రాహుల్ కోరితే యుపిఏకి మద్దతిస్తా: కేసీఆర్

      టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నాలుక మళ్ళీ మరో మలుపు తిరిగింది. నిన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీని, పొన్నాల లక్ష్మయ్యని, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని పేరు పేరునా తిట్టిన కేసీఆర్ ఇప్పుడు ఎన్నికల ప్రచార సమయం ముగిసిపోయి, పోలింగ్ మాత్రమే బ్యాలన్స్ వున్న సమయంలో ట్విస్ట్ ఇచ్చాడు. ఒక జాతీయ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కేసీఆర్ ఒక సంచలన ప్రకటన చేశాడు. ఈ ఎన్నికల తర్వాత మోడీ నాయకత్వంలోని ఎన్డీయేకి తాను మద్దతు ఇవ్వనని చెప్పాడు. ఇది సంచలన ప్రకటన కాదు.. మోడీ ప్రస్తావన అయిపోయిన తర్వాత అసలు సంచలన ప్రకటన కేసీఆర్ నోటి నుంచి వచ్చింది. రాహుల్ గాంధీ తనని కోరిన పక్షంలో యు.పి.ఎ.కి తాను మద్దతు ఇస్తానని ప్రకటించారు. దీంతోపాటు తెలంగాణ రావడానికి సోనియాగాంధీనే కారణమని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ చేరువ కావడానికి కేసీఆర్ ఈ మాటలు మాట్లాడి వుండొచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఈసారి కేసీఆర్ మాటలు నమ్మడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని అంటున్నారు.

టీఆర్ఎస్‌కి వీఆర్ఎస్సే: గజ్వేల్‌లో చంద్రబాబు గర్జన

      టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విషయంలో ఇంతకాలం సంయమనం పాటించిన చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఎన్నికల ప్రచార వేళ ముగుస్తున్న సమయంలో కేసీఆర్‌కి వ్యతిరేకంగా గర్జించారు. ఆ గర్జన కూడా అక్కడో ఎక్కడో కాకుండా, కేసీఆర్ అసెంబ్లీకి పోటీ చేస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే గర్జించారు. ఆ గర్జనలివిగో... తెలంగాణలో దొరలరాజ్యం పోవాలి. కేసీఆర్ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే పిచ్చాస్పత్రికి పంపిస్తా. గజ్వేల్ నీ జాగీర్ అనుకుంటున్నావా కేసీఆర్? గజ్వేల్ టీడీపీ అభ్యర్థి ప్రతాప్ రెడ్డి ఊదితే గోదావరిలో పడతావ్. కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో అవినీతి పంట పండిస్తున్నాడు. తెలంగాణకి ద్రోహం చేస్తున్న ప్రధాన వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ అంతు చూస్తా. మోడీనీ, నన్ను తిడతావా.. ఖబడ్డార్.  

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు విడుదల

      ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఇంటర్‌బోర్డు కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఫలితాను విడుదల చేశారు. గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ ఫలితాల రిజల్ట్స్ విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్య 8.68 లక్షల మంది. వీరిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య 4.55 లక్షలు. మొత్తం పరీక్షలు రాసిన విద్యార్థులలో 55.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీళ్ళలో బాలుర శాతం 51.37. బాలికల ఉత్తీర్ణత శాతం 60.52. మొదటి సంవత్సరం ఒకేషనల్ కోర్స్ లో 42.98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణతా శాతం 1.24 శాతం పెరిగింది. 74 శాతం ఉత్తీర్ణతతో కృష్ణాజిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. మే 6 లోపు విద్యార్థులు రీ కౌంటింగ్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు.   To know results from the websites: * http://examresults.ap.nic.in * http://results.cgg.gov.in * www.apit.ap.gov.in * www.results.educationandhra.com * www.resumedropbox.com, * www.indiaresults.com * www.vidyavision.com * www.ExamResults.net * www. nettlinxresults.net * www.manabadi.com * www.manabadi.co.in * www.results.manabadi.co.in * www.schools9.com * www.exametc.com * http://results.webdunia.com * www.bharatstudent.com * www.kabconsultants.com * www.educationgateway.com * www.AndhraEducation.net * www.results.andhraeducation.net * www.educationandhra.com * www.betechs.com * www.koshercomm.in * www.resultsindia.in * www.educationplus.co * www.PsddOrFail.in * www.asmalldream.org * www.manachaduvu.com * www.vidyavision.co.in * www.vnssolutions.in * www.iitjeeforum.com

కేసీఆర్, పొన్నాలకు విద్యార్థుల షాక్‌!

