పాలన గాలికొదిలి రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ రాజకీయాలు

  తెలంగాణా ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న తెలంగాణా అంశాన్నిరాజకీయ పార్టీలన్నీకూడా ఒక రాజకీయ అంశంగానే భావిస్తూ, దానిని ఏవిధంగా తమ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలనే ఆలోచనతోనే ఎత్తులు వేయడం, తెలంగాణా ప్రజలని అపహాస్యం చేయడమేనని చెప్పవచ్చును. దీనికి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీనే తప్పు పట్టవలసి ఉంటుంది. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దీనిని తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత కాలంగా సాగదీస్తూ వచ్చింది. తన పార్టీ సభ్యులే రెండు వర్గాలుగా వేర్వేరు వాదనలు వినిపిస్తూ ఉద్యమాలు చేస్తూ రాష్ట్రంలో అశాంతికి మూల కారణమయితే, వారిని అదుపుచేయకపోగా వివిధ కారణాలరీత్యా వారిని వెనుక నుండి ప్రోత్సహించడమో లేక ఉపేక్షిస్తూ పరిస్థితిని మరింత జటిలం చేసింది.   నేటికీ ఆ పార్టీలో ఇదే పరిస్థితి కొనసాగుతుంన్నపటికీ కేంద్ర రాష్ట్ర పార్టీ నాయకత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చొని చోద్యం చూస్తున్నాయి. అంటే, నేటికీ కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనపై ఒక స్పష్టమయిన నిర్ణయానికి రాలేదని అర్ధం అవుతోంది. ఒకవేళ నిజంగా ఈ సమస్యపై పరిష్కారం కనుగొని ఉండి ఉంటే, నేడు రెండు ప్రాంతాలలోఆందోళనలు చేస్తున్నతన పార్టీ నేతలను తప్పక అదుపుచేసి ఉండేది.   కానీ, కాంగ్రెస్ నాయకత్వం అటువంటి ప్రయత్నాలేవీ చేయకపోవడంతో, మళ్ళీ సీమంధ్ర నేతల సమైక్య డ్రామా మొదలయింది. వీరు ఇక్కడ ఏదో ఒక వాదన చేయడం, దానిని అక్కడి కాంగ్రెస్ నేతలు ఖండిస్తుండటం ఒక నిత్యకృత్యంగా మారిపోయింది.   నిన్న మొన్నటి వరకు సమైక్యవాదం వినిపించిన కావూరి, ఇప్పుడు మంత్రి పదవి పుచ్చుకోవడంతో ఇప్పుడు ఈ సమస్యపై జాతీయ ద్రుక్పధంతో మాట్లాడాలని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పడం చూస్తే వారి ఉద్యమాలపట్ల నిబద్దత ఏపాటిదో, దేనికోసం చేస్తున్నారో అర్ధం అవుతుంది.   తెరాస తెలంగాణా ఉద్యమం మొదలుపెట్టినప్పటికీ, దానిని తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం రాష్ట్రమంతా వ్యాపింపజేసింది మాత్రం కాంగ్రెస్ నేతలే. ఈ వ్యవహారంలో ఒకరికి తమ వ్యాపార ప్రయోజనాలు కాపాడుకోవాలనే తాపత్రయమయితే, మరొకరికి పదవుల కోసం, ఇంకొకరికి తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆరాటం. అందుకు అమాయకులయిన ప్రజలను, ఉడుకు రక్తంగల విద్యార్ధులను వాడుకొని ఇదంతా వారి ప్రయోజనాలు కాపాడేందుకేనని నమ్మ బలుకుతున్నారు. ఈవిధంగా రాజకీయ పార్టీలు, వాటి నేతలు ఉద్యమాలతో రాజకీయాలు చేస్తూ తమ భవిష్యత్తుని నిర్మించుకొంటుంటే, వారి మాటలు నమ్మి వారి వెనుక తిరుగుతున్న ప్రజలు, ముఖ్యంగా విద్యార్ధులు వారి భవిష్యత్తుని పణంగా పెడుతున్నారు.   రాష్ట్రంలో ఇంత అశాంతి నెలకొని ఉన్నపటికీ, కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాలకే పెద్ద పీటవేస్తూ ఒకసారి రాయల తెలంగాణా అని మరోసారి మరొకటి అంటూ ఆ పరిస్థితులను మరింత జటిలం చేస్తోంది. వీటివల్ల రాజకీయ పార్టీలకి, వాటి నేతలకి వచ్చే నష్టం ఏమిలేకపోయినా, ప్రజలు మాత్రం తీవ్రంగా నష్టబోతున్నారు.   పరిపాలనా వ్యవహారాలూ చూసుకోవడానికి ఎన్నుకోబడిన శాసనసభ్యులు, మంత్రులు అందరూ ఉద్యమాల పేరిట పరిపాలనను గాలికొదిలేసి తిరుగడం కేవలం జవాబు దారీ లేకపోవడమే. అయితే దీనిని ప్రశ్నించే వారు కాని, వ్యవస్థ గానీ లేకపోవడంతో ఇది కొనసాగుతోంది. దీనినే ‘కాంగ్రెస్ మార్క్ పరిపాలన’ అంటారేమో మరి తెలియదు.

భద్రత ఆహారానికా అధికారానికా ?

