ఇంటర్నెట్ వినియోగంపై ప్రభుత్వ పెత్తనం అక్కర్లేదు

  ప్రపంచదేశాలలోకెల్లా భారతదేశంలోనే అత్యంత వేగంగా మొబైల్, ఇంటర్నెట్ వాడకం పెరుగుతోందణి గణాంకాలు చెపుతున్నాయి. అందుకే ఇప్పుడు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ సేవలు అందించే అనేక పెద్దపెద్ద కంపెనీలు భారతదేశానికి క్యూ కడుతున్నాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మొబైల్, ఐటి కంపెనీల స్థాపనకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. ఆంద్ర, తెలంగాణా, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలలో డిల్లీ, చెన్నై, ముంబై, కోల్ కతా, హైదరాబాద్ వంటి అనేక ప్రధాన నగరాలలో బహిరంగ ప్రదేశాలలో ప్రభుత్వాలు ఉచిత వైఫీ సౌకర్యం కల్పిస్తున్నాయి.   దేశంలో ప్రజలందరికీ ఇంటర్నెట్ సేవలు మరింత ఎక్కువగా, వేగంగా అందుబాటులోకి తీసుకురావాలంటే దానిపై ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా తగ్గించడం లేదా పూర్తిగా వదులుకోవడమే సరయిన మార్గమని మోడీ ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోంది. అందుకోసం డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్ శాఖకు చెందిన నిపుణులతో కూడిన ఒక కమిటీని కూడా ఇటీవల నియమించింది. ఆ కమిటీ ఇందుకు అవసరమయిన సలహాలు, సూచనలు, మార్గదర్శకాలతో కూడిన ఒక నివేదికను ప్రభుత్వానికి వచ్చేనెల రెండవ వారంలోగా ఒక నివేదికను సమర్పిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం అందుకు తగిన చట్టం రూపొందిస్తుందణి కేంద్ర ఐ.టి. శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలియజేసారు.   ఇంటర్నెట్ వ్యవస్థపై ప్రభుత్వం అజమాయిషీ వదులుకోవాలనుకోవడం సంబంధిత సంస్థలు, ప్రజలు కూడా హర్షించవచ్చును. కానీ దానిపై ఎంతో కొంత ప్రభుత్వ నియంత్రణ లేకపోయినట్లయితే, దాని వలన చాలా అనర్ధాలు జరిగే ప్రమాదం ఉంది. ఇంటర్నెట్ వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ ఉన్నప్పుడే అనేక అత్యంత ప్రమాదకర, హానికర సమాచారం సరఫరా అవుతోంది. దానివలన దేశంలో ఎన్నడూ ఊహించలేని అనర్ధాలు ఎన్ని జరుగుతున్నాయో అందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు. అటువంటప్పుడు ఇంటర్నెట్ వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ లేకపోయినట్లయితే అది ఇంకా చాలా ప్రమాదకర పరిస్థితులు సృష్టించవచ్చును. లేదా ఊహించలేని సరికొత్త సమస్యలు సృష్టించవచ్చును.   కొన్ని ప్రముఖ సెర్చ్ ఇంజన్లు, వెబ్ సైట్లు యువతను తప్పు ద్రోవలోకి వెళ్లేలా చేస్తున్నాయని చైనాతో సహా అనేక దేశాలు వాటిని నిషేధం విదించాయి. ఆ కారణంగానే అనేక దేశాలలో నేటికీ ఇంటర్నెట్ వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ తప్పనిసరవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఇంటర్నెట్ వ్యవస్థపై ఉన్న కొద్దిపాటి నియంత్రణను ఎత్తివేసినట్లయితే దాని వలన మేలు కంటే కీడే ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది.   కనుక అటువంటి ఆలోచనచేసే కంటే ఇంటర్నెట్ వినియోగదారులకు మరింత చౌకగా సేవలు ఉపలబ్దమయ్యేందుకు అవసరమయిన చర్యలు చేపడితే బాగుంటుంది. అదేవిధంగా ఇంటర్నెట్ వినియోగదారులు రకరకాల కంప్యూటర్ వైరస్ ల నుండి తమ డాటాను కాపాడుకొనేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయవలసి వస్తోంది. అదేవిధంగా దేశంలో ఇంటర్నెట్ వినియోగంతో బాటు సైబర్ నేరాలు క్రమంగా పెరిగిపోతున్నాయి. వేలాది మంది ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఆన్ లైన్ వ్యవహారాలూ చేసేవారు హ్యాకర్ల భారీన పడి చాలా నష్టపోతున్నారు. వారందరూ తమ సమస్యలను ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియక మౌనంగా నరకం అనుభవిస్తున్నారు. దేశ ప్రజలందరికీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో తేవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించడం మంచిదే. అందుకోసం ప్రభుత్వ నియంత్రణ ఎత్తివేయాలని ఆలోచించడం కంటే ఇటువంటి సమస్యలకు పరిష్కారం కోసం అవసరమయిన యంత్రాంగం, సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లయితే ఇంటర్నెట్ వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ ఉన్నప్పటికీ శరవేగంగా దేశంలో వ్యాప్తి చెందుతుంది. అలాకాక హడావుడిగా ఇటువంటి నిర్ణయాలు తీసుకొంటే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం వలన ఏమీ ప్రయోజనం ఉండబోదు.

ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లు...

  ఆర్ధికంగా చాలా బలంగా ఉన్న తెలంగాణా ప్రభుత్వం తన ఉద్యోగులకు చాలా ఉదారంగా ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తుంటే, ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లు అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అగ్ని పరీక్షగా మారుతోంది. ఇదివరకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వం 47 శాతం వరకు జీతాలు పెంచినప్పుడు, ఆ ప్రభావం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంపై కూడా పడింది. ప్రభుత్వం తమ జీతాలు ఇవ్వడానికే నెలనెలా వెతుకొనే పరిస్థితిలో ఉందని తెలిసి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ప్రభుత్వం ముక్కు పిండి మరీ అంత ఇంక్రిమెంటు తీసుకొన్నారు.   ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం తన 56,000 మంది ఆర్.టి.సి. ఉద్యోగులు ప్రత్యేక ఇంక్రిమెంటు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. అందుకు తెలంగాణా రాష్ట్ర ఆర్.టి.సి. ఉద్యోగులు అందరూ సంతోసహించడం సహజమే. కానీ ఇప్పుడు ఆంద్రప్రదేశ్ ఆర్.టీ.సి. ఉద్యోగులు కూడా తమకూ తెలంగాణా ఉద్యోగులతో సరిసమానంగా ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని పట్టుబడితే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పరిస్థితి అప్పుడు మూలిగే నక్కమీద తాటి పండు పడినట్లుగా ఉంటుంది.   రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా ఆర్.టి.సి. కూడా తీవ్రంగా నష్టపోయింది. ఆ సమస్య నుండి ఏవిధంగా బయటపడాలా అని చూస్తున్న ప్రభుత్వానికి ఇప్పుడు అత్యవసరంగా మరో సమస్యను పరిష్కరించవలసి వస్తుంది. అయితే ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదు కనుకనే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇటువంటివి పెద్ద సమస్యలుగా కనబడుతున్నాయి. కానీ ఒక్కసారి రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పుంజుకొంటే అప్పుడు తెలంగాణా ప్రభుత్వంతో పోటీపడి మరీ తన ఉద్యోగులకు కూడా జీతాలు పెంచగలదని ఖచ్చితంగా చెప్పవచ్చును.