  తెలంగాణ ఉద్యమం పేరుతో హడావిడి చేస్తున్న రాజకీయ నాయకులకు కరెక్ట్ మొగుళ్ళు ఎవరయ్యా అంటే.. ఇంకెవరూ.. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. వాళ్ళ మధ్యలోకి వెళ్తే ఎంత పుడింగి లాంటి రాజకీయ నాయకుడైనా భంగపడాల్సిందే. ఇలా గతంలో అనేకమంది నాయకులు భంగపడ్డారు. పేర్లెందుకు గానీ, కొంతమంది నాయకులైతే పాపం ఉస్మానియా విద్యార్థుల చేతుల్లో తన్నులు కూడా తిన్నారు. అప్పుడెప్పుడో కేసీఆర్ ఉత్తుత్తి నిరాహారదీక్ష చేసి పళ్ళరసం తాగి విరమించగానే ఉస్మానియా విద్యార్థులు రంగంలోకి దిగారు. దాంతో భయపడిపోయిన కేసీఆర్‌ చచ్చినట్టు ఫ్లూయిడ్స్ ఎక్కించుకుని మరీ వెరైటీ నిరాహారదీక్ష చేశాడు. అలాంటి ఉస్మానియా విద్యార్థులు కేసీఆర్‌కి మరోసారి షాక్ ఇచ్చారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిసరాల్లో ప్రచారం చేయడానికి హెలికాప్టర్లో వెళ్ళాడు. హెలికాప్టర్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో దిగగానే విద్యార్థులు కేసీఆర్‌కి చెప్పులు చూపిస్తూ ‘గో బ్యాక్’ అని అరిచారు. తెలంగాణ విద్యార్థులకు నష్టం కలిగేలా వ్యవహరిస్తున్న కేసీఆర్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో బెదిరిపోయిన కేసీఆర్ అక్కడి నుంచి హెలికాప్టర్ ఎక్కి తుర్రుమని పారిపోయే వరకూ విద్యార్థులు వెనకడుగు వేయలేదు. అలాగే టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకి కూడా ఒక తెలంగాణ విద్యార్థి షాకిచ్చాడు. సొంత నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న పొన్నాల మీద ఒక విద్యార్థి చెప్పు విసరడానికి ప్రయత్నించాడు. అది గమనించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆ విద్యార్థిని పట్టుకుని చావబాదారు. తనకు చెప్పుతో స్వాగతం లభించడంతో బిత్తరపోయిన పొన్నాల అక్కడ ప్రచారం చేయకుండానే వెళ్ళిపోయాడు. మొత్తమ్మీద ఏంటంటే, కేసీఆర్, పొన్నాల.. వీళ్ళిద్దరూ ఒకరికొకరు భయపడరు. కానీ ఇద్దరూ స్టూడెంట్స్ అంటే భయపడతారు.

రామ్‌దేవ్ మీద ఇ.సి. నిషేధం: కేసీఆర్ తిట్లపై వుండదా?

      ఎన్నికల కమిషన్ కూడా చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ వుంటుంది. కొంతమంది మీద చిన్న చిన్న పాయింట్లను కూడా పట్టించుకుని కొరడా ఝుళిపిస్తుంది. మరికొంతమంది ఏం చేసినా అసలు ఎంతమాత్రం పట్టించుకోకుండా ఊరుకుంటుంది. ఈమధ్య కాలంలో ఇద్దరు ముగ్గురు బీజేపీ నాయకులు, నిన్నగాక మొన్న రామ్ దేవ్ బాబా కాస్తంత నోరు జారి మాట్లాడినందుకు వాళ్ళు ఎక్కడా, ఏ ఎన్నికల మీటింగ్‌లో మాట్లాడకూడదని నిషేధం విధించింది. నరేంద్రమోడీ, రాహుల్ గాంధీలకు కూడా ఎక్కువగా మట్లాడొద్దని వార్నింగ్స్ ఇచ్చింది. అయితే కేసీఆర్ ఎవర్ని ఎన్ని రకాలుగా తిట్టినా, ప్రాంతీయ విభేదాలు పెరిగేలా ఎంత మాట్లాడినా, ఇతర పార్టీలవాళ్ళని సన్నాసులు, దద్దమ్మలు అన్నా, పవన్ కళ్యాణ్‌ని ‘వాడు’ అన్నా ఎన్నికల సంఘానికి వినిపించలేదు. కేసీఆర్ ఎన్నో రకాలుగా అదృష్టవంతుడని నిరూపణ అయింది. ఇప్పుడు ఎన్నికల సంఘం వైపు నుంచి కూడా ఆయనకి అదృష్టం కలిసొస్తుందని అనుకోవాలా?

