సిద్దేశ్వరస్వామి ఆలయం మొదటి దశ పునర్మిణాన పనులకు భూమి పూజ

  తిరుపతి జిల్లా తలకోనలోని  సిద్దేశ్వర స్వామి ఆలయంలో మొదటి దశ పునర్మిణాన పనులకు నేడు శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు  ఆదేశాలతో సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాల నిర్మాణం, పునర్మిణాం పనులను వేగవంతం చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మెన్  బీఆర్ నాయుడు తెలిపారు. మొదటి దశగా  సిద్దేశ్వర స్వామి వారి గర్భాలయం, అర్ధమండపం,  పార్వతీదేవి అమ్మవారి గర్భాలయం, మహా మండపం పనులను పునర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు టీటీడీ ఛైర్మెన్ వెల్లడించారు. ఈ పనుల కోసం మొదటి దశగా ఇప్పటికే రూ. 2 కోట్లు టీటీడీ విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందన్నారు. ఈ నిధులతో పాటు సదరు పనులకు, ఇతర అభివృద్ధి పనులకు దశల వారీగా మరిన్ని నిధుల సహకారం అందిస్తామన్నారు. వీటితోపాటు ముఖ మండపం, నంది మండపం, రాజ గోపురం,  సుబ్రమణ్యస్వామి ఆలయం,  వినాయక స్వామి ఆలయం, నవగ్రహ మండపం,  అభయ ఆంజనేయ స్వామి ఆలయం, ధ్వజమండపం, ఆఫీస్ గదులు, స్టోర్ గదులు, పోటు, కళ్యాణకట్ట, పుష్కరిణి తదితర పనులను చేపట్టనున్నారు.     అంతకుముందు భూమి పూజకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే  పులివర్తి నాని, జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, టిటిడి బోర్డు సభ్యులు  శాంతా రామ్, టిటిడి సీఈ టి.వి సత్యనారాయణ, టిటిడి ఎస్ శ్రీ మనోహర్, ఈఈ  జగన్మోహన్ రెడ్డి,  దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, పలువురు భక్తులు పాల్గొన్నారు.  

ఓటు చోర్ ఆందోళన... అసలు లక్ష్యం అదేనా?

  కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు, లోక్ సభలో, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నంత  పనిచేశారు. ఆటం బాంబు పేలుస్తా అన్నారు. పేల్చారు. భారత ఎన్నికల సంఘం, ప్రధాని మోదీ, బీజేపీలతో కుమ్ముక్కై,’ఓట్ల చోరీ’ కి పాల్పడిందని ఆరోపించారు. ఆరోపించడమే కాదు,  దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇవిగో ఆధారాలు అంటూ, పవర్ పాయింట్ ప్రెజెంటేషన’, ద్వారా అవునా, నిజమా, నిజంగానే ఓటు చోరీ జరిగిందా, అనిపించేలా ప్రెజెంటేషన్ ఇచ్చారు. సంచలన వ్యాఖ్యలు, విమర్శలు చేశారు. అలాగే, కర్ణాటక  రాజధాని బెంగుళూరులో మరో స్టేజి షో నిర్వహించారు.  ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అవకతవకలు, అక్రమాల గురించి కొన్ని నిర్దిష్ట ఆరోపణలు చేశారు.అయితే ఆయన చేసిన ‘నిర్దిష్ట’ ఆరోపణల్లో,  ‘నిర్దిష్ట’ నిజాలు ఉన్నాయా లేవా, అనేది నిగ్గు తేలాలంటే, రాహుల్ గాంధీ, తాను చేసిన   ఆరోపణలను నిరూపించే సాక్ష్యాదారాలతో ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయాలని, ఎన్నికల సంఘం, కోరింది. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ 1960 లోని, రూల్ 20 (3)(b) కింద, ప్రమాణం చేసి,అఫిడవిట్’ దాఖలు చేయమని కోరుతూ,కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ), కర్ణాటక చీఫ్ ఎలక్షన్ఆఫీసర్ ద్వారా,రాహుల్ గాంధీకి, వర్తమానం పంపింది. ఎదుకో ఏమో కానీ, రాహుల్ గాంధీ ప్రమాణ పత్రాన్ని ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు.  అయితే. రాహుల్ గాంధీ చేసిన చేస్తున్న నిర్దిష్ట ఆరోపణల్లో నిజం ఉన్న లేకున్నా, ఆయన ప్రస్తావించిన ఎన్నికల అవకతవకలు జరగడమే లేదని అనుకుంటే అది అత్మవచనే అవుతుంది. నిజానికి, 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల మొదలు, 2024 సార్వత్రిక ఎన్నికల వరకు, పంచాయతీ మొదలు పార్లమెంట్ వరకు రాహుల్ గాంధీ ప్రస్తావించిన ఎన్నికల అక్రమాలు అవకతవకలు జరగని ఎన్నిక ఇంత వరకు జరగలేదు. ఎక్కడిదాకానో ఎందుకు, 2023లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన, తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 22 లక్షల ఓట్లు రద్దయినట్లు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అనేక సందర్భాలలో  ఆరోపించారు. ఆయన పోటీ చేసి, ఓడిపోయినా తుంగతుర్తి అసెంబ్లీ నియోజక వర్గంలలోనూ పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ఓట్లు గల్లంతు అయ్యాయని దయాకర్’ కోర్టుకు వెళ్లారు. ఆ కేసు ఇంకా ఇప్పటికీ నడుస్తోంది. అలాగే, మాజీ ఎమ్మెల్సీ రాజకీయ  విశ్లేషకులు, ప్రొఫెసర్ నాగేశ్వర్’ బల్క్ ఓట్లకు సంబంధించి  ఒకే గదిలో పదుల సంఖ్యలో గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్న స్వీయ అనుభవాన్ని, ఒక ఇంటర్వ్యూ లో వివరించారు.  సో .. రాహుల్ గాంధీ ప్రస్తావించిన దొంగ ఓట్లు, బల్క్ ఓట్లు, డ్యూయల్ ఓట్లు, చనిపోయినవారికి ఓటు హక్కు కొనసాగడం, బతికున్న వారికీ ఓటు లేక పోవడం వంటి సవాలక్ష  అవకతవకలు, అక్రమాలు, ఎన్నికల సంఘం పురుడు పోసుకోక ముందు నుంచి ఉన్నవే. ఆనవాయితీగా వస్తున్నావే. కాంగ్రెస్, బీజేపీ, లేదా మరో పార్టీ ఏపార్టీ అధికారంలో ఎవరున్నా, ప్రధాన ఎన్నికల అధికారిగా,అలనాటి శేషన్’ ఉన్నా ఈనాటి జ్ఞానేశ్ కుమార్’  ఉన్నా, అవకతవకలు అక్రమాలు జరగని ఎన్నికలు ఇంతవరకు జరగలేదు.  అప్పుడు ఇప్పడు జరిగే తప్పులు జరుగుతూనే ఉన్నాయి.అప్పుడే జరిగాయి, ఇప్పడు లేవు అనుకున్నా, అప్పుడు లేవు ఇప్పుడు ఉన్నాయి అనుకున్నా,అది ఆత్మవంచన, పరనింద అవుతుందే కానీ, నిజం మాత్రం కాదు. నిజానికి,ఈవిషయంలో ఎదుటి వారిపై ఒక వేలు చూపిస్తే, నాలుగు వేళ్ళు మన వైపు చూపిస్తాయి. ఇప్పడు జరుగుతున్నది కూడా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీ వైపు, మోదీ వైపు వేలు చూపితే, బీజేపీ కాంగ్రెస్ వైపు వేలు చూపుతుంది. ఒక విధంగా గొంగళిలో తింటూ వెంట్రుకలు ఏరుకోవడం ఎలా ఉంటుందో, ఇలా పరస్పరం ఆరోపణలు చేసుకోవడం కూడా అంతే.. అయితే ఈ రాజకీయ క్రీడలో రాజకీయ పార్టీల ప్రతిష్ట మాత్రమే కాదు, అతి పెద్ద ప్రజాసామ్య దేశంగా ప్రపంచ దేశాల్లో మన దేశానికి, ఎన్నికల నిర్వహణలో, ‘ది బెస్ట్’  అన్న కితాబు పొందిన మన ఎన్నికల వ్యవస్థ ప్రతిష్టను కూడా దిగజార్చి వేస్తోంది. అదే అసలు విషాదం. అయినా, కాంగ్రెస్ నాయకుడు,లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ,ఇతర విపక్ష పార్టీల నాయకులు, బీహార్ ఎస్ఐఆర్’, కర్ణాటకలోఓట్ల గోల్ మాల్’ వ్యవహారాన్నికలగాపులగం చేసి, ప్రజల్లో అపోహలను సృష్టించే ప్రయత్నం, గందరగోల చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవంక, బీహార్’ లో ‘ఓటర్ అధికార యాత్ర’ పేరిట... రాహుల్ గాంధీ యాత్ర సాగిస్తున్నారు.సవాళ్ళు విసురుతున్నారు. ఎన్నికల సంఘం స్పష్టమైన సంధానాలు ఇచ్చినా, మళ్ళీ మళ్ళీ అవే ఆరోపణలు చేస్తున్నారు.  ఈ నేపధ్యంలో కేంద్ర ఎన్నికల నఘం, రాహుల్ గాంధీ, ఇతర విపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలపై ఘాటుగా స్పందించింది.అంతే కాదు, విపక్షాలు చేస్తున్న ఆరోపణలను నిరూపించే సాక్ష్యాదారాలతో ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయాలని, లేదంటే, దేశానికి క్షపణ చెప్పాలని ఎన్నికల ప్రదానాధికారి, జ్ఞానేశ్ కుమార్’ ఆదివారం డిమాండ్ చేశారు.అందుకు ప్రతిగా విపక్షాలు,’ ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై పార్లమెంటులో అభిశంసన ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ రాజకీయ క్రీడలో అంతిమంగా ఏమి జరుగుతుంది

విపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఈయనేనా?

  తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎన్డీయే ప్రకటించడంతో విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి  ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అదే తమిళనాడు చేందిన డీఎంకే ఎంపీ తిరుచ్చి శివను ప్రకటించే ఛాన్స్ ఉందని జాతీయ మీడియాలో వార్తలోస్తున్నాయి. ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగే ప్రతిపక్షాల భేటీలో అభ్యర్థి ఎవరో తేలనుంది. తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎన్‌డీయే ప్రకటించడంతో, అదే తమిళనాడు నుంచి డీఎంకే అభ్యర్థిని దించడం ద్వారా బీజేపీ వ్యూహాన్ని తిప్పికొట్టాలని విపక్ష కూటమి భావిస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఈనెల 21వ తేదీతో నామినేషన్ గడువు ముగియనుంది. ఈ క్రమంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకోసం రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో కూటమి ఫోర్ల్‌ లీడర్లు సోమవారంనాడు సమావేశమయ్యారు. కూటమి అభ్యర్థిని ఈరోజే అధికారికంగా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి.  

మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు కొట్టివేత

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన నిందితులకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. వారు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను విజయవాడ సీబీ కోర్టు సోమవారం (ఆగస్టు 18) కొట్టివేసింది. మధ్యం కుంభకోణంలో అరెస్టై ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డి, అలాగే విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న  ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ల వాదనలు పూర్తికావడంతో వాటిని కోర్టు తిరస్కరించింది. అలాగే ఈ కేసులో  వాపెదువరెడ్డి, సత్యప్రసాద్ ల ముందస్తు బెయిలు పిటిషన్లను కూడా  కోర్టు కొట్టివేసింది. 

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్.. ఆయనే ఎందుకంటే?

