English | Telugu

శ్రీచరణ్ చెప్పాడు...శ్రీముఖి చెక్ మీద సంతకం చేసింది!

వినాయక చవితిని పురస్కరించుకుని జీ తెలుగు "మన ఊరి రంగస్థలం" పేరుతో ఒక ఈవెంట్ చేసింది. ఆ ఎపిసోడ్ ప్రోమో చూస్తే ఫుల్ ఎంటర్టైన్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో ఎన్నో లవ్ ట్రాక్స్ ని చూపించారు. అలాగే గణపయ్య లడ్డూ వేలంపాట కూడా జరిగింది. ఈ ఎపిసోడ్ లో 'సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్' నుంచి కంటెస్టెంట్స్ అంతా వచ్చారు. శ్రీముఖి, శ్రీచరణ్ ఇద్దరూ ఫుల్ ఎంటర్టైన్ చేశారు. మనో, గీతామాధురి పాటలతో అదరగొట్టారు.

బుల్లి తెర మీద రోజూ మనం చూసే షోస్ లో నటీనటులంతా వచ్చి డాన్సులు చేశారు. ఇక ఈ షోలోశ్రీముఖి అల్లరి మాములుగా లేదు. "మీకెప్పుడైనా అందమైన అమ్మాయి కనిపించినప్పుడు ఆ అమ్మాయి వెంట పడ్డారా?" అని మనోని శ్రీముఖిఅడిగింది. "లేదు అది కలగానే మిగిలిపోయింది" అన్నారు మనో . "ఇప్పుడు దాన్ని నిజం చేసుకోండి" అనేసరికివెంటనే రోహిణి లవర్ లా ఎంట్రీ ఇచ్చి మనో ముఖాన్ని తన ఓణీతో తుడుస్తూ "టచప్ గర్ల్ అనుకున్నారా?" అంది. "టచ్ ఇచ్చావుగా మరి" అని అన్నారు మనో గారాలు పోతూ. "పూలు తీసుకురమ్మంటే పూల చొక్కా వేసుకొచ్చావ్.. హేనాటీ" అంది రోహిణి.. "యు లూటీ "అంటూ నవ్వుతూ మనో అనేసరికి రోహిణి షాక్ ఐపోయింది.

ఫైనల్ గా వంద కేజీల లడ్డుకి వేలం పాట పెట్టారు. అందరూ పాడుకుంటారు. హరితేజ లక్ష, భానుశ్రీ రెండు లక్షలు అంటూ పాడుతుండగా "శ్రీముఖి గారి పాట ఐదు లక్షలు" అంటూ శ్రీచరణ్ ఎంట్రీ ఇచ్చాడు. అతను అలా చెప్పగానే ఇలా చెక్ రాసిచ్చేసింది శ్రీముఖి. ఇది అంద‌రి దృష్టినీ విప‌రీతంగా ఆక‌ర్షించింది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.