కావూరి బీజేపీలో చేరడం ఖాయం: మే 1న పార్టీ తీర్థం

      పాపం కావూరికి ఎట్టకేలకి బీజేపీలో ఎంట్రీ దొరుకుతోంది. చేయాల్సిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేయకుండా ఆ తర్వాత ఎప్పుడో తన ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన తర్వాత కావూరి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. వెంటనే బీజేపీలో చేరిపోయి ఎన్నికలలో పోటీ చేయాలని అనుకున్నప్పటికీ బీజేపీ నుంచి ఆయనకి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇప్పుడ మా పార్టీలో చేరితో తమరికి ఎంపీ టిక్కెట్ ఇవ్వాలి. అలా ఇస్తే తమరి పుణ్యమా అని సీమాంధ్రలో మా పార్టీ గల్లంతయిపోయే ప్రమాదం వుంది. అంచేత మీకు ఇప్పుడే పార్టీ తీర్థం ఇవ్వబోమని బీజేపీ నాయకత్వం క్లియర్‌గా చెప్పేసింది. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ అప్లికేషన్ పరిశీలిస్తామని చెప్పింది. ఆ ప్రకారంగా కావూరి బీజేపీలో చేరడానికి బీజేపీ ఇపుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీజేపీ ఓకే అనడంతో బతుకుజీవుడా అనుకున్న కావూరి బీజేపీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మే 1న పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే ఎన్డీయే మిత్రపక్షాల సభలో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమక్షంలో బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఇప్పుడు కృష్ణ, మహేష్ అభిమానుల వంతు

      చిరంజీవి కాంగ్రెస్ పార్టీకే ఓటేయమని తన అభిమానులను కోరుతుంటే, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ‘కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్’ అంటూ బీజేపీకే ఓటేయమని కోరుతూ గట్టిగా ప్రచారం చేస్తుండటంతో మెగా అభిమానులకు ఎవరి మాట వినాలో తెలియని ఒక అయోమయ పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మహేష్ బాబు అభిమానులకు కూడా అటువంటి పరిస్థితే ఎదురయింది. కొద్ది రోజుల క్రితం మహేష్ బాబు తన బావగారయిన (తెదేపా గుంటూర్ లోక్ సభ అభ్యర్ధి) గల్లా జయదేవ్ కే తాను మద్దతు ఇస్తున్నానని, తన అభిమానులు కూడా ఆయనకే మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాని ట్వీటర్ మేసేజ్ పెట్టారు.   నేడో రేపో మహేష్ బాబు స్వయంగా బావగారు జయదేవ్ కోసం గుంటూరులో ప్రచారం చేసే అవకాశాలున్నాయి. ఇటువంటి సమయంలో సూపర్ స్టార్ కృష్ణ మరియు మహేష్ బాబు అభిమానుల సంఘాల గౌరవాధ్యక్షుడు మరియు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు మీడియాతో మాట్లాడుతూ తమ అభిమాన సంఘాలన్నీ వైకాపాకే మద్దతు ఇవ్వాలని నిశ్చయించుకొన్నాయని ప్రకటించారు. అంతే కాక అవసరమయితే తన సోదరుడు సూపర్ స్టార్ కృష్ణ కూడా వైకాపా తరపున ఎన్నికల ప్రచారం చేస్తారని విస్పష్టంగా ప్రకటించారు. అందుకు బలమయిన కారణమే ఉంది. ఆయన తెదేపా టికెట్ ఆశించి భంగపడిన తరువాత వైకాపాలో చేరి టికెట్ సాధించి తెనాలి నుండి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. కనుక అభిమానులు వైకాపాకే మద్దతు ఈయలని కోరుతున్నారు. మహేష్ బాబు తేదేపాకు మద్దతు ఇవ్వమని కోరుతుంటే, ఆయన వైకాపాకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం, కృష్ణ కూడా వైకాపా తరపున ప్రచారంలో పాల్గొంటారని ప్రకటించడంతో, ఇప్పుడు మహేష్ బాబు అభిమానులు కూడా మెగా డైలెమాలో పడ్డారు. గల్లా జయదేవ్ గుంటూరు నుండి లోక్ సభకు పోటీ చేస్తున్నందున, ఆయనకు మద్దతు ప్రకటించిన మహేష్ బాబు, నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే, తప్పనిసరిగా ఆ లోక్ సభ నియోజక వర్గం పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నుండి పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్ధులకు ప్రచారం చేయవలసి ఉంటుంది. అటువంటప్పుడు ఆయన తండ్రి కృష్ణ వైకాపా తరపున ప్రచారం చేస్తారా? చేస్తే అప్పుడు తాము ఎవరిని అనుసరించాలి? అనే సందిగ్దత అభిమానులలో నెలకొంది.            

