ఆ సంతకాలు నిజమైనవే

      నరేంద్రమోడి వీసా వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది.. గుజరాత్‌ అల్లర్ల విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న మోడికి అమెరికా వీసా ఇవ్వొదంటూ పలువురు పార్లమెంట్‌ సభ్యులతో పాటు, రాజ్యసభ సభ్యులు ఒబామకు లేఖరాశారన్న వార్త కొద్ది రోజుల క్రితం సంచలనం సృష్టించింది. ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చాలా మంది నాయకులు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా సిపిఎం పార్టీకి చెందిన సీతారాం ఏచూరి, సిపిఐ ఎంపి అచ్యులన్‌, డిఎంకె ఎంపి రామలింగంలు ఆ లేఖలో ఉన్నవి తమ సంతకాలు కాదని. ఫోర్జరీ సంతకాలని ప్రకటించారు.   అయితే ఆ లేఖలను పరీక్షించిన ఫోరెన్సిక్‌ నిపుణులు అందులోని సంతాకాలు,చేతిరాత అసలైదని అని ప్రకటించడంతో ఇప్పుడు మరోసారి వివాదం మొదలైంది. ఇన్నాళ్లు అవి మా సంతాకాలు కాదంటూ చెపుతూ వచ్చిన ఎంపిలు ఫోరెన్సిక్‌ నివేదికతో ఖంగుతున్నారు.. అయితే ఈ విషయం పై మోడి స్పందించక పోవడం విశేషం.

31న యుపిఎ సమన్వయ కమిటీ మీటింగ్‌

      తెలంగాణ పై తేల్చే దిశగా కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని యుపిఎ వడి వడిగా అడుగులు వేస్తుంది.. గతం వారం రోజులగా తెలంగాణపై విస్త్రుత స్ధాయిలో జర్చలు జరిపిన కాంగ్రెస్‌ అదిష్టానం ఇప్పటికే తెలంగాణపై అభిప్రాయ సేకరణ పూర్తియందని ప్రకటించింది.. ఇక మిగిలింది కాంగ్రెస్‌ పార్టీ అభిప్రాయం చెప్పడమేనని చెప్పినని నేతలు ఆ దిశగా ప్రయత్నాలు వేగవంతం చేశారు. ఈ విషయంపై కాంగ్రెస్ యూపిఎలో తన భాగస్వామ్యపక్షాలయిన ఇతర పార్టీలతొ చర్చించనుంది. ఈ నెల 31న యుపిఎ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమవేశంలో భాగస్వామ్య పక్షాల నుంచి వచ్చే అభిప్రాయాలను కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకునేందుకు  రెడీ అవుతుంది. ఆగస్టు 5నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్ననేపధ్యంలో,  వీలైతే ఈలోగానే తెలంగాణపై తుది నిర్ణయం ప్రకటించాలని ప్రయత్నింస్తుంది కేంద్రం. యూపిఎ లోని ప్రదాన భాగస్వామ్యపక్షాలనైన శరద్‌పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ, ఫారూఖ్ అబ్దుల్లాకు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్, అజిత్ సింగ్ నేతృత్వంలోని ఆర్‌ఎల్డీ, ముస్లీంలీగ్ పార్టీలు ఇప్పటికే తెలంగాణ ఏర్పాటుకు తమ మద్దతు ప్రకటించగా.. మిగిలిన పార్టీ మద్దతు అవసరం పడకపోవచ్చు అనే ధైర్యంతో ఉంది యుపిఎ.

అంగీకరించే ప్రసక్తే లేదు : ములాయం

      తెలంగాణ పై కాంగ్రెస్‌ తేల్చేస్తుంది అన్న ఊహాగానాల మధ్య ములాయం మరో బాంబు పేల్చారు..తాము చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు వ్యతిరూకమని చెపుతూనే.. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న కిరణ్‌కుమార్‌ రెడ్డి ని అభినందించారు. చిన్నరాష్ట్రాల వల్ల దేశ ప్రగతి దెబ్బతింటుందన్నారు.   అసలు కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు ఎందుకు మొగ్గు చూపుతుందో అర్ధంకావటం లేదని.. తెలంగాణ ఏర్పాటు జరిగితే మరిన్ని రాష్ట్రాల్లో అలాంటి ప్రతిపాదనలు వస్తాయన్నారు.. ఇప్పటికే తెలంగాణ నేపధ్యంలో గుర్ఖాలాండ్‌లో కూడా మరోసారి ఉద్యమాలు ఊపందుకున్నాయి.. ఇలాంటి పరిణామాలే మరిన్నిజరుగుతాయని ములాయం అభిప్రాయపడ్డారు.. ఉత్తరప్రదేశ్‌ నుంచి ఉత్తరాఖండ్‌ను, మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్, బీహార్‌ నుంచి జార్ఖండ్‌ను వేరుపడగా ఇప్పుడు ఆ రాష్ట్రల ప్రగతి కుంటుపడిందని, కాబట్టి అక్కడి పరిస్ధితులను సమీక్షించుకొని రాష్ట్ర ఏర్పాటులో ముందడుగు వేయాలని కోరారు.. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అంగీకరించమన్న ములాయం పార్లమెంట్‌లో బిల్లు పెడితే వ్యతిరేకిస్తామన్నారు.

స‌మైఖ్యం కోసం డిఐజీ రాజీనామ‌

  ఇన్నాళ్లు తెలంగాణ కోరుతూ నాయ‌కులు ఉద్యోగులు త్యాగాలు చేశారు ఇప్పుడు సీన్ మారింది. కేంద్ర తెలంగాణ‌కు అనుకూలంగా సంకేతాలు ఇస్తున్న నేప‌ధ్యంలో ఇప్పుడు త్యాగాలు చేయ‌డం సీమాంద్ర ప్రజ‌ల వంతు అయింది.. గతంలో ఓ మ‌హిళ డిఎస్పీ రాజీనామ చేయ‌టం అప్పట్లో సంచ‌ల‌నం సృష్టించింది.. ఇప్పుడు మ‌రోసారి అంలాటి రాజీనామనే తెర మీద‌కు వ‌చ్చింది.రాష్ట్ర విభ‌జ‌న‌ను నిర‌సిస్తూ డిఐజి ఇక్బాల్ రాజీనామ చేశారు. తెలంగాణ పై నిర్ణయం తీసుకునే క్రమంలో భాగంగా రాయ‌ల‌సీమ‌ను విభ‌జించే ప్రయ‌త్నం కేంద్రం చేస్తుండ‌టంతో అందుకు నిర‌స‌న‌గా ఇక్బాల్ రాజీనామ చేశారు. సిన్సియ‌నర్ ఆఫీస‌ర్‌గా మంచి పేరున్న ఇక్బాల్‌కు ఇంకా 5 సంవ‌త్సరాల‌కు పైగా ప‌ద‌వీ కాలం మిగిలే ఉంది.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న స‌మ‌యంలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీస‌ర్‌గా ప‌నిచేసిన ఇక్బాల్ ఇటువంటి నిర్ణయం తీసుకోవ‌టం అంద‌రిని ఆశ్చర్యానికి గురిచేసింది.

కిర‌ణ్‌కుమార్ రెడ్డి రాజీనామా..?

  తెలంగాణ అంశం పై కేంద్ర ఏదో ఒక‌టి తేల్చేయ‌డానికి రెడీ అవుతుంటే అందుకు ప్రతిగా స‌మైఖ్యవాదులు కూడా త‌మ ద‌గ్గర ఉన్న ఆఖ‌రి అస్త్రల‌ను సిద్దం చేస్తున్నారు.. ప్రస్తుతం రాష్ట్రముఖ్యమంత్రిగా ఉన్న కిర‌ణ్‌కుమార్ రెడ్డి కూడా విభ‌జ‌న త‌ధ్యం అయిన ప‌క్షంలో రాజీనామాకు సిద్దప‌డిన‌ట్టు వార్తలు వ‌స్తున్నాయి.. ఒక వ‌ర్గం మీడియా అయితే ఇప్పటికే కిర‌ణ్‌కుమార్ రెడ్డి త‌న రాజీనామాను స‌మ‌ర్పించార‌ని కూడా చెపుతుంది.. దిగ్విజ‌య్‌సింగ్, గులాం న‌బి ఆజాద్ ల‌తో జ‌రిగిన భేటిలో త‌న నిర్ణయాన్ని క‌రాఖండిగా చెప్పారు.  విభ‌జ‌న అనివార్యం అయితే త‌ను ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటా అని కూడా చెప్పిన‌ట్టుగా స‌మాచారం. త‌రువాత సోనియాతో జ‌రిగిన భేటిలో కూడా ఇదే విష‌యం చెప్పిన కిర‌ణ్‌.. త‌న రాజీనామాను కూడా అందించిన‌ట్టుగా చెపుతున్నారు.. దీని తోడు కిర‌ణ్‌కుమార్ రెడ్డి శ‌నివారం స‌చివాల‌యానిక రాక‌పోవ‌డం, అన్ని అధికారిక కార్య‌క్ర‌మాలు ర‌ద్దు చేసుకోవ‌టంతో ఈ వాద‌న‌లుకు మ‌రింత బ‌లం చేకూరుతుంది.. కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించకపోయినప్పటికీ రాష్ట్ర విభజనకు సంబంధించిన ప్రణాళికను కాంగ్రెసు అధిష్టానం నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రాన్ని విభ‌జిస్తే కొత్తగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉండాల్సింది. కిరణ్ కుమార్ రెడ్డి అందుకు అంగీకరించకపోతే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయవచ్చుననే ప్రచారం సాగుతోంది.

