English | Telugu

అది నైట్ త‌రువాతే అంటూ శ్రీ‌ముఖి రచ్చ‌

కోవిడ్ కార‌ణంగా ఓటీటీల‌కు కొత్త ఊపొచ్చింది. దీంతో ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు కుప్పులు తెప్ప‌లుగా రియాలిటీ షోల‌తో పాటు కొత్త కొత్త సినిమాల‌కు శ్రీ‌కారం చుడుతున్నారు. ఇదే క్ర‌మంలో తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ `ఆహా` వ‌రుస‌గా స‌రికొత్త టాక్ షోల‌తో ర‌చ్చ చేయ‌డం మొద‌లుపెట్టింది. ఇటివ‌లే హీరో నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో `అన్ స్టాప‌బుల్‌` ని ప్రారంభించి ఆహా అనిపించారు.

తాజాగా మ‌రో షోకు తెర‌లేపారు. ఇప్ప‌టికే జెమినీ టీవీలో అన‌సూయ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న `మాస్ట‌ర్ చెఫ్‌`కి ధీటుగా `ఆహా` ఓటీటీ కోసం `ఛెఫ్ మంత్ర` పేరుతో కొత్త షోకి శ్రీ‌కారం చుడుతున్నారు. ఇదే ఓటీటీలో మంచు ల‌క్ష్మి హోస్ట్‌గా `ఆహా భోజ‌నంబు` పేరుతో ఓ షోని ఇప్ప‌టికే ప్ర‌సారం చేశారు. దానికి ఆశించిన స్థాయిలో ఆద‌ర‌ణ ద‌క్క‌లేదు. దీంతో మ‌రింత కొత్త‌గా `మాస్ట‌ర్ చెఫ్‌`కి ధీటుగా వుండాల‌ని `ఛెఫ్ మంత్ర‌`ని మొద‌లుపెట్టారు.

స‌రికొత్త‌గా ప్ర‌జెంట్ చేయ‌బోతున్న ఈ షోకు హోస్ట్‌గా బుల్లితెర గ్లామ‌ర్ డాల్ శ్రీ‌ముఖి వ్య‌వ‌హ‌రిస్తోంది. జెమిని టీవీలో ప్ర‌సారం అవుతున్న`మాస్ట‌ర్ చెఫ్‌`కి ఆహా `ఛెఫ్ మంత్ర‌`కున్న తేడా ఏంటంటే ఇందులో ప‌లు రుచిక‌ర‌మైన వంట‌కాల‌ని ప‌రిచ‌యం చేస్తూనే ప‌లువురు సెల‌బ్రిటీల‌తో ఈ షోని మ‌రింత క‌ల‌ర్ ఫుల్‌గా మ‌లుస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేయ‌బోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని ఆహా టీమ్ వ‌దిలింది.

ఈ ప్రోమోలో శ్రీ‌ముఖి, సుహాస్‌, శ్రియా, రెజీనా సంద‌డి చేస్తున్నారు. నాకు దోష కావాలి అని శ్రియ ముద్దు ముద్దుగా అడ‌గ‌డం.. డ్రింక్స్ వున్నాయా అని రెజీనా సంద‌డి చేయ‌డం.. అవ‌న్నీ నైట్ త‌రువాతే అని శ్రీ‌ముఖి బ‌దులివ్వ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. స్సై\సీ జాడీని త‌ల‌పై పెట్టుకుని శ్రియ స్వాతిముత్యం డ్య‌మాన్స్ చేయ‌డం.. అయ్య‌య్యో తేలుతున్నారేంటీ?.. అంటూ శ్రీ‌ముఖి అంటున్న తీరు `ఛెఫ్ మంత్ర‌` షో పై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.