....సాయి లక్ష్మీ మద్దాల       మొత్తం మీద ఆహార భద్రత చట్టాన్ని ఆర్డినెన్సు ద్వారా పట్టాలెక్కించేసింది సోనియా గాంధి ఆధ్వర్యం లోని మన్మోహన్ ప్రభుత్వం. ఎన్నికల ఘంటికలు మ్రోగటానికి సిద్ధంగా ఉన్న తరుణాన ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించింది కేంద్రంలోని కాంగ్రెస్ సర్కార్. ఈ ఆహారభద్రత పధకానికి వీరు ఖర్చు పెట్టబోయేది 1,25,000 కోట్లు. దీని ద్వారా లబ్ధి పొందబోయే ప్రజలు దాదాపు 85 కోట్ల మంది. అంటే దేశ జనాభాలో సగానికి పైగా పేదవారే ఉన్నారా?మరి ఈ 60సం॥ ల కాలంలో భారతదేశం ప్రజల అభివృద్ధిని దోచుకున్నది ఎవరు?తగినంత పరిమాణంలో నాణ్యమైన ఆహారాన్ని సరసమైన ధరలకు అందించటం ద్వారా ప్రజలకు పౌష్టికాహారం భద్రత కల్పించటంతో పాటు వారి గౌరవ ప్రదమైన జీవనానికి దోహదపడటం ఈ కీలక చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పటికే ఏటా 5కోట్ల 50లక్షల టన్నుల ఆహార ధాన్యాల్ని చౌక ధరలకు పంపిణి చేస్తూ,లక్షల కోట్ల రూపాయల భారాన్ని నెత్తిన మోస్తున్నామన్నది కేంద్రపాలకుల వివరణ. ఈ కొత్త చట్టం అమలులోకి వస్తే ఏటా మరో 70లక్షల టన్నుల ధాన్యం అవసర మన్నది తద్వారా ప్రభుత్వంపై మరో 25,000కోట్ల భారం పడుతున్నదని ఇప్పటి వివరణ.    ఈ చట్టం ద్వారా ఎంతమంది పేదలకు కడుపునిండా ఆహారం దొరుకుతుందో అనుమానమే. ఎందుకంటే ప్రజా పంపిణి వ్యవస్థ నిండా ఉన్నది అవినీతి పందికొక్కులే కనుక. అయితే ఆహారభద్రత కల్పించటమంటే ఒక చట్టాన్ని చేసి,ప్రజలను అందునా పేదవారిని ఊరించటమా!పేదల ఓట్లే రేపటి తమ అధికారానికి ఆశల మెట్లు  అని మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. కాని నానాటికి పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినంత ఆహార ఉత్పత్తి ఎలా అనే విషయం మీద ఎందుకు దృష్టి పెట్టటం లేదు?వ్యవసాయానికి నిధులకేటాయింపు తీరు దేశ ఆహారభద్రతకు భరోసా ఇవ్వలేక పోతోంది. ఎరువులు,విత్తనాలు,సాగునీటి సౌకర్యాల కల్పనపై బడ్జెట్ లో ఎలాంటి ప్రతిపాదనలు,కేటాయింపులు ఉండవు. ఆహార భద్రత చట్టం ఉద్దేశాలు,లక్ష్యాలు నెరవేరాలంటే వ్యవసాయం దాని అనుబంధ రంగ మైన పాడి పరిశ్రమకు నిధులు మరింత పెరగాలి. పాడి పశువుల నిర్వహణకు,అవుతున్న ఖర్చుకు,పాలధరకు మధ్య పొంతన లేక పాడి రైతులు పాడికి దూరమవుతున్నారు. ఇది ఎవరి నిర్లక్ష్యం ?ఉపాధి హామీ పధకానికి 33,000కోట్ల బడ్జెట్ కేటాయించామని చెప్పటమే తప్ప దానిని వ్యవసాయానికి ఊతంగా మారుస్తామన్న దిశగా మాటలే లేకపోవటం శోచనీయం. కూలీలు దొరకక,వ్యవసాయ యంత్రాలు అందుబాటులో లేక పంటలు పండిచటం ఎలా సాధ్యం?            అధిక దిగుబడుల సాధనకు నిధుల కేటాయింపులు చాల కీలకం. దేశంలో 58%ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నది వ్యవసాయ రంగమేనని తాజా ఆర్ధిక సర్వే వెల్లడి చేసింది. దేశంలో పేదల ఆహార అవసరాలు తీర్చడానికి వచ్చే ఏడాదికి 90,000కోట్ల రూపాయల మేర రాయితీలు ఇస్తున్నట్లు ప్రకటించారు. అందులో కనీసం మూడోవంతైన వ్యవసాయానికి కేటాయించకపోవటం ఎంత దారుణం. ఆరుగాలం కష్టపడిన రైతుకు శ్రమ ఫలితంగా తగిన గిట్టుబాటు ధర ఇవ్వటం న్యాయమా లేక ఓట్ల రాజకీయాల కోసం ఉచితబియ్యం లాంటి పధకాలు ప్రవేశపెట్టి వేల కోట్ల రూపాయలు కుమ్మరించటం న్యాయమా అన్నది పాలకులకే తెలియాలి. రెండు దశాబ్దాలుగా పండించేవాడిని చెండుకుతినేలా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకాల కారణంగా రోజుకు రెండు వేలమంది  రైతులు  సేద్యాన్ని   వదిలేస్తున్నారు. ఈ కఠోర వాస్తవ గణాంకాలు దేశ ఆహార భద్రతకే ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.             నిస్సార మవుతున్న నేలలు,అడుగంటుతున్న భూగర్భ జలాలు,సాగునీటి కొరత,వాతావరణ మార్పుల దుష్ప్రభావాలు అన్నిటికి మించి నేడు మార్కెట్లో నడుస్తున్న రైస్ మిల్లర్స్ అసోసిఎషన్ దంద ! బియ్యం ధరలను ఆయా మిల్లుల యాజమాన్యాల అసోసియేషన్ లు  నిర్ణయిస్తు మార్కెట్ ను వారి గుప్పెట్లో పెట్టుకుంటే సదరు రాజకీయ నేతలు అందులో భాగస్వాములై ఏమి పట్టనట్లు ఉన్న పాపం ఎవరికి?ఇన్ని రకాలుగా రైతును నలుచుకు తింటూ అన్న దాతను పస్తుపెట్టి ఆహారభద్రత అంటూ తమ అధికారానికి భద్రత పెంచుకుంటున్న చేతకాని పాలకులను ఏమనాలి?ఈదేశానికి పట్టిన చీడ అనా లేక దౌర్భాగ్యమన?    

ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులే పలికేను

  సుప్రీంకోర్టు సీబీఐని పంజరంలో చిలకలుగా వర్ణించినప్పటి నుండి దానికి అదే పేరు స్థిరపడిపోయింది. దానిని సార్ధకనామధేయంగా చేసుకోవడానికి సీబీఐ కూడా శక్తి వంచనా లేకుండా ప్రయత్నిస్తూనే ఉంది. కొద్ది నెలల క్రితం కేంద్ర ప్రభుత్వానికి డీ.యం.కే. మద్దతు ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించిన గంటలోగానే, చెన్నైలో కరుణానిధి కొడుకు ఇంటి మీద సీబీఐ చిలుకలు వాలిపోయి ఒకటే హడావుడి చేసేసరికి, వాటి విశ్వసనీయత చూసి కేంద్రమే ముక్కున వేలు వేసుకొంది.   మళ్ళీ మొన్నామధ్య రైల్వేమంత్రిగారు బన్సాల్ గారి మేనల్లుడు విజయ్ సింగ్లా రైల్వే శాఖలో ఒక కీలకమయిన పోస్టుమీద అశోక్ కుమార్ అనే పెద్దాయన మనసు పారేసుకొంటే, దానిని ఆయనకు ఇప్పించేందుకు పది కోట్లు బేరం చేసుకొని, అందులో కేవలం రూ.89.68 లక్షలు మాత్రమే అడ్వాన్సుగా స్వీకరిస్తుంటే, సైంధవుడిలా అడ్డుపడిన సీబీఐ ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లు మంత్రిగారి మేనల్లుడిని, ఆయనకు లంచం మేపుతున్న పెద్దమనుసులని పట్టేసుకొంటే, పాపం అన్నెం పున్నెం తెలియని మంత్రిగారి పదవి పుటుక్కున ఊడిపోయింది.   ఆయన మంత్రి పదవి ఊడగొట్టిన తరువాత ఇప్పుడు తాపీగా “ఆయన నిజంగానే అన్నెం పున్నెం తెలియని వ్యక్తి. ఆయన ఇంట్లో బేరసారాలు అయినంత మాత్రాన్న ఆయనకేమి ముట్టినట్లు కాదు. అయినా ఆ సమయంలో ఆయన ఇంట్లో లేడు వాకింగ్ కో షాపింగు కో బయటకి వెళ్ళేడు కూడా. అందువల్ల, మేనల్లుడు తన ఇంట్లో సాగించిన వ్యవహారం గురించి అసలతనికి తెలిసే అవకాశమే లేదు. అసలు ఆయన మేనల్లుడితో ఈ వ్యవహారం గురించి ఫోన్లో మాట్లాడిన దాఖలాలు లేనే లేవు. మేనల్లుడికి లంచం మేపిన వ్యక్తితో బన్సాల్ మంత్రిగారు అనేక విషయాలు మాట్లాడి ఉండొచ్చు గాక, ఆ పది కోట్ల డీల్ గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు, ఒట్టు!” అంటూ మాజీని చేసిన మంత్రిగారికి సీబీఐ చిలుకలు క్లీన్ చిట్ ఇస్తూ కిలకిలమన్నాయి.   అయితే, అసూయపరులయిన ప్రతిపక్షనేతలు కొందరు ఏ గూటి చిలుక ఆ గూటి పలుకే పలుకుతుందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏమయినప్పటికీ మంత్రిగారు చాలా పెద్దమనిషని మనకి అర్ధమయిపోయింది.

పంచాయతీ నిధులు దోచుకున్న కాంగ్రెస్ దొంగలు

      పంచాయతీ నిధులను కాంగ్రెస్ దొంగలు దోచుకున్నారని, నాటి వైఎస్ నుంచి నేటి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు వీరికి డబ్బుమీద ద్యాస తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోరని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ముందుగా రైతుల రుణ మాఫీ చేస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వైఎస్‌ను అడ్డం పెట్టుకుని ఆయన తనయుడు జగన్మోహన్‌రెడ్డి లక్ష కోట్లు దోచుకున్నారని, ఆంకా దోచుకోడానికి పార్టీ పెట్టారని, అలాంటి పార్టీలకు ఓట్లు వేయకూడదని ప్రజలకు పిలుపునిచ్చారు. మొదట నుంచి ప్రజలకోసం పనిచేస్తుంది, సమస్యలపై పోరాటం చేస్తోంది ఒక్క టీడీపీయేనని చంద్రబాబు పేర్కొన్నారు. 2014 సాధారణ ఎన్నికలలో టీడీపీ విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.   అంతకుముందు ఉత్తరాఖండ్ సహాయక చర్యల్లో పాల్గొని విమాన ప్రమాదంలో మృతి చెందిన జవాన్ వినాయకం కుటుంబాన్ని చంద్రబాబునాయుడు పరామర్శించారు. పూతలపట్టు మండలం చిన్నబండపల్లి వినాయకం కుటుంబాన్ని పరామర్శించి రూ.2లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలాగే ప్రభుత్వంతో మాట్లాడి ఆకుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునే చూస్తామని చంద్రబాబు అన్నారు.