అది ఆజాద్ జాదూనే..!

  కేంద్ర తెలంగాణ విష‌యంలో స్పష్టమైన వైఖ‌రితో ఉంది అన్న వాద‌న బ‌లంగా వినిపిస్తున్న నేప‌ధ్యంలో ఇప్పుడు సీమాంద్ర నాయ‌కుల నుంచి కొత్త వాద‌న వినిపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో జ‌రుగుతున్న పరిణామాల‌న్నింటి వెనుక కేంద్రలోని ముఖ్య నాయకుడు ఆజాద్ హ‌స్తం ఉన్నట్టుగా ఆరోపిస్తున్నారు ప‌లువురు నేత‌లు.. గ‌తంలో ఆంద్రప్రదేశ్ ఇంచార్జ్‌గా వ్యవ‌హారించిన స‌మ‌యంలో కూడా ప‌లు వివాదాస్పద వ్యాఖ్య‌ల‌తో తెలంగాణ‌తో పాటు రాష్ట్రంలో విద్వేశాల‌ను రెచ్చగొట్టిన ఆజాద్ మ‌రోసారి తెరవెనుక త‌తంగా న‌డిపిస్తున్నార‌న్న వాద‌న ఉంది.. ఆజాద్ వ‌ల్లే అస‌లు ఎవ‌రు కోర‌ని రాయ‌ల్ తెలంగాణ అంశం తెర మీద‌కు వ‌చ్చింది అంటున్నారు. ప్రత్యేఖ తెలంగాణ ఏర్పడితే ఇక్కడ ఎం ఐ ఎం పార్టీ అస్తిత్వంమే ప్రశ్నార్ధకం అవుతుంది అందుకే తొలినుంచి ఆ పార్టీ విభ‌జ‌న‌ను వెతిరేఖిస్తూ వ‌స్తుంది.. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ దూరంగా ఉన్న ఎం ఐ ఎం పార్టీ ఆజాద్ తోక‌లిసి ఈ నాట‌కం ఆడిస్తున్నట్టుగా చెపుతున్నారు.. రాయ‌ల‌సీమ ప్రాంతంలో ఉన్న ముస్లింల‌తో క‌లిపితే కొత్త గా ఏర్పడే రాష్ట్రంలో ముస్లిం శాతం ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక ఆజాద్ ఈ ప్రతిపాతద‌న తెచ్చిన‌ట్టుగా చెపుతున్నారు..

బోన‌మెత్తిన భాగ్యన‌గ‌రం

  సికింద్రాబాద్ బోనాల సంద‌ర్భంగా భాగ్యన‌గ‌రం కొత్త శోభ సంత‌రించుకుంది.. ఆషాడం జాత‌ర‌గా పేరొందిన ఉజ్జయినీ మ‌హంకాళి అమ్మవారి భోనాలు ఆదివారం ఘ‌నంగా ప్రారంభం అయ్యాయి. తెల్లవారుజామున 4 గంటలకు మహా హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతిచ్చారు. తెలంగాణాతో పాటు వివిధ జిల్లాలకు చెందిన లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. రెండు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఈ ఉత్సవాల్లో తొలి రోజు భ‌క్తులు అమ్మవారికి భోనాల‌తో పాటుర సాక స‌మ‌ర్పిస్తారు.. రెండో రోజ‌యిన సోమ‌వారంనాడు రంగం నిర్వహిస్తారు.. అవివాహిత మ‌హిళ చెప్పే భ‌విష్యవాణి విన‌టానికి ఎంతో ప్రత్యేక‌త ఉంది. రంగంలో భాగంగా దేశ ప‌రిస్థితులు, వ‌ర్షాలు ఇలా అనేక విష‌యాల‌ను అమ్మవారే చెపుతార‌ని న‌మ్ముతారు భ‌క్తులు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాల్ని ప్రతిబింబించే ఈ జాతరలో పాల్గొనే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతరతో పాటు సికింద్రాబాద్‌లోని 40 దేవాలయాల్లో ఆదివారం బోనాల ఉత్సవాలు జరుతున్నాయి.ఈ రోజు ఉద‌యం నుంచి సికింద్రాబాద్ అమ్మవారి ఆళ‌యానికి విఐపిల తాకిడి కూడా బాగా ఉంది.. ముఖ్యమంత్రి కిర‌ణ్‌కుమార్‌, రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, వైకాప అధ్యక్షులరాలు విజ‌య‌మ్మ, టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఇంకా చాలా మంది నాయ‌కులు నాయ‌కులు అమ్మవారిని ద‌ర్శించుకున్నారు.

ఇక వైకాపా తెలంగాణాలో బోర్డు తిప్పేసినట్లే

  ఎట్టకేలకు వైకాపా తెలంగాణాలో బోర్డు తిప్పేసేందుకు సిద్దపడినట్లే ఉంది. ఈ రోజు వైకాపా నేతలు కొండా సురేఖ, మహేందర్ రెడ్డి తదితరులు రాష్ట్ర విభజనపై పార్టీ అభిప్రాయం తెలుసుకొనేందుకు ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో చివరిసారిగా సమావేశమయ్యారు. వారు అమెను “పార్టీ తెలంగాణపై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని” మీడియా ముందు ప్రకటన చేయాలని పట్టుబట్టగా, పార్టీకి చెందిన కొందరు నేతలు వారిని రాష్ట్ర విభజనవల్ల కలిగే నష్టాలను వివరించి ఒప్పించే ప్రయత్నం చేసారు. కానీ విజయమ్మ మాత్రం మీడియా ముందుకు వచ్చి ప్రకటన చేయాడానికి అంగీకరించక పోవడంతో సురేఖ తదితరులు సమావేశం నుండి ఆగ్రహంతో బయటకి వచ్చేసారు.   ఆ తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, పార్టీ అధిష్టానం తెలంగాణపై ఇచ్చిన వివరణతో తాము సంతృప్తి చెందలేదని, తెలంగాణాకు అడ్డుపడే పార్టీలో ఆత్మవంచన చేసుకొంటూ తాము కొనసాగలేమని అందువల్ల రేపు తెలంగాణకి చెందిన పార్టీ నేతలందరూ సమావేశమయ్యి చర్చించిన తరువాత తమ నిర్ణయం ప్రకటిస్తామని ఆమె తెలిపారు. పార్టీ వారిని వదులుకోవడానికే సిద్దపడింది కానీ, ప్రకటన చేసేందుకు మాత్రం అంగీకరించకపోవడం గమనిస్తే, పార్టీ ఇక తెలంగాణాలో బోర్డు తిప్పేసేందుకు సిద్దపడుతునట్లు అర్ధం అవుతోంది. రేపు కొండా సురేఖ తదితరులు పార్టీకి రాజినామాలు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆ తంతు మొదలయినట్లు భావించవచ్చును.

