విభజనపై పునరాలోచించండి : సియం

  తెలంగాణ ప్రకటన తరువాత రెండోసారి ఢిల్లీ వెల్లిన కిరణ్‌కుమార్‌ రెడ్డి మరోసారి సమైక్యవాదాన్ని బలంగా వినిపించారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయం మీద పునరాలొచించాలని ఆంటోని కమిటీకి స్పష్టం చేశారు. మంగళ వారం రాత్రి ఆంటోని కమిటీని కలిసిన సీమాంద్ర జిల్లాలో జరుగుతున్న ఉద్యమతీవ్రతను కమిటీ ప్రతినిధులకు తెలియజేశారు. 35 రోజులుగా సీమాంద్ర జిల్లాలో లక్షల సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వస్తున్నారని, ఏ పార్టీ ప్రమేయం లేకుండానే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుందని ఆయన కమిటీ సభ్యులకు తెలియజేశారు. ప్రస్థుత పరిస్థితులో ప్రజలు నాయకుల మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరని, ప్రజల్లోకి వెళ్లాలంటే రాజీనామాలు చేయక తప్పని పరిస్థితి ఏర్పాడిందని చెప్పారు. సీమాంద్రలో ఒక్కసీటు కూడ గెలిచే అవకాశం లేదన్న ఆయన ఊరూరా జరుగుతున్న లక్షగళ ఘోష, 175 కిలో మీటర్ల మానవహారం లాంటి అంశాలను కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రవిభజన వల్ల సీమాంద్ర జిల్లాలకు తీరని అన్యాయం జరుగుతుందని అందుకే నిర్ణయంపై కేంద్ర పునరాలోచించాలని కోరారు. ప్రజల మనోభావాలు లెక్కచేయకుండా ముందుకు వెలితే పార్టీ మనుగడే కష్టమవుతుందని కమిటీకి తేల్చిచెప్పారు.

కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్

  కిరణ్ కుమార్ రెడ్డి డిల్లీ నుండి తిరిగి రాగానే తన పదవికి రాజీనామా ఇచ్చి సీమంధ్ర నేతలు పెట్టబోయే కొత్త రాజకీయ పార్టీకి సారద్యం వహిస్తారని మీడియాలో వార్తలు గుప్పుమంటుంటే, తాజాగా మరో ఆసక్తికరమయిన వార్త బయటకి వచ్చింది. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీలో కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణలను సభ్యులుగా నియామకం జరిగిందని సమాచారం. ఇక మరో సంచలన వార్త ఏమిటంటే హైదరాబాదును పద్దేళ్ళపాటు కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకొందని సమాచారం. ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడుతూ తాను అంటోనీ కమిటీని కలిసి భద్రాచలం తెలంగాణకు చెందుతుందని చెప్పానని తెలిపారు. మరో ప్రశ్నకు జవాబిస్తూ హైదరాబాద్ సంగతి తనకు తెలియదని ఆమె చెప్పడం బహుశః ఇదే సూచిస్తోందనుకోవచ్చును. ఈ రోజు డిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంటోనీ కమిటీని కలిసినప్పుడు, అంటోనీ ఇదే విషయం ఆయనకు తెలియజేసి నచ్చచెప్పవచ్చును. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం చేయడం ద్వారా సీమంద్రాలో ఉద్యమాలను అదుపులోకి తీసుకురావచ్చునని బహుశః కాంగ్రెస్ ఆలోచన కావచ్చును. కానీ, అప్పుడు తెలంగాణాలో మళ్ళీ ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధిష్టానం ముందుగా సంబంధిత వర్గాలను నేతలను ఒప్పించకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం

నిర్భయ నిందితుల‌కు ఈ నెల 10న‌ శిక్ష ఖ‌రారు

  ఇటీవ‌ల నిర్భయ కేసులో తొలితీర్పు చెప్పిన కోర్టు ఈ నెల 10న మిగ‌తా నిందితుల‌కు కూడా శిక్షలు ఖ‌రారు చేయ‌నుంది. ఇప్పటికే ఈ కేసులో విచార‌ణ పూర్తిచేసిన సాకేత్‌ కోర్టు న‌లుగురు నిందితులు ముఖేష్‌, ప‌వ‌న్ గుప్తా, విన‌య్ శ‌ర్మ, అక్షయ్ ఠాకూర్‌ల‌కు శిక్షవిదించ‌నుంది. ఇప్పటికే ఈ కేసులో ముద్దాయిగా ఉన్న మైన‌ర్ బాలుడికి జువైన‌ల్ కోర్టు మూడేళ్ల శిక్ష విధించింది. గ‌త డిసెంబ‌ర్ 16 రాత్రి డిల్లీలో క‌దులుతున్న బ‌స్సులో ఆరుగురు నిర్భయ‌పై అత్యాచారానికి పాల్పాడ్డారు. ఈ దాడిలో పాల్గొన్న వార‌లో ఒక‌రిపై జైల్లో దాడి జ‌రిగి మ‌ర‌ణించ‌గా మ‌రోక‌డికి జువైన‌ల్ కోర్టు తాజాగా శిక్ష ఖ‌రారు చేసింది. మిగిలిన నలుగురికి ఈ నెల 10న శిక్ష ఖ‌రారు చేయ‌నున్నారు.

చంద్రబాబు మాట జారుటేల

  చంద్రబాబు తన ‘ఆత్మగౌరవ యాత్ర’ను మొదలుపెట్టినప్పుడు ఆయనకు సమైక్యవాదులు, వైకాపా మద్దతుదారుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయని అందరూ భయపడ్డారు. కానీ, తెలుగు తమ్ముళ్ళ మధ్య సాగుతున్న ఆయన జోలికి వచ్చేసాహసం ఎవరూ చేయకపోవడంతో అందరూ నిటూర్పు విడిచారు. ఆయనను ఎవరూ ఇబ్బంది పెట్టకపోయినా ఆయన మాత్రం చాలా ఘాటయిన పదాలతో కాంగ్రెస్, వైకాపా,తెరాస నేతలను దుయ్యబట్టడం వివాదాస్పదం అవుతోంది.   కాంగ్రెస్ నేతలని ఆయన కుక్కలని, అవి తనను చూసి మొరుగుతాయే తప్ప సోనియాగాంధీ మొరగవని, ఆమెను చూసి తోకూపుతాయని ఎద్దేవా చేసారు. ఇక బెయిలు కోరుతున్న జగన్, ప్యాకేజి కోరుతున్న కేసీఆర్ సోనియా గాంధీ ధరిస్తున్న చెప్పుల వంటి వారని ఆయన విమర్శించారు. తమతో పెట్టుకొంటే వైకాపా తోక కట్ చేస్తానని హెచ్చరించారు. తెలుగువారి జోలికి వస్తే కబడ్దార్, సింహ గర్జన చేస్తానని ఏవేవో మాటలు చెప్పారు. సోనియా గాంధీకి డబ్బు పిచ్చి పట్టిందని ఆయన ఎద్దేవా చేసారు. కాంగ్రెస్ పార్టీకి సమర్ధంగా రాష్ట్ర విభజన చేయడం చేతకాకపోతే,  తనకు అధికారం అప్పగిస్తే తానా పనిని అవలీలగా, ఎంతో సమర్ధంగా, అందదరికీ ఆమోదయోగ్యంగా చేయగలనని చెప్పుకొన్నారు. అంతకంటే ఆ పని ఏవిధంగా చేయవచ్చో కాంగ్రెస్ పార్టీకి చెప్పిపుణ్యం కట్టుకొంటే ప్రజలు కూడా చాలా సంతోషిస్తారు.   తొమ్మిదేళ్ళు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పాలించిన ఆయనే ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే, పార్టీలో మిగిలినవారు కూడా ఆయనను అనుకరించక మానరు. అదేవిధంగా కంటికి కన్ను, పంటికి పన్ను అన్నట్లు  ఆయన ఏస్థాయి భాషనుపయోగిస్తే ఆయన విరోధులు కూడా అదే స్థాయిలో జవాబిస్తారనే సంగతి ఆయన గుర్తుంచుకోవడం మేలు. ప్రత్యర్దులను విమర్శించడానికే అయితే ఆయన పనికట్టుకొని బస్సుయాత్ర చేసి ఇంత శ్రమ పడనవసరం లేదు. ఆ పని తన కార్యాలయం నుండి ఇంత కంటే బాగా, తక్కువ శ్రమతో చక్కబెట్టవచ్చును.ఆయన నిర్మాణాత్మకమయిన సలహాలు ఇస్తే ప్రజలు కూడా హరిస్తారు.  