చివరాఖరుకు  ఎన్డీఎ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠకు తెర పడింది. నిజానికి మాజీ ఉపరాష్ట్రపతి జగదీశ్ ధన్ ఖడ్  అనారోగ్య కారణాల వలన తన పదవికి రాజీనామా చేసిన మరు క్షణం నుంచీ ఆయన వారసుడి వేట మొదలైంది. ఊహాగానాలు ఊపందుకున్నాయి. చాలా చాలా పేర్లు తెరపైకి వచ్చాయి, అయితే..  చివరాఖరుకు  ఊహాగానాలలో అంతగా వినిపించని మహారాష్ట్ర గవర్నర్  సీపీ రాధాకృష్ణన్ ను అధికార ఎన్డీఎ తమ కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. బీజీపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలోతీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ  నడ్డా  ఆదివారం (ఆగస్టు 17)మీడియా సమావేశంలో ప్రకటించారు.  అయితే.. ఎన్నో పేర్లు పరిశీలనకు వచ్చినా, బీజీపీ నాయకత్వం ఆయన్నే ఎందుకు ఎంపిక చేసింది ? ఇదీ ఇప్పడు రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినవస్తున్న ప్రశ్న. ఇందుకు ఒకటికంటే ఎక్కువ కారణాలే కనిపిస్తున్నాయి. అయితే ఇతర కారణాలు ఎన్నున్నా..  సైధాంతిక పునాదులే అయన ఎంపిక వెనక ఉన్న ప్రధాన కారణంగా’పేర్కొనవచ్చునని  పరిశీలకులు అంటున్నారు. అవునుజ. జగదీశ్ ధన్ ఖడ్ ను బలవంతంగా బయటకు పంపవలసి వచ్చిన  చేదు అనుభావాన్ని దృష్టిలో ఉంచుకునే  బీజేపీ నాయకత్వం ఉపరాష్ట్రపతి అభ్యర్ధి ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులు వేసిందని, అందుకే..  బాల్యం నుంచి రాష్ట్రీయ స్వయం సేవం సఘ్(ఆర్ఎస్ఎస్) భావజాలంతో, భారతీయ జన సంఘ్ (బీజేఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లతో కలిసి నడిచిన సీపీ రాధాకృష్ణన్ ను ఎన్డీఎ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేసిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  అదొకటి అయితే వివిధ కీలక పదవులకు బాధ్యులను ఎంపిక చేసే విషయంలో బీజేపీ నాయకత్వం, ఆలోచనా తీరు కొంత భిన్నంగా ఉంటుంది.  విభిన్న కోణాల్లో ఆలోచించి కానీ తుది నిర్ణయం తీసుకోదు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ రాష్ట్ర శాఖలఅధ్యక్షులు,ఇతర బాధ్యుల ఎంపిక విషయంలో బీజేపీ ఎంతో కసరత్తు చేస్తుంది. ఇప్పడు ఉపరాష్ట్రపతి అబ్యర్ది ఎంపిక విషయంలోనూ అదే కసరత్తు ఇంకొంచెం ఎక్కువగా చేసిందని పరిశీలకులు అంటున్నారు.  అందుకే సైద్ధాంతిక కట్టుబాట్లతో పాటుగా  రాజకీయ సమీకరణాలు, అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుందని అంటున్నారు. దక్షిణాదిలో మరీ ముఖ్యంగా  తమిళనాడులో పట్టు పెంచుకునేందుకు ఎంతో కాలంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న కమల దళం, తమిళ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సీపీ రాధాకృష్ణన్‌ ను వ్యుహ్తంకంగానే   ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేసిందని అంటున్నారు.  ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపికయ్యే సమయానికి ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నా, ఆయన స్వరాష్ట్రం తమిళనాడు. తమిళనాడులోని తిరుప్పూర్‌లో 1957 అక్టోబర్ 20న జన్మించిన సీపీ రాధాకృష్ణన్‌  తమిళ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని  సంపాదించుకున్నారు. 16 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్ తీర్ధం పుచ్చుకున్న ఆయన  అదే బాటలో రాజకీయ ప్రస్థానం సాగించారు. బీజేఎస్, బీజేపీలో కీలక బాధ్యతలు  నిర్వహించడంతో పాటుగా, 1998, 1999లో కోయంబత్తూరు నుంచి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004-2007 మధ్య తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.  అంతే కాకుండా రాధాకృష్ణన్‌ కు అన్ని పార్టీలతో, అందరు నాయకులతో సన్నిహిత సంబంధా లున్నాయి. డిఎంకే అధినాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయని అంటారు. రాధాకృష్ణన్ ఒక వారం పదిరోజుల క్రితం కూడా, ఇటీవల అనారోగ్యానికి గురైన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను ఆయన  ఇంటికెళ్ళి మరీ పరామర్శించారు. అలాగే..  ఇతర పార్టీలలోని ముఖ్యనేతలతోనూ రాధాకృష్ణన్‌కు మంచి సంబంధాలున్నాయని అంటారు. అలాగే.. ఆయన ఓబీసీ కులానికి చెందిన వారు కావడం కూడా కలిసి వచ్చిందని అంటారు. నిజానికి బీజేపీ అన్ని కోణాల్లో ఆలోచించే..  తమిళ మోదీగా పిలుచుకునే సీపీ రాధాకృష్ణన్‌ ను ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. అదలా ఉంటే,సెప్టెంబర్ 9 న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎలక్ట్రోరల్ కాలేజీలోని బలా బలాల దృష్ట్యా ఎన్డీయే అభ్యర్ధి రాధాకృష్ణన్ గెలుపు ఇంచు మించుగా ఖరారు అయినట్లే అంటున్నారు.

ఫాస్టాగ్ వార్షిక పాస్ కు అనూహ్య స్పందన

జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించే వాణిజ్యతర వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌కు అద్భుత స్పందన వచ్చింది.  దేశవ్యాప్తంగా 1,150కి పైగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల టోల్‌ ప్లాజాల్లో ఆగస్టు15 నుంచిఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అలా వచ్చిన గంటలవ్యవధిలోనే అంటే  అదే రోజు సాయంత్రం 7 గంటల వరకు   1.4 లక్షల వాహనదారులు ఈ పాస్‌ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేశారు.  అంతే కాకుండా రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌లో ఏకకాలంలో పాతిక వేల మంది  లాగిన్‌ అవుతున్నట్లు భారత నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. మూడువేల రూపాయలతో ఫాస్టాగ్ వార్షిక పాస్ తీసుకున్న వాహనయజమానులు ఈ పాస్ తో ఏడాది పాటు, లేదా 200 ట్రిప్పులు (వీటిలో ఏది ముందు అయితే అది) వరకూ జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చు అయితే ఈ వార్షిక పాస్ వ్యక్తిగత వాహనాలు, వ్యాన్లు, జీపులకు మాత్రమే వర్తిస్తుంది. వాణిజ్య వహానాలకుకాదు ఈ పాస్ ద్వారా 200 ట్రిప్పులు లేదా ఏడాది పాటు ప్రయాణించవచ్చు. అది ముగిస్తే మళ్లీ మూడువేల రూపాయలతో పాస్ ను మళ్లీ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది, 

కూకట్‌పల్లిలో దారుణం..బాలిక దారుణ హత్య

  కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి సంగీత్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. పదేళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. తల్లిదండ్రులు ఆఫీసుకు వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉన్న బాలికపై ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా విచారణలో తేలింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. సంగీత్‌నగర్‌లో కుమారుడు, కుమార్తెతో కలిసి దంపతులు నివాసముంటున్నారు. తండ్రి బైక్‌ మెకానిక్‌.. తల్లి ల్యాబ్‌ టెక్నీషియన్‌. బాలిక కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం తల్లిదండ్రులు తమ కుమారుడిని స్కూల్‌కు పంపి విధులకు వెళ్లారు. కుమార్తెకు స్కూల్‌ సెలవు కావడంతో ఇంట్లోనే ఒంటరిగా ఉంది. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కుమారుడి లంచ్‌ బాక్స్‌ తీసుకెళ్లేందుకు తండ్రి ఇంటికి వచ్చాడు. బెడ్‌రూమ్‌లో పొట్టపై కత్తి పోట్లతో బాలిక విగతజీవిగా పడి ఉండటాన్ని ఆయన గమనించాడు. దుండగులు బాలికను హతమార్చినట్లు గుర్తించి కూకట్‌పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలానగర్‌ డీసీపీ సురేశ్‌కుమార్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.  బాలిక హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలికపై లైంగిక దాడికి ఒక యువకుడు యత్నించాడు. ఆ బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆగ్రహానికి గురైన ఆ యువకుడు కత్తితో పొడిచి హత్య చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ కేసులో బాలిక ఒంటరిగా ఉందని తెలిసి బాలిక దగ్గరి బంధువువే హత్యకు ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సీఎం రేవంత్ గౌడ్.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

  సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ గౌడ్ అని సంభోధించారు. ముఖ్యమంత్రిని మేము రెడ్డిగా కాదు బీసీ నేతగా చూస్తున్నామని పేర్కొన్నారు. అలాంటి లక్షణాలు, ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఆయనను గౌడ్‌గా సంభోధించా అని వివరించారు. ఎవరి జనాభా ఎంత ఉంటే వారి వాటా అంత ఉండాలి అనే రాహుల్ గాంధీ ఆశయాన్ని రేవంత్ ఆచరణలో పేడుతున్నారని కొనియాడారు. ట్యాంక్‌బండ్‌ సమీపంలో పాపన్నగౌడ్ విగ్రహానికి సీఎం రేవంత్  శంకుస్థాపన చేశారు.  సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ విగ్రహం తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబడాలని ముఖ్యమంత్రి తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ మాట ఇచ్చారు. గాంధీ ఫ్యామిలీ మాట ఇస్తే అది శిలాశాసనమే. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణలో కులగణన సర్వే చేశాం. అందులో తప్పులుంటే చూపాలని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు శాసనసభ వేదికగా సవాల్‌ విసిరాం. తప్పులు చూపితే క్షమాపణ చెబుతామని చెప్పాం. రాజకీయ ప్రయోజనాల కోసం కులగణను తప్పుపట్టవద్దు. దీన్ని తప్పుపడితే వందేళ్ల వరకు బహుజనులకు న్యాయం జరగదు. బీసీ రిజర్వేన్ల బిల్లును ఐదు నెలలుగా కేంద్రం పెండింగ్‌లో పెట్టింది. బీసీతో పాటు ఎస్సీ, ఎస్టీ కలిపితే 70 శాతం వరకు చేరుతాయి.  తెలంగాణలో 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వకుండా గత ప్రభుత్వం చట్టం చేసింది. గత ప్రభుత్వం చేసిన చట్టం మనకు అడ్డంకిగా మారింది.’’ అని ముఖ్యమంత్రి అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ కోటను మైనింగ్ లీజుకు ఇచ్చాయని  రేవంత్ రెడ్డి విమర్శించారు. తద్వారా జనగామ జిల్లాలోని ఖిలాషాపూర్ కోటను కాలగర్భంలో కలిపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బహుజనుల సామ్రాజ్యాన్ని అందరికీ ఎలా అందించవచ్చో పాపన్నగౌడ్ నిరూపించారని అన్నారు. చరిత్ర కలిగిన కోటలను చారిత్రక కట్టడాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించామని రేవంత్ రెడ్డి తెలిపారు.  

కేంద్ర మంత్రులతో వరుస భేటీలతో హస్తినలో లోకేష్ బిజీబిజీ

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ హస్తిన పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులతో వరుస భేటీలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.   కేవలం భేటీలతో సరిపుచ్చడమే కాదు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం నారా లోకేష్ వారికి పలు విజ్ణప్తులు చేస్తున్నారు. విశేషం ఏమిటంటే... లోకేష్ వినతలు పట్ట కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందిస్తున్నారు.  నారా లోకేష్ సోమవారం హస్తినలో కేంద్ర మంత్రులు జైశంకర్, జేపీనడ్డా, హర్దీప్ సింగ్ పురి, నితిన్ గడ్కరీలతో భేటీ అయ్యారు.  కేంద్ర మంత్రి జైశంకర్ తో భేటీ సందర్భంగా నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో డేటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. అలాగే తమ బృందం సింగపూర్ పర్యటన వివరాలను ఆయనకు తెలిపారు. కాగా ఏపీలో డేటా సిటీ ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి లోకేష్ కు హామీ ఇచ్చారు. ఇక నడ్డాతో భేటీలో  రాష్ట్రంలో యూరియా కొరత సమస్యను పరిష్కరించాలని విజ్ణప్తి చేశారు. లోకేష్ వినతికి సానుకూలంగా స్పందించిన నడ్డా.. ఈ నెల 21 నాటికి రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చారు  ఇక కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సమావేశమైన లోకేష్ రిఫైనరీ నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేం దుకు సహకారం, అలాగే ఓఎన్ జీసీకి ఆఫ్ రిగ్ కాంట్రాక్టు సాధనకు తోడ్పడానికి కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే నితిన్ గడ్కరీతో భేటీలో కానూరు, మచిలీపట్నం రోడ్డు విస్తరణకు సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి గడ్కరీ సానుకూలంగా స్పందించారు.  అలా లోకేష్ కలిసిన ప్రతి కేంద్ర మంత్రీ లోకేష్ సమస్యలు వివరించిన తీరునూ, రాష్ట్ర ప్రగతి, ప్రయోజనాల సాధన విషయంలో కనబరుస్తున్న శ్రద్ధనూ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో అన్ని విధాలుగా సహకారం అందిస్తామని స్పష్టమైన భరోసా ఇచ్చారు. 

లోకేష్ రెడ్ బుక్కా మ‌జాకా

  మ‌నం చేసింది  ఒక‌రు కాపీ కొడుతున్నారంటే అది సూప‌ర్ హిట్ అయిన‌ట్టు లెక్క‌. ఇది త‌ర‌చూగా కొంద‌రు స్ట్రాట‌జిస్టులు చెప్పే మాట‌. లోకేష్ రెడ్ బుక్ విష‌యం కూడా స‌రిగ్గా ఇలాంటిదేన‌ని చెప్పాలంటారు వీరు. మొన్న క‌విత తాము పింక్ బుక్ రాస్తున్నామ‌ని కామెంట్  చేయ‌డంతోనే ఈ రెడ్ బుక్ బొమ్మ హిట్ అయిన‌ట్టు చెప్పాలంటారు కొంద‌రు టీడీపీ లీడ‌ర్లు. తాజాగా కేటీఆర్ సైతం ఈ త‌ర‌హా కామెంట్లు చేశారు. మ‌న‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేసే వారంద‌రి.. పేర్లు ఊర్లు రాసిపెట్టాల‌ని.. అధికారంలోకి వ‌చ్చినంక‌.. అంద‌రి ప‌ని చెబుతామ‌ని అంటున్నారాయ‌న‌. దీనంత‌టిని బ‌ట్టీ చూస్తే ఆనాడు నెగిటివ్ గా క‌నిపించిన రెడ్ బుక్ ప్ర‌స్తుతం ప‌వ‌ర్ఫుల్ గా మారిన‌ట్టు తెలుస్తోంద‌ని అంటున్నారు. ఎక్క‌డో ప‌క్క రాష్ట్రంలో కూడా దీని ప్ర‌భావం పాకిన‌ట్టు, ఆయా నేత‌ల‌కు సోకిన‌ట్టు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవ‌ల జ‌గ‌న్ కూడా ఒక యాప్ తెచ్చి అందులో అన్ని వివ‌రాల‌ను పొందు ప‌ర‌చ‌మ‌న్నారు. అయితే ఇది  రెడ్ బుక్ కి- యాప్ వ‌ర్ష‌న్ అన్న కామెంట్ వినిపించింది. రెబ్ బుక్ కి గుడ్ బుక్ తెస్తామ‌ని తొలినాళ్ల‌లో బీరాలు ప‌లికిన జ‌గ‌న్ ఆ త‌ర్వాత అదే త‌ర‌హాలో యాప్ తెస్తామ‌ని అన్న‌పుడే.. ఈ రెడ్ బుక్ ఎంత పెద్ద హిట్టో తెలుసుకోవ‌చ్చంటున్నారు. బేసిగ్గా జ‌గ‌న్.. ప్ర‌స్తుత‌ కూట‌మి ప్ర‌భుత్వం అన్నీ త‌మ ప‌థ‌కాలే కాపీ కొడుతున్న‌ట్టు ప్ర‌చారం చేస్తుంటారు. ఆ మాట‌కొస్తే ఇక్క‌డ లోకేష్ అధికారంలోకి రావ‌డానికే ఒక ఫార్ములా క‌నిపెడితే.. దాన్నిప్పుడు మీరంతా క‌ల‌సి కాపీ కొట్ట‌డాన్ని ఏమ‌నాలి బులుగూస్! అన్న కౌంట‌ర్ కామెంట్ వినిపిస్తోంది. స్టాన్ ఫ‌ర్డ్ లో చ‌దివిన లోకేష్ కి ఈ కార్య‌క‌ర్త‌ల‌కు జీతాలు, డైరెక్ట్ క్యాష్ బెనిఫెట్ స్కీములు ఏమంత కొత్త కాదు. ఆయ‌న‌కు ఇవ‌న్నీ కొట్టిన పిండి. అయితే అవి బాబు ద‌గ్గ‌ర‌కు వెళ్లేస‌రిక‌ల్లా.. రూపం మార్చుకుని క‌నిపిస్తాయి. ఒక్క రెడ్ బుక్ మాత్ర‌మే ఒరిజిన‌ల్ గా అలా బ‌య‌ట‌కొచ్చేసి సూప‌ర్ డూప‌ర్ బంప‌ర్ హిట్ కొడుతోంది. ఇటు ప్ర‌త్య‌ర్ధి పార్టీ వైసీపీయే కాకుండా.. ఎక్కడో ఉన్న బీఆర్ఎస్ సైతం అచ్చు దింపేస్తుందంటే అర్ధం చేసుకోవ‌చ్చ‌ని కాల‌ర్ ఎగ‌రేస్తున్నారు తెలుగు త‌మ్ముళ్లు.  