పంచాయితీ రెండో తీర్పూ అదే

  రెండో దశ పంచాయితీ ఎలక్షన్స్ లోనూ తొలి దశ ఫలితాలే రిపీట్ అయ్యాయి.. ప్రదాన పోటి అంత అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టిడిపి పార్టీల మధ్యే సాగింది.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంతో అయినా పరువు నిలబెట్టుకుంటే.. టిఆర్ ఎస్ మాత్రం పూర్తిగా చతికిల పడింది.. ఒక్క కరీంనగర్ జిల్లాలో తప్ప మిగతా అన్ని చోట్ల టిఆర్ఎస్ ఆశించిన స్థాయిలో విజయం సాదించలేకపోయింది. తెలంగాణ తో పాటు అన్నిప్రాంతాల్లోనూ టిడిపి హావా కొనసాగగా, కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి దశతోపోలిస్తే రెండో దశలో బాగానే పుంజుకున్నటుగా కనిపిస్తుంది. వైయస్ ఆర్ కాంగ్రెస్, టిఆర్ ఎస్ పార్టీలు మాత్రం మొదటి దశ కన్నా ఈ దశలో మరింత వెనకపడ్డాయి.. టిఆర్ఎస్ పార్టీ కేవలం కరీంనగర్ జిల్లాలో తప్ప మరెక్కడ ప్రభావం చూపలేకపోయింది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తున్న 1903 అభ్యర్ధులు గెలుపొందగా, టిడిపి మద్దతిస్తున్న 1809, వైకాపా పార్టీ తరుపున 1065, టిఆర్ పార్టీ నుంచి 545 మంది అభ్యర్ధులు గెలుపొందారు..

కాంగ్రెస్‌కు తేల్చే స‌త్తా ఉందా..?

  తెలంగాణ విష‌యంపై గత వారం రోజులుగా చ‌ర్చలు జ‌రుపుతున్న కాంగ్రెస్ చివ‌ర‌కు మ‌రోసారి రాష్ట్రనాయ‌క‌త్వాన్ని ఉసూరు మ‌నిపించింది. అంతా అయిపోయింది ఇక నిర్ణయ‌మే మిగిలింది అన్న నేత‌లు ఆ నిర్ణయాన్నే ఎప్పుడు చెపుతారు అన్న విష‌యం మాత్రం తేల్చటం లేదు.  అస‌లు నిజంగా కాంగ్రెస్‌కు తెలంగాణ పై తేల్చే స‌త్తా ఉందా అన్న విష‌యం కూడా ఇప్పుడు అనుమానం క‌లుగుతుంది.. మిగ‌తా అన్ని పార్టీల అభిప్రాయాలు తాము చెప్పిన డేట్ లోపు చెప్పాల‌న్న కాంగ్రెస్ అధిష్టానం.. త‌మ పార్టీ అభిప్రాయం చెప్పడానికి మాత్రం మీన‌ మేషాలు లెక్కపెడుతుంది.. ఇప్పటికే సంప్రదింపుల ప్రక్రియ పూర్తి అయింద‌ని ప్రక‌టించిన కోర్‌క‌మిటీ, నిర్ణయాన్ని మాత్రం ఎందుకు వాయిదా వేసింది అన్న విష‌యం ఎవ‌రికీ అర్ధం కావ‌టం లేదు. అస‌లు స‌మ‌స్య అంతా హైద‌రాబాదే అంటున్న అదిష్టానంకు ఆ స‌మ‌స్యను ప‌రిష్కరించే స‌త్తా ఉందా..? స‌మ‌స్యను ప‌రరిష్కరించే దిశ‌గా కాంగ్రెస్ చేస్తున్న ప్రయ‌త్నాలు ఏంటి..? అధిష్టానం నిర్ణయం వ్యతిరేకంగా తీసుకున్న ప‌క్షంలో పార్టీకి, ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తామ‌న్న కాంగ్రెస్ నేత‌ల తీరుపై అధినాయ‌కత్వం స్పందిచ‌క‌పోవ‌డం వెనుక మ‌త‌ల‌బేంటి..? ఇలా ఎన్నో ప్రశ్నలు.. వేధిస్తున్నాయి.. దీంతో అస‌లు కాంగ్రెస్‌కు ఈ స‌మ‌స్యను తేల్చే ఆలోచ‌న ఉందా లేదా అన్న అనుమానం కూడా క‌లుగుతుందంటున్నారు విశ్లేష‌కులు.. గ‌త‌ంలో ఒక‌సారి ఇలాగే అర్ధ రాత్రి ప్రక‌ట‌న చేసిన కాంగ్రెస్కు మ‌రోసారి అలాంటి ప‌రిస్థితులు ఎదురైతే ఎదుర్కొనే స‌త్తా ఉందా అన్నది కూడా అనుమాన‌మే.. ఇలాంటి ఎన్నో విష‌యాల‌ను బేరిజు వేసుకున్న కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పై తేల్చడం క‌న్నా నాన్చడ‌మే బెట‌ర్ అన్న ఆలోచ‌న‌లో ఉంద‌న్న వాద‌న కూడా వినిపిస్తుంది..

వ్రతం చెడినా ఫలితం దక్కించుకోలేని వైకాపా

  రెండవ విడత పంచాయితీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్, తెదేపాల ప్రభంజనమే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంతవరకు రాష్ట్రం మొత్తంలో వెలువడిన ఫలితాలలో కాంగ్రెస్ మద్దతు పలికిన అభ్యర్ధులు మొత్తం 735 స్థానాలు దక్కించుకోగా, తెదేపా బలపరిచిన అభ్యర్ధులు 660 స్థానాలను కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ రెండవ స్థానంలో నిలిచింది.   ఇక తెలంగాణాపై వెనకడుగు వేసిన వైకాపాకి ఊహించినట్లుగానే తెలంగాణాలో భంగపాటు తప్పలేదు. అక్కడ ఆ పార్టీకి అన్ని జిల్లాలలో కలిపి కేవలం 35 స్థానాలు మాత్రమే దక్కాయి. వ్రతం చెడినా ఫలితం దక్కనట్లుగా సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకొన్నందుకు, కనీసం సీమంధ్రలో కూడా ఆ పార్టీ ఊహించినట్లు ఏమీ అద్భుతాలు జరుగలేదు. అక్కడ కూడా ఆ పార్టీ మూడవ స్థానికే పరిమితమయింది. సీమంద్ర ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్ధులు 462 సీట్లు దక్కించుకోగా, తెదేపా 496 , వైకాపా 344 సీట్లు దక్కించుకోవడం గమనిస్తే వైకాపా సమైక్య వ్యూహం బెడిసి కొట్టినట్లు అర్ధం అవుతోంది. అయినప్పటికీ, యధావిధిగా తమ పార్టీ ఈసారి కూడా మిగిలిన అన్నిపార్టీల కంటే ఎక్కువ సీట్లు సాధించినట్లు ఆ పార్టీకి చెందిన మీడియా ప్రకటించుకొంది.   వైకాపా తన సమైక్య ప్రయోగం ఆశించిన ఫలితాలు ఇవ్వనందున బహుశః ఈ రోజు లేదా రేపుఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ “తెలంగాణాపై తమ పార్టీ ఆనాడు ప్లీనరీలోఇచ్చిన మాటకే కట్టుబడి ఉందని, సీమంధ్ర శాసనసభ్యుల రాజీనామాలు వారి వ్యక్తిగతమని, అవి పార్టీ అభిప్రాయం కాదని” మీడియా ముందుకు వచ్చి ప్రకటన చేయవచ్చును. తద్వారా కనీసం మూడవ దశ పంచాయితీ ఎన్నికలలోనయినా పార్టీ పరిస్థితి మెరుగుపరచుకొనే ప్రయత్నం చేయవచ్చును.   ఇక, తెరాస పరిస్థితి కూడా వైకాపాకు ఏమాత్రం భిన్నంగా లేదు. కాంగ్రెస్ విసిరిన పాచికలకి ఆ పార్టీ ఈ ఎన్నికలలో చిత్తయిపోయినట్లు అర్ధం అవుతోంది. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ 275 సీట్లు దక్కించుకొని మొదటి స్థానంలో, తెదేపా 164 సీట్లతో రెండవ స్థానంలో నిలవగా, తెరాస కేవలం 132 సీట్లతో మూడవ స్థానానికి పరిమితమయిపోయింది. కానీ, ఆ పార్టీ కూడా తన స్వంత మీడియా లో మిగిలిన పార్టీల కంటే అత్యధిక స్థానాలు గెలుచుకొన్నట్లు ప్రకటించుకొంది.