రాహుల్‌గాంధీకి కోర్టు స‌మ‌న్లు

  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాందీకి పంజాబ్‌లోని స్థానిక కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. గ‌తంలో జ‌రిగిన ఓ బ‌హిరంగ స‌భ‌లో ఉత్తర ప్రదేశ్‌తో పాటు బీహార్‌వాసుల‌ను అవ‌మానక‌రంగా మాట్లాడ‌ర‌న్న కేసులో కోర్టు రాహుల్‌కు స‌మ‌న్లు జారి చేసింది. ఈ నెల 19న కోర్టు ఎదుట స్వయంగా హాజ‌రు కావాల‌ని రాహుల్‌ను కోర్టు ఆదేశించింది. చండీగడ్‌కు చెండిన శివ‌మూర్తి యాద‌వ్ అనే న్యాయ‌మూర్తి దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు రాహుల్‌కు స‌మ‌న్లు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ ఎన్నిక‌ల ప్రచారంలో న‌వంబ‌ర్ 14, 2011లో రాహుల్‌గాందీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశార‌ని శివ‌మూర్తి ఆరోపించారు. గ‌తంలో కూడా ఓ సారి రాహుల్‌కు స‌మ‌న్లు జారీ చేసిన కోర్టు అవి అంద‌క‌పోవ‌టంతో ఇప్పుడు మ‌రోసారి స‌మ‌న్లు జారీ చేసింది కోర్టు.

కాంగ్రెస్ లోకి కూన శ్రీశైలం గౌడ్

      కాంగ్రెస్ పార్టీతో విభేధించి వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అట్టహాసంగా చేరిన కుత్బుల్లాపూర్ స్వతంత్ర ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ సమక్షంలో ఈ రోజు ఢిల్లీలో ఆయన తిరిగి పార్టీలో చేరారు. వైఎస్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న కూన ఎమ్మెల్యేగా గెలవక ముందు కార్పోరేషన్ చైర్మన్ గా కూడా ఉన్నారు. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి రంగారెడ్డి జిల్లా కన్వీనర్ గా కూడా ఉన్నారు. తెలంగాణ విషయంలో జగన్ పార్టీ యూ టర్న్ తీసుకోవడంతో ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

పెంపుడు కుక్కలమే: బొత్స

      టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నేతలని సోనియాగాంధీ పెంపుడు కుక్కలు అని అనడంపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అవును పెంపుడు కుక్కలు పార్టీకి విశ్వాసంగా ఉంటాయి. మమ్మల్ని నమ్ముకున్న పార్టీకి, ప్రజలకు కుక్కల్లా విశ్వాసంగా ఉంటాం. కానీ చంద్రబాబు మాత్రం గుంట నక్క. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన నేత. ఇలాంటి భాష వాడడం ఏమిటని, పద్దతిగా వ్యవహరించాలని చంద్రబాబుకు సలహా ఇచ్చారు.   షర్మిల తాము విభజన చెప్పలేదని అనడాన్ని ఆయన ఖండించి ఎందుకు ప్రజలను మోసం చేస్తారని బొత్స ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రెండు రాజకీయ లబ్దికోసం పాకులాడుతున్నాయి. రాష్ట్ర విభజన మీద నిర్ణయం జరిగిందని, ఇప్పుడు నిరసనలతో లాభం లేదని, సీమాంధ్రలో రవాణా స్థంభించిందని, ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి సహకరించాలని బొత్స కోరారు.