త‌మ్ముళ్ల త‌ల‌నొప్పి

  ముఖ్యమంత్రి చంద్ర‌బాబుకు తమ్ముళ్ల త‌ల‌నొప్పి మొద‌లైందా? స‌త్య‌వేడు ఎమ్మెల్యేతో మొద‌లు.. ప్ర‌స్తుతం ద‌గ్గుబాటి దుర్గాప్ర‌సాద్, కూన ర‌వికుమార్, న‌జీర్ ఇలా టీడీపీ ఎమ్మెల్యేల వ్య‌వ‌హారంతో కొత్త త‌ల‌నొప్పిగా త‌యార‌వుతోందా? మ‌రి వైసీపీ వాగుడుకాయ‌లైన వంశీ, నాని, అనిల్, రోజా వంటి వారికీ- వీరికీ తేడా ఏంట‌న్న ప్ర‌శ్న‌కు ఆస్కార‌మేర్ప‌డుతోందా? అన్న చ‌ర్చ‌కు తెర‌లేచింది.ఇప్ప‌టికే  కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఎమ్మెల్యేల దందా మొద‌లైంద‌న్న టాక్ ఒకింత వైల్డ్ గానే స్ప్రెడ్ అయ్యింది. అదే పెద్ద విష‌య‌మ‌నుకుంటే మ‌ధ్య‌లో మ‌రో తంటా వ‌చ్చే ప్రమాదం ఉందికూన ర‌వికుమార్ విష‌య‌మే తీస్కుంటే ఆముదాలవ‌లస ఎమ్మెల్యే అయిన ఈయ‌న త‌ల్లికి వంద‌నం విష‌యంలో ముగ్గురు ప్రిన్సిపాల్స్ తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. అయితే పొందూరు కేజీబీవీ స్కూల్లో విద్యార్ధినుల నుంచి అక్ర‌మంగా అద‌న‌పు డ‌బ్బు వ‌సూళ్లు చేస్తున్నార‌ని తాను నిల‌దీయ‌డం వ‌ల్లే వారిలా త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని అంటారు ర‌వికుమార్. తాను అమెరికా నుంచి రాగానే వారి బండారం మొత్తం బ‌య‌ట పెడ‌తాన‌ని అంటున్నారాయ‌న‌. అయితే ఎమ్మెల్యే త‌న‌ను వీడియో కాన్ఫ‌రెన్స్ ల రూపంలో వేధిస్తున్నారంటూ.. పొందూరు కేజీబీవీ ప్రిన్సిప‌ల్ ఆరోపిస్తున్నారు.అయితే ఇందులో మ‌రో కోణం కూడా లేక‌పోలేద‌ని అంటారు. వ‌చ్చే రోజుల్లో అచ్చెన్నను మంత్రిత్వం నుంచి త‌ప్పించి కూన‌కు ఆ ప్రాంతం నుంచి ప‌ద‌వి ఇచ్చేలా అధిష్టానం ఆలోచిస్తుంద‌ని అంటారు.. దీంతో అచ్చెన్న వ‌ర్గ‌మే ఇదంతా చేయిస్తుండ‌వ‌చ్చ‌న్న ప్ర‌చారం కూడా ఒకింత జోరుగానే న‌డుస్తోంది. ఇదిలా ఉంటే రీసెంట్‌గా  గుంటూరు తూర్పు ఎమ్మెల్యే న‌జీర్ విషయం పార్టీకి తలనోప్పిగా మారింది . ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్.. ఓ మహిళతో వీడియో కాల్ లో మాట్లాడుతూ ముద్దులు పెడుతున్న దృశ్యాలు  వైరల్ గా మారాయి. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి.  ఈ వీడియో వ్యవహారం తేల్చాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. ఈ వీడియోలో ఉన్న టీడీపీ మహిళా నేత గుంటుపల్లి వాణి ఈ విష‌యంపై తాను మ‌రో వీడియో రిలీజ్ చేశారు. తన భర్తతో వీడియో కాల్ మాట్లాడిన వీడియోను డీప్ ఫేక్ చేసి ఎమ్మెల్యేను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారామె. ఈ కేసులో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో అనుమానితురాలిగా భావించి మ‌రో టీడీపీ మ‌హిళా నేత సోఫియాను ప్ర‌శ్నించారు పోలీసులు. ఆమె చెప్పేదాన్నిబ‌ట్టీ చూస్తే.. వాణికి ఎమ్మెల్యేకీ మ‌ధ్య ఎఫైర్ ఉన్న మాట వాస్త‌వ‌మేన‌ని బాంబు పేల్చారామె. ఇందులో ఇంకో న‌మ్మ‌లేని నిజ‌మేంటంటే ఈ వీడియో లీక్ చేసింది మ‌రెవ‌రో కాదు.. వాణి భ‌ర్త న‌వీన్ కృష్ణేన‌ని అంటున్నారామె. ఈ విష‌యం త‌న‌కు స్వ‌యంగా న‌వీన్ కృష్ణే చెప్పిన‌ట్టు పోలీసుల‌తో చెప్పారామె. దీంతో ఎమ్మెల్యే వీడియో లీక్ కేసును ఎలా హ్యాండిల్  చేయాలో అర్ధంకాని గ‌జిబిజి గంద‌ర‌గోళం ఎదుర్కుంటున్నార‌ట గుంటూరు పోలీసులు. ఇదంతా ఇలా ఉంటే జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌ర్సెస్ ద‌గ్గుబాటి  ప్ర‌సాద్ వ్య‌వ‌హ‌రం మ‌రో త‌ల‌నొప్పి త‌క‌రారు కింద త‌యారైన‌ట్టు తెలుస్తోంది. అనంత‌పూర్ అర్బ‌న్ ఎమ్మెల్యే అయిన ద‌గ్గుబాటి ప్ర‌సాద్.. జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన వార్ టూ సినిమా  అనుమ‌తుల‌తోనే ఆడిస్తున్నారా? అని తెలుగు యువ‌త నేత ధ‌నుంజ‌య నాయుడితో చేసిన సంభాషణ ద్వారా ఇది వెలుగులోకి వ‌చ్చింది. తాను అనంత‌పూర్ ఎమ్మెల్యే కాబ‌ట్టి.. సినిమా ఆడ‌దంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి. అయితే ఈ ఆడియో లీక్‌లో వాయిస్ త‌న‌ది కాద‌ని కంప్ల‌యింట్ చేశారు ద‌గ్గుబాటి. తాను తొలి నుంచి నంద‌మూరి, నారా కుటుంబాల అభిమానిన‌ని.. అలాగ‌ని జూనియ‌ర్ ఎన్టీఆర్ అంటే త‌న‌కెలాంటి ద్వేషం లేద‌ని అన్నారాయ‌న‌. ఒక వేళ త‌న మాట‌ల‌కు జూనియర్ ఫ్యాన్స్ నొచ్చుకుని ఉంటే సారీ చెబుతున్నాన‌ని కూడా అన్నారు. ఈ ఆడియో లీక్ లోని వాయిస్ త‌న‌ది కాద‌ని ఆయ‌న పోలీస్ కంప్ల‌యింట్ కూడా చేశారు.  ఇప్పుడీ వ్య‌వ‌హారం చినికి చినికి గాలి వాన‌గా మారింది. జూనియ‌ర్  ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఇంటి ముందు చేరి నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. కూట‌మి నేత‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు కూడా చేస్తున్నారు. దీనంత‌టికీ కార‌ణ‌మైన ఎమ్మెల్యే విష‌యం బాబు వ‌ర‌కూ చేరింది. వ‌రుస పెట్టున త‌మ పార్టీ ఎమ్మెల్యేలు ఈ విధంగా బుక్ అవ‌డం. అది వైసీపీకి ఆయుధంగా మార‌డంపై చంద్ర‌బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నివేదిక ఇవ్వాలసిందిగా పార్టీ నేతలను ఆదేశించారు. ఇప్ప‌టికే కొలికిపూడి రూపంలో ఒక కొత్త త‌ల‌నొప్పి త‌యార‌వుతుండ‌టం గుర్తించి ఎలాగోలా క‌ట్ట‌డి చేశారు. ఆపై క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీని వేసి ఇలాంటి వారంద‌రిపైనా చ‌ర్య‌లు తీసుకునేలా ఒక ప్ర‌ణాళిక ర‌చిస్తున్నారు. ఇక‌పై ఇలాంటి వ్య‌వ‌హారాలు బ‌య‌ట ప‌డితే.. వారికి పార్టీలో గానీ ప‌ద‌వులు ఇవ్వ‌డంలోగానీ ప్రాధాన్య‌త ఇవ్వ‌బోమ‌న్న సంకేతాల‌ను పంపేలా తెలుస్తోంది.  