సురేఖ అసంతృప్తి

      తెలంగాణ పార్టీ నేతలతో జగన్ పార్టీ అంతరం క్రమక్రంగా పెరుగుతోంది. విజయమ్మతో భేటి తరువాత కొండా సురేఖ మీడియా తో మాట్లాడుతూ... సీమాంధ్ర ఎమ్మెల్యేల రాజీనామాలు వ్యక్తిగతమో, పార్టీ నిర్ణయమో తమకు అధిష్టానం చెప్పలేదన్నారు. తాము అసంతృప్తితోనే బయటకు వచ్చామని చెప్పారు.   సీమాంధ్ర నేతల రాజీనామాల పైన, తెలంగాణ విషయంలో తమకు సరైన సమాధానం దొరకలేదని చెప్పారు. తెలంగాణ వ్యతిరేక పార్టీలో ఉన్నామనే అపవాదు తమకు వద్దని ఆమె అన్నారు. సీమాంధ్ర ఎమ్మెల్యేల నిర్ణయం పార్టీ వైఖరి కాకపోతే తమకు ఇప్పటి వరకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. పార్టీ వైఖరి తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉందన్నారు. తామంతా మరోసారి చర్చించి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని సురేఖ అన్నారు.

రెండో విడత పోలింగ్: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

      రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పలు చోట్ల చెదురుమొదురు ఘటనలు మినహా అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు ప్రశాతంగా జరిగాయి. ఒంటిగంట వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతినిచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌటింగ్ ప్రారంభమైంది.   రెండో విడతలో 916 పంచాయతీయలు ఏకగ్రీవమయ్యాయి. ముందుగా వార్డుసభ్యుల ఓట్లు లెక్కించి అనంతరం సర్పంచ్ ఓట్లు లెక్కించనున్నారు. రెండో విడత తొలి ఫలితం చిత్తూరు జిల్లా నుంచి వెలువడింది. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం కనకంపాలెంలో సర్పంచ్ గా స్వతంత్ర అభ్యర్ధి గెలుపొందినట్లు సమాచారం. సాయంకాలానికల్లా చాలా వరకూ పలితాలు వెలువడే అవకాశం వుంది.

విజయమ్మతో కొండా భేటి..తాడోపేడో

      వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 16 మంది సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజీనామాలు చేసిన నేపథ్యంలో గుర్రుగా ఉన్న ఆ పార్టీ తెలంగాణ నాయకులు శనివారం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో సమావేశమయ్యారు. మాజీ మంత్రి కొండా సురేఖతో పాటు ఆమె భర్త కొండా మురళి, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మహేందర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణా రెడ్డి, రవీంద్ర నాయక్‌ తదితరులు సమావేశానికి వచ్చారు.   సీమాంధ్ర ఎమ్మెల్యే చర్యలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కొండా దంపతులు దీనికి విజయమ్మ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణపై పార్టీ వైఖరిపై స్పష్టమైన ప్రకటన చేయాలని వారు విజయమ్మను కోరనున్నట్లు సమాచారం.   తెలంగాణకు వ్యతిరేకంగా వైఖరి తీసుకుంటే తాము పార్టీకి రాజీనామా చేస్తామని కూడా వాళ్లు తేల్చిచెప్పనున్నారు. ప్లీనరీలో తెలంగాణకు అనుకూలంగా చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నామని మాటల్లో చెబుతున్నా, చేతల్లో మాత్రం సమైక్యానికి అనుకూలంగా కనిపిస్తోందని, ఇది తమను తమ ప్రాంతాల్లో ఇబ్బందులకు గురి చేస్తోందని వారు నివేదించనున్నారు.

తెలంగాణపై తెదేపా కూడా మాట మారుస్తుందా

  ఈ రోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాష్ట్ర విభజనపై మాట్లాడిన తీరు చూస్తే, క్రమంగా ఆ పార్టీ కూడా వైకాపా మార్గంలోనే పయనించేందుకు సిద్దం అవుతున్నట్లు కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం వైకాపా శాసనసభ్యులు కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించినట్లే “ఎవరిన డిగి రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకొంటోందని” ఆయన ప్రశ్నించారు. ప్రజలు తెలంగాణా కోసం అడుగుతుంటే కాంగ్రెస్ రాయల తెలంగాణా అని మాట్లాడటం ఏమిటని ఆయన ప్రశించారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం, తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజనకి ఆలోచనలు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. ముందుగా రాజధాని, జలవనరుల పంపిణీ, రెవెన్యు మొదలయిన అంశాలను పరిష్కరించకుండా విభజనకు సిద్దపడితే తాము ఉద్యమిస్తామని అన్నారు. సోమిరెడ్డి ఇంకా చాల అంశాలు ప్రస్తావించి నప్పటికీ, ఆయన రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నట్లు తన మాటలతో స్పష్టం చేసారు.   చంద్రబాబు అనుమతి లేకుండా సోమిరెడ్డి ఈవిధంగా మాట్లాడే అవకాశం లేదు, గనుక ఆయన తమ పార్టీ అభిప్రాయం వెలువరిస్తునట్లుగానే భావించవలసి ఉంటుంది. మరి ఇంతవరకు తమ పార్టీ తెలంగాణకు అనుకూలమని ప్రకటిస్తూ వచ్చిన తెదేపా కూడా ఇప్పుడు హటాత్తుగా “ఎవరిని అడిగి విభజిస్తున్నారని” ప్రశ్నించడం చూస్తే, నేదో రేపో ఆ పార్టీ శాసనసభ్యులు కూడా రాజీనామాలతో రంగంలో దిగవచ్చునని అనిపిస్తోంది. అఖిలపక్షంలో రాష్ట్ర విభజనకు తమకు అభ్యంతరం లేదని స్పష్టంగా చెప్పిన తెదేపా ఇప్పుడు మళ్ళీ మాట మార్చితే తెలంగాణాలో భంగపాటు తప్పదు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నసోమిరెడ్డి, మరి తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా మాట్లాడటలేదనే సంగతిని విస్మరించడం విశేషం.