కాంగ్రెస్ వేలితో కాంగ్రెస్ కన్ను పొడుస్తున్నతెరాస

  కాంగ్రెస్ పార్టీ తన చేతి వాటం ప్రదర్శించి తెలంగాణాని ఎత్తుకు పోవడంతో కంగుతిన్న తెరాస నేతలిప్పుడిపుడే మెల్లగా కోలుకొంటున్నారు. ముందుగా కోలుకొన్న కేసీఆర్, కాంగ్రెస్ తో విలీనం ప్రసక్తి లేదని ప్రకటించి, దానిని కొంత దారిలోకి తెచ్చుకోన్నాక, ఆ మరునాడే ఆయన కుమారుడు ఈ నెల 23లోగా తెలంగాణా ఇస్తే, తాము మాటకు కట్టుబడి తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేస్తామని మరో ఆఫర్ ఇచ్చారు. “కాంగ్రెస్ పార్టీ నిజంగానే తెలంగాణా ఇచ్చే ఉద్దేశ్యమే ఉంటే, దిగ్విజయ్ సింగ్ ప్రకటించినట్లే పదిరోజుల్లో కాకపోయినా, కనీసం పంచాయితీ ఎన్నికలు మొదలయ్యేలోగానైనా తెలంగాణా ప్రకటించాలి. అప్పుడు ప్రజలే కాంగ్రెస్ కి ఓటు వేసి గెలిపిస్తారు. కానీ, ఆలోగా ఇవ్వకపోతే వారిచేతిలో కాంగ్రెస్ భూస్థాపితం కాక తప్పదు. కాంగ్రెస్ పార్టీకి ఇదే ఆఖరి అవకాశం” అని ఆయన అన్నారు.   కేటీఆర్ ఈవిధంగా డిమాండ్ చేయడం పైకి చాల సహజంగానే కనిపిస్తున్నపటికీ, దానివెనుక కాంగ్రెస్ తాజా వాగ్దానంతోనే కాంగ్రెస్ పార్టీని ఇరికించి, రానున్న పంచాయితీ ఎన్నికలలో ఆ పార్టీని పూర్తిగా దెబ్బతీయాలనే ఆలోచన దాగి ఉంది. ఒక్క తెరాసకే కాదు యావత్ రాష్ట్ర ప్రజలకి కూడా కాంగ్రెస్ పదిరోజుల్లో తెలంగాణా ఇవ్వలేదని నమ్ముతున్నారు. గనుకనే, కేటీఆర్ కూడా కాంగ్రెస్ కు తన వాగ్దానం గురించి మరో మారు గుర్తు చేసి, అది ఇవ్వకపోతే ఏమిచేయాలో తెలంగాణా ప్రజలకు హిత బోధ చేస్తున్నారు.   ఈవిధంగా తెరాస నేతలందరూ కాంగ్రెస్ పై ఒత్తిడి తెస్తూ, అది ఎలాగూ పదకొండో రోజున గతంలో లాగే ‘పది రోజులంటే పది రోజులు కాదంటూ’ చెప్పక తప్పదు గనుక, అప్పుడు కాంగ్రెస్ ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టి, పంచాయితీ ఎన్నికలలో పూర్తి ఆధిపత్యం సంపాదించవచ్చుననే ఆలోచనతోనే ఈవిధమయిన డిమాండ్ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ కూడా మళ్ళీ మరో మారు తనకు తానే పదిరోజుల డెడ్ లైన్ విధించుకొని మరో పెద్ద పొరపాటు చేసింది. ఆ పొరపాటుకి పంచాయితీ ఎన్నికలలో అది మూల్యం చెల్లించేలా చేయడమే తెరాస లక్ష్యం.   ఈ వంకతో తెరాస ఎన్నికలలో ఆదిపత్యం సంపాదించగలిగితే, ఇంత వరకు తనపై వచ్చిన ఆరోపణలన్నీ గాలికి కొట్టుకొనిపోతాయని తెరాస అభిప్రాయం. అందువల్ల ఎన్నికలు దగ్గిరపడుతున్న కొద్దీ తెరాస తన డిమాండును మరింత గట్టిగా వినిపిస్తూ, ప్రజలకి కాంగ్రెస్ పార్టీ తమని మరోసారి మోసం చేసిందనే భావన కల్పించే ప్రయత్నాలు తప్పక చేస్తుంది.

సోనియాని కోదండరామ్ ఎలా కలుస్తారు!

        తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరామ్, ఇతర నేతలు కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరపడాన్ని టిడిపి మండిపడింది. కుట్రలు, కుతంత్రాలు చేసే కాంగ్రెస్ బాటలోనే ఐకాస నడుస్తుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. సమైక్యాంద్ర సభలు పెట్టాలని దిగ్విజయ్ సింగ్ సీమాంద్ర కాంగ్రెస్ నేతలని ప్రోత్సహించారని టిడిపి నేత రేవంత్ రెడ్డి తెలిపారు. సీమాంద్ర లో సభలు పెట్టాలన్న దిగ్విజయ్ సింగ్ ను కొదండరామ్ ఏ మేరకు సబబని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు సమాధానం చేపాల్సిన బాధ్యత కోదండరామ్ కు ఉందని ఆయన అన్నారు.   రాజకీయ పార్టీలు మోసం చేశాయని చెబుతున్న జెఎసి నేతలు తెలంగాణ ప్రజల బలిదానాలను కాంగ్రెస్ కాళ్లమీద పెడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ సాధనే లక్ష్యమంటున్న కోదండరామ్ తదితరులు సోనియాగాందీ అప్పాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్ ను వెలివేయాలని అనుకుంటుంటే, ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడితో కలిసి ఫోటోలు దిగుతుంటే ఎలాంటి సందేశం ఇస్తున్నారని రేవంత్ విమర్శించారు.

జగన్ పార్టీలో చేరిన మోపిదేవి కుటుంబం

      జగన్ అక్రమాస్తుల కేసులో నిందుతుడిగా చంచల్ గూడ జైలులో వున్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. వైఎస్ విజయమ్మ సమక్షంలో మోపిదేవి సోదరుడు హరనాథ్ బాబు, కుమారుడు రాజు, మాజీ మండలాధ్యక్షుడు వాసుదేవలతో సహా రేపల్లె నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, పట్టణంలోని కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి వైఎస్ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరిని విజయమ్మ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ జిల్లా అద్యక్షుడు మర్రి రాజశేఖర్, కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కాపాడుతుందన్న భావంతో ఇంతకాలం ఎదురుచూసిన వారికీ నిరాశ ఎదురుకావడంతో జగన్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి రేపల్లె నుంచి మోపిదేవి అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి హాజరుకావడం విశేషం.