తెలంగాణలో ఎన్నికల సందడి సమాప్తం!

      రాష్ట్రంలో తొలి విడత ఎన్నికలు జరగనున్న తెలంగాణ ప్రాంతంలో సోమవారం సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగియనుంది. 30వ తేదీన ఇక్కడ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సోమవారం సాయంత్రం 6 గంటల తర్వాత ఓటర్ల ఇళ్లకు వెళ్లి పలుకరించడం.. ర్యాలీలు..రోడ్‌షోలు.. ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు అన్నిటినీ నిలిపివేయాలని ఎన్నికల సంఘం అన్ని రాజకీయపార్టీలను ఆదేశించింది. ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాయి. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ జూన్2న ఆవిర్భవించనున్న తరుణంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు ఈసారి ప్రత్యేకంగా దృష్టిసారించాయి. కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఎన్నికల ప్రచారానికి అతిరథ మహారథులను రంగంలోకి దించాయి. మొత్తంమీద మూడు వారాల ప్రచార సంరంభానికి తెరపడనుంది.

నేడు ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు

      ఇంటర్ మొదటి సంవత్సరం ఫరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు సోమవారం ప్రకటించనుంది. గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ అహ్మద్ నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాల సీడీని విడుదల చేస్తారు. ఈ పరీక్షా ఫలితాలను http://examresults.ap.nic.in, www.manabadi.com, www.vidyavision.com, www.apit.ap.gov.in, www.exametc.com తదితర వెబసైట్ల ద్వారా తెలుసుకోవచ్చని ఇంటర్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ ద్వారా 1100కు, ఇతర ల్యాండ్ లైన్, మొబైల్ ద్వారా 1800-425-1110 నంబర్లకు డయల్ చేయడం ద్వారా మీ సేవ కేంద్రాల నుంచి ఫలితాలను తెలుసుకోవచ్చని ఆ ప్రకటనలో తెలిపారు. ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల నుంచి ఫలితాలను పొందవచ్చని, 58888 నెంబర్ డయల్ చేయడం ద్వారా ఇంటరాక్టివ్ వాయిస్ ద్వారా ఫలితాలను పొందవచ్చని తెలిపారు. ఎస్ఎంఎస్ ద్వారా ఫలితాలను తెలుసుకోవాలంటే బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు inter అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రోల్ నంబర్ టైప్ చేసి 533346కు ఎస్ఎంఎస్ చేయాలన్నారు. మిగతా నెట్‌వర్క్ నుంచి IPE1 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి హాల్‌టిక్కెట్ నంబర్‌ను టైప్ చేసి 54242కు ఎస్ఎంఎస్ చేయడం ద్వారా ఫలితాలను పొందవచ్చని ఇంటర్ బోర్డు ఆ ప్రకటనలో తెలిపింది.  

