ఒక్క క్షణం తర్వాత అంది.
'మీమీ ఈ కోమలి కెందు కింతఅభిమానం?'
'అందుకు పూర్వచరిత్ర చాలావుంది.....ఈపిల్ల, నేను ఎనిమిదేళ్ళు వాడిగా ఉన్నప్పుడు మా ఇంట్లో పుట్టింది. వీళ్ళయ్య వీళ్ళమ్మని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. నెలలు నిండిన తర్వాత పుట్టినింటికికూడా పోలేని బలహీనస్థితిలో మా ఇంటికివచ్చింది. మానాన్నగారు అంతా విని మరేమీ అనకుండా మా పెరట్లో పెంకుటింట్లో వుండమన్నారు. కాన్పు అయ్యాక చూద్దాంలెమ్మని ముప్పొద్దుల మీనాక్షి అమ్మ అన్నం పంపేది. మాతోపాటే ఫలహారాలూ అవీ చేసి పంపేది. మాఇంటి పెద్దాడపడుచుజరిపినట్టు మర్యాదలను జరిపింది. మా అమ్మచూలింతరాలి కోరికలన్నీ తీరాయి....
పండంటికొడుకుని కందామని ఆశతో వున్న ఆమెకి ఈ బంగారు బొమ్మపుట్టింది.
కాన్పు అయిన గంటకంతా వీళ్ళ అయ్యని పిలిపించి చీవాట్లేస్తే మా నాన్నగారితో అతనేమంటాడో తెలుసా? 'మామా' అది అడిగే కోరికలన్నీనే తీర్చలేకే మీకాడికంపాను. మీ ఇంటి కాడ అన్నీ తీర్తాయి అనుకున్నా మావా!'
మానాన్నగారు నువ్వుకుని నామకరణం అదీ చేయించి అన్నీ అయ్యాక బట్టలు పెట్టి పంపారు. కోమల అన్న పేరు పెట్టిందికూడా మా నాన్నగారే!
చిన్నతనమంతా మా ఇంట్లోనే గడిపింది. మా అమ్మాయిల వెంటే అచ్చట్లూ ముచ్చట్లు తీర్చుకుంది!
'అందుకే కోమలికి నేనంటే అంత అభిమానం'
కథంతా విన్న గీతాంజలి మనస్సుసర్లోకములలో తేలియాడినట్లైంది.
'పూర్వజన్మలో పుణ్యంచేసుకున్న పునీతజన్మలంటే వీళ్ళేనేమో! ఎంత హృదయత! ఎంత ఆదరము! ఎంత అభిమానం'
గీతాంజలి మనస్సు ఊగిపోయింది. మధురభావనలతో 'ఈమె గొల్ల పడుచా సారధీ?'
'అవును ఆనాడు శ్రీకృష్ణుడు క్షత్రియుడు అయినా కోరి గొల్లవాడలో ఎందుకున్నాడు అంటే ఇలాంటి కోమల......కోమల చారువిలాసినులు వుండినారు కాబట్టి-అని అనిపిస్తుంది. నాకు మా కోమలను చూస్తే నిజమేకదా?'
'నల్లనివాడు పద్మనాయనమ్ములవాడు'మా వాడు అనుకోగల్గినవాళ్ళు.
వాళ్ళు-వాళ్ళని గురించి నేనేం చెపుతాను. అయినా అది నీకే బాగా తెలుస్తుందికదా'
నవ్వుతూ తన పేరుకు అర్ధం చెపుతున్న గీతాంజలిని చూసినవుకున్నాడు.
'నేనుపార్ధసారథిని గీతా....అంతేకానీ నీవల్ల నటుడిని కాను. ఆ విషయం అనుభవం కావటానికి-అయినా కృష్ణావతారం తల్చుకుంటే నాకాశ్చర్యం వేస్తుంది. బాలకృష్ణుడు - గోపాలకృష్ణుడు-పల్లవీ వల్లటుడు-యాదవరాజు- నీతివిజ్ఞుడు-యుద్దవేత్త-చతురుడు- రుక్మిణినాధుడు-సత్యభామా వల్లభుడు-రాధికాప్రియుడు-
అహో!
ఎన్నిరూపులు!
ఎన్నిరకాల కృష్ణుడు.
ఒక్కోరూపమ్లో ఒక్కో రూపం.
నిజంగా కృష్ణ తత్తం అర్ధంచేసుకోవటం చాలాకష్టం కదా? అతని భావనావేశానికి ముగ్ధురాలైంది.
