నారాయణఖేడ్ లో హరీష్ సుడిగాలి పర్యటనలు
నారాయణఖేడ్ ఉపఎన్నికపై అప్పుడే టీఆర్ఎస్ దృష్టిపెట్టింది, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన మంత్రి హరీష్ రావు... నారాయణఖేడ్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కృష్టారెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన నారాయణఖేడ్ ను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలనుకుంటున్న గులాబీ బాస్... ఆ బాధ్యతలను హరీష్ కి అప్పగించడంతో ఇప్పట్నుంచే పని మొదలుపెట్టారు, సిద్దిపేట మాదిరిగా నారాయణఖేడ్ ను డెవలప్ చేస్తానంటూ ప్రజలకు హామీ ఇస్తున్నారు. ప్రజలను ఏ అధికారులైనా డబ్బులు కోసం వేధిస్తే తమకు చెప్పాలని, వాళ్లని 24గంటల్లో సస్పెండ్ చేస్తామని హరీష్ హామీ ఇచ్చారు. నారాయణఖేడ్ ను ఎవరూ సరిగా పట్టించుకోలేదన్న హరీష్, తాము అధికారంలోకి వచ్చాక రెండు మార్కెట్ యార్డులను, గిడ్డంగులను నిర్మించామని గుర్తుచేశారు. గత సంప్రదాయానికి భిన్నంగా నారాయణఖేడ్ బైపోల్ లో పోటీకి దిగాలనుకుంటున్న టీఆర్ఎస్ కి ప్రజలు పట్టంకడతారో, లేక సెంటిమెంట్ ప్రకారం కృష్టారెడ్డి కుటుంబ సభ్యులను ఎన్నుకుంటారో చూడాలి.