రామాంతపూర్ ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య...పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

  హైదరాబాద్ రామాంతపూర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీకృష్ణాష్ట‌మి వేడుక‌ల్లో మృతి చెందిన వారి బాధిత కుటుంబాలు స్ధానికులు ధర్నా నిర్వహించారు.మెయిన్ రోడ్డుపై ఆందోళన చేయడంతో  భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ఘటన స్ధానికి చేరకోని పరిస్ధితి ఆదుపులోకి ప్రయత్నం చేస్తున్నారు. గోకుల్ నగర్‌లో విద్యుత్ శాఖ సీఎండీ ముషారాష్‌కు నిరసన సెగ తలిగింది.ఎక్కువ కేబుల్స్ కటింగ్ చేస్తున్నారని అవసరం లేని వైర్లు తొలిగిస్తామన్నారు.  దాని వల్లే విద్యుత్ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఇంకా అలాంటి వైర్లు లేకుండా చేస్తామని తెలిపారు.  ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రామాంతపూర్ ప్రమాద మృతులకు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా  ప్రకటించింది. అందుకు సంబంధించి త్వరలోనే చెక్‌లను పంపిణీ చేస్తామని, గాయపడిన వారికి వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇవాళ ఆయన గాయపడిన వారిని పరామర్శించేందుకు గాంధీ ఆసుపత్రికి వెళ్లారు.

వచ్చే ఏడాది జూన్ కల్లా అందుబాటులోకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు!

విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు 2026 జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని జీఎంఆర్‌కు ఆదేశించడంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగంగా సాగుతున్నాయి. గత నెల చివరి నాటికే 84శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి.   అంతే కాదు విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం ముప్పావుగంటలో చేరుకోవడానికి వీలుగా బీచ్ కారిడాన్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందు కోసం రెండు వేల 800 కోట్ల రూపాయల వెచ్చించేందుకు రెడీ అయిన చంద్రబాబు సర్కార్..విమానాశ్రయానికి అనుబంధంగా 15 అంతర్గత రహదారులను ఫోర్ లైన్లుగా విస్తరించేందుకు నిర్ణయించింది. ఈ రహదారుల విస్తరణ కోసం 390 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ 15 రహదారుల్లో కనీసం ఏడింటిని వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది.అంతే కాకుండా విశాఖలో ట్రాఫిక్  ఇబ్బందులను తొలగించేందుకు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికీ శ్రీకారం చుట్టనుంది.   అన్నీ అనుకున్నట్లే సాగితే, వచ్చే ఏడాది జూన్ నెలలో భోగాపురం విమానాశ్రయంలో విమానరాకపోకలు ఆరంభమౌతాయని అంటున్నారు. 