రోడ్ మ్యాప్ తర్వాతే తెలంగాణ పై నిర్ణయం

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్య నారాయణ ను తెలంగాణ రోడ్ మ్యాప్ ను తయారుచేయమని చెప్పినట్లు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. రోడ్ మ్యాప్ ను పరిశీలించిన తరువాత సోనియా గాంధీ, ఇతర నేతలతో మాట్లాడి తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని దిగ్విజయ్ అన్నారు. అంతకుముందు దిగ్విజయ్ తో కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే భేటి అయ్యారు. షిండే తో భేటి పై వివరాలను మీడియాకు వెల్లడించేందుకు దిగ్విజయ్ నిరాకరించారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు కూడా ఈ రోజు దిగ్విజయ్ సింగ్ తో భేటి అయ్యారు. ముందుగా తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్న పాల్వాయి గోవర్ధన్ రెడ్డి దిగ్విజయ్ ని కలిసి తెలంగాణ ఇస్తే పదిహేను ఎంపీ సీట్లు వస్తాయని చెప్పారు. వెంటనే తెలంగాణ పై రాజకీయ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. రెండు వారాల్లో తెలంగాణ పై నిర్ణయం జరుగుతుందని ఈ సంధర్బంగా దిగ్విజయ్ చెప్పారని అన్నారు. విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ కూడా దిగ్విజయ్ ను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరారు. రాష్ట్రం సమైక్యంగా ఉండవలసిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

జగన్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమన్నారు

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విలన్ లాగా వ్యవహరిస్తున్నరని మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సోదరుడు హరనాథ్ ఆరోపించారు. జగన్ వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే జైలు నుంచి బయటకు తీసుకువస్తామని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి చెప్పారని కొత్త ఆరోపణ చేశారు. మోపిదేవి అనారోగ్యం పాలైన ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. మోపిదేవి ఆరోగ్యం సరిగా లేకపోతే ఉస్మానియాకు తీసుకువచ్చి వెంటనే జైలుకు తీసుకుపోయారని, ధర్మాన, సబితాలకు ఒక న్యాయం, తన సోదరుడు మోపిదేవికి మరో న్యాయమా అని ప్రశ్నించారు. 2014 లో జగన్ మోహన్ రెడ్డి ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలని అన్నారు. ఇంత నీచమైన కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసినందుకు సిగ్గుగా వుందని అన్నారు.

గంటి ప్రసాద౦ను ప్రభుత్వమే హత్య చేయించింది: భార్య

      ప్రజా సమస్యలపై పోరాడే తన భర్తకు శత్రువులు ఎవరూ లేరని, ఆయనను చంపేందుకు ప్రభుత్వమే కుట్ర పన్ని పోలీసులతో దాడి చేయించిందని ప్రసాదం భార్య కామేశ్వరీదేవి ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కోమర్తిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. తన భర్తపై ప్రభుత్వం గతంలో ఎన్నో అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసిందని, అవేవీ కోర్టులో రుజువు కాకపోవడంతో నిర్దోషిగా విడుదలయ్యారని చెప్పారు. ప్రసాదంపై దాడి పోలీసు గూండాల చర్యేనంటూ పౌరహక్కులు, విరసం నేతలు ఆరోపించారు. బూటకపు ఎన్‌కౌంటర్లపై ఆయన న్యాయ పోరాటాలు చేస్తున్నారని, గతంలో ఒకసారి విశాఖపట్నంలో కిడ్నాప్ చేసి తిరిగి వదిలిపెట్టారని, ఇటీవల చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ల ద్వారా బెదిరించారని వివరించారు. ఘటనా స్థలికి ఆలస్యంగా రావడంతోపాటు నిర్లక్ష్యంగా పోలీసులు దర్యాప్తు చేశారంటూ కొందరు విరసం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులో ఆస్పత్రిలో ఉన్న బంధువులను పరామర్శించడానికి వెళ్లిన గంటి ప్రసాదంపై కొందరు దాడి చేశారు.అందులో తీవ్రంగా గాయపడిన ప్రసాదం తర్వాత మరణించాడు.

తెలుగువన్ లో నాట్స్ తెలుగు సంబరాలు ప్రత్యక్షంగా ప్రసారం

      ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) మూడో ద్వైవార్షిక వేడుకలను ప్రత్యక్షంగా ప్రసారం చేస్తుంది తెలుగువన్.కాం.                                              (Click Here to Watch NATS LIVE)        http://www.teluguone.com/live/nats/   ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) మూడో ద్వైవార్షిక వేడుకలకు డల్లాస్ లోని ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటర్ అందంగా ముస్తాబైంది. గురువారం సాయంత్రం విందు కార్యక్రమాలతో ప్రారంభమయ్యే వేడుకలు శనివారంతో ముగుస్తాయి.  ఈ సంబరాలకు నందమూరి నట సింహం బాలకృష్ణ ,కాజల్ అగర్వాల్ , నిషా అగర్వాల్, ఇలా ఎందరో సినీ ప్రముఖులు నాట్స్ సంబరాలకు విచ్చేస్తున్నారు. వీరితో పాటు.. కామెడీ స్టార్ ఆలీ.. కోన వెంకట్ , నిర్మాత సాయి కొర్రపాటి.. ఇలా ఎందరో సినీ దిగ్గజాలు సంబరాలకు తరలివస్తున్నారు. సినిమా నిర్మాణంపై సదస్సులు, వ్యాపార మెళుకువలపై చర్చా కార్యక్రమం, ఆధ్యాత్మిక సమ్మేళనం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేందుకు నాట్స్ ఏర్పాట్లు చేస్తోంది.  ఆంధ్రప్రదేశ్ స్పీకర్ నాదెండ్ల మనోహార్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా రానున్నారు. అమెరికాలో తొలిసారిగా ఈటీవీ పాడుతా తీయగా..నిర్వహించిన బాలు.. నాట్స్ సంబరాల వేదికపై  పాడుతా తీయగా ఫైనల్ నిర్వహించనున్నారు. ఇక కీరవాణి మ్యూజికల్ నైట్.. సంబరాలకు విచ్చేసిన  వారిని సంగీత ప్రవాహంలో ముంచెత్తనుంది.. సంబరాలకు వచ్చే తెలుగు ప్రముఖుల జాబితా కూడా పెరిగింది. సభలో పాల్గొనేందుకు వచ్చిన అతిధులకు ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటర్ సమీపంలోని ఒమ్ని, మారియట్, హాలిడేఇన్ లలో బసను ఏర్పాటు చేశారు. 