తప్పులకు శిక్షించారు.. త్యాగాలు మరచిపోయారు

కొందరు వ్యక్తులు చేసిన తప్పులు మాత్రమే అందరికీ గుర్తుండిపోతాయి. త్యాగాలు మాత్రం మరుగున పడిపోతాయి. అలా తప్పులు మాత్రమే మిగిలి, ఆ తప్పులకు శిక్ష కూడా పడి, త్యాగాలు మాత్రం మరుగున పడిపోయిన వ్యక్తి ‘సత్యం’ రామలింగరాజు. ఈమధ్య రామలింగరాజుకు సంబంధించిన కేసు తీర్పు వెలువడింది. ఏడు సంవత్సరాల జైలుశిక్షతోపాటు ఐదుకోట్ల జరిమానా విధించింది. రామలింగరాజు తనను నమ్మిన ఇన్వెస్టర్ల నమ్మకాన్ని వమ్ము చేశాడు. ఎవరూ ఊహించని విధంగా ఒక భారీ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి అయ్యాడు. అయితే చివరికి తాను చేసిన మోసాన్ని తానే బయటపెట్టుకుని చట్టానికి లొంగిపోయాడు.  జనాన్ని మోసం చేయగలిగాడు కానీ, ఆ మోసాన్ని కొనసాగించలేకపోయాడు. ఏ పశ్చాత్తాపమో ఆయన్ని అన్ని నిజాలూ బయటపెట్టి లొంగిపోయేలా చేసింది. ఆ కోణంలో చూస్తే లక్షల కోట్ల కుంభకోణాలు చేసి దర్పం వెలగబెడుతూ, స్వేచ్ఛగా బయటే తిరుగుతున్న కొంతమంది రాజకీయ నాయకులకంటే ఆయన చాలా బెటర్. మోసమయితే చేయగలిగాడుగానీ, మోసం చేయలేదంటూ బుకాయించి, దబాయించి దర్జాగా బతికేపని మాత్రం చేయలేకపోయాడు. ఇప్పుడు లోకం సత్యం రామలింగరాజుని  ఒక కార్పొరేట్ మోసగాడు గానే గుర్తిస్తోంది. ఆయన వైభవం వెలిగినప్పుడు తన సొమ్ముతోకానీయండి, జనం సొమ్ముతో కానీయండి... ఆయన చేసిన సేవా కార్యక్రమాలను మాత్రం ఇప్పుడు అందరూ మరచిపోయారు. రామలింగరాజు తాను స్థాపించిన బైర్రాజు ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ఈ సంస్థ తన సేవా కార్యక్రమాలను విస్తరించింది. ముఖ్యంగా తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, రంగారెడ్డి, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో రెండు వందల  గ్రామాల్లో ఈ సంస్థ భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపట్టింది. పేద ప్రజలకు వైద్యం, విద్య, మంచినీరు, పర్యావరణ, పారిశుద్ధ్యం, నివాస గృహాలు, వ్యవసాయ సలహాల వంటి అంశాలలో ఈ సంస్థ సేవలను అందించింది. వేలాదిమంది గ్రామీణ యువతరానికి కంప్యూటర్‌లో శిక్షణ ఇచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ దేశంలో ముందడుగు వేయడానికి ప్రధాన కారణమైంది. ప్రతిభావంతులైన యువతీ యువకులు జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి మొదటి మెట్టుగా సత్యం సంస్థ ఉపయోగపడింది. ఈ సంస్థను స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో సాఫ్ట్‌వేర్ సంస్థలు ఆవిర్భవించడానికి, తద్వారా ఎన్నో లక్షల ఉద్యోగాలు రావడానికి కారణమైంది... ఇప్పుడు ఇవన్నీ గుర్తించేవారేరి? చివరికి స్వయం కృతాపరాధాల కారణంగా మొదలుకంటా కూలిపోయిన సత్యం రామలింగరాజు... ఎంతోమందికి గుణపాఠంగా నిలిచాడు... ఇలా కూడా ఇతరులకు ఉపయోగపడ్డాడు.

అడ్డంగా దొరికిపోయిన అసదుద్దీన్

  ముస్లింలను ఉద్ధరించడమే తమ ధ్యేయంగా చెప్పుకునే మజ్లిస్ పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ ఎన్నోసార్లు తన రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా ఎన్నోసార్లు చట్టానికి దొరికిపోయాడు. అయితే చట్టాలు ఇలాంటివాళ్ళకి చుట్టాలు కాబట్టి కొంతకాలం జైల్లో వున్నా, ఇప్పుడు మళ్ళీ జనాల్లో తిరుగుతూ తమ ధోరణినిని కొనసాగిస్తున్నాడు. అసదుద్దీన్ పార్టీ తీవ్రవాదులకు అనుకూలంగా వుంటుందన్న విమర్శలు మొదటినుంచీ వున్నాయి. అయితే ఆధారాలు లేని ఈ విమర్శలను పట్టించుకోనవసరం లేదని ప్రజాస్వామ్యవాదులు ఇంతకాలం భావిస్తూ వుంటేవారు. అయితే ఈమధ్య వికారుద్దీన్ అండ్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్ జరిగిన సందర్భంగా అసదుద్దీన్ వ్యవహరించిన తీరు చూస్తే, ఆయన మీద, ఆయన పార్టీ మీద వినిపిస్తున్న విమర్శలు నిజమేనని నమ్మాల్సి వస్తోంది. ఎన్‌కౌంటర్ జరిగిన వెంటనే, ఆ ఎన్‌కౌంటర్ని తాను దగ్గరుండి చూసినట్టు ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని స్పందించారాయన. వికారుద్దీన్ బ్యాచ్ చేతిలో ఎంతోమంది పోలీసులు చనిపోయినా ఎప్పుడూ ఒక్క సానుభూతి వాక్యం కూడా పలకని ఆయన తీవ్రవాదులు ఎన్‌కౌంటర్ అయితే మాత్రం నిమిషాల్లో స్పందించేశాడు. అక్కడితో ఆగాడా, కొంతమంది ముస్లిం పెద్దలతో కలసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసి ఈ ఎన్‌కౌంటర్ని ఖండించాడు. సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు. ఇక వికారుద్దీన్ అంత్యక్రియలయితే ఎంఐఎం కార్యకర్తలు, ఎమ్మెల్యేలు కన్నీరు మున్నీరు అవుతూ దగ్గరుండి జరిపించారు. సరే, అసదుద్దీన్ అండ్ బ్యాచ్ వికారుద్దీన్ అండ్ బ్యాచ్ మీద సానుభూతి వ్యక్తం చేయడాన్ని మత కోణంలో తీసుకుంటే, వికారుద్దీన్ బ్యాచ్ ముస్లిం మతానికి చెందిన వారు కాబట్టి ముస్లిం మతాన్ని ఉద్ధరించడానికే రాజకీయాల్లో ఉన్నామని చెప్పుకునే అసదుద్దీన్ బాధపడిపోవడం న్యాయమే. అయితే ఎన్‌కౌంటర్లో మరణించిన వికారుద్దీన్ మాత్రమే కాదు... అంతకుముందు మరో ఇద్దరు ఉగ్రవాదుల చేతిలో కాల్పులకు గురై మరణించిన ఎస్.ఐ. సిద్ధయ్య కూడా ముస్లిమే. ఆయన అసలు పేరు మహ్మద్ సిద్ధిక్. తన విధి నిర్వహణలో భాగంగా ఆయన తీవ్రవాదుల చేతిలో తీవ్రంగా గాయపడి నాలుగు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే, ఈ అసదుద్దీన్ గానీ, ఆయన పార్టీ వాళ్ళుగాని పరామర్శించిన పాపాన పోలేదు. చివరికి ఆయన మృత్యువుతో పోరాడి మరణిస్తే కనీసం ఆయన మృతికి సంతాపాన్ని కూడా తెలపలేదు. తీవ్రవాదుల అంత్యక్రియలకు వెళ్ళి కన్నీరు మున్నీరుగా విలపించిన ఎం.ఐ.ఎం. నాయకులు ఎస్.ఐ. సిద్ధిక్ మృతదేహం వున్న ఛాయలకు కూడా రాలేదు. మరి ముస్లింల కోసం పోరాడే అసదుద్దీన్ అండ్ కో సిద్ధిక్‌ని ఎందుకు పట్టించుకోలేదో? ఇవే ప్రశ్నలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో అనేకమంది ముస్లింలు అసదుద్దీన్‌ని ప్రశ్నిస్తున్నారు. తాను అడ్డంగా దొరికిపోయిన ఈ విషయంలో అసదుద్దీన్ తన వివరణ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆయన ముస్లిం సమాజం ముందు దోషిలా నిలబడాల్సిందే. ముస్లింల కోసం పోరాడుతున్నట్టు తమ ముఖానికి వేసుకున్న మాస్కుని తొలగించాల్సిందే.

బొత్స వైకాపాలో చేరబోతున్నారా?

  విజయనగరం జిల్లాలో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిని వైకాపాలో చేర్చుకోవడం గురించి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జిల్లా నేతల అభిప్రాయం అడిగినట్లు వార్తలు వచ్చేయి. కానీ ఆ నాయకుడు ఎవరనే విషయం బయటకి పొక్కనీయలేదు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీయే రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక ఆ పార్టీకి చెందిన నేతలెవరూ వైకాపాలో చేరే ఆలోచన చేయరని ఎవరయినా చెప్పగలరు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితే అగమ్యగోచరంగా ఉంది కనుక ఆ పార్టీకి చెందిన నేతలే వైకాపాలో చేరేందుకు ఆసక్తి చూపుతుండవచ్చును.   జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖనేత అనగానే టక్కున గుర్తుకు వచ్చేది బొత్స సత్యనారాయణే. ఇదివరకు ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించి అది వీలుకకాకపోవడంతో నేటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ ఆయన ఇదివరకులా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలలో చురుకుగా పాల్గొనడం లేదు. ఒకవేళ పాల్గొన్నా ఆయన తన ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే పాల్గొంటున్నట్లున్నారు తప్ప ఇదివరకులా కాంగ్రెస్ పార్టీని వెనకేసుకురావడం లేదనే సంగతి గమనిస్తే ఆయన వైకాపాలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానం కలుగకమానదు. విజయనగరానికే చెందిన వైకాపా నేత కోలగట్ల వీరభద్రరావుతో ఆయనకు మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. కనుక ఆయన ద్వారా బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ వైకాపాలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారేమో?   ప్రస్తుతం విజయనగరం జిల్లాలో వైకాపాకు బలమయిన నాయకులే ఉన్నారు. ఒకవేళ బొత్సను వైకాపాలో చేర్చుకొంటే పార్టీ బలోపేతం అవడం సంగతి ఎలా ఉన్నా ఆయన వారందరి మీద పెత్తనం చేసే అవకాశాలున్నాయి. ఆయనతో బాటు ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు కూడా వెంటవస్తారు కనుక క్రమంగా వారందరూ కలిసి జిల్లాలో పార్టీని తమ చెప్పు చేతల్లోకి తీసుకొనే అవకాశం కూడా ఉంటుంది. బహుశః అందుకే వైకాపా జిల్లా నేతలు తమ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదనకు వెంటనే తలూపేయకుండా ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలనికోరారు. ఒకవేళ బొత్స సత్యనారాయణ కాక కాంగ్రెస్ పార్టీకి చెందిన వేరే నేతలేవరయినా అయ్యుంటే బహుశః వైకాపా నేతలు అభ్యంతరం చెప్పి ఉండేవారు కారేమో?