ముఖ్యమంత్రి డిల్లీ యాత్ర నేడే

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్నతనను కలిసిన గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్ రెడ్డి తదితర మంత్రులకు అప్పుడే రాజీనామాలు చేయవద్దని తాను మరో రెండు మూడు రోజుల్లో డిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలని కలిసిన వచ్చిన తరువాత అందరూ సమిష్టి నిర్ణయం తీసుకొందామని చెప్పారు. నిన్న మరో రెండు మూడు రోజులన్నముఖ్యమంత్రి ఈ రోజు సాయంత్రమే డిల్లీ వెళ్లి అంటోనీ కమిటీని కలవనున్నారు. నిన్నఆయన ఆ మాట చెప్పిన కొద్ది సేపటికే డిల్లీలో హోంమంత్రి షిండే మీడియాతో మాట్లాడుతూ మరో ఇరవై రోజుల్లో తన శాఖ తెలంగాణపై నోట్ సిద్దం చేసి మంత్రి మండలికి సమర్పిస్తుందని చెప్పారు. సమైక్యరాష్ట్రం కోసం గట్టిగా వాదిస్తున్నకిరణ్ కుమార్ రెడ్డి, షిండే ప్రకటన నేపద్యంలో మరింత ఆలస్యం చేయడం మంచిది కాదనే ఆలోచనతోనే, అంటోనీ కమిటీ ముందు ఆఖరిసారిగా తన వాదనలు వినిపించేందుకు ఈ రోజే డిల్లీకి బయలుదేరుతున్నారు. కానీ, అధిష్టానం రాష్ట్ర విభజనకు కృత నిశ్చయంతో ఉన్నసంగతి ఆయనకు తెలియకపోలేదు. గనుక బహుశః అదే విషయంపై తాడో పేడో తేల్చుకొనే ఉద్దేశ్యంతోనే డిల్లీ బయలుదేరుతున్నారేమో.   అయితే ప్రస్తుతం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అమెరికాకు వెళ్లి ఉన్నందున ఆయనకానీ, పార్టీ అధిష్టానం గానీ ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకపోవచ్చును. కానీ తెలంగాణా కాంగ్రెస్ నేతలు అయన సమైక్యవాదంతో చాల అసహనం గురవుతూ వెంటనే పదవి నుండి వైదొలగమని కోరుతున్నందున ఆయన కూడా ఇంకా ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చును.   ఒకవేళ ఆయన అధిష్టానానికి విధేయత చూపుతూ తన రాజీనామాను పార్టీకే సమర్పిస్తే ఆయన స్థానంలో మరొకరిని నియమించి విభజన ప్రక్రియను కొనసాగించవచ్చును. అలా కాకుండా ఆయన నేరుగా గవర్నర్ కి రాజీనామా పత్రం సమర్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం రద్దయిపోతుంది. సీమంధ్ర నేతలు పెట్టబోయే కొత్త రాజకీయ పార్టీకి ఆయన నాయకత్వం వహిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపద్యంలో కాంగ్రెస్ అధిష్టానం పరిస్థితి చేయి దాటపోనీయకుండా కొంత వెనక్కు తగ్గి ఆయన సూచనలలో కొన్నిటికయినా తల ఒగ్గినా ఆశ్చర్యం లేదు.   సీమంధ్ర నేతలు హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతం చేయమని కోరినప్పుడు ఇనతవరకు ససేమిరా అంటున్న దిగ్విజయ్ సింగ్, నిన్నకొద్దిగా మెత్తబడి ఆ విషయం అంటోనీ కమిటీ చూసుకొంటుందని చెప్పడం గమనిస్తే, కిరణ్ కుమార్ రెడ్డి కూడా మరికొన్ని హామీలు రాబట్టుకొనే అవకాశం ఉందనుకోవచ్చును. ఒకవేళ ఆయన పార్టీకి పదవికి రాజీనామా చేస్తే రాష్ట్ర రాజకీయాలలో మరో కొత్త అధ్యాయం మొదలవుతుంది.

హైదరాబాద్ యుటిపై దిగ్విజయ్ సింగ్

      రాష్ట్ర విభజనకు సంబంధించిన అన్ని అంశాలను ఆంటోని కమిటీ చూస్తోందని కాంగ్రెసు పార్టీ ఎపి ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేసే విషయం తనకు తెలియదని చెప్పారు. విభజనకు అన్ని పార్టీలు ఒప్పుకున్నాయని, అలాంటప్పుడు మళ్లీ వ్యతిరేకత ఎక్కడిదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అంతకుముందు డిగ్గీని కలిశారు. ఆయనతో అరగంట పాటు భేటీ అయ్యారు. కాగా ఇంతకుముందు హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అవుతుందా అంటే దిగ్విజయ్ సింగ్ ఖండించేవారు. ఈసారి ఖండించకపోవడం విశేషం.