విద్యార్దుల మనసులలో విషబీజాలు నాటుతున్న ఉద్యమాలు

  సీమంధ్ర ప్రజలను ద్వేషిస్తున్న నోటితోనే, తెలంగాణా ఏర్పడితే అక్కడ స్థిరపడిన సీమాంధ్రా ప్రజల ధన,మాన, ప్రాణాలకి, ఉద్యోగాలకి, వ్యాపారాలకీ ఎటువంటి ముప్పు ఉండదని, అందుకు తాము పూచీ అని తెరాస నేతలు గట్టిగా చెపుతుంటారు. అయితే, వారు తెలంగాణా ఉద్యమం పేరిట నేర్పిన విద్వేష పాఠాలు బాగా వంట బట్టించుకొన్న కొందరు, స్థానికేతరుల మీద విషం చిమ్మడం మొదలుపెట్టారు.   మొన్న సోమవారం నాడు, నిజాం కాలేజీలో ఉస్మానియా పీజీ కోర్సులలో ప్రవేశం కొరకు జరిగిన ఓయు కామన్ ఏంట్రాన్స్ టెస్ట్ కౌన్సిలింగ్ కోసం వచ్చిన స్థానికేతర విద్యార్ధులను కొందరు తెలంగాణా విద్యార్దులు అడ్డగించి వెనక్కి తిప్పి పంపేసారు. ఏ విశ్వవిద్యాలయంలోనైనా స్థానికేతరులకు 15 శాతం కోటా ఉంటుంది. మెరిట్ ఆధారంగా ఈ సీట్లు భర్తీ చేయబడుతాయి. దానికి స్థానికులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చును. దానికి దరఖాస్తు చేసేందుకు వచ్చిన స్థానికేతర విద్యార్ధులను కొందరు తెలంగాణా విద్యార్దులు అడ్డుకొని తిప్పి పంపేసారు.   ఇది ఈ రోజు కొత్తగా మొదలయిన సమస్యేమి కాదు. గత మూడు నాలుగేళ్ల నుండి ఉస్మానియాలో ఇదే తంతు నడుస్తున్నా ఎవరూ పట్టించుకొనే నాధుడు లేదు. మొన్న సోమవారం నాడు కూడా మళ్ళీ అదే తంతు జరుగుతున్నపుడు అక్కడే ఉన్న పోలీసులు కానీ, విశ్వవిద్యాలయ అధికారులు గానీ కలుగజేసుకోలేదు. కళ్ళ ముందు జరుగుతున్నఅన్యాయాన్ని చూస్తూ కూడా, విద్యార్ధులెవరూ తమకు పిర్యాదు చేయలేదని చేసినట్లయితే తగిన చర్యలు తీసుకొంటామని ఉస్మానియా వైస్ చాన్సిలర్ ప్రొఫసర్.సత్యనారాయణ చెప్పడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.   అదే విధంగా మొన్న ‘నమస్తే తెలంగాణా పత్రిక’ సీమంద్రా లో ఆత్మీయ యాత్ర చేపట్టినపుడు, అమలాపురంలో కొందరు సీమాంధ్ర యువకులు వాహనాన్ని అడ్డుకొని, పత్రిక ప్రతులను తగుల బెట్టారు. ఈవిధంగా ఇతరుల అభిప్రాయాల పట్ల అసహనం చూపడం వలన మరింత విద్వేషం పెరుగుతుందే తప్ప వేరే ప్రయోజనం ఉండదు.   నేడు ఉస్మానియాలోనో లేక కాకతీయాలోనో లేక ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనో చదువులు పూర్తి చేసుకొన్నవిద్యార్ధులు రేపు ఉన్నత చదువులకి లేదా ఉద్యోగాలకి ఇతర రాష్ట్రాలకి, దేశాలకి వెళ్లి నప్పుడు వారికి అక్కడ ఇదే అనుభవం ఎదురయితే ఏవిధంగా ఉంటుందో ఆలోచించి ఉంటే వారు ఈవిధంగా చేయరు. స్వార్ధ రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం అనేక ఉపదేశాలు చేస్తుంటారు. అయితే, భావి భారతాన్ని నిర్మించాల్సిన విద్యార్దులు అటువంటి ఉపదేశాలకు లొంగిపోకూడదు.   వేయి మంది తెలంగాణా యువకులు తమ బలిదానాలతో కన్నవారికి ఆగర్భశోకం మిగిల్చితే, నేడు దానికి కారకులయిన మహానుభావులు ఎన్నికలు ఓట్లు, నోట్లు సీట్లు అని రాజకీయాలు చేసుకొంటున్నారు. అటువంటి స్వార్ధ రాజకీయ నేతల మాటలకి లొంగిపోయి విద్యార్ధులు బలిదానాలు చేసుకోవడం, సాటి విద్యార్ధులపట్ల విద్వేషం వెళ్ళగక్కడం సబబు కాదు. విద్యార్ధులు రాజకీయ నాయకులకి ఆదర్శంగా నిలవాలి తప్ప రాజకీయ నాయకులని ఆదర్శంగా తీసుకోరాదు.   ఉడుకు రక్తం గల విద్యార్దుల భావోద్వేగాలు రెచ్చగొట్టి ఉద్యమాల బాట పట్టించిన సదరు నేతలు తమ రాజకీయ భవిష్యత్ నిర్మించుకొంటుంటే, విద్యార్ధులు మాత్రం తమ చదువులను, భవిష్యత్తుని, చివరికి ప్రాణాలను కూడా త్యాగాలు చేస్తున్న సంగతి గుర్తుంచుకొంటే, తాము రాజకీయ నేతల చేతిలో పావులుగా వాడుకోబడుతున్నామని అర్ధం అవుతుంది.   నేడు రాష్ట్రం సమైక్యంగా ఉంది. రేపు విడిపోవచ్చును. కానీ, మనుషులు ఎక్కడ ఉన్నా మానవత వెల్లివిరియాలి. మానవత్వం, వివేకం లేని విజ్ఞానం ఎంత ఉన్నామనిషి మనిషిగా చెప్పుకోవడానికి అర్హత ఉండదు. భావి భారతాన్ని నిర్మించవలసిన విద్యార్దులు సంకుచిత భావాలు విడనాడి మనమంతా భారతీయులమనే విశాల దృక్పధం అలవరుచుకోవాలి.

వైఎస్ విజయమ్మ పై కేసు

      వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మీద ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదయింది. వరంగల్ జిల్లా మరిపెడ మండల కార్యాలయం ఆవరణలో సభ నిర్వహించారు. గత నెల 28న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు ఇక్కడ బహిరంగసభకు అనుమతి తీసుకున్నారు. అయితే బుధవారం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయానికి చెందని స్థలంలో సభ నిర్వహించవద్దని స్థానిక ఎంపీడీవో నోటీసు పంపారు. దీనిని పట్టించుకోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు యధావిధిగా సభ నిర్వహించారు. దీంతో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్లు అయింది. మరిపెడ ఎంపీడీవో ఫిర్యాదు మేరకు విజయమ్మతో పాటు ఏడుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కేసు నమోదయింది. ఎన్నికల నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయాలని సంబంధిత అధికారులను కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీచేశారు.

మావోయిస్టు మాజీనేత పై కొడవళ్ళతో దాడి

మావోయిస్టు మాజీనేత గంటి ప్రసాదంపై నెల్లూరులో గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులు, వేటకొడవళ్ళతో దాడి చేశారు. నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువును పరామర్శించేందుకు వచ్చిన ఆయనపై దుండగులు వేటకొడవళ్ళతో దాడి చేసి తుపాకితో కాల్పులు జరిపారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేస్తున్నారు. గంటి ప్రసాదం నెల్లూరుకు వస్తున్నాడని తెలిసి ముందస్తు వ్యూహంగానే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా పోలీసులే ఈ దాడికి పాల్పడి ఉంటారని విరసం నేత వరవరరావు సందేహం వ్యక్తం చేశారు.

స్వామి వివేకానందుని మహా నిష్క్రమణ!