పామర జనానికి తెలియని నిజాలు

  కొంచెం కూడా లోకజ్ఞానం లేని అజ్ఞానులయిన భారతీయులు కొందరు దేశాన్నిదారిద్ర్యం పట్టి పీడిస్తోందని అవాకులు చవాకులు వాగుతుంటారు. మీడియా కూడా అటువంటి వారికి వంత పాడుతూ ఎక్కడో మారుమూల గ్రామాలలో ఆకలి చావులు చస్తున్నవారి ఫోటోలు ప్రచురిస్తూ దేశంలో పేదరికం విలయతాండవం చేస్తోందని, సగం మందిపైగా ఒంటిపూట భోజనానికి కూడా నోచుకోవట్లేదని అతిశయోక్తులు ప్రచురిస్తుంది.   కానీ, మన అదృష్టం కొద్దీ మహా మేధావులయిన కాంగ్రెస్ నేతలు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులయిన మాంటెక్ ఆహ్లువాలియా వంటి నిపుణులు ఉండబట్టి సరిపోయింది. లేకుంటే ప్రపంచం కూడా ఈ తప్పుడు కధనాలు నమ్మేసి ఉండేది. ఆహ్లూ వాలియా గారు తన ఏసి గదిలో కూర్చోనప్పటికీ ఎంతో చమటోడ్చి అరడజను చాయ్ లు, మరో అరడజను బిస్లిరీ నీళ్ళ బాటల్స్ సేవించి, సుదీర్గ పరిశోధన చేసి మన దేశంలో పేదరిక స్థాయి దాదాపు 22 శాతం తగ్గిపోయిందని కనిపెట్టారు.   పామరులయిన ప్రజలకి, వారి పెరిగిన ఆర్ధిక శక్తి గురించి కూడా తెలియజేసి పుణ్యం కట్టుకొన్నారు. ఇప్పుడు చాల మంది భారతీయులలలో సగటున రూ.33కంటే వ్యయం చేయగలిగే స్థితికి చేరుకొన్నారని, అంటే ఇక వారందరూ దారిద్యరేఖపై నుండి హై-జంప్ చేసి మద్యతరగతిలోకి వచ్చిపడ్డారని శలవిచ్చారు.   కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్ ముంబాయిలో తన ఆఫీసుకి తన ఇంపోర్టెడ్ కారులో వెళుతూ పేపర్లో ఆ వార్త చదివి చాలా ఆనందపడిపోయారు. కానీ, ఇంత గొప్ప సంగతి తనకంటే తెలిసింది. కానీ, పాపం! రోడ్డు పక్కన ఫుట్ పాత్ ల మీద తిండి లేక ఈసురో...మని మొహాలు వ్రేలాడేసుకొని కూర్చోన్నవారికి ఎలా తెలుస్తుంది? అని ఆలోచించి, ఆఫీసుకి చేరుకోగానే ఒక స్థానిక పత్రికకి ఫోన్ చేసి ఈ విషయమంతా చెప్పి, ముంబైలో కేవలం రూ.12 పెడితే కడుపు నిండా భోజనం దొరుకుతుందని, అందువల్ల మిగిలిన రూ.21లతో అందరూ పండుగ చేసుకోవచ్చునని తన మాటగా ఆ ఫుట్ పాత్ జనాలకి తెలియజేయమని ఆయన ఆదేశించారు.   అయితే, ఆసంగతి అ ఫుట్ పాత్ జనాలకి తెలియలేదు, కానీ అంతకంటే ముందుగా డిల్లీలో తన ఫాం హౌస్ లో ఫ్రూట్ జ్యూస్ త్రాగుతూ సేద తీరుతున్నరషీద్ మసూద్ అనే కాంగ్రెస్ పెద్దాయనకి తెలిసిపోయింది. ఆయన వెంటనే మీడియా వాళ్ళని పిలిపించుకొని “మీరు ఆ రాజ్ బబ్బర్ మాటలు పట్టించుకోవద్దు. ఇక్కడ డిల్లీలో అయితే రూ.5పడేస్తే సుష్టుగా పొట్ట పగిలేలా తినొచ్చును. ఆ లెక్కన మనిషికి మొత్తం రూ.28 చొప్పున మిగిలిపోతుంటుంది. ఇక అదంతా ఎలా ఖర్చు చేయాలి? ఎప్పుడు ఖర్చు చేయాలి? డబ్బు ఖర్చు చేయలేని స్థితిలో ప్రజలుంటే ఇక దేశంలో పేదరికం ఎక్కడ మిగులుతుంది?” అని సూటిగా మీడియా వాళ్ళను ప్రశించారు. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వాళ్ళు బయటకొస్తుంటే, ఫారూక్ అబ్దుల్లా అనే మంత్రిగారు తన ఏసి కారులోంచి దిగి “ఏంటి సంగతీ?” అని అడిగారు. మీడియా అంతా పూసగుచ్చింది.   “అసలు ఒక్క రూపాయికి కావలసినంత తిండి దొరుకుతుంటే, వీళ్ళేమిటి 5, 12 అని తప్పుడు లెక్కలు చెపుతున్నారు?” అంటూ తెగ చిరాకుపడిపోయారు. “మనం ఏమి, ఎంత, ఏ రకం ఫుడ్డు తినాలనుకొంటున్నామనే దాని బట్టే ఖర్చుఉంటుంది తప్ప, ఒక సింపిల్ భోజనం కావాలంటే ఒక్క రూపాయి చాలదూ? మరటువంటప్పుడు కేవలం మేమే స్విస్ బ్యాంకుల్లో బ్లాక్ మనీ అకౌంట్స్ మెయింటేన్ చేస్తున్నామని ఆ ఆరోపణలేమిటి? ఆ మిగిలిన రూ.32లు ఎక్కడికి పోతున్నాయి? స్విస్ బ్యాంకులోకే కదా? మరి అందరికీ స్విస్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే ఇక దేశంలో పేదరికం ఎక్కడ ఉంది. ఈ సారి ఆ ఆహ్లూవాలియాని కలిసినప్పుడు “ఇండియా మే బీ పూర్, బట్ ఆల్ ఇండియన్స్ ఆర్ రిచ్” అని స్టేట్మెంట్ మార్చమని గట్టిగా చెపుతాను” అని ఆయన మీడియా మీద ఒంటి కాలుపై లేచేసరికి ఇంకెప్పుడు దేశంలో తిండి లేక పేదలు చచ్చిపోతున్నారని వ్రాయమని లెంపలు వేసుకొని బ్రతుకే జీవుడా అంటూ మీడియా వాళ్ళు బయటపడ్డారు.

అబద్ధాలకు తెరతీసిన "వేర్పాటు''!