జీతాల్లేకుండా ఎలా బతుకుతారు?: హరికృష్ణ

      రాష్ట్ర విభనను నిరసిస్తూ సీమాంధ్రలో గత 20 రోజులుగా సమైక్యాంధ్రకు మద్దతుగా సమ్మె చేస్తున్న ఉద్యోగులు అందరికీ వెంటనే జీతాలు చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుని బతికే సాధారణ ఉద్యోగులు నెల జీతాలు లేకుండా ఎలా బతుకుతారని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ ప్రశ్నించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా తన రాజ్యసభ సభ్యత్వానికి హరికృష్ణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.   ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వీలయినంత తొందరలో ఉద్యోగులకు జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సమ్మె చేస్తున్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వ తీరును ఆయన ఖండించారు. ఈ నెల 7న ఉద్యోగులు హైదరాబాద్ లో తలపెట్టిన బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తెదేపా బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకొంటుందా

  క్రిందటి నెల గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ సభలో ప్రసంగిస్తూ తెదేపా వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుని పొగడ్తలతో ముంచెత్తి, రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలనే ఆయన ఆశయాన్ని తెదేపా కూడా అమలుచేస్తే బాగుంటుందని అన్నారు. తాము దేశం నుండి కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని చేస్తున్న ప్రయత్నంలో తెదేపా కూడా కలిస్తే బాగుంటుందని ఆయన పరోక్షంగా సూచించారు.   తెలంగాణా అంశాన్నినమ్ముకొన్న బీజేపీకి, రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ పెద్ద షాక్ ఇవ్వడమే కాకుండా తెరాసను విలీనం చేసుకొని తమపార్టీకి తెలంగాణాలో చోటులేకుండా చేయడంతో మోడీ ఈ ప్రతిపాదన చేసారనుకోవచ్చును. తద్వారా ఆంధ్ర, తెలంగాణా రెండు ప్రాంతాలలో పటిష్టమయిన క్యాడర్స్ ఉన్నతెదేపాతో చేతులు కలిపితే రెండు రాష్ట్రాలలో బలపడవచ్చునని ఆయన ఆలోచన.   అంతే గాక, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను అతని జేడీ(యు)ను వదులుకొన్నందున ఆ లోటును తెదేపాతో భర్తీ చేసుకోవచ్చుననే ఆలోచన కూడా ఉంది. ఒకవేళ బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరచగలిగే పరిస్థితి ఏర్పడితే, బీజేపీకి తెదేపా, అన్నాడీయంకే వంటి కొత్త స్నేహితుల మద్దతు చాలా అవసరం ఉంటుందనే ఆలోచనతోనే మోడీ ఈ ప్రతిపాదన చేసి ఉండవచ్చును.   అయితే, మోడీ చేసిన ఈ ప్రతిపాదనకు తెదేపా వెంటనే ఎగిరి గంతేసి తలూపకుండా అలాగని ఖండించకుండా మౌనంగా ఉండి, ఆ ప్రతిపాదన తమ పరిశీలనలో ఉన్నట్లు మోడీకి సంకేతం పంపింది. ఇప్పుడు ఆత్మగౌరవ యాత్రలో చంద్రబాబు నాయుడు చెబుతున్నట్లు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో వైకాపా, తెరాసలు కలిసిపోయినా లేక ఎన్నికల పొత్తులు పెట్టుకొన్నా, వారినెదుర్కోవడం తేదేపాకు శక్తికి మించిన పని అవుతుంది. అటువంటి పరిస్థితే గనుక ఏర్పడితే తెదేపా బీజేపీతో పొత్తుపెట్టుకోవడం అనివార్యం అవుతుంది.   బహుశః దీనిని దృష్టిలో ఉంచుకొనే చంద్రబాబు ఇటీవల ఒక ప్రముఖ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యులో మోడీ ప్రతిపాదనపై స్పందిస్తూ “ప్రస్తుతం రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇటువంటప్పుడు ఎన్నికల పొత్తుల గురించి మాట్లాడటం సబబుకాదు,” అని చెప్పడం గమనిస్తే బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవడాన్ని ఆయన వ్యతిరేఖించడం లేదని అర్ధం అవుతోంది.   తెలంగాణాలో బలంగా ఉన్న బీజేపీ వల్ల తేదేపాకు లాభం చేకూరితే, ఆంధ్ర, తెలంగాణా రెండు ప్రాంతాలలో బలంగా ఉన్నతెదేపా వల్ల బీజేపీకి కూడా అంతే లాభం ఉంటుంది. కాంగ్రెస్, వైకాపా, తెరాసలు చేతులు కలిపితే అప్పుడు తెదేపా, బీజేపీలు కూడా చేతులు కలిపే అవకాశం ఉంది.