నారా రోహిత్ ‘ప్రతినిధి’ మీద కన్నేసిన జగన్ పార్టీ

  నారా రోహిత్ హీరోగా నటించిన ‘ప్రతినిధి’ సినిమా ఈమధ్యే విడుదలై విజయవంతంగా ప్రదర్శిమవుతోంది. ఈ సినిమా మీద జగన్ పార్టీ కన్నేసింది. ఏ రకంగా కన్నేసిందనే విషయాన్ని క్లియర్‌గా చెప్పేముందు కొంచెం ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళాల్సిన అవసరం వుంది. నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమా మీద మొన్నీమధ్య జగన్ పార్టీ ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేసింది. బాలకృష్ణ ఎన్నికలలో పోటీ చేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీకి ప్రచారం కూడా చేస్తున్నాడు. కాబట్టి ‘లెజెండ్’ సినిమా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం వుంది. అంచేత ఎన్నికలు అయ్యేంతవరకూ ‘లెజెండ్’ సినిమాని నిలిపేయాలంటూ ఫిర్యాదు చేసింది. ఎన్నికల కమిషన్ ఈ సినిమా ప్రదర్శనని నిలిపేయడం ఖాయమన్నట్టుగా జగన్ మీడియా కూడా ప్రచారం చేసింది. అయితే ఎన్నికల కమిషన్ సభ్యులు ఈ సినిమాని చూసి ప్రదర్శన ఆపాల్సిన అవసరం లేదంటూ, నాలుగు కట్స్ తో సరిపెట్టారు. ఈమాత్రం దానికే ఏదో సాధించేసినట్టు జగన్ పార్టీ వాళ్ళు సంతోషపడిపోయారు. ‘లెజెండ్’ మీద సాధించిన ‘విజయం’ స్ఫూర్తితో ఇప్పుడు నారా రోహిత్ నటించిన ‘ప్రతినిధి’ సినిమా మీద జగన్ పార్టీయులు కన్నేశారు. ఈ సినిమాలో కూడా కొంచెం రాజకీయ నేపథ్యం వుంది. ఈ సినిమా హీరో నారా రోహిత్ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తున్నాడు. ఈ రెండు పాయింట్లనీ లింక్ చేసి, ‘ప్రతినిధి’ సినిమా ఓటర్లని ప్రభావితం చేసి, తెలుగుదేశం పార్టీకి మేలు చేసే అవకాశం వుందని, ఈ సినిమా ప్రదర్శనని నిలిపివేయాలని ఎన్నికల కమిషన్‌ని కోరాలని జగన్ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇవాళో రేపో ‘ప్రతినిధి’ మీద కంప్లయింట్ చేసే అవకాశం వుందని తెలుస్తోంది.

పవన్ కి 24గంటలు గడువు: హరీష్ రావు

  ఇంతకాలం సినీ రంగానికే పరిమితమయిన పవన్ కళ్యాణ్ కొంచెం ఆవేశపరుడనే సంగతి కొందరికే తెలుసు. అయితే ఆయన రాజకీయాలలో ప్రవేశించడంతో ఆవిషయం అందరికీ తెలుస్తోందిపుడు. ఆయన నిన్న తన ప్రసంగంలో కేసీఆర్, హరీష్ రావులపై చేసిన విమర్శలకు, హెచ్చరికలకు అప్పుడే అటునుండి ధీటుగానే జవాబు వచ్చింది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు తగిన విధంగా బుద్ది చెపుతామని, అందుకు ఆయన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు కూడా. ఆంధ్రావాడయిన బొత్ససత్యనారాయణతో తెరాస నేత హరీష్ రావుకి వ్యాపారలావాదేవీలున్నాయని పవన్ చేసిన ఆరోపణను ఆయన ఖండించడమే కాకుండా 24గంటలలోగా పవన్ తన ఆరోపణలు నిరూపించడమో లేకపోతే తప్పుఒప్పుకొని క్షమాపణలు చెప్పాలని లేకుంటే ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని హరీష్ రావు హెచ్చరించారు. మరొక మూడు రోజుల్లో తెలంగాణాలో ఎన్నికలుముగుస్తాయి గనుక ఈ వ్యవహారం ఇక్కడితో ముగుస్తుందో లేక కొత్త మలుపులు తిరుగుతుందో త్వరలోనే తేలిపోతుంది.