- డా.ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]       అబద్దాల నోటికి అరవీసెడు సున్నం కొట్టినా చాలదట! ఊదర ద్వారా ఏ ఉద్యమాలూ నిలవవు; ఊదర వల్ల ఉద్యమాలకు అస్తిత్వం రాదు. ప్రజలకు, దేశానికి, రాష్ట్రాలకు 'అసిత్వం' అనేది సామాజిక, ఆర్థికరంగాలలో పాలనావ్యవస్థలు ప్రజానుకూలమైన, ప్రణాళికాబద్ధమైన, ద్వంద్వప్రమాణాలకు తావులేని పథకాలను ఆచరణలో జయప్రదంగా అమలు జరిపినప్పుడు మాత్రమే స్థిరపడుతుంది. ఆ ప్రగతి ప్రజాతంత్ర విప్లవం ద్వారా మాత్రమే ప్రజాబాహుళ్యం అనుభవంలోకి వస్తుంది. ప్రజలకు సామాజిక, ఆర్థికస్థిరత్వం అప్పుడు మాత్రమే సాధ్యం. అలాంటి స్థిరత్వం ద్వారానే జాతికీ, దేశానికీ, రాష్ట్రాలకూ ఆత్మగౌరవం సిద్ధిస్తుందిగాని పదవీ ప్రయోజనాల కోసం రాజకీయ నిరుద్యోగులు ప్రారంభించే ఊదర ఉద్యమాల వల్ల ఎంతమాత్రం సంప్రాప్తించదు! పరిణామాలకు చెప్పే వక్రభాష్యాలవల్ల, ఆడే అబద్దాలవల్లా ప్రాంతాలకు స్థిరత్వంగానీ, ప్రజలకు ఆత్మగౌరవంగానీ సమకూడదు. ఈ సూత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోని మోతుబరులకూ, చీలికవాదం చాటున, సమైక్యతా వాదం చాటునా దాచుకుంటున్న స్వార్థపరులందరికీ సమంగానే వర్తిస్తుంది. ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవాలంటే, అటూ యిటూ కూడా కృత్రిమంగా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ పేరుకు మాత్రమే 'మేథావులు'గా చెలామణి కాజూస్తున్న కొందరు కుహనా విద్యాధికులూ పలుకుతున్న అబద్ధాలు! ఈ మోతుబరులు, ఈ విద్యాధికులలో హెచ్సుమంది అటుయిటూ కూడా ప్రాంతాలలోనూ తరతమ భేదాలతో, ఆంధ్రప్రదేశ్ (విశాలాంధ్ర) రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎదిగివచ్చిన నయా (నియోరిచ్) సంపన్న వర్గాలేనని మరచిపోరాదు. వీరిలో ఒక ప్రాంతంలోని మోతుబరులకు దేశానికి స్వాతంత్ర్యం రాక ముందునుంచీ ప్రెసిడెన్సీలో భాగంగా తెలుగుసీమలోని ఒక ప్రాంతం ఉన్నప్పుడే కొంత ఆర్థికస్తోమత సమకూడి ఉంది. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగువారు వేరై ఆంధ్రప్రాంతం ఒక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఈ సంపన్నవర్గం మరింత బలపడుతూ వచ్చింది. ప్రారిశ్రామికంగానూ, వ్యవసాయకంగానూ. కాని ఈ మోతుబరుల 'బలాన్ని' చూపి ఆంధ్రప్రాంతంలోని నూటికి తొంభైమంది ప్రజాబాహుళ్యం స్థితిగతులన్నీ మెరుగైపోయినట్టు భావించరాదు; జల సమస్యలు ముగింపునకు వచ్చినట్టూ భావించరాదు.   అలాగే బ్రిటిష్ వలసపాలకుల అండతో హైదరాబాద్ కేంద్రంగా నిజామాంధ్రలోని తెలుగుప్రజలపైన దారుణమైన నిరంకుశ పాలనను సాగిస్తూ తెలుగుప్రజల్ని తెలుగు పాఠశాలలు పెట్టుకోనివ్వకుండా ఉర్దూను మాత్రమే పాలనా భాషగానూ రుద్ది, స్వభాషా సంస్కృతులకు దూరంచేసి, దొరల, జాగిర్దార్ల, దేశ్ ముఖ్ ల దౌర్జన్యాలను అనుమతించడం ద్వారా నిజాంసర్కార్లు [ఒక్క కుతుబ్ షాహీ మినహా] ప్రజల్ని వెట్టిచాకిరీకి తాకట్టుగా మార్చాయి! ఆ పరిస్థితుల్లో అక్కడ నిజాంకు తాబ్ దార్లుగా మారిన ఏ కొలదిమంది దొరలూ, జాగిర్దార్లూ మాత్రమే సంపన్నులుగా చెలామణీ అయ్యారు. కాని, మెజారిటీ తెలంగాణా తెలుగుప్రజలను నిజాముతోపాటు తెలుగుదొరలూ, తెలుగు జాగిర్దార్లూ, తెలుగు పటేల్, పత్వారీలూ దారుణ దోపిడీ ద్వారా పీల్చుకుతిని పిప్పిచేసి 'నీ బాన్చని దొరా, నీ కాల్మొక్తా' అన్న బానిసవ్యవస్థకు బందీలు చేసి వదిలారు. ఒక్క తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం [ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ సాహస నాయకత్వంలో] మాత్రమే ఏకభాషా సంస్కృతులు ఆధారంగా ఉభయ ప్రాంతాలలోని తెలుగువారినందరినీ ఏకోన్ముఖం చేసి విశాలాంధ్ర ఏర్పాటుకు భౌతిక, మానసిక పునాదుల్ని పటిష్టం చేసింది. అయితే అంతకుముందు ఆంధ్రరాష్ట్రావతరణ తర్వాత ''నియోరిచ్'' కోస్తాంధ్రలో ఎలా తలెత్తిందో, ఇటు విశాలాంధ్ర అవతరణ తర్వాత మన తెలంగాణా ప్రాంతంనుంచి కూడా "నయాసంపన్నవర్గం'' తలెత్తింది. అంతకుముందెన్నడూ లేని స్థాయిలో విశాలాంధ్ర ఏర్పడిన తరువాత కోస్తాంధ్ర ప్రాంతాల నుంచి విద్యా, వ్యాపారరంగాల నుంచి ఎలా గణనీయమైన సంఖ్యలో "విదేశీ భారతీయులు''గా (ఎన్.ఐ.ఆర్.లు) ఎదుగుతూ వచ్చారా, అలాగే మన తెలంగాణానుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాతనే ఎన్.ఐ.ఆర్.ల సంఖ్యా నానాటికీ పెరుగుతూ వచ్చింది. ఈ పరిణామం ప్రధానంగా పరాయిపాలన నుంచి విడివడి, ఉభయప్రాంతాలలోని తెలుగువారంతా 'విశాలాంధ్ర' (ఆంధ్రప్రదేశ్)గా ఏర్పడిన తరువాతనే జరిగిందని మరచిపోరాదు!   అయితే అటూ, యిటూ కూడా సామాన్య ప్రజాబాహుళ్యానికి సమష్టిగా దక్కవలసిన రాష్ట్ర సహజవనరులు అందుబాటులోకి వచ్చాయని కలలో కూడా భావించకూడదు! ఈ సహజవనరులపై పెత్తనం కోసం ఉభయప్రాంతాలలోని మోతుబరుల మధ్య పెరుగుతూ వచ్చిన స్ఫర్ధలే, ప్రజాబాహుళ్య ప్రయోజనాలతో సంబంధంలేని వ్యర్థ ఉద్యమాల రూపంలో దఫదఫాలుగా తలెత్తుతూ రాష్ట్ర ప్రజల మూల్గులను పీల్చి వేస్తున్నాయి, ఐకమత్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ సమయంలో వామపక్షాలు సహితం ప్రజలకు నాయకత్వం వహించి వాస్తవాలను బోధించి సమీకరించడంలో విఫలమవడం ప్రజలపాలిట 'శాపం'గా మారి, మోతుబరులకు, వారి పాలకశక్తులకూ పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ అండదండలు అందించినట్టయింది! ఇందుకు ప్రధాన కారణం - విభేదించే విధానాలు చెప్పుకోదగినవి లేకపోయినా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలుబాటలలో యింకా ప్రయానిస్తూండటమే! ప్రజల్ని సరైన పంథాలో చైతన్యవంతుల్ని చేయడంలో తరచుగా విఫలమావుతూండటంవల్లనే ప్రజాతంత్ర ఐక్యసంఘటిన నిర్మాణంలో కూడా క్రియాశీల పాత్ర వహించలేకపోతున్నారు; ఐక్యప్రజాతంత్ర ఉద్యమాలు నిర్మించుకోడానికి ముందు ఉభయకమ్యూనిస్టు పార్టీలు [సి.పి.ఐ.-సి.పి.