సామాన్యుడిపై బండ

  ధరలు పెంచుకునే అధికారం చమురు కంపెనీలకు అప్పగించిన కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి జీవితంతో ఆడుకుంటుంది. నెలకు రెండు మూడు సార్లు పెట్రోల్‌ డిజిల్‌ రేట్లు పెంచుతూ సామాన్యుడి నడ్డివిరిచిన చమురు కంపెనీలు ఇప్పుడు మరో బండనేశాయి. ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలతో బతకటమే కష్టం అనుకుంటున్న ప్రజలపై ఇప్పుడు మరోభారం మోపారు.. ఒకేసారి ఏకంగా 62 రూపాయలు గ్యాస్‌ ధన పెంచారు. దీంతో సబ్సిడీ లేని గ్యాస్‌ సిలిండర్‌ ధర 1025రూపాయలకు చేరింది. దీంతో పాటు నగదు బదిలీ పదకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తున్న సొమ్ముతో కలిపి ఇక పై ప్రతి సిలిండర్‌పై 116 రూపాయలు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. సబ్సిడీ ఇవ్వాల్సిన ప్రభుత్వాలు అవి ఇవ్వక పోగా పన్నుల పేరుతో మరింత భారమోపడాన్ని సామన్య ప్రజలు తప్పుపడుతున్నారు.

అదుపుతప్పితే రాష్ట్రపతి పాలనే

  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తున్న నేపధ్యంలో రాజకీయ అంశాపై సమ్మెచేసే హక్కు ఉద్యోగులకు లేదని లాయర్‌ రవికుమార్‌ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. సమైక్యాంద్ర కోరుతూ జరుగుతున్న ఆందోళనల వల్ల పరిస్థితులు చేయి దాటితే రాష్ట్ర్రంలో రాష్ట్రపతిపాలన విధిస్తామంటూ కేంద్రం హైకోర్టుకు నివేదించింది. రాష్ట్ర విభజనపై తాము ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ పొన్నం అశోక్‌ గౌడ్‌ పరిస్థితులు చేయి దాటే పరిస్థితి ఏర్పడితే మాత్రం తీవ్ర చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్థుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం నిశితంగా పరిశీలిస్తుందన్నారు. అయితే ఉద్యోగుల సమ్మె వ్యవహారం రాష్ట్రనికి సంభందించినదన్న అశోక్‌ గౌడ్‌, శాంతి భద్రత సమస్య ఏర్పడితేనే కేంద్రం జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పాటు ఏపిఎన్జీవోల తరుపు న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు.

సచివాలయంలో సమ్మెషురూ

  రాష్ట్రన్ని సమైక్యగాం ఉంచాలని కోరుతూ 34 రోజులుగా భోజన విరామ సమయంలో వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతూ వచ్చిన సీమాంద్ర సచివాలయ ఉద్యోగులు సోమవారం అర్ధరాత్రి నుంచి నిరవదిక సమ్మెకు దిగారు. ఉద్యోగుల హక్కులు, ప్రయోజనాలతో పాటు, హైదరాబాద్‌లో వారి రక్షణకు ప్రభుత్వం  భరోసా కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రాజ్యంగ బద్దంగా ఉద్యోగాలకు ఎంపికైన తమకు సమ్మె చేసే హక్కును కూడా అదే రాజ్యంగం కల్పించిందన్నారు. తెలంగాణ ప్రాంతానికిగాని అక్కడి ఉద్యోగులకు కాని తాము వ్యతిరేకం కాదని, కేవలం రాష్ట్ర విభజన జరిగితే తాము అన్యాయమవుతామనే సమ్మెకు దిగుతున్నామని స్పష్టం చేశారు. యుపిఏ ప్రభుత్వం తెలంగాణ ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని అలా తీసుకువరకు సమ్మె కొనసాగిస్తామన్నారు. 33 రోజులుగా శాంతియుతంగా నిరసనలు చేసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో సమ్మెబాట పట్టామన్నారు.

కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్‌

  సీమాంద్రలో నిరసన సెగలు ఎగసి పడుతున్నా కేంద్ర మాత్రం రాష్ట్ర ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. ఈ నేపధ్యంలోనే వీలైనంత త్వరగా కేబినెట్‌ నోట్‌ రేడీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ నోట్‌ తయారు చేయటంలో హైదరాబాద్‌ అంశమే కీలకంగా మారనుంది. అయితే ఇప్పటి వరకు హైదరాబాద్‌ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా చేయాలన్న ఆలోచన ఉన్న కేంద్రానికి, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయటం కరెక్ట్‌ అన్న వాదన హోం శాఖ వినిపించే అవకాశాలున్నాయంటున్నారు. ఈ మేరకు జాతీయ మీడియా ఇప్పటికే వార్త కథనాలను కూడా ప్రసారం చేసింది. ఇన్నాళ్లు హైదరాబాద్‌ను తెలంగాణకు రాజధానిగా కొనసాగించాలని భావించినా ప్రస్థుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితులతో కేంద్రం పునరాలోచనలో పడిందంటున్నారు. దీంతో పాటు ఆంద్ర ప్రాంతానికి విజయవాడ, లేదా విశాఖపట్నంలలో ఒకదానిని రాజధానిగా ప్రతిపాదించనున్నారు.

విభ‌జ‌న జరుగుతుంద‌ని ఎలా న‌మ్ముతున్నారు

  స‌మ్మెలో ఉన్న ఏపిఎన్జీవోల‌పై నో వ‌ర్క్ నో పే అస్త్రాన్ని ప్రయోగించిన ప్రభుత్వంపై జెఏసి నాయ‌కులు కోర్టును ఆశ్రయించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర పరిస్థితుల‌పై కోర్టు కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలోని ప‌రిస్థితులు ప్రభుత్వం నియంత్రించ‌లేని ప‌క్షంలో కోర్టు స్వయంగా జోక్యం చేసుకుంటుంది అని వ్యాఖ్యానించింది. ఈ కేసు త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 16కు వాయిదా వేసింది హై కోర్టు.జీఓ 177 ప్రకారం ప్రభుత్వం ఎన్జీవోల‌పై నో వ‌ర్క్ నో పే అమ‌లు చేస్తున్నామ‌ని కోర్టుకు వివ‌రించింది. అయితే ఈ స‌మ‌స్యలో ఉద్యోగ సంఘాల‌ను ఉద్దేశించి కూడా కోర్టు కొన్నికీల‌క వ్యాఖ్యలు చేసింది, రాష్ట్ర విభ‌జ‌న జ‌రుగుతుంద‌ని కేంద్ర ప్రభుత్వం అధికారిక నోట్ ఇవ్వలేద‌ని అప్పుడే విభ‌జ‌న జ‌రుగుతుంద‌ని ఎలా భావిస్తున్నారు అని ప్రశ్నించింది. అలాగే విభ‌జ‌న త‌రువాత ఉద్యోగుల‌కు ఇబ్బందులు క‌లుగుతాయ‌ని ఎలా అనుకుంటున్నార‌ని ప్రశ్నించింది. ఇలా ఊహాజనిత విష‌యాల‌తో స‌మ్మే చేయ‌టం త‌గ‌ద‌న్న కోర్టు త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 16 కు వాయిదా వేసింది.