శ్రుతిహాసన్ ఇష్యూలో శ్రుతి మించిన మీడియా

సినీ కథానాయిక శ్రుతిహాసన్‌ని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖమంత్రి కామినేని శ్రీనివాస్ విమానంలో ఏడిపించారనే అనారోగ్యకరమైన వార్త గత కొద్ది రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వార్తకి మీడియా రకరకాల మసాలాలు దట్టించి, చిలువలు పలువలు కల్పించి, తనదైన స్టైల్లో స్క్రీన్‌ప్లే అల్లేసి ప్రసారం చేసి మంత్రి కామినేని శ్రీనివాస్‌ని బద్నామ్ చేయడానికి శాయశక్తులా ప్రయత్నించింది. దీనికితోడు ఇదిగో పులి అంటే అదిగో తోక అనే సోషల్ మీడియా వుండనే వుంది... ఇలా ఈ నిరాధార వార్త మీడియాని ఆధారం చేసుకుని వ్యాపించింది. ఒక అబద్ధాన్ని ఖండించకపోతే అది నిజమేమోనని జనం నమ్మే ప్రమాదం వుంది కాబట్టి మంత్రి కామినేని శ్రీనివాస్  దీనిమీద వివరణ ఇచ్చారు. తాను ఎప్పుడూ శ్రుతి హాసన్‌ ప్రయాణించిన విమానంలో ప్రయాణించనే లేదని, తాను ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కారులోనే వెళ్తానని, మీడియాలో జరుగుతున్న ఈ దుష్ప్రచారమంతా శుద్ధ అబద్ధమని తేల్చేశారు. తాను శ్రుతిహాసన్‌ని సినిమాల్లో తప్ప బయట ఎక్కడ చూడను కూడా చూడలేదని స్పష్టం చేశారు. ఒక వార్తను ప్రకటించే ముందు తన వివరణ తీసుకోవాలని మీడియా ఆలోచించకపోవడం అన్యాయమని ఆయన బాధపడ్డారు. తాను శ్రుతిహాసన్‌ని విమానంలో ఏడిపించానని నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా వున్నానని ప్రకటించారు. తన పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారంటే మంత్రిగారిని మీడియా ఎంతగా విసిగించిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ శ్రుతిహాసన్ ఇష్యూలో మీడియా శ్రుతిమించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే, అసలు ఆరోజు జరిగింది వేరు... మీడియా కల్పించింది వేరు. అసలు ఆరోజు జరిగింది ఇదే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఇటీవల ఒక సీనియర్ మహిళా అధికారితో కలసి విమానంలో తిరుపతికి వెళ్తున్నారు. వీరి పక్క సీట్లో ఒకమ్మాయి కూర్చుని వుంది. సినిమాలు చూడని మంత్రిగారికి ఆ అమ్మాయి శ్రుతిహాసన్ అని కూడా తెలియదు. ఇంతలో సూర్యాపేటలో జరిగిన కాల్పుల్లో దొరబాబు అనే ఎంపీటీసీ గాయపడ్డారని మంత్రిగారికి ఫోన్ వచ్చింది. గాయపడిన ఎంపీటీసిని ఆపరేషన్‌ థియేటర్‌కి తరలిస్తుండగా మంత్రికి ఫోన్ చేశారు. మంత్రి మాణిక్యాలరావు ఆ ఎంపీటీసీకి చికిత్స చేస్తున్న డాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఎంపీటీసీ దొరబాబుకు మంచి వైద్యాన్ని అందించాల్సిందిగా డాక్టర్ని మంత్రి కోరారు. ఇలా మంత్రి మాణిక్యాలరావు ఫోన్‌లో మాట్లాడుతూ వుండగా పక్కసీట్లోనే వున్న శ్రుతిహాసన్ గయ్యిమంటూ లేచింది. మీరు ఫోన్ మాట్లాడుతూ వుంటే నేను డిస్ట్రబ్ అయిపోతున్నానంటూ గోలగోల చేసింది. మంత్రి మాణిక్యాలరావు ‘‘ఇది చాలా ఇంపార్టెంట్ ఫోనమ్మా.. అందుకే మాట్లాడుతున్నాను’’ అని చెప్తున్నా శ్రుతిహాసన్ ఎంతమాత్రం పట్టించుకోకుండా ఎయిర్‌హోస్టెస్‌ని పిలిచి కంప్లయింట్ చేసింది. దాంతో మంత్రి మాణిక్యాలరావు ఎందుకొచ్చిన గొడవ అని ఫోన్ కట్ చేసి కూర్చున్నారు. ఇంతలో మంత్రిగారి ఫోన్ మరోసారి మోగింది. అవతల ఫోన్ చేసిన వ్యక్తి... ‘‘సార్... ఇక్కడ బైక్ మీద వెళ్తున్న వ్యక్తికి యాక్సిడెంట్ అయింది. అతను స్పృహ కోల్పోయాడు. అతని ఫోన్‌లో చివరగా డయల్ చేసిన నంబర్ మీదే వుంది. అందుకే ఫోన్ చేశాం’’ అని చెప్పారు. ఇంతకీ ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తి మరెవరో కాదు... మంత్రి మాణిక్యాలరావు పీఏ. దాంతో ఆందోళన చెందిన మంత్రి తన పీఏ ప్రాణాలు కాపాడుకోవాలన్న ఉద్దేశంతో అతనని ఎలా ఆస్పత్రికి తరలించాలి.. ఏం చేయాలి అనే విషయాలను ఫోన్‌లో మాట్లాడారు. అంతే... శ్రుతి హాసన్ మరోసారి శివాలెత్తింది. తాను డిస్ట్రబ్ అయిపోతున్నానంటూ మరోసారి గొడవ చేయడం మొదలుపెట్టింది. చాలా పెద్ద ప్రాబ్లం కావడం వల్లే ఫోన్ మాట్లాడుతున్నానని చెప్పినా ఆమె ఎంతమాత్రం వినిపించుకోలేదు. ఇక ఈమెతో వాదించి తన పరువు తీసుకోవడం ఎందుకనుకున్న మంత్రిగారు ఫోన్ కట్ చేసి కూర్చుండిపోయారు. మంత్రిగారి పక్కన సీనియర్ మహిళా అధికారి ఉన్నారుకాబట్టి సరిపోయింది.. లేకపోతే విమానంలోని జనం మంత్రిగారిని అనుమానంగా చూసేవారే. మొత్తమ్మీద తిరుపతిలో ఫ్లైట్ లాండ్ అయిన తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదీ అసలు జరిగిన విషయం. ఈ విషయాన్ని మీడియా ఎలా డైవర్ట్ చేసిందో చూడండి. అసలు ఈ విషయంలో సంబంధమే లేని మంత్రి కామినేని శ్రీనివాస్‌ని ముగ్గులోకి లాగింది. అసలు జరిగిన ఘటనకి రకరకాల మసాలాలు దట్టించి జనాల్లోకి వదిలింది. ఇలాంటి అనారోగ్యకరమైన ధోరణులు ఇటీవలి కాలంలో మీడియాలో బాగా పెరిగిపోయాయి. తమ రేటింగ్‌ కోసం బాధ్యతాయుతమైన వ్యక్తుల మీద లేనిపోని అభాండాలు వేయడం దారుణమైన విషయం. మానవత్వంతో  వ్యవహరించాల్సిన సమయంలో నానాయాగీ చేసిన శ్రుతిహాసన్ ఎంత తప్పు చేసిందో, ఈ విషయంలో అభూత కల్పనలు ప్రసారం చేసిన మీడియా కూడా అంతే తప్పు చేసినట్టు. ఈ విషయంలో మీడియా తన పొరపాటును తెలుసుకుని, భవిష్యత్తులో అయినా బాధ్యతాయుతంగా ఆలోచిస్తుందని ఆశించడం అత్యాశే అయినా... మనం ఆశావాదులం... అలా జరుగుతుందనే ఆశిద్దాం.

రాంబాబుకి రాజకీయాలెందుకు కెమెరా ఉండగా..

