English | Telugu
సునీత 1 మినిట్ మ్యూజిక్!
Updated : Aug 29, 2022
సింగర్ సునీత ఎంత ఫేమస్ పర్సనో తెలిసిందే. ఇండస్ట్రీలోనూ ఆమెకు ఎంతో మంచి పేరుంది. 'గులాబీ', 'ఎగిరే పావురమా' మూవీస్ తో మంచి పేరు తెచ్చుకున్న సింగర్ ఆమె. చిన్న వయస్సులోనే గాయనిగా కెరీర్ మొదలుపెట్టిన సునీత వేల పాటలు పాడారు. అలాగే 500 కంటే ఎక్కువ సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వర్క్ చేశారు. ఇప్పుడు తన ఫాన్స్ కి ఒక గుడ్ న్యూస్ చెప్పారు. అదే #1 మినిట్ మ్యూజిక్ టైటిల్ తో వీడియోస్ చేస్తున్నట్లు చెప్పారు. దానికి తగిన ఏర్పాట్లన్నీ పూర్తిచేసినట్లు తెలిపారు.
సునీత ఏ పాట పాడినా ఎవ్వరైనా సరే అలా ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోకుండా వుండరు. ఒక పక్కన "పాడుతా తీయగా" షోకి జడ్జి గా చేస్తూ మరో వైపు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నారు సునీత. ఇక తాను స్టార్ట్ చేయబోతున్న ఈ న్యూ కాన్సెప్ట్ కి ఆమె ఫాన్స్ ఫిదా అవుతున్నారు. "మీ గొంతు వినడానికి మేము సిద్ధం" అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.