సమన్యాయం నుండి సమైక్యం దాకా

  సమన్యాయం కోరుతూ అందరికంటే ముందుగా రాజీనామాలు చేసిన వైకాపా తొలుత రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నామని దైర్యంగా చెప్పేందుకు సంకోచించినప్పటికీ, గత నెలరోజులుగా సాగుతున్న సమైక్య ఉద్యమ తీవ్రతను చూసి, ఇక సమైక్యవాదానికి డోకా లేదని పూర్తిగా నమ్మకం కలిగిన తరువాత నేడు షర్మిల ‘సమైక్య శంఖారవం’తో వైకాపా పూర్తి సమైక్యవాద పార్టీగా మార్పు చెందింది. తమ రాజీనామాలతో ప్రజలను, పార్టీలను సమైక్య దిశగా కదిలేలా చేసిన వైకాపా, ఇప్పుడు ఆ ప్రజల అభీష్టం మేరకే సమైక్య పోరాటం కొనసాగిస్తున్నట్లు చెప్పుకొంటోంది.   తెలంగాణాలో ఎటూ తనకిక పనిలేదు కనుక, అక్కడ పార్టీని బ్రతికించుకోవాలని తిప్పలు పడుతున్న తెదేపాను, సరిగ్గా ఆ బలహీనతమీదనే సమైక్య దెబ్బతీయాలని వైకాపా ప్రయత్నిస్తోంది. ఇంత కాలం యావత్ తెలుగు ప్రజల గురించి పోరాడుతున్నట్లు చెప్పుకొన్న వైకాపా, ఇప్పుడు కేవలం సీమంధ్ర ప్రజల సంక్షేమం, హైదరాబాదులో నివసిస్తున్నవారి భద్రత గురించి మాత్రమే మాట్లాడుతోంది.   ఇంతవరకు విస్వసనీయతకు పేటెంట్ హక్కులు తమవేనని వాదించిన వైకాపా, తెలంగాణాలో తన నేతలకు, అక్కడి ప్రజలకు హ్యండిచ్చి బయటపడిన తరువాత ఇప్పుడు విశ్వసనీయతను వదిలిపెట్టి, సమైక్యంపై పూర్తి పేటెంట్ హక్కులు కోసం చాల కృషి చేస్తోంది. ఈ శ్రమంతా అంతిమంగా ఓట్ల రూపంలో మార్చుకోవడానికేనని అందరికీ తెలుసు.   ఈ రోజు హోంమంత్రి షిండే ‘ఇరవై రోజుల్లో తెలంగాణా నోట్’ సిద్డంచేయబోతున్నట్లు చెప్పిన తరువాత, ఇక రాష్ట్ర విభజన అనివార్యమని అర్ధం అవుతోంది. అటువంటప్పుడు వైకాపా ఇంకా సమైక్యం గురించి మాట్లాడటం కంటే ‘సమన్యాయం’ గురించి మాట్లాడటం సబబుగా ఉంటుంది. సమైక్యం ద్వారా సీమంధ్రపై పేటెంట్ హక్కులు పొందాలని తపిస్తున్నవైకాపా, విభజన అనివార్యం గనుక, ఇప్పుడు సీమంధ్రకు ఏవిధంగా న్యాయం జరగాలని కోరుకొంటోందో నిర్దిష్టంగా వివరిస్తే బాగుంటుంది.   తెలంగాణాలో పార్టీని బ్రతికించుకోవాలని తిప్పలుపడుతున్న తెదేపా ఆవిధంగా చెప్పే సాహసం ఎలాగూ చేయలేదు గనుక, ఆ అవకాశం ఉన్న వైకాపా నిర్దిష్టంగా సీమంధ్ర కోసం ఆశిస్తున్నప్రయోజనాల గురించి దైర్యంగా ప్రకటించగలిగితే, సీమంధ్ర ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించిన కారణంగా ఆ పార్టీ లాభపడవచ్చును. అలా కాకుండా నీటి సమస్యలు, ఉద్యోగాలు, ఆదాయం, రాజధానిలో భద్రత అంటూ గాలిలో గీతలు గీస్తూపోతే, విభజన వల్ల వచ్చే సమస్యలపట్ల ఆ పార్టీకి పూర్తి అవగాహన లేకుండా మాట్లాడుతున్నట్లు అవుతుంది.

20 రోజుల్లో తెలంగాణపై నోట్‌

  విభ‌జ‌న‌పై సీమాంద్ర భ‌గ్గుమంటున్నా కేంద్ర మాత్రం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు దిశ‌గా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా సిడ‌బ్ల్యూసి తీర్మానాన్ని కేంద్ర మంత్రి వ‌ర్గం ముందుకు ఉంచ‌నుంది. ఈ నేప‌ధ్యంలో 20 రోజుల్లో తెలంగాణ తీర్మానాన్ని కేంద్ర కేబినేట్ ముంద‌కు తీసుకువ‌స్తామ‌న్నారు కేంద్ర హొంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విష‌య‌మై కేంద్ర హొం శాఖ ఇప్పటికే నోట్ రూప‌క‌ల్పన‌పై క‌స‌ర‌త్తు ప్రారంభించిందని, అయితే ఈ నోట్ త‌యారు చేయ‌టానికి ఎలాంటి తుది గ‌డువు లేద‌ని స్పష్టం చేశారు. అదే స‌మ‌యంలో 20 రోజుల్లోనే ఈ నోట్‌ను సిద్దం చేసి కేబినెట్ ముందుంచుతాం అన్నారు షిండే. ఈ నోట్‌లో విభ‌జ‌న త‌రువాత త‌లెత్తబోయే అన్ని అంశాల‌ను చ‌ర్చించ‌నున్నామ‌న్న ఆయ‌న నోట్‌లో చ‌ర్చించే విష‌యాల‌ను అత్యంత గోప్యంగా ఉంచుతామ‌న్నారు.