English | Telugu

తమన్నాకు ఇష్టమైన తెలుగు వంటకాలు!

తమన్నా తనను తాను తెలుగమ్మాయిగా ప్రకటించుకుంది. సౌతిండియన్ లాంగ్వేజెస్ అన్నిటిలో సినిమాలు చేసినా ప్రపంచమంతా తనను తెలుగమ్మాయిగా గుర్తిస్తారని చెప్పుకొచ్చింది. ఇప్పుడు తెలుగులో 'మాస్టర్ చెఫ్'కి హోస్ట్‌గా చేస్తోంది. అంతే కాదు... తనకు, తన కుటుంబానికి తెలుగు వంటల్లో ఏవి ఇష్టమో వెల్లడించింది.

"పూత రేకులు, ఆవకాయ... మా ఇంట్లో అందరికీ ఇష్టమైన తెలుగు రుచులు" అని తమన్నా చెప్పింది. తెలుగమ్మాయిగా ప్రకటించుకున్నప్పటికీ... తమన్నా ఇంకా ముంబయిలోనే ఉంటోంది. షూటింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్ నుండి ముంబయి వెళుతుంది. వెళుతూ వెళుతూ అక్కడ ఉన్న స్నేహితుల కోసం అప్పుడప్పుడూ హైదరాబాద్ బిర్యానీ తీసుకువెళతానని, వాళ్లకు అది నచ్చుతుందని చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ వంటల గురించి ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకున్నానని తెలిపింది. త్వరలో జెమినీ టీవీలో 'మాస్టర్ చెఫ్' టెలికాస్ట్ కానుంది.

సినిమాల విష‌యానికి వ‌స్తే ఎప్పుడూ లేనంత బిజీగా మారింది త‌మ‌న్నా. తెలుగులో 'మేస్ట్రో', 'సీటీమార్' సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా 'ఎఫ్‌3', 'గుర్తుందిగా శీతాకాలం' ఫిలిమ్స్‌ సెట్స్ మీద ఉన్నాయి. హిందీలో 'బోలే చుడియా', 'చోర్ నిక‌ల్ కే భాగా' చేస్తోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.