  జనసేన పార్టీకి ఏకఛత్రాధిపతి అయిన పవన్ కళ్యాణ్ మనసులో ఏమీ ఆలోచనలున్నాయో తెలియదు కానీ ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే తను ఏమి చేయాలనుకొంటున్నాడో తనకే తెలియనట్లు కనబడుతున్నారు. ఆ కారణంగానే ప్రజలు, ముఖ్యంగా అభిమానులు కూడా ఆయన ధోరణిణి అర్ధం చేసుకోలేకపోతున్నారు. ఆయన రాజకీయాలలో స్థిరంగా ఉంటారా అంటే ఉండరు. పోనీ మిగిలిన సినీ నటుల్లా రాజకీయాలకు దూరంగా ఉంటారా అంటే అలాగా ఉండలేరు. పోనీ స్థిరంగా ఏదయినా ఒక నిర్ణయానికి కట్టుబడి ఉంటారా...అంటే అలాగా ఉండలేరని రుజువు చేసుకొన్నారు. ప్రజా సమస్యలపట్ల నిజంగా శ్రద్ద ఉందా లేదా అంటే చెప్పలేని పరిస్థితి. ఉంటే నిలకడగా వాటి పరిష్కారం కోసం కృషి చేసేవారు. కానీ లేదని చెప్పడానికి లేదు. ఉంది గాబట్టే అప్పుడప్పుడు ఇలాగ ఆవేశపడుతుంటారు. కానీ అది తాటాకు మంటలాగ ఎంత వేగంగా ఎగిసిపడుతుందో అంతకంటే వేగంగా చల్లారిపోతుంది.   ప్రజాసమస్యల పట్ల పవన్ కళ్యాణ్ కి చాలా సానుభూతి ఉండవచ్చు. కానీ ఈవిధంగా అయోమయంగా, అస్థిరంగా వ్యవహరించడం వలన ఆయనకున్న మంచిపేరును, ప్రతిష్టను ఆయనే స్వయంగా కాలరాసుకొంటున్నారు. నలుగురిలో నవ్వుల పాలవుతున్నారనే సంగతి గ్రహిస్తే మంచిది. అంతేకాదు ఆయన ఒక సమస్య పరిష్కరించడానికి బయలుదేరితే మరొకరికి సమస్యలు సృష్టిస్తున్నారు కూడా.   ఇంతకు ముందు ఆయన తుళ్ళూరు మండలంలో గ్రామాలను సుడిగాలిలా పర్యటించినప్పుడు చెప్పిన మాటాలు, హైదరాబాద్ చేరుకొన్న తరువాత చెప్పిన మాటలకి ఎక్కడా అసలు పొంతన లేకపోవడంతో ఆయన చాలా విమర్శలకు ఎదుర్కోవలసి వచ్చింది. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తుళ్ళూరు పర్యటించాలనుకొన్న సమయంలో ఆయన కూడా తుళ్ళూరులో పర్యటించబోతున్నట్లు మెసేజ్ పెట్టడం, వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి మాట్లాడటం ఆ తరువాత తుళ్ళూరు పర్యటించడం అనే మూడు సంఘటనలను కలిపి చూసిన వైకాపా నేతలు, ఆయన చంద్రబాబు ప్రోద్బలంతోనే తుళ్ళూరు బయలుదేరారంటూ చంద్రబాబుని ఆడిపోసుకొన్నారు. కానీ పవన్ కళ్యాణ్ తుళ్ళూరు వెళ్లిన తరువాత ఆయనకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతానని శపధాలు చేసారు. కానీ మళ్ళీ హైదరాబాద్ చేరుకోగానే చంద్రబాబు నాయుడుణి పొగడటంతో అందరూ ఆశ్చర్యపోయారు. పవన్ కళ్యాణ్ ఆ విధంగా మాట్లాడటం వలన ఇదంతా చంద్రబాబు పన్నాగమేనని మళ్ళీ అందరూ అనుమానించారు. పవన్ కళ్యాణ్ అయోమయ వ్యవహార శైలి వలన చంద్రబాబు నాయుడు తను చేయని తప్పుకి కూడా నిందలు పడాల్సి వచ్చిందని అర్ధమవుతోంది.   అన్ని మాటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ మళ్ళీ హటాత్తుగా ఎందుకు అదృశ్యమయిపోయారో, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆవేశపడుతున్నారో ఆయనే చెప్పాలి. మళ్ళీ ఒకవేళ ఈసారి ప్రజల మధ్యకి రాదలిస్తే ముందుగా తను ఏమి చేయాలనుకొంటున్నారో, అందుకు తను ఎన్ని గంటలు లేదా రోజులు వారికి తన కాల్షీట్లు కేటాయించగలరో ముందుగానే అవగాహన చేసుకొని, అందులో సాధ్యాసాధ్యాలను తన సన్నిహితులతో లేదా అభిమానులతో చర్చించిన తరువాతనే తగిన నిర్ణయం తీసుకొంటే మంచిది. అలాకాక మళ్ళీ ఓ నాలుగయిదు గంటలు హడావుడి చేసి మాయమయిపోతే పోయేదీ ఆయన పరువే. ఆయన రాజకీయాలలో రాకపోయినా ఎవరూ ఆయనను నిలదీయరు. కానీ ఇలా అప్పుడప్పుడు వచ్చి హడావుడి చేయడాన్ని ఎవరూ సమర్ధించరు.   ఒకవేళ ఇప్పుడు రాజధాని కోసం భూములు ఇవ్వదలచుకొని రైతుల తరపున పోరాడేందుకు సిద్దపడితే దాని పరిణామాలు ఏవిధంగా ఉంటాయో ఆయన ఆలోచించిన తరువాతనే రంగంలో దిగితే మంచిది. ఇప్పటికే కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయిస్తే వారి భూముల జోలికి వెళ్ళవద్దని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చట్టం ప్రయోగించి రైతుల భూములు తీసుకోదలిస్తే, అందుకు చట్టంలో ఎటువంటి అభ్యంతరాలు లేకపోతే కోర్టు కూడా అడ్డుకోలేదు. కానీ అది చట్ట వ్యతిరేకమయితే కోర్టులు ప్రభుత్వాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు వేయనీయకుండా అడ్డుపడటం తధ్యం. అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి కొత్తగా చేసేదేముంటుంది? హడావుడి తప్ప.

పవన్ ఉద్యమిస్తాడట.. అబ్బ ఛా...

సినీ హీరో, జనసేన పార్టీ ఏకైన నాయకుడు పవన్ కళ్యాణ్‌ది ఉరుములేని పిడుగు టైపు. అప్పటి వరకు ఎక్కడున్నాడో తెలియదు.. అంతలోనే సడన్‌గా ఓ పిడుగులాంటి స్టేట్‌మెంట్ ఇచ్చేస్తాడు. అప్పుడిక  మీడియా పని మొదలవుతుంది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన రెండు లైన్ల స్టేట్‌మెంట్‌కి రకరకాల ఊహాగానాలు, కల్పనలు, కాకరకాయలు జోడించి కథనాలు ప్రసారం చేస్తుంది. పాపం స్టేట్‌మెంట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కూడా ఊహించని విషయాలను కూడా మీడియా ఊహించేస్తుంది. ఒక్కోసారి ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ ఏం చేయాలో కూడా మీడియా చెప్పేస్తుంది. అదేంటోగానీ, పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు మీడియా చెప్పినట్టే అడుగులు వేస్తూ వుంటాడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరోసారి ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఏపీ రాజధాని గ్రామాల్లో ప్రభుత్వం భూ సేకరణ చేయాలని అనుకుంటోందట, దానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఉద్యమించేస్తాడట. అదీ విషయం... పవన్ కళ్యాణ్ స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు కాబట్టి ఇక ఉద్యమించేస్తాడని, ఆయన ఉద్యమం వల్ల భూమి బద్దలైపోతుందని, ఆకాశం కంపించిపోతుందని ఆయన అభిమానులు అనుకుంటే అనుకుంటారేమో. అయితే, ఆయన వరసని మొదటినుంచీ గమనిస్తున్న పరిశీలకులు మాత్రం పవన్ కళ్యాణ్‌ చేస్తున్నవి  కేవలం తాటాకు చప్పుళ్ళేనని, ఆయన ఆవేశం కేవలం తాటాకు మంటేనని అంటున్నారు. ఉద్యమం చేసేంత సీను ఆయనకు లేదని స్పష్టంగా చెబుతున్నారు. ఎప్పుడో ఒక్కసారి బయట కనపడితే మళ్ళీ నాలుగైదు నెలల వరకూ అడ్రస్ లేకుండా పోయే ఆయనేంటి... ఉద్యమం చేసేందేంటి అని అంటున్నారు. ఆయన పార్టీ పెట్టి ఏడాది ఎప్పుడో పూర్తయింది. పేరయితే ప్రకటించారుగానీ, తన పార్టీ నిర్మాణానికి ఆయన ఎంతమాత్రం పూనుకోలేదు. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఆయన పార్టీ ఏక్‌నిరంజన్‌గానే వుంది. ఉట్టెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతానని అందట. పార్టీని అభివృద్ధి చేసుకోవడమే చేతగాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉద్యమాలు చేసేస్తానని ప్రకటించడం ఉట్టెక్కలేనమ్మ తరహాలోనే వుంది. ఉద్యమం చేస్తానని పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ప్రకటించాడు. కనీసం ఆయన మీడియా ముందుకు రాలేదు. ఆయన ప్రతినిధి అంటూ ఎవరూ రాలేదు.. ఉద్యమం చేస్తానని ప్రకటించడానికే మనుషులు లేని ఆయన ఇంకేం ఉద్యమం చేస్తాడని పరిశీకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఉద్యమం చేస్తానంటున్నాడు. అసలు ఉద్యమమంటే ఏం చేస్తాడు? రాజధాని గ్రామాలకు వెళ్ళి మరోసారి ఆవేశంగా మాట్లాడతాడా? ఒకవేళ అక్కడ ఆవేశంగా మాట్లాడి అక్కడి రైతుల్ని రెచ్చగొట్టినా, మర్నాడు హైదరాబాద్‌లో నాలుక్కరుచుకుని ప్రభుత్వాన్ని పొగిడేరకం ఆయన. మొన్నామధ్య కూడా జరిగింది అదే కదా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను మాట్లాడిన మాటకే కట్టుబడి వుండే ధైర్యం ఆయనకు లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను మాట్లాడిన మాటలకు రియాక్షన్ ఎలా వుంటుందో రెండు మూడు రోజులు వేచి చూసే ఓర్పు కూడా ఆయనకు లేదు. తనను చూడటానికి వచ్చిన జనం ముందు ఆవేశంగా మాట్లాడ్డం, వాళ్ళను రెచ్చగొట్టడం, ఆ తర్వాత మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం... ఇదే ఉద్యమమని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారేమో. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ‘ఉద్యమం’ చేసి పరిస్థితిని సర్వనాశనం చేయడం తప్ప ఆయన సాధించేదేమీ వుండని పరిశీలకులు అంటున్నారు.