కేసీఆర్ నీ తాట తీస్తా! పవన్ కళ్యాణ్

  తెదేపా-బీజేపీ అభ్యర్ధులకు మద్దతుగా ఈరోజు వరంగల్ పట్టణంలో నిర్వహించిన ఎన్నికల సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ కూడా కొంచెం హద్దులు మీరారు. దేశానికి ప్రధాని కాబోయే నరేంద్ర మోడీని ఉద్దేశించి తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ‘మోడీ, బీడీ’ అని నోటికి వచ్చినట్లు వాగితే సహించబోనని హెచ్చరించారు.   “కేసీఆర్! నువ్వు నన్ను ఏమన్నా సహిస్తాను. కానీ దేశంలో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి చెప్పట్టబోతున్న బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోడీని ఏమయినా అంటే మేము సహించను. ఆయన గురించి చులకనగా మాట్లాడితే నీ తాట తీస్తాను! ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి దేశ సమగ్రతకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకోనని తీవ్రంగా హెచ్చరించారు.   ఊహించినట్లే ఆయన మాటలకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. పవన్ కళ్యాణ్ సహజంగా కొంచెం ఆవేశపరుడు గనుక ఆయన నుండి ఇటువంటి పంచ్ డైలాగులు రావాలని సభకు వచ్చిన వారు ఆశించడం సహజమే. ఇదంతా పార్ట్ అండ్ ప్యాక్ ఆఫ్ మన (మురికి) రాజకీయాలు అని అందరూ తేలికగా తీసుకోవచ్చును. అయితే ఇక్కడ గమనించ వలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మొదటి నుండి కూడా కేసీఆర్ తన ప్రసంగంలో ప్రత్యర్ధులను ఉద్దేశించి వాడే ‘సన్నాసులు, లఫంగులు’ వంటి తిట్లను వాడటాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. రాజకీయ విలువలను మరింత దిగజార్చే అటువంటి బాషను ఎవరూ కూడా సమర్దించరు. దానిని అందరూ గట్టిగా ఖండించవలసిందే!   అయితే ఆయన బాషను తప్పు పడుతున్న పవన్ కళ్యాణ్ కూడా ఇంచుమించు అదే విధంగా మాట్లాడుతున్నారిప్పుడు. తనకంటే వయసులో, రాజకీయ అనుభవంలో ఎంతో పెద్దవాడయిన కేసీఆర్ ని పట్టుకొని ‘నీ తాట తీస్తానని’ అనడం ఏవిధంగా పవన్ సమర్దించుకోగలరు?   ఇక ఆయన తన జనసేన పార్టీ స్థాపిస్తున్న సందర్భంగా తనకు కులాలు, మతాలు, ప్రాంతాలు ఆపాదించవద్దని, అదేవిధంగా ప్రజలు కూడా ఈ బలహీనతల నుండి బయటపడి అన్ని విధాల సమర్దులు, నిజాయితీపరులు అయిన వ్యక్తులకే ఓటు వేయాలని హితబోద చేసారు. కానీ అదే పవన్ కళ్యాణ్ నేడు బీసీల ప్రస్తావన చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. దేశంలో మొట్టమొదటి సారిగా బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోడీని ఏమయినా అంటే చూస్తూ ఊరుకోమని, కులాల ప్రసక్తి తేవడం ద్వారా ఈ బలహీనత నుండి ఆయన కూడా ఇంకా బయటపడలేదని స్పష్టం చేసారు. అందుకే ఎదుటవాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అని ఒక కవి శలవిచ్చారు.   పవన్ కళ్యాణ్ కుల ప్రస్తావన తేకుండా దేశానికి ప్రధాని కాబోయే ఒక వ్యక్తిని పట్టుకొని ఆవిధంగా మాట్లాడవద్దని హెచ్చరించి ఉండి ఉంటే ఆయన స్థాయికి తగ్గటుగా ఉండేది. ఆశయాలను ఆచరణలో పెట్టడం ఆలోచినంత తేలిక కాదు. అయితే అలాగని ఆ ప్రయత్నం ఎన్నడూ మానుకోకూడదు. నిరంతర సాధనతోనే అది సాధ్యమవుతుంది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రద్దు: ఎమ్మెల్యేలందరూ మాజీలే!

      ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయాలని, ప్రస్తుతం రాష్ట్రంలో వున్న రాష్ట్రపతి పాలనను మరో రెండు నెలలు పొడిగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. శుక్రవారం సాయంత్రం ప్రధాని నివాసంలో జరిగిన సమావేశంలో మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 356 (3) ప్రకారం అసెంబ్లీని సుప్తచేతనావస్థలో వుంచుతూ మార్చి 1 నుంచి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. రెండు నెలలలోపు రాష్ట్రపతి పాలనకు పార్లమెంటు ఆమోదం పొందాల్సి వుంటుంది. అయితే ఎన్నికల తరుణంలో ఆ అవకాశం లేకపోవడం వల్ల అసెంబ్లీని రద్దు చేసి, రాష్ట్రపతి పాలను పొడిగించడమే మార్గంగా మారింది. దీంతో ప్రస్తుత ఎమ్మెల్యేలందరూ మాజీలైపోయారు. అసెంబ్లీ రద్దు, రాష్ట్రపతి పాలన పొడిగింపు నిర్ణయాలకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్రపతి త్వరలో జారీచేస్తారు.

