటం పాక్ దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. ఇప్పుడిక పాకిస్తాన్ కు మిగిలిన ఏకైక మిత్ర దేశం చైనానే!    చైనా కూడా పాక్ తో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. యూఎన్ మీటింగ్ జరిగాక చైనా పీఎంతో భేటీ అయిన నవాజ్ షరీప్ చర్చలు ఫలప్రదం అయ్యాయంటే చైనీస్ వారు మాత్రం పాక్ తమకు మంచి మిత్రదేశం అని మాత్రమే కామెంట్ చేశారు. కాశ్మీర్ సమస్య గురించి, ఇండియా గురించి వారు ఎక్కడా మాట్లాడలేదు. అసలు కాశ్మీర్, ఉగ్రవాదాల విషయంలో చైనా కూడా పాక్ కు పూర్తి మద్దతు ఇస్తుందన్న భరోసా లేకుండా పోయింది ఇస్లామాబాద్ కి! ఇది ఖచ్చితంగా మోదీ మార్కు అంతర్జాతీయ దౌత్యమే అనాలి. ఆయన పదే పదే చేసిన ప్రపంచ పర్యటనల ఫలితం అనే చెప్పుకోవాలి!   పైకి స్పష్టంగా చెప్పకపోయినా ఆల్రెడీ మన ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రవేశించి అక్కడి ఉగ్రవాద క్యాంపులపై దాడి చేసిందని అంటున్నారు. ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్స్ ఏ దేశం కూడా తనంత ఒప్పుకోదు కాబట్టి నిజంగా జరిగిందా లేదా తెలియదు. కాని, ఇండియా ఏ క్షణంలో అయినా తన మీద దాడి చేస్తుందని పాక్ భయపడుతున్న మాట మాత్రం వాస్తవం. అందుకు తగ్గట్టే యుద్ధ సన్నాహాలు చేసుకుంటోంది ఆ దేశం!    ఒకవైపు దౌత్య, ఆర్మీ పరమైన ఒత్తిళ్లు పెంచుతూనే మోదీ ఉగ్రదేశం పాక్ పై ఇంకో రూట్ లోనూ ప్రెషర్ పెంచుతున్నారు. ఎప్పుడో నెహ్రు టైంలో పాక్ మనతో సింధు జలాల విషయమై ఒప్పందం చేసుకుంది. ఈ ఇండస్ వాటర్ ట్రీటీని కూడా పునః సమీక్షిస్తామని ప్రకటించారు ఇండియన్ అధికారులు! దీనర్థం భారత్ నుంచి పాకిస్తాన్ లోకి ప్రవహించే సింధు జలాలు ఇంత కాలం వంద శాతం వాడుకునేది పాక్. ఇకపై అలా జరగకుండా నీటిని అడ్డుకుంటాం అని అర్థం! ఇండియా ఈ పని చేస్తే పాక్ ఆకలితో నకనకలాడిపోవాల్సి వస్తుంది. సింధు నది పాకిస్తాన్ కి అతి పెద్ద జీవనాధారం. కాని, ఇప్పటి వరకూ మన ప్రభుత్వాలు ఆ నదిపై ఎలాంటి హక్కునూ కోరలేదు. మొత్తం నీరంతా పాక్ వాడేసుకుంటోంది. మోదీ ఇండస్ నదిపై చూపు పెట్టడంతో పాక్ గడగడలాడిపోతోంది..    పాకిస్తాన్ ఇండియా వచ్చి యుద్ధం చేస్తుందేమో అన్న భయంలో ఎంతగా వుందంటే.. అసలు ఎలాంటి ప్రకటనా మన వద్ద నుంచి ఇప్పటి వరకూ రాకుండానే ఆ దేశ స్టాక్ ఎక్స్ ఛేంజ్ కుప్పకూలిపోయింది! అసలు పాక్ కు స్టాక్ ఎక్స్ ఛేంజ్ వుందా అంటారా? సోషల్ మీడియాలో చాలా మంది ఇదే డౌట్ వ్యక్తం చేస్తున్నారు. అసలు అత్యంత దారుణమైన ఆర్దిక స్థితిలో వున్న దాయాది దేశం ఇండియా ఆగ్రహాన్ని పదే పదే రెచ్చగొట్టి ఇంత కాలం తప్పు చేసింది. ఇప్పుడిక ఫైనల్ గా మోదీ శకంలో అంతిమ ఫలితం చవి చూడబోతోంది! చేసుకుంటూ వచ్చిన పాపాలకి మూల్యం చెల్లించబోతోంది! 