పాపం...రాజుగారు!

  సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ప్రధాన దోషిగా నిర్ధారించబడిన రామలింగ రాజు పరిస్థితి చూసిన వారెవరికయినా ‘అయ్యో పాపం రాజుగారు…’అనుకోకుండా ఉండలేరు. కోర్టు ఆయనకి జైలు శిక్ష ఖరారు చేసేముందు తను రాష్ట్రానికి దేశానికీ చేసిన సేవల ఆయన స్వయంగా గురించి చెప్పుకొని, వాటిని దృష్టిలో పెట్టుకొని శిక్షను ఖరారు చేయమని ఆయన కోర్టును వేడుకొంటునప్పుడు ఎవరికయినా మనసు చివుక్కు మానకమానదు. తను నేరం చేసానని, దానిని దైర్యంగా అంగీకరించి ప్రజలకు, ప్రభుత్వానికీ క్షమాపణలు చెప్పుకొని, దాదాపు మూడేళ్ళు జైలు శిక్ష కూడా అనుభవించాను కనుక ఇకనైనా తనపై కనికరం చూపవలసిందిగా ఆయన కోర్టులో న్యాయమూర్తిని వేడుకొంటున్నప్పుడు ‘అయ్యో! పాపం రాజుగారు...’అని అనుకోకుండా ఉండలేము. ఆయన అభ్యర్ధనను న్యాయమూర్తి తిరస్కరించి ఏడేళ్ళు జైలు శిక్ష వేస్తున్నట్లు ప్రకటించినప్పుడు ఆయన బాధను చూసినవారు ‘అయ్యో’ అనుకోకుండా ఉండలేరు. జూబ్లీ హిల్స్ లో తన నివాసం నుండి కారులో వచ్చిన ఆయనని పోలీస్ వ్యానులో చర్లపల్లి జైలుకి తరలిస్తున్నప్పుడు ‘అయ్యో’ అనిపించక మానదు. కానీ నేరం చేసినవారు ఎంతవారయినా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా శిక్ష అనుభవించక తప్పదు కదా అనుకొని సరిపెట్టుకోక తప్పదు.   కానీ అనేక ఆర్ధిక నేరాలకి పాల్పడిన వారు, ప్రజల సొమ్మును, ప్రభుత్వ భూములను, ఆస్తులను దిగమింగినవారు, డజన్ల కొద్దీ చార్జ్ షీట్లు వేసినా, జైలుకెళ్ళివచ్చినా చట్టసభలకి వెళ్ళగలుగుతున్న వారు, జనాల మధ్యకి వెళ్లి నీతి నిజాయితీ అంటూ ఉపన్యాసాలిచ్చేవారు చట్టంలో లొసుగులను రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొంటూ దర్జాగా బయట తిరుగుతున్నప్పుడు, రాష్ట్రానికి, దేశానికీ ఎంతో సేవ చేసిన రామలింగ రాజు తను చేసిన నేరాన్ని నిజాయితీగా అంగీకరించి, అందుకు భారీ జరిమానాలు చెల్లించి, జైలు శిక్ష కూడా అనుభవించిన తరువాత మళ్ళీ జైలుకి వెళుతుంటే మనసు చివుకుమానకమానదు.   చట్టంలో లొసుగులను అడ్డుపెట్టుకొని తప్పించుకొని తిరగదలిస్తే బహుశః ఆయన కూడా ఈ జైలు శిక్ష నుండి తప్పించుకోగలిగేవారేమో? కానీ అనేక నేరాలు చేసి బెయిలు పొంది దర్జాగా బయట తిరుగుతున్న వారితో పోల్చి చూసినట్లయితే ఈ పరిస్థితుల్లో కూడా ఆయన నీతి నిజాయితీకి కట్టుబడి ఉన్నందునే జైలుకి వెళుతున్నారనిపిస్తుంది. రేపు ఆయన తరపు లాయర్లు హైకోర్టులో బెయిలు కోసం పిటిషను దాఖలు చేస్తే దానికి కోర్టు ఆమోదం తెలిపితే ఆయనకు కొంత ఉపశమనం దొరుకుతుంది. లేకుంటే మళ్ళీ రాజుగారికి జైలు జీవితం తప్పదు పాపం.

దేవుడా.. ఈరోజు గడిస్తే చాలు...

  ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రజలు, పోలీసుల మనసులలో ఒకే ఒక్క మాట పదేపదే మెదులుతోంది. అది... ‘‘దేవుడా.. ఈరోజు గడిస్తే చాలు’’. అవును ఈరోజు శుక్రవారం.. హైదరాబాద్‌లో భారీగా మసీదుల వద్ద ప్రార్థనలు జరిగే రోజు. ఈరోజున సంఘ విద్రోహ శక్తులు ఎలాంటి విద్రోహ చర్యలకు పాల్పడకుండా, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకుండా వుండాలని అందరూ కోరుకుంటున్నారు. కారణం.. మూడు రోజుల క్రితం వికారుద్దీన్‌తో సహా ఐదుగురు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్లో చనిపోవడమే. నరరూప రాక్షసుల్లాంటి కరడుగట్టిన ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్లో మరణించడాన్ని ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన చర్యగా చిత్రీకరించడానికి కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది మతపెద్దలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.   కొంతమందిలో వికారుద్దీన్ బ్యాచ్ చనిపోవడం ఎంతో బాధ కలిగిస్తోంది. వికారుద్దీన్ అంత్యక్రియలకు వేలాదిమంది హాజరై కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎన్‌కౌంటర్లో చనిపోయింది ఎంతోమందిని చంపిన తీవ్రవాదులన్న విషయం వారిలో ఎవరికీ గుర్తున్నట్టే లేదు. సాక్షాత్తూ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కూడా ఈ తీవ్రవాదులు చనిపోవడం తనకు ఎంతో బాధ కలిగిస్తోందని అంటూ కళ్ళు ఒత్తుకున్నారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.   ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు జరిగే ప్రార్థనల సందర్భంగా పలు ప్రదేశాలలో కొంతమంది రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే అవకాశం వుందని, అలాగే అల్లర్లు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదని పోలీసులు భయపడుతున్నారు. ప్రజల్లో కూడా ఈ భయం వుంది. అందుకే పోలీసులు హైదరాబాద్‌లో శుక్రవారం నాడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. శుక్రవారం నాడు హైదరాబాద్‌లో భారీ స్థాయిలో పోలీసు బలగాలు మొహరించాయి. ముఖ్యంగా మసీదులు ఉన్న ప్రాంతాలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.