....గోపి చిల్లకూరు       అమెరికా తో స్వామిజి కి ఏర్పడిన విశ్వ మత సభల ఆధ్యాత్మిక అనుభందం, స్వామిజి ఆధ్యాత్మిక జైత్ర యాత్ర అమెరికా ప్రజలతో పాటు తన భారతీయుల మదిలో ఎంతో స్పూర్తిని, ఆత్మ విశ్వాసాన్ని, ఒక ఆదర్శాన్ని నింపి నిద్రావస్తలో వున్న భారతీయులను మేల్కొలిపి కార్యోన్ముకులను చేసాయి. ఎందరో స్వతంత్ర సమరయోధులు స్వామిజి ప్రసంగాలు, రచనల ద్వారా ఉత్తేజితులై స్వాతంత్రము కోసం పోరాడి కొంత కాలానికి విజయం సాదించారు.   స్వామిజి అమెరికన్ స్వాతంత్ర దినం రోజు జూలై 4th 1902 నాడు భౌతికముగా మహా సమాధి అయ్యారు. ఆశ్యర్య కరముగా మహా సమాధికి నాలుగు సంవత్సరాల క్రితం 4th of July 1898 నాడు అమెరికన్ శిష్యులతో కలసి కాశ్మీర్ పర్యటనలో వున్నప్పుడు .ఒక అమెరికన్ భక్తు రాలు స్వామిజి ని అమెరికన్ స్వతంత్ర దినం రోజు సందేశం ఇవ్వమని అడిగితె ,అయన ప్రేమతో జూలై 4 వ తేది అమెరికన్ స్వాత్రంత్రదినాన్ని గురించి అద్భుతమైన పద్యం ఇంగ్లీష్ లో వ్రాసి శిష్యులచే చదివించారు స్వామిజి అమెరికా స్వాతంత్ర దినోత్సవం రోజున అమెరికన్ భక్తుల కోసం తనని ఆదరించిన అమెరికా దేశం పై అద్భుతముగా ఒక గీతం రాసి అమెరికాకు అంకిత మిచ్చారు . అమెరికా స్వాతంత్రము పై అయన కవితా ప్రవాహం ఇలా పొంగి పొర్లింది . Fourth Of July, Poem By Swami Vivekananda Behold, the dark clouds melt away, That gathered thick at night,and hung So like a gloomy pall above the earth! ["రాత్రి గాఢముగా క్రమ్మి భూమి పై విషాద యావని కల్లా వేలాడుతున్న కారు మేఘాలు ఎలా కరిగిపోతున్నాయో చూడు ] Before thy magic touch,the worldAwakes. The birds in chorus sing. The flowers raise their star-like crowns- Dew-set, and wave thee welcome fair. నీ అమృత స్పర్శతో జగత్తు మేల్కొనుచున్నది ,పక్షులు ఐక్య కంఠ ముతో పాడుతున్నాయి ! శశిరచ్చాదిత ప్రసూనాలు నక్షత్ర మండిత మకుటాలతో తల ఎత్తి నీకు సుస్వాగతము పలుకుతున్నాయి . The lakes are opening wide in love Their hundred thousand lotus-eyes To welcome thee, with all their depth. All hail to thee, thou Lord of Light! [నిన్ను ఆహ్వానించుటకై శత కోటి కమల నయనాలతో సరస్సులు తమ హృదయాంతరాల నుండి ప్రేమ భాహువులను ప్రసరించు చున్నాయి] A welcome new to thee, today, O sun! today thou sheddest LIBERTY! Bethink thee how the world did wait, And search for thee, through time and clime. [ ధీర మణి నీకు విజయోస్తు భాస్కర ! మారోసారి ఈనాడు నీకు నవీన ఆహ్వానం నేడు నీవు స్వతంత్రం కురిపిస్తున్నావు ! దీర్ఘ కాలం నుండి ప్రపంచమంతా నిన్ను గాలిస్తూ ,నీ కొరకు తహ తహతో ఎలా నిరీక్షించి వుందో ఒక్కసారి అలోచించి చూడు] Some gave up home and love of friends, And went in quest of thee, self banished, Through dreary oceans, through primeval forests, Each step a struggle for their life or death; [ ఎంతో మంది గృహాన్ని ,మిత్ర ప్రేమను పరిత్యజించి స్వయం గా గంభీర సముద్రాలూ దాటుతూ ,దట్ట మైన అరణ్యాల లో నడుస్తూ వేచిన ప్రతి అడుగు జీవన్మరణ సమస్య గా నీ అన్వేషణలో మునిగి పోయారు] Then came the day when work bore fruit, And worship, love, and sacrifice, Fulfilled, accepted, and complete. Then thou, propitious, rose to shed [వారి పరిశ్రమ పలిచిన ఒక్క సుదినం వచ్చింది వారి పూజ ,ప్రేమ ,త్యాగం స్వీకరించ బడ్డాయి ,పరి పూర్ణతను పొందాయి . నువ్వు అత్యంత ప్రీతి మంతుడవు అయ్యావు ] The light of FREEDOM on mankind. Move on, O Lord, on thy resistless path! Till thy high noon o'erspreads the world. Till every land reflects thy light, Till men and women, with uplifted head, Behold their shackles broken, and Know, in springing joy, their life renewed మానవాళి పై "స్వంతంత్ర జ్యోతి ని వెదజల్లడానికి లేచావు నీ మద్యాహ్నపు దినపు ఖరకిరణాలు ప్రపంచాన్నంతా ముంచెత్తెవరకు ,ప్రతి దేశము నీ క్రాంతిని ప్రతిబింబించే వరకు , స్రీ పురుషులు అందరు ఎత్తిన తలలతో తమ సంకెళ్ళు సడల బడి , తమ జీవితాలు క్రొత్త ఆనందముతో సరి కొత్త గా చూసేంత వరకు ప్రభూ ! నీ దివ్యమైన పధం లో పయనించు . అసంఖ్యాక సుఖాశిస్సులు !   జూలై 4th 1902 న మహాసమాధి చెందినా స్వామిజి వివేకానంద భౌతికముగా తన చివరి ఏడు రోజులు బేలూరు మఠ్ లో ఇలా గడిపారు ------------------------------------------------------------------------------------------------------------ శిష్యులు తమ కార్యనిర్వహణలో సమస్యలు చెప్పు కోవడానికి అయన దగ్గరకు వచ్చినపుడు సున్నితముగా తిరస్కరించి "ఇంకా నేను బౌతిక విషయాలలో నన్ను తలదూర్చ నియద్దని ,శిష్యులు తమ నాయకుడు వారితో లేనపుడే వారి సామర్ద్యము వెలువడుతుందని మీ ప్రకారం మీరు ప్రయతించండి అని చెప్పి ,నేను భగవంతుని లో ఇక్యానికి దగ్గరగా వున్నాను అని చెప్పారు . మూడు రోజులకు ముందు ఏకాదశి రోజున సోదరి నివేదిత కు తన స్వహస్తాలతో భోజనము వడ్డించి,తినిపించి ,ఆమె చేతులు కడుగుకోడానికి తనే నీళ్ళు,towel ఇచ్చారు ,సోదరి నివేదిత స్వామిజి ని ఏమిటి స్వామి ఇది అని వారిన్చినపుడు ,ఆమెతో స్వామి ఇలా అన్నారు " ఏసు ప్రభువు తన భక్తుల పాదలను స్వయంగా కడిగారు కదా అన్నారు ". వెంటనే నివేదిత స్వామిజి ఇదే చివరి సారి ఇలా అనభోయీ ,క్షణంలో తమాయించుకున్నారు ఆమెకు ఏదో చెడు స్పురించినది (మహాసమాధి) .కాని అదే చివరిది అయినది. చివరి రోజు 4th జూలై నా స్వామిజి ఎప్పటికంటే ముందుగా ఉదయాన్నే లేచి ధ్యాన మందిరం లోకి వెళ్లి తలుపులు గట్టిగా బంధించుకొని ౩ గంటలు ధ్యానములో గడిపారు తన రోజు వారి పనులకు విరుద్దగాముగా.తరువాత ఆనందముగా ,తన్మయత్వముతో మెట్లు దిగుతూ జగజ్జనని కాళిమాతా పై అద్భుతమైన పాట పాడారు,కొద్దిచేపు తరువాత తనలో తను మాట్లాడుకొంటూ "ఇంకొక వివేకానందుడు వుంటే ,అయన మాత్రమే ఈ వివేకానందుడు చేసిన కార్యాలు అర్దమై ఉండేవి ,ఆయినా ఎన్ని మంది వివేకనందులు పుడుతారు ఎంతో కాలానికి గాని " అన్నారు . సాయంతం స్వామి ప్రేమానంద తో కలసి దాదాపు రెండు మైళ్ళు నడుస్తూ వేద కాలేజీ ప్రారంభించడానికి కొన్ని చూచనలు చేసారు .చివరగా మాట్లాడుతూ భారత దేశం ఆద్యాతమక,పుణ్య దేశం ,భారత దేశం స్తిరంగా నిలబడేది భగవంతుని అన్వేషణలోనే ,ప్రపంచానికి భగవంతుని అన్వేషణ గూర్చి తెలెయ చెప్పడమే కాని ఇది రాజకీయాలలో ,సాంఘిక విషయాలలో తలడూర్చకూడదు. స్వామిజి సాయత్రం ఏడు గంటలకు అయన రూం లోకి వెళ్లి శిష్య్లని ఆయనను పిలిచేదాకా రావద్దని చెప్పి వెళ్లారు . ఒక గంట ధ్యానం తరువాత అందరిని పిలిచి తలుపులు కిటికీలు తీసి ,అయన పడక పై పనుకొన్నారు. ఒక గంట తరువాత అయన గట్టిగా భారం గా శ్వాస పీల్చారు .మరల కొద్ది సెకండ్ల తరువాత అదేవిధముగా శ్వాస పిల్చి శరీరాన్ని వదిలారు .అయన తన సోదర శిష్యులతో తరచు చేపుతుందే వారు తానూ 40 వ జన్మదినం జరుపుకోలేనని,చివరకు అదే నిజమవుతూ ౩౦ సంవస్తరాల 5 నెలల ఇరవై నలుగు రోజులు బౌతికముగా జీవిచారు. స్వామి వారి జయంతిని January 12th ను జాతీయ యువజన దినోస్తావం గా జరుపుకుంటాము . 150 వ జయంతి ఉత్సవాలు గత మూడు సంవత్సరాలుగా భారత దేశములోనే కాకుండా ప్రపంచ వ్యాప్తముగా ఘనం గా జరుగుతున్నాయి ఎక్కడా కూడా అయన మహాసమాధి ,వర్దంతి లు జరుపము ఎందుకంటే స్వామి వారు బౌతికముగ ,శారీరకం గా మనకు దూరమయ్యారు కాని అయన రగిలించిన స్పూర్తి ,ఆయన రచనలు ,అయన ఏర్పాటు చేసిన శ్రీ రామకృష్ణ మఠ్ లు భారతీయులకు తరతరాలుగా ఆధ్యాత్మిక ఆదర్శాన్ని చూపిస్తూనే వుంటాయి . ప్రపంచ యువతకు అయన సందేశాలు మార్గదర్శకాలు అవుతాయి .

