English | Telugu

వంట‌ల‌క్క‌ని ఆడుకున్న రుద్రాణి

`కార్తీక దీపం` సీరియ‌ల్ రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఈ శ‌నివారం ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార‌బోతోంది. ఈ రోజు 1256వ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతోంది. ఈ రోజు హైలైట్స్ ఏంటో చూద్దాం. అప్పారావు మాట‌లు విన్న సౌంద‌ర్య .. ఆ వ‌చ్చింది మోనితేనండి..ఈ ఊరెందుకు వ‌చ్చిందంటారు? అంటుంది. `సౌంద‌ర్య నేవ్వే అన్నావ్ గా ప్రశాంతంత‌గా వుందామ‌ని.. ఆ రుద్రాణి గొడ‌వ మ‌రిచిపోదాం అనుకుంటే నువ్వు మ‌ళ్లీ ఆ మోనిత‌ని గుర్తు చేయ‌కు. ..` అంటాడు ఆనంద‌రావు. ఇంత‌లో అప్పిగాడు లోప‌లికి వెళ్లి `ఏంటి బావా పిలిస్తే రావు` అంటూనే కార్తీక్ చేతిలోని కాఫీ తీసుకుని వెళ్లి సౌంద‌ర్య‌, ఆనంద‌రావుల‌కి అందిస్తాడు.

Also Read:మోనిత క్రూర‌త్వం.. ఆనంద‌రావు ప‌రిస్థితేంటీ?

కాఫీ తాగుతూ బాగుంది అంటూనే అప్పారావుతో స‌ర‌దాగా మాట్లాడుతారు ఇద్ద‌రు. అప్పుడే అప్పారావు.. త‌న ఫోన్ తీసి మోనిత‌తో తీసుకున్న ఫొటో చూపించి.. మేడ‌మ్ నేను చెప్పినామె ఈమె` అంటాడు. వెంట‌నే సౌంద‌ర్య ఆ ఫొటోని ఆనంద‌రావుకి చూపించి కాఫీకి డ‌బ్బులు ఇచ్చేసి చిల్ల‌ర నువ్వే వుంచుకో` అనేసి ఆనంద‌రావుని చూసి వెంట‌నే అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. సీన్ క‌ట్ చేస్తే..మ‌హాల‌క్ష్మీ బాబుని తీసుకొచ్చి దీప‌కు ఇస్తుంది. `ఇబ్బంది పెట్టాడా మ‌హాల‌క్ష్మీ` అని దీప అడిగితే.. `లేదు దీపా పాలు ప‌ట్టించాను నిద్ర‌పోయాడు.. కానీ రుద్రాణి ఎక్క‌డ మా ఇంటికి వ‌స్తుందో.. బాబుని ఎక్క‌డ చూస్తుందో అని భ‌య‌ప‌డుతూనే వున్నాను` అంటూ బాబుని దీప‌కు అప్ప‌గించి తాను వెళ్లిపోతుంది.

Also Read: రుద్రాణికి కార్తీక్ ఎవ‌రో తెలిసిపోతుందా?

దాంతో దీప ఆలోచ‌న‌లో ప‌డుతుంది. `ఆ రుద్రాణి ఆట క‌ట్టించాలి.. అస‌లే వ‌డ్డీ క‌ట్టాల్సిన గ‌డుపు తీరిపోయింది` అని మ‌న‌సులో అనుకుంటు .. నాన్నా నువ్వు బ‌జ్జో.. నేను ఇప్పుడే వ‌స్తాను` అంటూ బ‌య‌టికి వెళుతుంది దీప‌. క‌ట్ చేస్తే.. రుద్రాణి ఇంట్లో పిల్లి గ‌డ్డం వాడు బాబుని ఊయ‌ల‌లో వేసి ఊపుతూ వుంటాడు. దీప గేట్ తోసుకుంటూ `రుద్రాణి` అని అరుస్తూ ఎంట్రీ ఇస్తుంది..` అర‌వ‌కు దీపా.. అంటూ రుద్రాణి అంటుంది. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతుంది. ఈ డైలాగ్ వార్ లో వంట‌ల‌క్క‌ని రుద్రాణి ఓ ఆట ఆడుకుంటుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? ..దీప బాబుని తిరిగి తీసుకుందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.