చచ్చు తెలివితేటలతో చావగొట్టేస్తోన్న నెటిజన్లు!

  సోషల్ మీడియా.. ఇప్పుడు ఇది తెలియని వారు ఎందరున్నారో సరిగ్గా తెలియదుగాని... ప్రపంచాన్ని మాత్రం సమూలంగా మార్చేసింది! ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా సైట్లు జనం రోజువారి జీవితంలో అత్యంత కీలకం అయిపోయాయి. ఒకవేళ ఓ పది రోజులు ఫేస్బుక్, ట్విట్టర్ లు లేకపోతే అందరూ ఏమైపోతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది! కాని, సోషల్ మీడియా క్రేజ్ కు మరో కోణం కూడా వుంది. అది అంతగా హర్షించదగింది కూడా కాదు!   ఎస్ జానకి అంటే ఎవరికి మాత్రం అభిమానం వుండదు చెప్పండి? మానవ రూపం దాల్చిన సంగీత సరస్వతి అంటారు ఆమెని తన అభిమానులు. అయితే, జానకి తాజాగా ఓ ప్రకటన చేశారు. మలయాళ సినిమా కోసం తాను పాడుతున్న ఓ పాటే తనకు చివరి పాట అని ఆమె చెప్పారు! అంటే.. ఇక మీదట తాను రికార్డింగ్ లకు హాజరుకానని ఆమె ఉద్దేశ్యం! ఎస్ జానకి లాంటి లెజెండ్రీ సింగర్ ఇక మీద పాటలు పాడరు అంటేనే ఎంతో బాధాకరమైన విషయం. అయినా కూడా ఆమె వయస్సు దృష్ట్యా ఆమె నిర్ణయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాని, అసలే ఇక జానకి గానామృతం వుండదని బాధపడుతున్న ఆమె అభిమానులకి సోషల్ మీడియా వెబ్ సైట్లు మరింత షాక్ నిచ్చాయి. కొందరు నెటిజన్స్ అత్యుత్సాహంతో జానకి ఇక మీద పాటలు పాడనని అంటే ఆమె చనిపోయినట్టు భావించారు! వచ్చిన న్యూస్ మొత్తం కూడా చదివి, విని, కన్ ఫర్మ్ చేసుకునే అలవాటు లేని ఇలాంటి బద్ధకస్తులు అప్పుడప్పుడే ఇదే తప్పు చేస్తుంటారు. చాలా సార్లు సోషల్ మీడియాలో తప్పుగా అర్థం చేసుకున్న వాళ్లు తప్పుడు సమాచారాన్నే సర్క్యూలేట్ చేసేస్తుంటారు! జానకమ్మ విషయంలో కూడా అదే జరిగింది..    జానకి ఇక మీద పాటలు పాడరని ప్రచారం కావాల్సింది కాస్తా ఆమె మరణించారని తప్పుడుగా వార్త బయలుదేరింది. గతంలో ఇలాగే మాదురీ దీక్షిత్, అమితాబ్ లాంటి వారు కూడా బలయ్యారు. వాళ్ల వాళ్ల అభిమానులు ఈ చచ్చు చావు వార్తలు విని హడలిపోయారు! అయినా చేతిలో కంప్యూటరో, స్మార్ట్ ఫోనో వుందో కాబట్టి సోషల్ మీడియాలో ఏదంటే అది రాసేయటం, కాదంటే షేర్ చేయటం కాకుండా సామాన్య జనం కూడా ఇక మీదట జాగ్రత్త పడాలి. ఎందుకంటే, ఫేస్బుక్ , ట్విట్టర్ లాంటి వాటి వల్ల ఇప్పుడు ప్రతీ వ్యక్తి జర్నలిస్టే అయిపోయాడు. మనం ఏం పోస్ట్ చేసినా అది గంటల్లో గందరగోళం సృష్టించేసే అవకాశం వుంది! అలాంటి ఘటనలే ఈ మధ్య కొన్ని ప్రాంతాల్లో మత కలహాలుగా మారాయి. కాబట్టి ప్రతీ ఒక్కరూ సంయమనం పాటించాలి. సోషల్ రెస్పాన్సిబులిటి లాగే సోషల్ మీడియా రెస్పాన్స్ బులిటి కూడా అలవర్చుకోవాలి... 