అల్లూరి సీతారామరాజు జయంతి

      అది భరతమాత తెల్లోడి కబంద హస్తాల్లో నలిగిపోతున్న రోజులు.. ఉత్తర భారతంలో స్వతంత్రోధ్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న రోజులు అలాంటి సమయంలోనే పశ్చిమ గోదావరి జిల్లా అడవుల్లో ఓ అగ్నికణం పుట్టింది.. ఆ అగ్ని కణమే దావాణలంలా వ్యాపించి బ్రిటీష్‌ సామ్రాజ్య గుండెల్లో వణుకు పుట్టింది.. అలా తెల్లోడి పెత్తనం మీద గర్జించిన తెలుగు తేజమే అల్లూరి సీతారామరాజు.. ఈ రోజు ఆ విప్లవ వీరుని జయంతి సందర్భంగా ఆ త్యాగాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం.. తెలుగు వీర లేవరా, దీక్షబూని సాగరా... దేశమాత స్వేచ్చ కోరి తిరుగుబాటు చేయరా... అంటూ భరతమాత విముక్తి కోసం బ్రిటీషువారిని గడగడలాడించిన మన్యం వీరుడు మన అల్లూరి సీతారామరాజు. అల్లూరి ఒక వ్యక్తి కాదు ఆయనో మహోజ్వల శక్తి. ఆయన జీవితం విప్లవానికి ఒక సంకేతం. స్వతంత్రం సాదించటానికి ఆయుధాలు సుశిక్షుతులైన సైనికులు కాదు..అది సాధించాలన్న కాంక్ష చాలని నిరూపించిన అసలు సిసలు భారతీయుడు అల్లూరి. అందుకే లోకజ్ఞానం లేని అడవి బిడ్డలనే ఆయుధాలుగా మార్చి తెల్లదొరలు గుండెలు చీల్చాడు.. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు. అడవిబిడ్డలైన గిరిజనులను ఏకంచేసి... ఆ ప్రకృతి సంపదలను అనుభవించే హక్కు గిరిజనులదేనని ఎలుగెత్తి చాటాడు. ఈయన పోరాట పటిమ, విప్లవ కార్యాచరణ అనితర సాధ్యం. పోడు వ్యవసాయానికి పన్ను కట్టక్కర లేదన్నాడు, గిరిజనులను నిలువు దోపిడీ చేస్తున్న దళారుల మీద, వారికి అండదండలుగా ఉన్న బ్రిటీషువారిమీద అల్లూరి తన విల్లును ఎక్కుపెట్టాడు. ప్రతీ గిరిజనున్ని ఒక గెరిల్లా యోధునిగా మార్చి తెలుగు నేలకు స్వతంత్ర పోరాట మార్గం చూపాడు.. భీమవరానికి ఆరుమైళ్ల దూరంలో ఉండే మోగల్లులోని పాండ్రంకిలో వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు 1897 జూలై 4వ తేదీన జన్మించారు అల్లూరి సీతారామరాజు. ఆంగ్లం, సంస్కృతం, తెలుగు బాగా చదువుకున్న వెంకటరామరాజుకు జాతీయ భావాలు ఎక్కువే. తండ్రి భావాలను పుణికిపుచ్చుకున్న అల్లూరికి, తండ్రి నడిపే ఫొటో స్టుడియోలోని జాతీయ నాయకుల ఫొటోలు, వారి జీవిత విశేషాలు ఎక్కువగా ప్రభావం చూపించాయి. వందేమాతరం ఉద్యమం జరుగుతున్న రోజుల్లోనే పసిప్రాయం వీడకపోయినా తండ్రితో సహా అనేక సభల్లో పాల్గొన్నారు. అదే సమయంలో గిరిజనులపై జరుగుతున్న దురాగతాలను చూసి చెలించిపోయిన అల్లూరి వారికి యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ పద్ధతులను నేర్పించి పోరాటానికి సిద్దం చేశాడు. 1922 సంవత్సరం మన్యంలో కాలుపెట్టిన సీతారామరాజు విప్లవానికి రంగం సిద్ధం చేశాడు. తన విప్లవ దళాలతో పోలీసు స్టేషన్లపై మెరుపుదాడులు నిర్వహించి బ్రిటిషు అధికారులను గడగడలాడించాడు. సమాచారం ఇచ్చి మరీ పోలీసుస్టేషనులపై దాడుల నిర్వహించి బ్రిటిషు అధికారుల్లో ముచ్చెమటలు పట్టించాడు. అయితే అదే ఏడాది అల్లూరి సీతారామరాజు విప్లవదళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. 1922 డిసెంబరు 6న జరిగిన పోరులో 12 మంది అనుచరులను రామరాజు కోల్పోయాడు. ఆ తర్వాత రామరాజు కొన్నాళ్లు ఎలాంటి పోరాటాలు జరుపలేదు ఆ సమయంలో ఆయన మరణించాడనే పుకార్లు కూడా వ్యాపించాయి. అయితే అల్లూరి 1923 సంవత్సరం ఏప్రిల్ నెలలో మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. మరోసారి దాడులకు దిగాడు. కాని అల్లూరికి సాయం చేస్తున్నారన్న నేపంలో బ్రిటీస్‌ అధికారులు మన్యం ప్రజలను వేథిచటం మొదలు పెట్టారు.. తనకున్న అవకాశాలతో పూర్తి స్థాయిలో మన్యం వీరులకు రక్షణ కల్పించలేని రామరాజు లొంగిపోవాలనుకున్నాడు.. అలా అయిన మన్యం ప్రజలకు వేదింపులు తగ్గుతాయని భావించాడు.. తాను స్నానానికి చేరువు దగ్గరకు రాబోతున్నట్టుగా తన అనుచరుల ద్వారా బ్రిటీష్‌ అధికారులకు సమాచారం అదించాడు రామరాజు..   1923 మే 7న ఏటి ఒడ్డున స్నానం చేస్తుండగా ఆయనను బంధించిన పోలీసులు ఎటువంటి విచారణ చేపట్టకుండానే అదే రోజున కాల్చిచంపారు. ఆయుదం చేతిలో లేని అల్లూరిని కూడా ఎదిరించలేని బ్రిటీష్‌ పోలీసులు ఆయన చెట్టు కట్టేసి కాల్చి కసి తీర్చుకున్నారు.. కాని బ్రిటీష్‌ అధికారులు ఓ నాయకున్ని చంపగలిగారు కాని ఆయన ప్రజల్లో రగిలించిన.. స్వతంత్ర కాంక్షను మాత్రం ఆర్పేయలేకపోయారు.. తెలుగు నేల మీద కూడా స్వతంత్ర సమరానికి బీజాలు వేసిన మహానాయకుడు అల్లూరి జయంతి సందర్భంగా ఒక్కసారి ఆ మహానాయకుని మరోసారి ఘన నివాళి అర్పిద్దాం..  

