English | Telugu

గ్రాండ్ ఫినాలే సాక్షిగా వ‌క్ర‌బుద్ది చూపించిన ష‌ణ్ముఖ్‌

బిగ్‌బాస్ సీజ‌న్ 5 గ్రాండ్ ఫినాలేలో వీజే స‌న్నీ విజేత‌గా నిలిచాడు. ఆల్ ఎమోష‌న్స్‌ని ప‌లికించిన ప‌రిపూర్ణ‌మైన వ్య‌క్తిగా ఆక‌ట్టుకున్న స‌న్నీత‌న ప్ర‌వ‌ర్త‌న‌తో కోట్లాది మంది హృద‌యాల్ని గెలుచుకుని విజేత అయ్యాడు. బిగ్‌బాస్ టైటిల్ తో పాటు భారీ స్థాయిలోనే ప్రైజ్ మ‌నీని ద‌క్కించుకుని బిగ్‌బాస్ సీజ‌న్ విజేత‌ల్లో హాట్ టాపిక్ గా మారాడు. అయితే ఈ ప‌రిణామం ముందు నుంచి టైటిల్ విజేత‌ను తానే అనుకుంటూ వ‌స్తున్న యూట్యూబ‌ర్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ బిగ్‌బాస్ స్టేజ్ పై త‌న వ‌క్ర బుద్దిని బ‌య‌ట‌పెట్టాడు.

స‌న్నీ విజేత‌గా నిలిచి షాకివ్వ‌డంతో మైండ్ బ్లాక్ అయిన ష‌న్ను స్టేజ్ పై త‌న వ‌క్క బుద్దిని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టాడు. దీంతో అత‌నిపై నెట్టింట ట్రోలింగ్ మొద‌లైంది. ష‌న్ను ర‌న్న‌ర్‌గా నిల‌వ‌డానికి అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌తో పాటు సిరితో వ్య‌వ‌హ‌రించిన తీరే ప్ర‌ధాన కార‌ణం. యూట్యూబ్‌లొ భారీ ఫ్యాన్ బేస్‌ని సొంతం చేసుకున్న ష‌ణ్ముక్ అస‌లు బండారం బిగ్‌బాస్ హౌస్ లోకి వచ్చాకే బ‌య‌ట‌కి తెలిసింది. సిరితో బాత్రూమ్ వ‌ద్ద చేసిన ప‌నుల‌కు, మోజ్ రూమ్ సాక్షిగా సిరిని టార్చ‌ర్ పెట్టిన తీరుకే ష‌న్నుని ప్రేక్ష‌కులు ర‌న్న‌ర్ గా నిల‌బెట్టారు.

అయితే ఇంత జ‌రిగినా.. త‌న‌ని విజ‌యం అప‌హాస్య‌వం చేసినా స‌న్నీని విజేత‌గా నిలిపినా త‌న త‌ప్పేంటో తెలుసుకోలేక గ్రాండ్ ఫినాలే స్టేజ్ సాక్షిగా మ‌రోసారి ష‌న్ను త‌న వ‌క్ర బుద్దిని బ‌య‌ట‌పెట్టాడు. స‌న్నీని విజేత‌గా ప్ర‌క‌టించిన త‌రువాత ర‌న్న‌ర్ స్పీచ్ కావాల‌ని నాగార్జున అడిగితే ష‌ణ్నూ మాట్లాడిన తీరు అత‌ని వ‌క్ర బుద్దిని బ‌య‌ట‌పెట్టింది. `ప‌ర్లేదు.. ప‌ర్లేదు.. విన్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.. ఆట ఎలా ఆడాం అన్న‌దే ముఖ్యం` అంటూ త‌న‌లో దాగి వున్న విషాన్ని వెల్ల‌గ‌క్కాడు. దీంతో నెట్టింట ష‌న్నూని ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు నెటిజ‌న్స్. విన్నింగ్ ముఖ్యం కాదు అన్న‌ప్పుడు ఇన్ని రోజులు హౌస్ లో ఎందుకున్నావ‌ని ర‌న్న‌ర్ గా మిగిలినా ఇంకా బుద్ది రాలేద‌ని తిట్టిపోస్తున్నారు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.