ఎం.] ఏకమై తిరిగి ఒక పార్టీగా అవతరించడం అవశ్యం జరగాల్సినపని. తెలంగాణా ఏర్పాటువాదం తలెత్తడానికి, ఎలాంటి శాస్త్రీయలక్ష్య నిర్వచనా లేకుండా కొందరు రాజకీయ నిరుద్యోగులు తలపెట్టిన ఉద్యమానికి కమ్యూనిస్టుపార్టీల ఉదాసీనత, నిర్వ్యాపార స్థితియే కారణం. అందువల్లనే రకరకాల అబద్ధాలకు వేర్పాటు ఉద్యమకారులు గజ్జెకడుతున్నారు; ఉభయప్రాంతాలలోని స్వార్థపర సంపన్నులూ, రాజకీయ నిరుద్యోగులూ భిన్నకోణాల నుంచి తెలుగుజాతిని విచ్చిన్నం చేయడానికైనా సిద్ధమేగాని పరాయి పాలకులనుంచి వారసత్వంగా అందిపుచ్చుకున్న 'విభజించి-పాలించే' సూత్రాన్ని వదులుకోడానికి మాత్రం వదులుకోడానికి సిద్ధంకావటంలేదు!   కనుకనే అనేక అబద్ధాలను ప్రచారంలో పెట్టడానికి వీరిలో కొందరు వెరవడం లేదు. ఉదాహరణకు తెలంగాణాలో ఒక మోతుబరి ఇటీవల కాలంలో నెలకొల్పిన ఒక స్థానిక దినపత్రిక - కేంద్రప్రభుత్వం లేదా కాంగ్రెస్ అధిష్ఠానవర్గం రాష్ట్ర విభజన సమస్యపై యింకా ఎలాంటి అవకాశవాద నిర్ణయానికి సిద్ధం కాకపోయినా, "వీర తెలంగాణా'' బదులు వేరు తెలంగాణాను ప్రమోట్ చేయడానికి, రాణి 'విజయాని'కి వచ్చినట్టుగా రంగుపులిమి "జజ్జనకర జనారే - తెలంగాణా ఖరారే'' అంటూ పతాకశీర్షిక పెట్టేసింది. అలా పెట్టడంలో ఉద్దేశ్యం, దాదాపు 800-900 మంది తెలంగాణా ఎస్.సి., ఎస్.టి., బి.సి. తదితర బడుగుబలహీన వర్గాల బిడ్డల్ని తమ రాజకీయ స్వార్థం కోసం బలిపశువుల్ని చేసి ఆత్మహత్యలవైపు పురిగొల్పిన పాపాన్ని మరోరూపంలో కడిగేసుకోడానికి చేస్తున్న తెలంగాణా ప్రయత్నం తప్ప మరొకటి కాదు. తెలంగాణా ''ఖరారే'' అన్నప్పుడు, ప్రత్యేకరాష్ట్రం ఆచరణలో నిర్ణయాత్మకంగా ఖరారైన తరువాత మాత్రమే వాడవలసిన పదం. అంతేగాని, "ఖరారు'' కాకుండానే వాచా 'విజయోత్సవం' జరపడం కనీవినీ ఎరగని పోకడ! కాని పత్రికాధిపతి ఆత్మ‘విశ్వాసం’తో మాత్రమే ‘ఖరార’యిన ‘విజయం’ ఎలాంటిది? అదే స్థాయి పత్రిక మాటల్లో ‘‘హస్తిన (ఢిల్లీ)లో కసరత్‌ ముమ్మరం’’ ఎలా అంటే? కోర్‌ కమిటీ నుంచి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీకి, అక్కడి నుండి కేంద్రమంత్రివర్గానికి ఆ పిమ్మట రాష్ట్రపతిని నివేదన, ఆదరిమిలా రాష్ట్ర అసెంబ్లీలో ఎలాంటి నిర్ణయం చేయకుండా చర్చకు పరిమితం కావటం, ఆ తరువాత పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం, రాజ్యాంగ సవరణకు మూడింట రెండువంతుల మెజారిటీ అవసరం కాబట్టి, బిల్లు ‘నామ్‌కేవాస్తే’గా రూపొండం.. ఇలా ఎన్నో ‘సంకేతాల’ట! ఇలా ఊహాగానాలనే తెలంగాణా రాష్ట్రం వచ్చేసిందన్న ‘సంకేతాలు’గా మార్చడానికి జరిగిన ప్రయత్నం! ఒక అబద్ధాన్ని ప్రచారంలోకి తెచ్చి, తెలిసో తెలియకో తెలిసినట్టు నటించడం ద్వారా మరో అబద్ధానికి తెర ఎత్తుతోంది ఆ పత్రిక ఎలా?. ''ఆంధ్రప్రదేశ్‌ విభజన అనివార్యం! తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తథ్యం! వరుస పరిణామాలు ఇస్తున్న విసృష్ట సంకేతాలివి!   మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడే సమయంలో ముఖ్యమంత్రిగా వుండి, విభజన ఆనుపానులు తెలిసిన నేత దిగ్విజయ్‌సింగ్‌ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమించడం మొదలు... స్వరం మార్చుకున్న కరడుగట్టిన తెలంగాణా వ్యతిరేకులు..!! ఇలా అబద్ధాల బిఠా ఆ పత్రిక వర్ణించింది. అంతగారు, అంతకు ముందు రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా పనిచేసిన గులామ్‌ నబీ అజాద్‌ స్థానంలో దిగ్విజయ్‌సింగ్‌ ‘‘నియామకమే తొలి అడుగ’’ని మహా ‘విశ్వసం’తో రాసేసింది. కాని రాష్ట్ర పర్యాటనలో ఇటు దిగ్విజయ్‌సింగ్‌గాని, అటు అజాద్‌గాని పలు ప్రకనల మధ్యనే విభజన ‘అనుభవాల’గురించి ఏమి చెప్పాలోమాత్రం ఆ పత్రిక వెల్లడిరచకుండా దాచిపెట్టింటి! బిజెపి`ఎన్‌డిఎ పరివార్‌ కేంద్ర ప్రభుత్వం మాధ్యప్రదేశ్‌ను బలవంతంగా విచ్చిన్నం చేసి ఛత్తీస్‌ఖడ్‌ రాష్ట్రాన్ని ఏర్పరచడం వల్ల తామెన్ని కష్టనష్టాలకు గురయ్యామో దిగ్విజయ్‌సింగ్‌ మన రాష్ట్ర పర్యటనలోనే మనకు గుర్తు చేయాల్సివచ్చింది! ‘యథాతథంగా  సమైక్యరాష్ట్రంగానే ఆంధ్రప్రదేశ్‌ను కొనసాగించినా అందుకు రాష్ట్రనాయకులంతా కట్టుబడి ఉండాల్సిందే’’నని కూడా ఆయన హెచ్చరించి పోయాడు! అంతేగాదు ‘‘రాష్ట్ర విభజన అనేది చాలా క్లిష్టమైదీ, బాధాకరమైనదీ, ఆ బాధేమిటో నేను స్వయంగా అనుభవించాను. అందువల్ల రాష్ట్రాన్ని విభజించడం ఆషామాషీ వ్యవహారం కాదు సుమా! మధ్యప్రదేశ్‌ విభజన జరిగినప్పుడు విద్యుత్‌ ప్రాజెక్టులన్నీ ఛత్తీస్‌గఢ్‌లో ఉంటే, వాడకందార్లందరూ మధ్య ప్రదేశ్‌లో ఉండిపోయారు...’’ అన్నారు దిగ్విజయ్‌సింగ్‌!   అలాగే అజాద్‌ కూడా లడఖ్‌ విభజన వల్ల మూడు జిల్లాలుగా కాంగ్రెస్‌ అన్ని సీట్లు గెలుస్తుందనుకుని విభజించనా కాంగ్రెస్‌ పూర్తిగా వోడిపోయిందని వాపోయాడు! వేర్పాటు వాదులకు అదీ ‘పరగడపై’పోయింది! ఇక పంజాబ్‌ విభజనవల్ల పంజాబ్‌ హర్యానా ప్రజలు ఇరువర్గాలూ ఘోరమైన ఇబ్బందులు పడుతూనే ఉన్నారని ప్రసిద్ధ పాత్రికేయుడు కులదీప్‌నయ్యర్‌ మాటనూ ఆ పత్రిక మరిచిపోయి అబద్ధాలు అల్లడం విచారకరం! 'వేర్పాటు’వాదం చేసే రాజకీయ నిరుద్యోగుల్లో ఒకరు ఇప్పటిదాకా కేంద్రం ప్రకటన ఎందుకు రాలేదన్న పశ్నకు సమాధానంగా ‘ఎబ్బే‌, రాబోయే 122 రోజుల్లో వస్తుంద’ని చెప్పగా, ‘కాదు, కాదు 145 రోజుల్లోనే (ఇంకా అయిదు నెలలకట, అంటే డిసెంబర్‌నాటికి, అంటే 2014 ఎన్నికలకు మరో ‘గాలం’) ప్రకటన రాబోతోంద’ని మరొకరూ, ఇదీ అదీగారు, రానున్న 215 రోజుల్లోనే అంటే అంటే 2014 ఫిబ్రవరికల్లా (అంటే ఇదీ 2014 ఎన్నికలకు వేసిన గాలమే) ప్రత్యేకరాష్ట్ర ప్రకటన వెలువడుతుందని ఇంకొకరూ ఎవరికితోచిన ‘బుద్ధి’తో వారు ఉబుసుపోని ప్రకటనలు చేస్తూ యువకుల ఆత్మహత్యలకు బాధ్యత నుంచి తప్పించుకునే నానారకాల ‘పారుమాటలూ’చెబుతున్నారు!   అయితే ఇదే సందర్భంలో తెలంగాణాను ‘సీమాంధ్రులంతా దోచుకు తింటున్నార’ని బాహాటంగా మొత్తం ప్రజల్ని దోపిడీ దార్లుగా చిత్రించుతూ తెలంగాణా నుంచీ, హైదరాబాద్‌ నుంచీ టోకుగా ‘బంగీ కట్టి, కోస్తాంధ్రకు తోలేస్తామ’ని విషప్రచారాన్ని గత అయిదేళ్లుగా నిర్వహించిన తెలంగాణాలోని ‘బొబ్బిలి’వలసదారు నడమంత్రపు సిరిదారుడైన కె.సి.