ఆ సంతకాలు నిజమైనవే
posted on Jul 29, 2013 @ 11:05AM
నరేంద్రమోడి వీసా వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది.. గుజరాత్ అల్లర్ల విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న మోడికి అమెరికా వీసా ఇవ్వొదంటూ పలువురు పార్లమెంట్ సభ్యులతో పాటు, రాజ్యసభ సభ్యులు ఒబామకు లేఖరాశారన్న వార్త కొద్ది రోజుల క్రితం సంచలనం సృష్టించింది.
ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చాలా మంది నాయకులు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా సిపిఎం పార్టీకి చెందిన సీతారాం ఏచూరి, సిపిఐ ఎంపి అచ్యులన్, డిఎంకె ఎంపి రామలింగంలు ఆ లేఖలో ఉన్నవి తమ సంతకాలు కాదని. ఫోర్జరీ సంతకాలని ప్రకటించారు.
అయితే ఆ లేఖలను పరీక్షించిన ఫోరెన్సిక్ నిపుణులు అందులోని సంతాకాలు,చేతిరాత అసలైదని అని ప్రకటించడంతో ఇప్పుడు మరోసారి వివాదం మొదలైంది. ఇన్నాళ్లు అవి మా సంతాకాలు కాదంటూ చెపుతూ వచ్చిన ఎంపిలు ఫోరెన్సిక్ నివేదికతో ఖంగుతున్నారు.. అయితే ఈ విషయం పై మోడి స్పందించక పోవడం విశేషం.