బీ‘జేపీ’కి జేపీ ప్రచారం

      రాజకీయాల్లో బోలెడు చిత్రాలు జరుగుతూ వుంటాయి. ఎన్నికల సందర్భంగా ఆ చిత్రాలు మరింత చిత్రాతి చిత్రంగా జరుగుతూ వుంటాయి. అలాంటి చిత్రాల్లో ఇదొక చిత్రం. మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న జయప్రకాష్ నారాయణకి అనుకూలంగా జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేయాలని అనుకున్నారు. దీనికోసం జేపీకి మాట కూడా ఇచ్చేశారు. అయితే పవన్ బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతు ఇస్తున్నారు కాబట్టి, మల్కాజ్‌గిరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రంగంలో ఉన్నారు కాబట్టి పవన్ అక్కడ ప్రచారం చేయడం న్యాయం కాదని టీడీపీ, బీజేపీ మొత్తుకున్నాయి. అయినా సరే జేపీకి అనుకూలంగా ప్రచారం చేస్తానని పవన్ ఊగాడు. అయితే రాష్ట్రానికి మోడీ వచ్చి వెళ్ళడం, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం ఇలాంటి పరిణామాల తర్వాత పవన్ కళ్యాణ్ జేపీకి అనుకూలంగాప్రచారం చేయాలన్న ఆలోచనను విరమించుకున్నారు. తనకు ప్రచారం చేయొద్దని బీజేపీ అడ్డు పడినా జేపీ దాన్ని లైట్‌గా తీసుకున్నారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మాజీమంత్రి, బీజేపీ నాయకుడు బండారు దత్తాత్రేయకి అనుకూలంగా ప్రచారం చేయాలని జయప్రకాష్ నారాయణ నిర్ణయించుకున్నారు. ఆదివారం నాడు జేపీ సికింద్రాబాద్‌లో బీజేపీకి ప్రచారం చేయబోతున్నారు.

కేసీఆర్ మొరిగే కుక్క: పొన్నాల

      టీ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మధ్య మాటల యుద్ధం జోరు పెరుగుతోంది. లేటెస్ట్ గా పొన్నాల కేసీఆర్ని మొరిగే కుక్కతో పోల్చారు. కేసీఆర్ పూటకోమాట మాట్లాడుతూ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారని పొన్నాల అన్నారు. తెలంగాణకు వాచ్ డాగ్‌లా వుంటానని గతంలో చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మొరిగే కుక్కలాగా తయారయ్యారని పొన్నాల ఘాటుగా విమర్శించారు. తెలంగాణ కోసం కష్టపడిన వాళ్ళకి కాకుండా తెలంగాణ ద్రోహులకు కేసీఆర్ టిక్కెట్లు ఇచ్చారని పొన్నాల అన్నారు. టీఆర్ఎస్‌కి ఈ ఎన్నికలలో పది సీట్లు కూడా రావని పొన్నాల జోస్యం చెప్పారు. శనివారం నాడు పొన్నాల కేసీఆర్ని మొరిగే కుక్క అన్నారు. మరి ఆదివారం నాడు కేసీఆర్ పొన్నాలని ఎలా పోలుస్తారో చూడాలి.

చిరంజీవి మీదకి కోడిగుడ్డు!

      చిరంజీవికి, కోడిగుడ్లకి ఏదో లింక్ ఉన్నట్టుంది. ఎందుకంటే, రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడి మీద పడనన్నిసార్లు చిరంజీవి మీద కోడిగుడ్లు పడ్డాయి. ఎన్నిసార్లు తనమీద కోడిగుడ్లు పడ్డా వాటిని దులుపుకుని వెళ్ళిపోతారు. ఆయనలో వున్న గొప్పతనం అది. ఆయన గొప్పతనాన్ని నిరూపించే సంఘటన మరోసారి జరిగింది. శుక్రవారం నాడు మచిలీపట్నంలోని కోనేరు సెంటర్లో చిరంజీవి ప్రసంగిస్తున్నారు. కాసేపు కాంగ్రెస్‌కి ఓటేయండని బాగానే మాట్లాడిన చిరు సడెన్‌గా వాయిస్ పెంచారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ మీద ఘాటు విమర్శలు చేయడం ప్రారంభించారు. సదరు విమర్శలు అదుపుతప్పి మోడీని ‘హిట్లర్’ అనడం వరకూ వెళ్ళాయి. నాన్‌ స్టాప్‌గా మోడీని విమర్శిస్తున్న చిరంజీవిని భరించలేకపోయిన బీజేపీ కార్యకర్తలు చిరంజీవి మీదకి కోడిగుడ్లు విసిరినట్టు తెలుస్తోంది. అయితే గురిచూసి విసరకపోవడం వల్ల కోడిగుడ్ల నుంచి చిరంజీవి జస్ట్ మిస్సయ్యారట. కోడిగుడ్లు విసిరిన బీజేపీ కార్యకర్తల కోసం పోలీసులు వెతుకుతున్నారట.