ఆర్‌, అతనికి అండగా నిలచిన ఆచార్యకోదండరామిరెడ్డి ఇప్పుడు గొంతులు మార్చారు! ఎందుకు? తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై వారికి అనుమానం వచ్చే బహుశా, గొంతులు మార్చారు. తమ‘పోరాటం’ తెలంగాణాను దోచుకునే ‘సీమాంధ్ర పెట్టుబడి దారులపైన’నే గాని సీమాంధ్ర ప్రజలపై కాదనీ, ‘‘సమైక్యాంధ్ర ఉద్యమం సీమాంధ్ర రాజకీయ పెత్తందార్ల పేరిట కృత్రిమ కుట్రల ఉద్యమం’అనీ వీరు గొంతు సవరించుకునే పరిస్థితి ఏర్పడిరది. ఇప్పటికైనా గొంతుకు తెచ్చుకున్న ‘సవరణ’మంచిదేగాని, అసలు ఒక్కటిగా ఉన్న తెలుగు జాతి ఎందుకు విడిపోవాలో వీరు సూటిగా సమాధానం ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు! తెలంగాణా ప్రజల్ని కోస్తాంధ్రుల న్యూనపరుస్తున్నారనీ, తెలంగాణా సాహిత్యాన్ని ‘దూషిస్తూ’న్నారనీ తెలంగాణా  సంస్కుతిని భ్రష్టు పట్టిస్తున్నారనీ తెలంగాణాను దోచుకోవడం ద్వారా కోస్తాంధ్రులు తెలంగాణాను ‘బికారి’గా మార్చారనీ, ‘అభివృద్ధి’ని కుంటుపర్చారనీ - ఇలా గణాంకాలతో, భౌతిక వాస్తవాలతో నిమిత్తంలేని వాదనలు చేస్తూ వచ్చారు.   సోదర తెలంగాణా ప్రజల్ని ఇంతకాలం న్యూనపరుస్తూ వచ్చిన ‘ఉద్యమ’నాయకులపై రాజకీయ నిరుద్యోగులే, గతంలోనూ ఇప్పుడూ మంత్రిపదవుల్లో ఉన్న తెలంగాణా నాయకుల్ని ‘దద్దమ్మలు, బలహీనుల’’నీ బహాటంగా ఆడిపోసుకుంటూ వచ్చింది కె.సి.ఆర్‌ ప్రభృతులే, చివరకు కాంగ్రెస్‌కు ఉద్యమాన్ని తాకట్టుపెట్టి, తానుగా ఆ ‘బలహీనుల’ జాబితాలో చేరిందీ కె.సి.ఆర్‌కి తెలంగాణా మిత్రులు కొందరు, తెలంగాణా  రాష్ట్ర ఏర్పాటును అభిలషిస్తున్న మిత్రులూ కొలది రోజుల నాడు ఏ సీమాంధ్ర పత్రికలోనూ కాదు, స్థానిక పెట్టుబడిదారుడైన రాజాం అధిపతిగా ఉన్న ‘నమస్తే తెలంగాణా’లో ప్రచురించిన వ్యాసంలో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తరువాత మన తెలంగాణాలో జరిగిన అభివృద్ధి గురించి రాసిన మాటలు సహృదయంతో పరిశీలించండి. సిక్కిం సెంట్రల్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌గా పనిచేస్తున్న తెలంగాణా మిత్రులు డాక్టర్‌ ఓం ప్రసాద్‌గద్దె ఆ పత్రికలో ‘విభజన.. వ్యతిరేకుల వితండవాదాలు’’ అన్న మకుటం కింద తెలంగాణాలో విశాలాంధ్ర ఏర్పడిన తరువాత జరిగిన అభివృద్ధి గురించి జరిగిన యిలా పేర్కొన్నారు.   ‘తెలంగాణాలోని మారుమూల పల్లెలు సైతం ప్రభుత్వ పథకాలతో అభివృద్ధిబాటన నడుస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నది. అలాగే, తెలంగాణాలో పట్టు సాధించిన నక్సలైట్లను నిర్మూలించేందుకు ప్రభుత్వమూ, పోలీసులూ తీసుకున్న ప్రత్యేక చర్యలతో మావోయిస్టులు ప్రభావం కోల్పోయారు. ఒకప్పుడు నక్సలైట్లకు కంచుకోటగా ఉన్న తెలంగాణా పల్లెలు ఇప్పుడు అలాగే లేవు. ఇప్పుడు తెలంగాణా గ్రామీణ ప్రాంతం స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఒకప్పటి జమిందారీ విదానం, దొరల దోపిడీ పీడనలు, భూస్వాముల ఆగడాలు లేవు. కాబట్టి ఇప్పుడు మళ్లీ మావోయిస్టులు తెలంగాణాలో పట్టుసాధిస్తారనడం ఆసమంజసం. (‘నమస్తే తెలంగాణా’’: 20`7`013)!   (ఇదిలా ఉండగా, ఈనెల (జూలై) 2వ తేదీన తెలంగాణా సమస్యపై ‘కాంగ్రెస్‌పైన వత్తిడిని పెంచే పేరిట అయిదు వామపక్షాల (సి.పి.ఎం. మినహా) ఆధ్వర్యంలో ఒక రాష్ట్ర సదస్సు జరుపుతారట. ఈ వామపక్షాలలో ఒకటయిన ‘న్యూఢమోక్రసీ’ (మార్క్సిస్టు... లెనినిస్టు) పార్టీ రాష్ట్ర నాయకుడైన డి.వి.కృష్ణా ఒక ప్రకటన చేస్తూ చెప్పిన మాటలు అందరూ పరిశీలించదగినవిగా ఉన్నాయి. "రాష్ట్ర విభజన జరిగితే నక్సలైట్ల సమస్య పెరుగుతుందనడం, తెలంగాణా ఏర్పడకుండా ఉంటే నక్సలైట్లు నిజంగానే పెరుగుతారనుకోవడం అనే రెండు వాదనలూ సరైనవికావు. తెలంగాణా ఏర్పడినంత మాత్రాన సమసమాజ వ్యవస్థ నెలకొంటుందని భావించలేము. ఇప్పటిమాదిరిగానే అప్పుడు కూడా ప్రజలు అణచివేతలకు దోపిడీకి గురి అవుతూనే ఉంటారు.'' అయినప్పడు (తెలంగాణా రాష్ట్రం ఏర్పడినాగాని సమసమాజ వ్యవస్థ నెలకొన్నప్పుడు తెలుగు జాతి అనుపమానమైన త్యాగాల ద్వారా సాధించుకున్న ఆంధ్రప్రదేశ్‌ను సమసమాజ వ్యవస్థ ఏర్పడకుండానే బలవంతంగా రాజకీయ నిరుద్యోగుల పాక్షిక పదవీ ప్రయోజనాలకోసం బలిపెట్టవలసిన అవసరందేనికొస్తోంది? విభజన కేవలం ‘విభజన’కోసమా? ‘సమసమాజ వ్యవస్థ’ నెలకొనాల్సిన అవసరం ఒక్క తెలంగాణా ప్రాంతానికే పరిమితమా, లేక యావత్తు తెలుగుజాతి కలలపంటైన యావత్తు విశాలాంధ్ర (ఆంధ్రప్రదేశ్‌) ప్రజలకూ, రాష్ట్రానికీ అవసరం లేదా? యావత్తు రాష్ట్రంలోనూ అలాంటి ఉత్తమోత్తమ వ్యవస్థ అవసరాన్ని మనసారా అభిలషించే అభ్యుదయ వాది ఎవడైనా ఒక ప్రాంతం అభ్యుదయాన్ని మాత్రమే కోరుకోవడం సోషలిజం ప్రాధమిక లక్ష్యానికే విరుద్ధం కాదా? సోషలిజం మాట పెరుమాళ్లకెరుక, ఒకనాటి సోషలిస్టు సోవియట్ యూనియన్ రాజ్యాంగరీత్యా విడిపోయే హక్కును దాని సమాఖ్య సభ్యజాతులకు యిచ్చి కూడా సమాఖ్య రూపురేఖలు ఎందుకని చెల్లాచెదరైపోవలసి వచ్చింది?   యూనియన్‌ నుంచి విడిపోయిన రిపబ్లిక్కులకు కొన్ని అమెరికా.... పెట్టుబడి పాలనా వ్యవస్థకు ‘జోహామీం’ అనవలసి వస్తోంది? ఆ మాటకొస్తే యూరప్‌లోని కొన్నిదేశాలో కొన్ని రాష్ట్రాలు (ఒకే జాతీయులు) విడిపోయి మళ్లీ కలుసుకోవడానికి దారితీసిన పరిణామాలేమిటి? సహజవనరులు, నీటి పంపిణీ, వాటి నిర్వహణ తాలూకూ తలెత్తిన సమస్యలూ, తలనొప్పులూ ‘వామపక్షు’లకు తెలియవా? నిన్నగాకమొన్న నైయినదీజలాల పంపిణీ ఈజిప్టు దాని ఇరుగు పొరుగుల మధ్య ఎంతటి తీవ్రతితీవ్రమైన ఘర్షణలకు దారి తీశాయో వామపక్షులకు తెలియదా?! ఈ మధ్యనే విడిపోయిన ఐక్యసూడాన్‌ (ఉత్తర ` దక్షణ సూడాకలుగా) రెండుభాగాలూ మళ్లీ ఎందుకు పునరేకీకరణకోసం తహతహలాడుతూ ‘సంప్రతింపుల అధ్యాయాన్ని తెరవవలసి వచ్చింది? ఒకే సైద్ధాంతిక పునాదిమీద ఏర్పడిన, మార్క్సిను భావజాలకుల మధ్య అనైక్యత కూడా ఒకే జాతిప్రజల మధ్య విభజనకు కృత్రిమ పునాదులు లేపుతోంది! ఇప్పటికైనా ‘వామపక్షులు’ తెలుగు ప్రజల, తెలుగు సమాజం పరిపూర్ణ ప్రయోజనాల దృష్ట్యా పునరాలోచన చేసుకుని, రెండు రకాల పరాయి పాలనలవల్ల చెల్లా చెదరై శతాబ్దాల పాటు పరాయి పంచలలో బతుకులాడిస్తున్న తెలుగువారందరినీ ఒక్క గూడికి చేర్చిన తెలంగాణా సాయూధ పోరాట స్ఫూర్తిని మరొక్కసారి పొంది చరితార్ధులు కాగలరని మనసారా కోరుకుందాం!!