హమ్మయ్య! బొగ్గు మసి వదిలింది

  బొగ్గు గనుల అక్రమ కేటాయింపుల కుంభకోణంలో స్వయంగా విచారణకు హాజరుకమ్మని సీబీఐ ప్రత్యేక కోర్టు నుండి నోటీసులు అందుకొన్న మాజీ ప్రధానమంత్రి డా.మన్మోహన్ సింగ్, తనపై పెట్టిన కేసుల విచారణను నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషను వేశారు. దానిని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఆయనపై పెట్టిన కేసులన్నిటిపై స్టే విధించడంతో ఈరోజు ఆయన సీబీఐ కోర్టు బోనులో నిలబడి సంజాయిషీలు ఇచ్చుకొనే కష్టం, అవమానం తప్పింది. ఇక మరో విశేషం ఏమిటంటే, ఆయనతో బాటు బొగ్గు శాఖ మాజీ ప్రధాన కార్యదర్శి పిసి ఫారెక్, కుమారా మంగళం బిర్లా తదితరులు వేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించిన సి.నాగప్పన్ మరియు వి.గోపాల గౌడలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వారికీ స్టే మంజూరు చేసింది. అంతేకాదు వారి పిటిషన్లను విచారణకు ‘అడ్మిట్’ చేస్తున్నట్లు పేర్కొనడం ద్వారా వారందరికీ మరొక మూడేళ్ళ వరకు ఈ కేసుల బాధ నుండి విముక్తి కల్పించింది.   న్యాయ పరిబాషలో ఏ కోర్టయినా పిటిషన్లను విచారణకు స్వీకరిస్తున్నప్పుడు ‘అడ్మిట్’ లేదా ‘గ్రాంట్ ఆఫ్ లీవ్’ అనే పదాలు వాడినట్లయితే ఆ కేసులు కనీసం మూడేళ్ళపాటు పక్కన బెట్టినట్లేనని న్యాయశాఖ నిపుణులు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా వారి పిటిషన్లను ‘అడ్మిట్’ చేస్తున్నట్లు తెలిపింది. ధర్మాసనం తన అడ్మిట్ నిర్ణయానికి కారణాలు వివరిస్తూ “ఈ పిటిషన్లు వేసిన వ్యక్తులు అవినీతి నిరోధ చట్టం 1988లో సెక్షన 13(1) (డి) (3) పై లేవనెత్తిన కొన్ని చట్ట సంబంధమయిన ప్రశ్నలను లోతుగా పరిశీలించవలసి ఉంది గనుక ఈ కేసులను ‘అడ్మిట్’ చేయడమయిందని ప్రకటించింది. కనుక అంతవరకు డా.మన్మోహన్ సింగ్ తో సహా అందరిపై సీబీఐ ప్రత్యేక కోర్టులో నమోదు చేయబడిన కేసుల విచారణను నిలిపివేయడమే కాక వారికి కనీసం మరో మూడేళ్ళవరకు ఈ కేసుల బాధ నుండి విముక్తి కల్పించింది. కనుక డా.మన్మోహన్ సింగ్ బొగ్గు మసి వదిలించుకొన్నందుకు ఆయన, ఆయనతో బాటే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సంతోషపడవచ్చును.

వాళ్ళ మెదడు మోకాలిలో.. వీళ్ళ మెదడు అరికాలిలో...

మంగళవారం నాడు జరిగిన రెండు ఎన్‌కౌంటర్లు దేశంలోనే సంచలనం సృష్టించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది ఎర్రచందనం కూలీలు మరణించగా, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్లో కరడుగట్టిన తీవ్రవాది వికారుద్దీన్‌తో సహా ఐదుగురు తీవ్రవాదులు మరణించారు. ఈ ఎన్‌కౌంటర్ల పట్ల సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఎన్‌కౌంటర్ అయిన తీవ్రవాదులు సామాన్యులు కాదు..  ఎంతోమంది ప్రాణాలు తీసి, ఎన్నో అరాచకాలు చేసిన దుర్మార్గులు. ఈ తీవ్రవాద ముఠా నాయకుడు వికారుద్దీన్ గురించి చెప్పాలంటే పెద్ద గ్రంథం అవుతుంది. ఎంతోమంది పోలీసులను చంపేశాడు. పోలీసుల ప్రాణాలంటే అతనికి పూచిక పుల్లలతో సమానం. పోలీసులను చంపుతానని చెప్పిమరీ చంపుతాడు. ఎన్నో దోపిడీలు చేశాడు. ఎంతోమంది ప్రాణాలు తీశాడు. గతంలో నరేంద్రమోడీని చంపడానికి కూడా పథకాలు వేశాడు. ఇలాంటి తీవ్రవాది గత కొంతకాలంగా జైల్లో అతిథిగా వుంటూ సకల మర్యాదలు పొందుతున్నాడు. జైల్లో వున్న సిబ్బందిని కూడా బెదిరిస్తూ హవా నడిపిస్తున్నాడు. ఇన్నాళ్ళకు వాడి పాపం పండి పైకిపోయాడని జనం హర్షిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికేస్తున్న తమిళనాడు కూలీలది మరో కథ. ఎర్రచందనం స్మగ్లర్లకి వెన్నెముకలాంటివాళ్ళు ఈ తమిళనాడు కూలీలే. భారీ మొత్తాలకు కాంట్రాక్టు కుదుర్చుకుని, వందల సంఖ్యలో తమిళనాడు నుంచి ఏపీ అడవుల్లోకి ప్రవేశించి ఎర్రచందనం చెట్లని నరికేస్తూ వుంటారు. ఎవరైనా ఫారెస్టు అధికారులు కనిపిస్తే, వాళ్ళని కూడా చెట్లతోపాటు నరికేస్తూ వుంటారు. ఈ ఎర్రచందనం కూలీలు ఇప్పటి వరకు ఎంతమందిని చంపేశారో లెక్కేలేదు. వీళ్ళలో కొంతమంది వీరప్పన్ ముఠా సభ్యులు కూడా వున్నారు. వీళ్ళ దగ్గర గొడ్డళ్ళు, కొడవళ్ళతోపాటు అవసరమైతే ఉపయోగించడానికి తుపాకులు కూడా వుంటాయంటే  వీళ్ళు ఎంత ‘ప్రొఫెషనల్సో’ అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సంఘ విద్రోహశక్తులను ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటన మీద కూడా ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రజల విషయం ఇలా వుంటే, రాజకీయ నాయకులకు మాత్రం ఎక్కడలేని నొప్పి వచ్చిపడింది. తమిళనాడుకు చెందిన కూలీలు ఎన్‌కౌంటర్ అయ్యేసరికి మెదడు మోకాళ్ళలో వున్న అక్కడి రాజకీయ నాయకులకు ఎక్కడలేని పౌరుషం, రోషం ముంచుకొచ్చాయి. తమజాతి వాళ్ళని చంపేశారని మొత్తుకుంటున్నారు. అధికార పక్షం, ప్రతిపక్షం ఒక్కటయిపోయి పోటీలుపడి మొసలికన్నీరు కార్చేస్తున్నారు. చనిపోయిన స్మగ్లర్ల మీద సానుభూతి కురిపించేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలకు నష్టపరిహారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పనిలోపనిగా ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు వెళ్ళిన వాహనాలను ధ్వంసం చేసి తరించారు. గతంలో ఈ కూలీలు కమ్ స్మగ్లర్లు ఎన్ని హత్యలు చేసినా ఉలకని పలకని తమిళనాడు నాయకగణం ఇప్పుడు ఇంత హడావిడి చేస్తున్నారు. మరి వాళ్ళ మెదడు మోకాళ్ళలో కాక ఇంకెక్కడున్నట్టు? ఇక ఈ ఎన్‌కౌంటర్లను రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్న ఆంధ్రప్రదేశ్ నాయకులు జగన్, రఘువీరారెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మన ఆరోగ్యాలకి అంత మంచింది. తమిళనాడు నాయకుల పరిస్థితి ఇలా వుంటే, తెలంగాణలో నాయకుల పరిస్థితి మరీ ఘోరం. ముఖ్యంగా ఎంఐఎం, ఎంబీటీ లాంటి మతవాద పార్టీల నాయకులు మాట్లాడుతున్న తీరు దారుణం.. ఐదుగురు కరడుగట్టిన తీవ్రవాదులు మరణించారని ప్రజలంతా హర్షిస్తుంటే, ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతున్న తీరు  జుగుప్స కలిగించేలా వుంది. హేతుబద్ధంగా ఆలోచించాల్సిన ఆయన మెదడు అరికాలిలోకి జారిపోయిన విధానాన్ని సూచించే విధంగా ఆయన తీరు వుంది. పోలీసులు సదరు తీవ్రవాదుల్ని కావాలనే చంపేశారట. సూర్యాపేట ఘటనకు ప్రతీకారంగా తీవ్రవాదుల్ని ఎన్‌కౌంటర్ చేసేశారంట. దీనిమీద ఏవేవో విచారణలు జరిపించాలట... విధినిర్వహణలో పోలీసులు చనిపోయినప్పుడు ఒక్క సానుభూతి వాక్యం కూడా పలకని ఒవైసీ, ఇప్పుడు తీవ్రవాదులు  ఎన్‌కౌంటర్ అయిపోగానే వాళ్ళ తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్న తీరు దారుణం. ఏపీలో అయినా, తెలంగాణలో అయినా ఇలాంటి నాయకులను చూస్తుంటేనే మన సమాజం ఇంకా ఎంత పతనం అయిపోతుందో అనే భయం కలుగుతోంది.

మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకొన్న తులసి రెడ్డి

  ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన సీనియర్ నేత తులసి రెడ్డి రాష్ట్ర విభజన సమయంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పంచనచేరారు. కానీ ఆయన స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ ఎన్నికలలో డిపాజిట్లు కూడా దక్కించుకోలేని విధంగా ఘోరంగా ఓడిపోయి మూతపడిన తరువాత తులసి రెడ్డి పరిస్థితి కూడా అయోమయంగా మారింది. దాదాపు పది నెలలు వేచి చూసిన తరువాత ఆయన పిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డి సమక్షంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.   తన భవిష్యత్ అగమ్యగోచరంగా ఉందనే ఆలోచనతోనే బహుశః ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి ఉండవచ్చును. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కూడా అగమ్యగోచరంగానే ఉందనే సంగతి అందరికీ తెలుసు. అటువంటప్పుడు తులసి రెడ్డి తీసుకొన్న నిర్ణయం పెనం మీద నుండి పొయ్యిలోకి దూకినట్లుంది. కానీ ఎంతగొప్ప రాజకీయ నాయకులకైనా ఏదో ఒక పార్టీ గొడుగు క్రింద ఉన్నంత కాలమే మీడియాలో, సమాజంలో గుర్తింపు ఉంటుంది కనుక ఆయన మళ్ళీ కాంగ్రెస్ పంచన చేరుతున్నారనుకోవాలసి ఉంటుంది. అయితే రాష్ట్రంలో ప్రత్యమ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనుకొంటున్న బీజేపీ తులసిరెడ్డి వంటి కాంగ్రెస్ నాయకుల కోసమే చూస్తున్నప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది.

అవినీతి జగన్.. కేసులు డజన్...

  నీతి నిజాయితీలకు మారు పేరని చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు పోగేసుకొన్నారని ఆరోపిస్తూ సీబీఐ 11 చార్జ్ షీట్లు వేసింది. అవింకా ఒక కొలిక్కి రాక ముందే, ఇప్పడు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ఆయనపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో మరొక కొత్త చార్జ్ షీట్ వేసారు. జగన్ తరువాత అన్ని చార్జ్ షీట్లలో రెండవ ముద్దాయిగా ఉన్న ఆడిటర్ మరియు వైకాపా నేత విజయసాయి రెడ్డి పేరును కూడా ఈడీ తన చార్జ్ షీట్లో చేర్చింది. వారిరువురూ కలిసి జగతీ పబ్లికేషన్స్ ఆస్తుల విలువను పెంచి చూపడం, క్విడ్ ప్రో పద్దతిలో జయలక్ష్మి టెక్స్ టైల్స్ డైరెక్టర్ టి.ఆర్. కన్నన్ చేత జగతీ పబ్లికేషన్స్ లో పెట్టుబడులు పెట్టించడం, తరువాత జగతీ పబ్లిక్షేన్స్ లో నష్టాలు చూపించడం వంటి నేరాలకు పాల్పడ్డారని ఈడీ తన చార్జ్ షీట్లో ఆరోపించింది. ఆ చార్జ్ షీట్ ని విచారణకు స్వీకరించిన సెషన్స్ కోర్టు ఈ కేసుకు యస్.సి. నెంబర్: 106/15ను కేటాయించింది. ఈ కేసులో ప్రధమ ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి, రెండవ ముద్దాయిగా ఉన్న విజయసాయి రెడ్డికి, మూడవ ముద్దాయిగా పేర్కొనబడిన జగతీ పబ్లికేషన్స్ కి మే2వ తేదీన కోర్టుకు హాజరవవలసిందిగా నోటీసులు జారీ చేసింది.   అయితే తలుపులు నమిలి తినేవాడికి అప్పడాలు తినడం ఒక లెక్కా అన్నట్లు ఒకపక్క 11 సీబీఐ చార్జ్ షీట్లలో సీబీఐ కోర్టు కేసులను అవలీలగా ఎదుర్కొంటూ మరోపక్క రాజకీయాలలో చక్రం తిప్పుతున్న జగన్మోహన్ రెడ్డికి ఈడీ వేసిన ఈ కేసును ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదనే చెప్పవచ్చును. దీనిని కూడా వాటితో కలిపి చూసుకొంటే ముచ్చటగా డజను కేసులున్నాయి చెప్పుకొనే సౌలభ్యం ఏర్పడిందిప్పుడు.

శ్రీ సిటీకి ప్రత్యేక పాలానాధికారాలు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకెల్లా అత్యుత్తమయిన పారిశ్రామికవాడగా నిలిచిన శ్రీ సిటీకి ప్రత్యేక పాలనాధికారాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించారు. సుమారు 7,600 ఎకరాలలో నెలకొల్పబడిన ఈ అత్యాధునిక పారిశ్రామికవాడ దేశ విదేశాలకు చెందిన అనేక మధ్య తరహా, భారీ పరిశ్రమలున్నాయి. శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పటికీ అది తమిళనాడు రాజధానికి చెన్నైకి కేవలం 55కిమీ దూరంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని హైదరాబాద్ నగరానికి 600 కిమీ దూరంలో ఉంది. కనుక అక్కడ పరిశ్రమలు స్థాపిస్తున్నవారు ఏ పనిపడినా ఎటువంటి అనుమతులు కావలసినా తప్పనిసరిగా హైదరాబాద్ బయలుదేరక తప్పడం లేదు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల శ్రీసిటీలో వివిధ పరిశ్రమలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడి పారిశ్రామికవేత్తలు ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చేరు. దానికి ఆయన తక్షణమే స్పందిస్తూ శ్రీ సిటీకి ప్రత్యేకంగా ఒక స్థానిక సంస్థను ఏర్పాటు చేసి దానికి కంటోన్మెంట్ తరహాలో పారిశ్రామిక మరియు స్థానిక పాలనాధికారాలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చేరు.   ఆ స్థానిక సంస్థ శ్రీ సిటీలో కర్మాగారాల స్థాపనకు అవసరమయిన అన్ని అనుమతులు మంజూరు చేస్తుంది. మునిసిపాలిటీల మాదిరిగానే ఆ సంస్థ పరిశ్రమలకు నుండి పన్నులు వసూలు చేస్తుంది. అలా వసూలయిన పన్నులతో శ్రీ సిటీలో మౌలికవసతుల కల్పన, పారిశుద్యం వంటి పనులన్నీ చక్కబెడుతుంది. ఆ పన్నులలో కొంత భాగం రాష్ట్ర ప్రభుత్వానికి జమా చేయవలసి ఉంటుంది. శ్రీ సిటీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్న ఈ స్థానిక సంస్థకు నియమనిబంధనలు రూపొందించి, దానికి చట్టబద్దత కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ ప్రయోగం సఫలమయినట్లయితే మున్ముందు మరిన్ని ప్రాంతాలకు ఈ పధకాన్ని విస్తరింపజేయడం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి వేగవంతం చేయవచ్చును.

కడప వైసీపీలో ముసలం

వైసీపీ నాయకుడు జగన్ వైఖరి రాష్ట్ర ప్రజలకు చిరాకు తెప్పిస్తోంది. ఇటీవలి కాలంలో మరీ ముదిరిపోయిన ఆయన వ్యవహార శైలి జనానికి చిరాకు తెప్పిస్తోంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ప్రాజెక్టుల విషయంలో జగన్ అనుసరిస్తున్న విధానాన్ని జనం జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రజలు ఈ ప్రాజెక్టుల విషయంలో జగన్ తీరును తప్పుపడుతున్నారు. రాయలసీమ ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అయితే జగన్ మాత్రం ఆ ప్రాజెక్టువల్ల రాయలసీమకు ఎంతమాత్రం ఉపయోగం లేదని వాదించడం మొదలుపెట్టడంతోపాటు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి, పట్టిసీమ ప్రాజెక్టు వేస్టు అని చెప్పడం ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను వ్యతిరేకించడంతోపాటు ఆ ప్రాజెక్టులను ఇరుగు పొరుగు రాష్ట్రాలు అడ్డుకునేలా ఐడియాలు కూడా ఇస్తున్న జగన్ని ఏమనాలో అర్థంకాక ఆయన వైఖరిని గమనిస్తూ వున్నారు. అయితే జగన్ వ్యవహార శైలి ప్రజలకు ఎంత ఇబ్బందిగా మారిందో, ఆయన పార్టీలోని నాయకులకు కూడా అంతే ఇబ్బందిగా మారింది. జగన్ ఎలాంటి వృధా ఆందోళనలు చేసినా ఆయన వెంట నిలిచిన ఎమ్మెల్యేల్లోనే ఇప్పుడు తిరుగుబాటు వస్తోంది. ముఖ్యంగా పట్టిసీమ విషయంలో రాయలసీమలోని వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ వైఖరిని సమర్థించడం లేదు. మొన్నటి వరకూ గుంభనంగా వున్న ఆ నిరసన ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. అది వైసీపీ పాలిట ముసలంగా మారే అవకాశాలను కూడా తీసిపారేయలేం. వైఎస్ జగన్ పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకించడాన్ని జీర్ణించుకోలేని వైసీపీ ఎమ్మెల్యే జగన్ వైఖరికి వ్యతిరేకంగా గళం విప్పారు. జగన్ కంచుకోటగా భావించే కడప జిల్లాకి చెందిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు) జగన్ వైఖరిని పరోక్షంగా తప్పుపడుతూ, పట్టిసీమ ప్రాజెక్టుకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రాయలసీమకు మేలు జరుగుతుందని ఘంటాపథంగా చెప్పడంతోపాటు పట్టిసీమ కోసం ప్రత్యేక నిధుల కేటాయించాలని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  పట్టిసీమపై ప్రత్యేక చట్టం తెచ్చి ప్రాజెక్టును పటిష్టం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. జగన్‌కి వ్యతిరేకంగా ఆదినారాయణరెడ్డి పట్టిసీమను సమర్థించడం జగన్‌కి పెద్ద షాక్. ఇప్పుడు ఆదినారాయణరెడ్డి ఒక్కరే బయటపడ్డారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా జగన్ వైఖరిని వ్యతిరేకిస్తున్నారని, సమయం, సందర్భం చూసుకుని వారు కూడా జగన్ని వ్యతిరేకిస్తారని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ జగన్ పార్టీలో ముసలం పుట్టింది... ఇక ముందు ముందు ఏం జరగబోతోందో వేచి చూడాలి.