'గీతను బోధించిన కృష్ణుడు సరజన సమ్మతుడు కదా!'
ఆమెమాటలు విని తన్మయుడయ్యాడు సారధి.
'గీతా! సుగీతా!! నీ యంజలియేనాకు కావలసినది' అన్నాడు ఆమె రెండు చేతులూ పట్టుకుని.
ఆ చేతులలో ముఖం దాచుకుని అంది.
'నీవుపాడిన ఈ గీత నీదే సారధీ'
కాకులు చెట్ల మీదికి వచ్చివాలుతున్నాయ్.
పక్షులుమెల్ల మెల్లగా ఆకాశంలో సుదూర యానానికి సిద్దమవుతున్నాయ్.
చీకటిచలిలాగే మెల్లమెల్లగా ముసురుకుంటోంది.
ఇద్దరూ లేచి నడకసాగించారు.
మౌనంగా సాగిన ఆ నడక వంతెనవద్ద ఆగిపోయింది.
'వస్తా! సారధీ! రేపు కాలేజీకి ఇదే దారిన వస్తావుకదా?'
'అలాగే వెయిట్ చెయ్యాలా?'
'ఆ 9-15కి సరిగా ఇక్కడే'
'గుడ్ బై'
'స్వీట్ నైట్'
నవ్వుకున్నాడు.
'కూర్చో సారధీ'
ముద్దొచ్చేలా మంచి అబ్బాయిలా కూర్చున్నాడు.
'నీకోకథ చెపుతా నన్నానుకదా?'
'అవునొదినా!'
'వింటావా?'
తలూపాడు
'ఎవరు? ఎక్కడా? ఎందుకు? ఎలా? అనేప్రశ్నలు వేస్తే సరజగత్తు అంతా అర్ధం అవుతుంది. ఆ నాలుగు ప్రశ్నలూ వేయనని మాటఇవాలి'
ఒక్కక్షణం ఆగి అన్నాడు.
'మీ మాట మీరనని కదావదినా!'
'సరేవిను.....
ఓ అందమైన అబ్బాయి.....
ఓ అందమైన అమ్మాయి.....
అసలు కథలన్నీ ఎప్పుడూ అందమైన అబ్బాయిలు, అమ్మాయిల మధ్యేవస్తాయి. వాళ్ళని మినహాయించి వుండేకథలు చాలా స్వల్పంకూడా. అందులో అందమైనవాళ్ళకి కథే వుండదా? సహజంగా ఫార్ములాప్రకారం అంటే తెల్సుకదా బి+జి=యల్ అలాగే ఈ అబ్బాయి అమ్మాయిని చూచిన వెంటనే-'రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ' అని కదా అసలు- ప్రేమించేశాడు. హృదయం ఇవటమేకాదు పుచ్చుకున్నాడుకూడా. సామాన్యంగా పెళ్ళిళ్ళెప్పుడూ పెద్దల బాధ్యతతోనే జరగాలి. అవే సర సామాన్యంగా చెడకుండా సాఫీగా సాగుతాయి. అలా కాకుండా ఏ కొందరికో జీవితంలో వలపు అనే మల్లెపందిరివిరుస్తుంది. ఆ మధుమత్తతలో వివాహం చేసుకున్న వాళ్ళే ధన్యజీవులు, ప్రేమజీవులు.
దేవదాస్ పారతులలాగా కాకుండా మల్లమ్మ నాగరాజుల్లా అయ్యే జీవితాలు చాలా అరుదు. సల్పంకూడా!
ఈ అబ్బాయి అబ్బాయిని ప్రేమించాక పెళ్లిచేసుకోవాలని తీర్మానించుకున్నాడు.
అసలు అదే కదా ధర్మం......
వెళ్ళి ఉన్న ఒక్క పెద్ద దిక్కూ అమ్మతో చెప్పుకున్నాడు.
తనప్రణయం.
పరిణామం..
పరిణయం....
అన్నీ-
కానీ-
ఇంకా మన బ్రాహ్మణ కుటుంబాల్లో ఇంట్లో పెద్దవాళ్లకి చాదస్తంవదల లేదు.
ఇంకాసక్కుబాయిలాంటికోడళ్ళు కొరకే ఎదురుచూస్తున్నారు చూస్తారు.
అలాగే ఆ అమ్మగారు మొరాయించింది.
ఆస్తి ఇవ్వనంది.
హక్కులేదంది.
ఏమేమోబెదరించింది.
సార్జిత అంది.
భర్త ఆస్తి భార్యదే అంది.
ఇతనూగట్టివాడే!