రాయలసీమ ఉద్యమం రాజేస్తున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

  ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు, రాయల తెలంగాణా గురించి కాంగ్రెస్ ఎటువంటి అధికార ప్రకటన చేయకపోయినా, కోతి పుండు కోతిని బ్రహ్మ రాక్షసిని చేసినట్లు, మీడియా రాజకీయ పార్టీలు కలిసి దానిని చిలికి చిలికి అదో ప్రముఖమయిన అంశంగా మార్చేశాయి. ఒకప్పుడు కేసీఆర్ తెదేపాను వీడి తెలంగాణా ఉద్యమం పెట్టుకొన్ని పైకెదిగినట్లే, ఇప్పడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి రాయలసీమ పరిరక్షణ సమితిని పెట్టుకొని పైకెదగాలని తాపత్రయపడుతున్నాడు.   ఆ మద్య రాయలసీమలో ట్రాక్టర్ యాత్రలు కూడా చేసి కొంచెం పేరు కూడగట్టుకొన్న ఆయన, ఇప్పుడు కాంగ్రెస్ వదిలిన రాయల తెలంగాణా అంశాన్ని అందుకొని, రాయలసీమను తెలంగాణాలో కలపొద్దని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయమని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్కు వద్ద 52 గంటల పాటు దీక్ష దీక్షకు కూర్చోబోతున్నాడు. ఆయన డిమాండ్ సంగతి ఎలా ఉన్నపటికీ, హైదరాబాదులో దీక్షకు కూర్చోవడం ద్వారా, అందరి దృష్టిని ఆకర్షించి తను కూడా కేసీఆర్ స్థాయికి ఎదగాలని తపన పడుతున్నట్లున్నారు.   ఇప్పటికే, కేసీఆర్ చేసిన ఉద్యమాల వల్ల రాష్ట్రం అన్నివిధాల వెనకబడిపోవడమే కాకుండా, ఉద్యమంతో ఏవిధంగాను సంబంధం లేని మారుమూల గ్రామాలలో ప్రజలు సైతం తమకు తెలియకుండానే అందుకు శిక్ష అనుభవిస్తున్నారు. ఇటువంటి ఉద్యమాల వల్ల కేసీఆర్ వంటి వ్యక్తులు వారి కుటుంబాలు రాజకీయంగా లాభపడితే, సామాన్య ప్రజలు అన్ని విధాల తీవ్ర నష్టపోతున్నారు. ఇప్పుడు ప్రత్యేక రాయలసీమ ఉద్యమం రాజేస్తున్న ఈ బైరెడ్డి వంటివారిని ఉపేక్షిస్తే, రేపు అతను కూడా మరో కేసీఆర్ వలె తయారయి, రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసే అవకాశం ఉంది.

జగన్ని దెబ్బతీయబోయి కాంగ్రెస్ గోతిలో పడిందా

  కాంగ్రెస్ ఒకటి తలిచి రాయల తెలంగాణా అంశాన్ని మీడియాకు లీక్ చేస్తే, దాని మీద జరుగుతున్న నిరుపయోగమయిన చర్చలవల్ల ఊహించని విధంగా జగన్ మోహన్ రెడ్డికే మేలు జరుగుతోంది. కాంగ్రెస్ ఉద్దేశ్యం రాయల తెలంగాణా ప్రతిపాదన తెచ్చి జగన్ మోహన్ రెడ్డిని భయపెట్టి లొంగ దీసుకోవడం. అతని పార్టీకి బాగా బలమున్న ప్రాంతాలను విడదీసి తెలంగాణాలో కలిపేసి, అతని పార్టీని దెబ్బ తీయగలమని అతనికి ఒక సంకేతం పంపేందుకే కాంగ్రెస్ రాయల తెలంగాణా ప్రతిపాదన ముందుకు తెచ్చింది. అయితే, ఊహించని విధంగా ఆ ప్రతిపాదనకు అన్ని వైపులా నుండి వ్యతిరేఖత ఎదురవడమే కాకుండా, దీనిపై జరుగుతున్న విస్తృత చర్చల వల్ల, సీమంధ్ర ప్రాంతంపై జగన్ మోహన్ రెడ్డి ప్రభావం చాలా ఎక్కువగానే ఉందనే సంగతి బయటపడింది.   కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డిని ప్రభావం చూసి భయపడుతున్నదని, అందుకే రాయల తెలంగాణా ఆలోచన చేస్తోందని నిర్దారిస్తున్న విశ్లేషణల వల్ల జగన్ కి, ఆయన పార్టీకి రాజకీయ వర్గాలలో మరింత సానుకూల పరిస్థితిని ఏర్పరుస్తుంది. అదిగాక ఈ విశ్లేషణలు జగన్ కి చెందిన సాక్షి మీడియాలో కాకుండా వేరే ఇతర మీడియాలో జరుగుతుండటం వలన, ప్రజలలో, రాజకీయ వర్గాలలో జగన్ మోహన్ రెడ్డి బలంపై నమ్మకం కలుగుతుంది. అందువల్ల వైకాపా నేతలు కూడా ఈ అంశాన్ని అందిపుచ్చుకొని మరికొంత కాలం దీనిపై చర్చలు కొనసాగిస్తే, జగన్ మోహన్ రెడ్డి బలం గురించి ఫ్రీ గా ప్రచారమూ జరుగుతుంది. పనిలోపనిగా కాంగ్రెస్ బలహీనతను ఎండగట్టవచ్చును.   కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డిని భయపెట్టాలని పధకం వేస్తే, అది అతనికి, అతని పార్టీకి ఉచితంగా ప్రచారం కల్పించి మేలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ తను తవ్వుకొన్న గోతిలో తానే పడినట్లయిందిప్పుడు.

మీడియాకు ముడిసరకు అందిస్తున్న కాంగ్రెస్

  ఏదో ఒక చిన్న పాయింటుని మీడియాకు లీక్ చేస్తే, దానిని పట్టుకొని రాజకీయపార్టీలు, మీడియా తీవ్రంగా చర్చించుకొంటూ కొన్ని రోజులు తన జోలికి రాకుండా ఉంటాయని కాంగ్రెస్ ఆలోచన. అందుకే ఒకసారి తెలంగాణా ప్యాకేజీ, మరోసారి రాయల తెలంగాణా, ఇప్పుడు పదిరోజుల్లో తెలంగాణా అంటూ చర్చలకు అవసరమయిన ముడి సరుకుని కాంగ్రెస్ పార్టీ ఉదారంగా అందిస్తోంది.   తెలంగాణా ప్యాకేజీని పట్టుకొని పదిరోజులు తీవ్ర చర్చలు, ఖండనల తంతు ముగిసిన వెంటనే రాయల తెలంగాణాని చర్చకు ఇచ్చింది. ఆ తరువాత 10 రోజుల్లో తెలంగాణా అనే టాపిక్ చర్చకు ఇచ్చి దిగ్వజయ్ సింగ్ ఎంచక్కా విమానం ఎక్కి వెళ్ళిపోయారు.   ఈసారి డెడ్ లైన్ నెలరోజుల నుండి 10 రోజులకి తగ్గించడంతో, నిజంగా తెలంగాణా కోరుకొనేవారిలో ఉత్సాహం ఉరకలు వేస్తుంటే, మరికొందరు మాత్రం ఇప్పటికిప్పుడు తెలంగాణా ఇచ్చేస్తామంటే మా పరిస్థితి ఏమిటని? కంగారు పడుతున్నారు. అయితే కేసీఆర్ మాత్రం, “నెలంటే ముప్పై రోజులు కాదని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కూడా 10 రోజులంటే 10 రోజులు కాదని ఖచ్చితంగా చెపుతుందని” కాంగ్రెస్ మీద కొండంత భరోసాతో ఉన్నాడు.   సీమంద్రా నేతలు మళ్ళీ రాజీనామాలు చేస్తామని హూంకరిస్తుంటే, టీ-కాంగ్రెస్ నేతలు వారిపై విరుచుకు పడుతున్నారు. తెదేపా వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని లగడపాటి ఆరొపిస్తుంటే, కాదు జగన్ వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని మంత్రి టీ జీ వెంకటేష్ శలవిస్తున్నారు. మొత్తం మీద రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, మీడియాకి మరో పదిరోజులకి సరిపడే మేతవేసి దిగ్విజయంగా తన యాత్ర ముగించుకొన్నారు సింగు గారు.