చరిత్ర పుస్తకాల్లోకి... ముఖపుస్తకం సీఈవో!

చేతిలో కత్తుంటే వీరుడైపోడు. ఆ కత్తి ఎలా వాడాలో, ఎవరి మీద వాడాలో తెలిస్తేనే వీరుడనిపించుకుంటాడు! ధనవంతుడు కూడా అంతే... ఊరికే కోట్లు సంపాదిస్తే గొప్పోడు అయిపోడు! నిజమైన గొప్ప వాడు అయ్యేది... తన వద్ద వున్న డబ్బును ఎలా ఖర్చు చేయాలో తెలిస్తేనే!. ఫేస్బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్ తాను డబ్బులున్న వీరుడినని నిరూపించుకున్నాడు!   మన దేశంలోని వేల కోట్లున్న సంపన్నుల్లా కాక దేవుడిచ్చిన సంపదని ఎలా వాడాలో ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు. ఇంతకీ ఆయన తన భార్య ప్రిసిల్లా చాన్ తో కలిసి చేసిన సత్కార్యం ఏంటో తెలుసా? ఓ మూడు బిలియన్ డాలర్లు చిన్న పిల్లల అనారోగ్యలపై పరిశోధనలకి కేటాయించాడు! ఓస్ .. ఇందులో ఏముంది అంటారా? ఇలా సమాజ సేవ చేయటం చాలా మంది డబ్బున్నోళ్లు చేస్తూనే వుంటారు కదా అంటారా? అది కరెక్టే! కాని, ఇంతకు ముందే జూకర్ బెర్గ్ తన సంపదలో 99శాతం సమాజ సేవకే వెచ్చిస్తానని ప్రకటించాడు. అందులో భాగంగా ఇప్పుడు మూడు బిలియన్లు... అంటే, మన దేశ కరెన్సీగా  అయితే... 20వేల కోట్లు చిన్న పిల్లల ఆరోగ్యానికి ఖర్చు చేస్తున్నాడు! జూకర్ బెర్గ్ భార్య మాటల్లో చెప్పుకుంటే ఈ శతాబ్దం చివరికల్లా చిన్న పిల్లల్లో అనారోగ్యాలు వుండకూడదు. అదీ ఈ ఫేస్బుక్ దంపతుల ఆశయం! నిజంగా ఇలాంటి ఆలోచనతో పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయటం అందరం మెచ్చుకోవాల్సిన విషయం! అంతే కాదు లక్షల కోట్లు నిస్సిగ్గుగా మెక్కి కూర్చునే మన పొలిటీషన్స్, కార్పోరేట్స్ కూడా ఎంతో నేర్చుకోవాలి. కార్లలో తిరిగి , బంగలాల్లో బజ్జోకుండా తమకు ఎంతో ఇచ్చిన సమాజానికి తిరిగి ఎంతో కొంత చేయాలి. ఆఫ్ట్రాల్... టైమొస్తే ఎంత డబ్బున్న వాడైనా కఠిక దరిద్రుడిలాగే చచ్చి స్మశానానికి పోతాడు కదా! రూపాయి కూడా వెంట తీసుకుపోడు! ఇదే జూకర్ బెర్గ్ ఉదారత్వం నిరూపించే సత్యం...