ఎంతపని చేశావ్ తమ్ముడూ:మన్మోహన్ ఆవేదన!

      తనకి తమ్ముడు వరసయ్యే దల్జీత్ సింగ్ కోహ్లీ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కొట్టి మోడీ సమక్షంలో భారతీయ జనతాపార్టీలో చేరడం తనకెంతో బాధని కలిగిస్తోందని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. దేశంలో మోడీ హవాలాంటిదేమీ లేదని మన్మోహన్ సింగ్ ప్రకటించిన మర్నాడే ఆయన తమ్ముడు బీజేపీలో చేరడం కాంగ్రెస్ పార్టీకి, మన్మోహన్ సింగ్‌కి షాక్ ఇచ్చింది. ఈ సంఘటన మన్మోహన్‌కి షాక్ ఇచ్చిందని ఒప్పుకుంటున్న ప్రధాని కార్యాలయ వర్గాలు మళ్ళీ తమాయించుకుని దల్జీత్‌సింగ్ మన్మోహన్‌కి సొంత తమ్ముడేమీ కాదు.. చాలాకాలంగా మన్మోహన్‌తో ఆయనకి సంబంధాలు లేవు అని కవర్ చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ అంశం మీద ఎలాగూ ప్రధాని కార్యాలయం స్పందించింది కాబట్టి ఇక మన్మోహన్ స్పందించరని అందరూ అనుకున్నారు. అయితే మన్మోహన్ సింగ్ కూడా స్పందించారు. ఇది విచారకరమైన సంఘటన అని ఆయన అన్నారు. తాను ఎవరినీ నియంత్రించే పరిస్థితిలో లేనని చెప్పారు. నిజమేగా!

పవన్ కళ్యాణ్ హెలికాప్టర్‌కి సాంకేతిక లోపం

      కరీంనగర్ జిల్లా గోదావరి ఖనికి ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న పవన్ కళ్యాణ్‌ ఎక్కే హెలికాప్టర్‌కి సాంకేతిక లోపం తలెత్తడంతో హెలికాప్టర్ని నిలిపేశారు. దాంతో పవన్ వెళ్ళాల్సిన కరీంనగర్ సభ పవన్ కళ్యాణ్ లేకుండానే జరిగింది. అయితే, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచే సెల్ ఫోన్‌లో గోదావరి ఖని సభని ఉద్దేశించి మాట్లాడారు. హెలికాప్టర్ సమస్య కారణంగా తాను గోదావరి ఖనికి రాలేకపోయానని, దానికి ప్రజలు తనను క్షమించాలని పవన్ కళ్యాణ్ ఫోన్‌లో కోరారు. పవన్ కళ్యాణ్ సభకి రాకపోతే రాకపోయారుగానీ, ఆయన ఎక్కిన తర్వాత ఆ హెలికాప్టర్‌కి సాంకేతిక లోపం రాలేదు.. అదే పదివేలు అని బీజేపీ నాయకులు సౌందర్యని గుర్తు చేసుకుంటూ అనుకున్నారు.

వీలునామా రాసేస్తానంటున్న విజయశాంతి

      మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకురాలు, సినీనటి విజయశాంతి తన వీలునామా రాసే యోచనలో వున్నారు. ఈ వయసులో వీలునామా రాయడమేంటన్న డౌటు కొంతమందికి రావొచ్చు. అయినా ఏ నిమిషానికి ఏమి జరుగునో అని సరిపెట్టుకోనూ వచ్చు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, కేసీఆర్, హరీష్ రావుతోపాటు విజయశాంతి ఆస్తుల మీద దర్యాప్తు చేయాలని సీబీఐ కోర్టు నిన్న ఆదేశించింది. ఈ నేపథ్యంలో విజయశాంతి ఒక నిర్ణయం తీసుకున్నారు. తన పేరిట ఉన్న ఆస్తులన్ని తన మరణం తర్వాత మెదక్ వాసులకు ఇచ్చేస్తానని విజయశాంతి ప్రకటించారు. రామాయంపేటలో విజయశాంతి ఎన్నిక ప్రచారాన్ని నిర్వహిస్తున్న విజయశాంతి మాట్లాడుతూ, సీబీఐ దర్యాప్తును తాను స్వాగతిస్తున్నానని, రాజకీయాల్లోకి వచ్చి తాను వెనకేసుకుంది ఏమీ లేదని చెప్పారు. తనపేరిట ఉన్న ఆస్తులన్నిటినీ భవిష్యత్తులో మెదక్ జిల్లావారికి రాసిచ్చేస్తానని అన్నారు.