ముందు-
ఆస్తి అక్కర్లేదన్నాడు.
తర్వాత....
పిత్రార్జితం అన్నమాటతో, తనకూ సగంవాటా ఉందన్నాడు. దావా వేస్తానన్నాడు....
బెదరిపోయింది.....
బావిలో దూకి చస్తానంది.
నవ్వుకున్నాడు.....
ఆడవాళ్ళంతా బెదిరించే వాళ్ళే ఎక్కువగా......
నిజంగా చస్తాననుకున్న వాళ్ళు ఎవరైనా, ఆడవారైనా బెదిరించరు....
దూకిచస్తే.....
కర్మచేసిసంవత్సరీకం వెళ్ళాకశుభ్రంగా తిరుపతి వెళ్ళి పెళ్ళి చేసుకుంటానన్నాడు.....
బిత్తరపోయింది.
అదేమంచి సమయం అనుకున్నాడు.
బిత్తరచూపులు చూస్తున్న తల్లితో తెలివిగా ఓ మాట అన్నాడు.
'అమ్మా! పెళ్ళికి ముందు చస్తే నీకే నష్టం. తర్వాత చస్తే నీకే లాభం'
అర్ధంకాక 'ఏమిటా?' అన్నట్టు చూసింది.
'తర్వాత చస్తే తద్దినం పెట్టేకొడుకూ.....తల తడిపేకోడలూ ఇద్దరూ ఉంటారు'
ఆ దెబ్బతో ఒప్పుకుంది.
లక్షణంగా పెళ్ళయింది.
కానీ.....
భగవంతుడు ఒక్కోసారి మానవుల్ని చిన్నచూపు చూస్తాడు లోకం కూడా ఒక్కోసారి చక్కనిదాంపత్యానికి దిష్టి పెడుతుంది.
నిజం!
నిజంసారధీ!
లేకపోతేఏమిటి?
పెళ్ళయిన రెండేళ్ళు నిండకముందే పండంటి కూతురును కని కూతురు ముఖం అయినా సరిగా చూడకుండా -స్త్రీకి వరంలాంటి-కూతురికి ఒక్కసారి అయినా స్తన్యం ఇవ్వకుండా-కళ్ళుమూసింది.
ఎంతహృదయ విదారకం!
ఏమంటే బలహీనంఅట!
అమాయకుడైన ఆ భర్తకి ఇక దిక్కేముందు చెప్పు?
పదమూడో నాడు ముద్దొచ్చే ఆ పసికందుని ఒడిలో పెటుకుని దిగాలుగా చూస్తున్న అతనికి లోకం అంతా శూన్యం అనిపించింది.
నిర్లిప్తంగా మూడు మాసాలు గడిచాయి-
ఈ దేశంలో భార్య లేనివాడిని ఊరుకోనివ్వరు కదా-
మరో పెళ్ళికి తొందర పెట్టారు-
తల్లిచెప్పినట్టుగా-
ఒక్కమాట కూడా ఎదురు చెప్పకుండా మరో పెళ్ళి ఒప్పుకున్నాడు.
అక్కడినుంచే ఆంధ్రదేశంలో కథలన్నీ అడ్డంతిరుగుతున్నాయి.
మనిషి మనసుకి కళ్ళెంవేసి నోరుమూసే సంఘటనకూడా అక్కడనుంచే ప్రారంభం అవుతుంది.
మొదట మొదట ఆ సవతి తల్లి ఆ అమ్మాయిని చాలా ప్రేమగా చూసేది.
రెండుమూడేళ్ళు గడిచాక ఆమె వేవిళ్ళొచ్చాయి.
అంతే.....
అంతవరకూ-ఆ అమ్మాయి మీదవున్న అభిమానం అంతా ఒక్కసారిగా తీసివేసినట్టు మారిపోయింది.
ఎవరికైనా తమ సంతనం మీద ప్రేమలూ, కాంక్షలూ అభిమానాలూ అనురాగాలూ ఎక్కువ కదా సారధీ?
అది సహజం కూడా.
తనకన్నా సంతానం మీద వుండే ప్రేమానురాగాలు మరొకరి సంతానం మీదచూపటం.
అది ఊహించుకోలేని విషయం కూడా.