నెల్లూరులో లేడీ డాన్.. చక్రం తిప్పితే పెరోల్

నెల్లూరులో ఓ మహిళా మణి . ఈమె పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. ఓ బట్టల దుకాణం పెట్టుకున్న ఆమె పోలీసుల్ని గుప్పిట్లో పెట్టుకుని ఆ ఆట ఆడారు.  వైసీపీ హయాంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పోలీసు అధికారులు అంతా ఆమె గుప్పెట్లో ఉన్నారనే టాక్ ఉంది.  అప్పుడు ఆమె ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్లుగా సాగింది… కూటమి పాలనలోనూ అదే ఆట ఆడాలనుకున్నారు. కానీ  అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు వీడియోలు సహా అన్నీ బయటకు వస్తున్నాయి. ఇటీవల నెల్లూరు జైల్లో ఉన్న శ్రీకాంత్ అనే వ్యక్తికి నెల రోజుల పెరోల్ పచ్చింది. పోలీసు ఉన్నతాధికారులు అంతా అతనికి పెరోల్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరాకరించారు. అయితే ఓ రోజు శ్రీకాంత్ కు  పెరోల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు వచ్చేశాయి. దాంతో పోలీసు వర్గాల్లో కలకలం రేగింది. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి తీగ లాగితే డొంక కదిలింది. ఈ పెరోల్ కథ అంతా ఓ మహిళ నడిపిందని .. కొంత మంది అధికారులు ఆమెకు దాసోహం అయ్యారని గుర్తించింది. ఆ మహిళ నెల్లూరులో ఓ బొటిక్ నిర్వహిస్తారు. వైసీపీ హయాంలో ఆమె పోలీసులకు.. రాజకీయ నేతలకు బొకేలు ఇస్తూ ఎన్నో కార్యక్రమాల్లో కనిపించారు. ఆ సమయంలోనే ఆమె సెటిల్మెంట్లు చేసేవారు. ఏ పనైనా పోలీసు శాఖలో అయితే ఇట్టే చేయించేవారు. దీంతో ఆమె పలుకుబడి పెరిగిపోయింది. ఈమె లవరే శ్రీకాంత్. ఓ హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడింది. ఓ సారి అనారోగ్యంతో ఉన్నాడని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ నెరజాణ తన లవర్‌తో గడిపేందుకు  నేరుగా ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి పోలీసులు అడ్డు చెప్పలేదు. వారిద్దరూ రొమాన్స్‌లో మునిగిపోయి వీడియోలు తీసుకున్నారు.  ఆ వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈమె భర్త అనుమానాస్పదస్థితిలో చనిపోయాడని చెబుతున్నారు. ఇప్పుడీ నెరజాణ గురించి మొత్తం బయటకు వస్తోంది. ఆమెకు సన్నిహితంగా ఉన్న పోలీసు అధికారులు ఎవరు.. రాజకీయ నేతలు ఎవరు.. అన్నీ  బయటకు తీసే పనిలో అధికారులు ఉన్నారు.

మార్వాడీ గో బ్యాక్.. మ‌త‌ల‌బ్ క్యా హై?

మీరు మార్వాడీ గో బ్యాక్ అంటే, మేం అంబేద్క‌ర్ గో బ్యాక్ అంటాం. మీరు ఇక్క‌డున్న నార్త్ వారిని త‌రిమేస్తామంటే.. మేం ఉత్త‌రాదికి చెందిన రాముడ్నే వ‌ద్దంటాం. ఇదీ ప్ర‌స్తుతం తెలంగాణాలో న‌డుస్తోన్న గొడ‌వ‌. ఇదెంత వ‌ర‌కూ స‌మంజ‌సం? ఎవ‌రిదంతా చేస్తున్నారు? అస‌లీ గొడ‌వ‌కు మూల‌కార‌ణమేద‌ని చూస్తే.. మార్వాడీలు వ‌స్తే పాతుకు పోతార‌ని.. కోటాను కోట్ల రూపాయ‌లు వెన‌కేస్తార‌ని కొంద‌రు  స్థానిక వ్యాపారులు  ఆరోపిస్తున్నారు. వీరిక్క‌డి నుంచి వెళ్లి  పోవ‌ల్సిందేన‌ని ఉద్య‌మిస్తున్నారు. డీమార్ట్ లాంటి సూప‌ర్ మార్కెట్ల కార‌ణంగా సాదా సీదా కిరాణా కొట్లు ఆగం అవుతున్నాయ‌ని, ఆయా వ్యాపారులు న‌ష్టాల  పాల‌వుతున్నారని అంటున్నారు. దానికి తోడు ఎద్దుల బండి వెళ్ల‌లేని చోటుకు కూడా ఈ మార్వాడీలు ప్ర‌వేశించి అక్క‌డ చిన్న కొట్టు తెరిచి తిష్ట వేస్తూ భారీ ఎత్తున సంపాదిస్తున్నార‌నీ అంటున్నారు. బేసిగ్గా వీళ్ల‌తో వ‌చ్చే తంటా ఏంటంటే వీళ్లు కిరాణా కొట్టు తెరిచినా,  త‌న‌ఖా కొట్టు తెరిచినా.. నిఖార్సుగా ఉంటారు. రూపాయి అటు ఇటు పోనివ్వ‌రు. ఎవ‌రికీ పెద్ద‌గా అప్పులు ఇవ్వ‌రు. వీళ్ల‌కు పెద్ద‌గా సెంటిమెంట్లు కూడా ఉండ‌వ‌ని అంటారు. దీంతో ఎదుటి వారి స‌మ‌స్య వీరిక‌స‌లు ఏ మాత్రం స‌మ‌స్య కాదని అంటారు. దీంతో వీరు భారీ ఎత్తున లాభార్జ‌న చేస్తార‌ని చెబుతారు. అదే  స్థానిక వ్యాపారులు ఏదైనా షాపు తెరిస్తే,  వాళ్ల‌కు ఇక్క‌డున్న ప‌రిచ‌యాల కార‌ణంగా అప్పులు ఇవ్వ‌డం, కాస్త ఉదారంగా వ్య‌వ‌హ‌రించ‌డం జ‌రుగుతుంది. అదే మార్వాడీల‌తో అలాక్కాదు. వీరు లెక్కంటే లెక్కే. అప్పు అస్స‌లు ఇవ్వరు దీంతో వీరికొచ్చిన లాభాలు మ‌రెవ‌రికీ రావు. అయితే ఇక్క‌డే  తెలుగు వాళ్ల‌లో చాలా మంది ముంబై, సూర‌త్, నాగ్ పూర్ వంటి వంటి  ప్రాంతాల‌కు వ‌ల‌స వెళ్లి నాలుగు డ‌బ్బులు సంపాదించ‌డం లేదా? అన్న ప్ర‌శ్న‌కు ఆస్కార‌మేర్ప‌డుతోంది. అయితే మార్వాడీలకీ, తెలుగు వాళ్ల‌కీ చాలానే తేడాలుంటాయ‌ని అంటారు. తెలుగు వాళ్లు బ‌త‌క‌డానికి నాలుగు రూక‌లు సంపాదించుకుని బిక్కు బిక్కుమంటూ బ‌తుకుతుంటారు. అదే మార్వాడీలు అలా కాదు..  ఇక్క‌డ వాళ్లు చిన్న జిలేబీ, స‌మోసా బండి పెట్టినా ఊళ్లో ఇళ్లు, వాకిళ్లు క‌ట్ట‌డంతో పాటు ఇక్క‌డ కూడా కాంప్లెక్సులు లేపుతార‌నే పేరుంది.  దీనికి తోడు ఇటీవల హైదరాబాద్ లోని మొజాంజాహి మార్కెట్లో పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ నేపథ్యంలో మార్వాడీలపై ఎప్పటి నుంచో గూడుకట్టుకున్న వ్యతిరేకత ఒక్కసారిగా భగ్గుమంది. దళిత సంఘాలు, కొందరు యువకులు మార్వాడీ గో బ్యాక్ అంటూ ఉద్యమిస్తున్నారు. దీంతో మార్వాడీల  ఉనికినే ప్ర‌శ్నార్ధ‌కం చేస్తూ కొంద‌రు ఈ మూమెంట్ తీసుకువస్తున్నారు. సోమవారం (ఆగస్టు 18) ఆమనగల్ బంద్కు కొందరు పిలుపు నిచ్చారు…మ‌రి చూడాలి ఇది ఏ తీరాల‌కు చేర‌నుందో? ఇందులో మ‌రెలాంటి గొడ‌వ‌లు రానున్నాయో అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ వీరి త‌ర‌ఫున బీజేపీ మాత్రమే వాయిస్ వినిపిస్తున్నది. మిగిలిన పార్టీలేవీ రియాక్ట్ కాలేదు.

ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కు అస్వస్థత

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బిజు జనతా దళ్ అధినేత నవీన్ పట్నాయక్  తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.   భువనేశ్వర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతకాలంగా వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇటీవలే ముంబైలో  ఆపరేషన్ చేయించుకున్నారు.  నిన్న రాత్రి నవీన్ పట్నాయక్ అస్వస్థతకు గురి కావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు.   ఆర్థరైటిస్ సమస్య కారణంగా వెన్నెముకకు ముంబైలో శస్త్ర చికిత్స చేయించుకుని గత నెల 12నే స్వరాష్ట్రానికి వచ్చారు.  ముంబై నుంచి వచ్చిన నెల రోజులకే ఆయన మళ్లీ అనారోగ్యానికి గురి అయ్యారు. కాగా ఆస్పత్రి వర్గాలు ఇప్పటి వరకూ ఆయన హెల్త్ బులిటిన్ విడుదల చేయలేదు. బీజేడీ వర్గాల సమాచారం మేరకు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. 

అయోమయంలో బీఆర్ఎస్.. జూబ్లీహిల్స్ అభ్యర్థిపై మల్లగుల్లాలు

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని ఎంపికచేయడంలో  బీఆర్ఎస్ మల్లగుల్లాలు పడుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఏర్పడిన ఖాళీకి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి.  ఈ ఉప ఎన్నిక కోసం అప్పుడే కాంగ్రెస్ ప్రచారం ఆరంభించేసింది.  మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ లు ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటనలు మొదలెట్టేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది ఖరారు కాకపోయినప్పటికీ, అభ్యర్థితో సంబంధం లేకుండా పార్టీ అభ్యర్థి విజయం కోసం వ్యూహరచన చేస్తున్నారు.   గతంలో  ఈ నియోజకవర్గంలో ని ఒక వర్గం ఓటర్లతో పరిచయాలు ఉన్న మంత్రి తుమ్మలకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బాధ్యతలు అప్పగించింది. దీంతో మంత్రి పొన్నంతో కలిసి ముఖ్య కార్యకర్తల సమావే శాలు నిర్వహిస్తూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లు మాత్రం నోటిఫికేషన్ వచ్చాక, అభ్యర్థుల ఎంపిక తరువాత అన్నట్లుగా సైలెంట్ గా ఉన్నాయి.  అయితే సిట్టింగు సీటును ఎలాగైనా దక్కించుకోవాలని భావిస్తున్న బీఆర్ఎస్ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.  ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందన్న ఆశతో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం బీఆర్ఎస్ లో అయోమయం నెలకొంది.  దివంగత ఎమ్మెల్యే మాగంటి కుటుంబంలో ఒకరిని బరిలో దింపాలని చూస్తున్నారు. దీనికి కొంత వ్యతిరేకత వస్తుందనే అభిప్రాయమూ వ్యక్తమౌతోంది. పి. జనార్దన్ రెడ్డి తనయుడు జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణు పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులలో అన్నీ హంగులు ఉన్న వ్యక్తిని ఎంపికచేయాలనే ఆలోచనా చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాని అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇక బీజేపీ పార్టీలో స్థానికంగా ఉన్న వారిలో ఒకరిని ఎంపికచేసే ఆలోచన చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హైకమాండ్ ఎవరిని ఖరారు చేస్తే వారిని గెలిపించుకుని సత్తా చాటాలన్న  పట్టుదలతో ఉంది.

తాడిపత్రిలో హైటెన్షన్ ఇరకాటంలో పోలీసులు

తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 14 నెలల తరువాత వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టనుండటమే ఇందుకు కారణం. నియోజకర్గంలో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానంటూ పెద్దారెడ్డి తాడిపత్రి రానున్నారు. ఆయన తాడిపత్రి ప్రవేశానికి కోర్టు నుంచి అనుమతి కూడా లభించింది. తాము విధించిన షరతులకు లోబడే తాడిపత్రి పర్యటన ఉండాలన్న షరతు విధించింది. దీంతో సోమవారం (ఆగస్టు18) తాడిపత్రిలో అడుగుపెట్టేందుకు పెద్దారెడ్డి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం నేత జేసీ ప్రభాకరరెడ్డి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారన్న భావనతో ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొత్తం మీద పెద్దారెడ్డి ఎంట్రీ నేపథ్యంలో తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.   మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని రాకుండా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి గత కాలంగా అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే . ఈ నేపథ్యంలోనే పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించి తాడిపత్రి లోకి ప్రవేశించేందుకు అనుమతి తెచ్చుకున్నారు.కోర్టు కూడా పెద్దారెడ్డికి భద్రత కల్పించి తాడిపత్రిలోకి అనుమతించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో పెద్దారెడ్డి సోమవారం (ఆగస్టు 18) తాడిపత్రి బయలుదేరారు. అయితే ఇదే సమయంలో జేసీ ప్రభాకరరెడ్డి తాడిపత్రిలో శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి భారీగా హాజరుకావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో   టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో ఉద్రిక్తతలు పెచ్చరిల్లి ఘర్షణకు దారి తీసు ప్రమాదం ఉందన్న భావనతో  తాడిపత్రికి బయలుదేరిన పెద్దిరెడ్డిని పోలీసులు మార్గమధ్యంలో నే అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా తాడిపత్రికి రావద్దంటూ పెద్దిరెడ్డికి చెబుతు న్నారు. కోర్టు అనుమతితో వస్తున్న తననెలా అడ్డుకుంటారని పెద్దారెడ్డి పోలీసులను నిలదీస్తున్నారు. మొత్తం మీద తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం పోలీసులను ఇరకాటంలో పడేసింది.