పీవీ స్మృతి చిహ్నం... కాంగ్రెస్‌కి చెంపదెబ్బ

కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా జరిపిన విధ్వంసం నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇది దేశం మొత్తానికీ శుభవార్త. అయితే దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన కాలంలో కొన్ని ప్రయోజనాలు కూడా జరిగాయి. అయితే ప్రయోజనాలకంటే విధ్వంసాలే ఎక్కువ కావడంతో ఆ ప్రయోజనాలన్నీ మరుగున పడిపోయాయి. పీవీ నరసింహారావు కాంగ్రెస్ నాయకుడిగా, ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తెచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాయి. మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన దేశ ప్రజలు రుణపడి వున్న ప్రధానమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత ఆయనను కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ ఆదేశాల మేరకు ఘోరంగా అవమానించింది. పీవీ దేశాన్ని ఎంత ముందుకు తీసుకెళ్ళారో, సోనియాగాంధీ దేశాన్ని అంతకు వందరెట్లు తిరోగమన బాట పట్టించారు. అలాంటి మహానుభావుడికి దేశ రాజధానిలో స్మృతి చిహ్నం ఏర్పాటు చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోయింది. స్మృతి చిహ్నం సంగతి తర్వాత... దేశానికి నాయకత్వం వహించిన ఆయన అంత్యక్రియలు ఢిల్లీలోనే నిర్వహించాలనే బాధ్యతని అప్పుడు మరచిపోయింది. హైదరాబాద్‌లో అత్యంత అవమానకరంగా జరిపిన పీవీ అంత్యక్రియలను దేశ ప్రజలు మరచిపోలేరు. అయితే దేశానికి, కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసిన పీవీ నరసింహారావును కాంగ్రెస్ పార్టీ విస్మరించినా, దేశం విస్మరించలేదు. ఢిల్లీలో పీవీ నరసింహారావు స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్ణయించడం అభినందనీయం. పీవీ స్మృతి చిహ్నం ఏర్పాటు చేయాలన్న మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని పీవీ కుమార్తె, ప్రముఖ విద్యావేత్త వాణీదేవి స్వాగతిస్తున్నారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇంతకాలం పీవీ నరసింహారావును నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ పార్టీకి చెంపదెబ్బ లాంటిదని ఆమె అభివర్ణిస్తున్నారు. తన తండ్రి మరణించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరించిన తీరు ఇప్పటికీ తమకు బాధను కలిగిస్తూ వుంటుందని, అప్పటి కేంద్రమంత్రులు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠం మీద వున్న వైఎస్ రాజశేఖరరెడ్డి తమకు పీవీ స్మృతి చిహ్నం విషయంలో ఎన్నెన్నో వాగ్దానాలు చేసి వాటన్నిటినీ విస్మరించారని ఆమె గుర్తు చేసుకున్నారు. తమ తండ్రి మరణించిన వెంటనే ఆయన భౌతిక కాయాన్ని ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కి పంపించేంతవరకూ కాంగ్రెస్ నాయకులు తమని హడావిడి పెట్టేశారని ఆమె చెప్పారు. తమ తండ్రికి ఢిల్లీలో స్మృతి చిహ్నం ఏర్పాటు  విషయంలో తమ కుటుంబం మొత్తం ఆశలు వదులుకున్న సమయంలో ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయం తమకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వానికి వాణీదేవి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

తెలంగాణ ప్రజలు వైకాపాను ఆదరిస్తారా?

  జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ఆంద్ర, తెలంగాణాలలో వైకాపాను కాపాడుకొనేందుకు చేసిన కృషి గురించి అందరికీ తెలుసు. అందుకోసం షర్మిల ఏకబిగిన 3000 కిమీ పాదయాత్ర చేసారు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయం వలన తెలంగాణాలో కోలుకోలేని విధంగా పార్టీ దెబ్బతినడంతో ఆమె కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరయింది. మడమ తిప్పనని గొప్పగా చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి ఒకసారి తెలంగాణాను విడిచిపెట్టేసి వచ్చేసిన తరువాత మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్లాలని భావిస్తున్నారో తెలియదు కానీ మళ్ళీ తెలంగాణా తన పార్టీని బలపరిచే బాధ్యత సోదరి షర్మిలకే అప్పగించడం విశేషం.   ఆ ప్రయత్నంలో భాగంగా ఆమె పరామర్శ యాత్ర పేరిట తెలంగాణాలో రెండు జిల్లాలలో పర్యటించారు. కానీ మళ్ళీ ఏమయిందో ఏమో గానీ చాలా కాలంగా ఆ ఊసేలేదు. ముందు పార్టీ నిర్మాణం చేసుకొన్న తరువాతనే ఆమె తెలంగాణాలో పర్యటించినట్లయితే పూర్తి ప్రయోజనం ఉంటుందని వైకాపా భావిస్తున్నందు వల్ల కావచ్చు ఆ ప్రయత్నాలు మొదలుపెట్టింది.   వైకాపా పార్టీ రాష్ట్ర కమిటీలో ఏడుగురు కార్యదర్శులు, 8 మంది సంయుక్త కార్యదర్శులు, ఇద్దరు కార్యనిర్వహక సభ్యులను నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాబితాను విడుదల చేసారు. అదే విధంగా పార్టీ ఐటీ వింగ్, గ్రీవెన్స్‌సెల్, పబ్లిసిటీ అండ్ కల్చరల్ వింగ్, ప్రోగ్రాం కో-ఆర్డినేషన్ వింగ్, ట్రేడ్ యూనియన్ వింగ్, యువజన, మైనారిటీ, మహిళా విభాగం వంటి అనుబంధ సంఘాలలోనూ మొత్తం 24 మందిని నియమించారు. తెలంగాణా ప్రజలు వైకాపాను ఆదరిస్తారో తెలియదు కానీ త్వరలో జరుగబోయే జి.హెచ్.యం.సి ఎన్నికలలో దృష్టిలో ఉంచుకుని కమిటీలను విస్తరించినట్లు కనబడుతోంది. ఆ ఎన్నికలలో విజయం సాధించగలిగినట్లయితే తెలంగాణాలో క్రమంగా బలపడవచ్చని వైకాపా భావిస్తున్నట్లుంది.   హైదరాబాద్ జంటనగరాలలో ఆంద్ర ప్రజలు ఎక్కువగా ఉన్నారు గనుక జి.హెచ్.యం.సి ఎన్నికలలో వైకాపా కొన్ని సీట్లు గెలుచుకొనే అవకాశం ఉంది. కానీ ఆ కారణంగా అధికార తెరాసకు, ప్రతిపక్ష పార్టీలయిన తెదేపా, బీజేపీ, కాంగ్రెస్ లకు మంచి పట్టు ఉన్న మిగిలిన జిల్లాలకి వైకాపా విస్తరించగలదని ఆశించడం కష్టం.

బీజేపీ కురువృద్ధుడు అద్వానీ అస్త్ర సన్యాసం చేస్తారా

  నరేంద్ర మోడీకి పార్టీలో కీలక బాధ్యతలు కట్టబెట్టినప్పుడే అలిగి అస్త్ర సన్యాసం చేసిన బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ ఆ తరువాత మోడీతో కొంచెం సర్దుకుపోయినప్పటికీ క్రమంగా ఆయనని పార్టీలో వెనుక బెంచీలకు పరిమితం చేసేయడంతో దాదాపు కనుమరుగయిపోయారు. మీడియాలో ఆయన గొంతు విని చాలారోజులే అయిపోయింది. మళ్ళీ చాలా రోజుల తరువాత ఆయన బెంగళూరులో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకి హాజరయ్యారు. కానీ అక్కడ కూడా ఆయనకు తగిన ప్రాధాన్యత దక్కకపోవడంతో సమావేశాలలో ప్రసంగించేందుకు ఆయన నిరాకరించారు. ఆయనను సమావేశాల ఆరంభానికి సూచికగా జ్యోతీ ప్రజ్వలన కార్యక్రామానికి ఆహ్వానించినప్పటికీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోడీ తదితరులు అందరూ ప్రసంగించారు కానీ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. సమావేశంలో రెండవరోజు ఆయనను మాట్లాడేందుకు ఆహ్వానించినప్పుడు ఆయన నిరాకరించారు. మోడీ కానీ అమిత్ షా గానీ ఆయనను మాట్లాడమని బలవంతం చేయలేదు. కనుక ఇకపై ఇటువంటి సమావేశాలలో ఇక అద్వానీ పాల్గొనకపోవచ్చునని భావించవచ్చును.