మీమగాళ్ళకి అర్ధం కాకస్త్రీ సవతితల్లిగా పనికిరాదని-మాతృమూర్తిగా మాత్రమే శోభిస్తుందని- ఏవేవో అర్ధంలేని మాటలంటారు.
కాని-
నిజానికి ఆడదాని హృదయం అర్ధం చేసుకున్నదెవరు?
ఆనాటినుంచి ప్రారంభమైన నిర్లక్ష్యం నిర్లిప్తతగా మారి చివరికి కష్టాలుగా రూపొంది ఆ అమ్మాయి తొమ్మిదవతరగతి చదివేటప్పటికి పరాకాష్ట అందుకుని ఆమె చదువుని ఆపించింది.
చదువుకోవాలని తృష్ణ.....
అవకాశహీనత.....
చదువు ఆగిపోయిందే అని ఆవేదన.....
ఆ అమ్మాయికి శాంతిని లేకుండా చేశాయి.
చదువంటే ప్రాణం పెట్టేది.
ముచ్చటగా తయారై ప్రతిదినంతమ ఇంటిమీదుగా బడికి వెళ్ళేతోటి విద్యార్ధుల్ని విద్యార్ధునుల్ని చూసికన్నీరు నింపుకునేది. అప్రయత్నంగా జారబోయిన ఆ కన్నీటిని అలాగే అణుచుకునేది.
చివరికి-ఇంట్లో సామానులు తెస్తే- పొట్లాలు కట్టని వారపత్రికల పేపర్లు జాగ్రత్తగా విప్పి చదివేది.
అసంపూర్తిగా వున్న కథల్ని-తనచదువులాగే అర్ధాంతరంగా ఆగిపోయే కథల్ని- శ్రద్దగా చదివేది.
ఒక్కోసారి తుది మొదలులేని కథలు చదివి కథముగింపూ ప్రారంభం ఎలా వుండి వుంటుందో, ఎలా వుంటే బావుంటుందో ఊహించుకునేది.
ఊహించుకుని నవుకుని-తనూ ఓ కథకురాల్ని అయితే ఎంత బావుంటుందనుకునేది. అంతటి భావుకత-తనకితగదనుకునేది.
ఏదైనా ప్రోత్సాహం ఉత్సాహంఉంటేనే వృద్దికి వస్తుంది సారధీ, ఆ అమ్మాయికి కనీసం ఎస్. ఎస్.ఎల్.సి అన్నా పాసు కావాలని ఆశ. ఇప్పుడు చెప్పు సారధీ ఆ అమ్మాయి ఏం చేయాలి?'
'ఏమైనా ఏం చేస్తుంది వదినా? ఇక్కడికి వచ్చి చదువుకుంటుంది-అంతే'
'నీమాట నిజమే సారధీ.....కానీనిన్న మళ్ళీ మరోఉత్తరం వచ్చింది. తను స్వయంగా రావటానికి ఎన్నో అడ్డంకులున్నాయట. ఏం చేయాలని......'
'మరిప్పుడేంచేయాలి?'
'చేసేదేముందు? నీ పెళ్ళికి పిలుచుకురావాలి'
సారధీకాస్త తటపటాయించాడు.
'మీ అన్నయ్యనే వెళ్ళమన్నారు.....వాళ్ళంటేనాకు అసహ్యం......వెళ్లిసారధిని పిలుచుకునిరమ్మని.
ఏమైనా అంటే మక్కెలైనా విరగదన్నివస్తాడు అన్నారు.'
'తప్పనిసరి అయితే నేనే వెళతానువదినా! అడ్రసివండి' అడ్రసు తీసుకుని అన్నాడు.
'ఇకవెళ్ళొస్తా వదినా? ఎప్పుడు వెళ్ళమంటారు'
'రేపే వెళ్ళాలి సారధీ'
'అలాగే'
వాకిలిదాకా వెళ్ళి మళ్ళీ తిరిగివచ్చి అన్నాడు.
'మీరు ఓ జాబు రాసివ్వండిదివదినా ఆమెకి'
'నీవేరాసెయ్. ఎలా వ్రాయాలో అలాగే రాయి' టకటకా జాబురాసేసి సుభద్ర సంతకం చేశాక అది తీసుకునివెళ్ళిపోయాడు సారధి.
'రామారావుగారు మీరేనాండీ?'
'అవున్నాయనా! లోపలికిరా!! కూర్చో ఎవరయ్యానీవు'