English | Telugu

బిగ్ బాస్ సిరిపై శ్రీ‌హాన్ షాకింగ్ కామెంట్స్‌

బిగ్‌బాస్ గ‌త సీజ‌న్‌లో సిరి హ‌న్మంత్‌ చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ష‌ణ్ముఖ్‌తో క‌లిసి మోజో రూమ్‌, బాత్రూమ్‌ వ‌ద్ద వీళ్లు చేసిన హంగామా వీరిని సోష‌ల్ మీడియాలో విల‌న్లుగా మార్చింది. అంతే కాకుండా బిగ్ బాస్ అన్ని సీజ‌న్ల‌తో పోలిస్తే వ‌ర‌స్ట్ జోడీగా వీరిని నెటిజ‌న్లు నెట్టింట ట్రోల్ చేసిన విష‌యం తెలిసిందే. హ‌గ్గులు, అంద‌రిని ప‌క్క‌న పెట్టి క్లోజ్‌గా వుండ‌టం, స‌న్నీని టార్గెట్ చేయ‌డం వంటి కార‌ణాల వల్ల చాలా వ‌ర‌కు త‌మ పాపులారిటీని పోగొట్టుకున్న ఈ జంట చివ‌రికి నెటిజ‌న్ల‌ దృష్టిలో విల‌న్లుగా మారింది. దీని కార‌ణంగా ష‌ణ్ముఖ్ - దీప్తి సున‌య‌న‌, సిరి హ‌న్మంత్ - శ్రీ‌హాన్ మ‌ధ్య దూరం పెరిగిందంటూ వార్త‌లు వినిపించాయి.

ష‌ణ్ముఖ్ - సున‌య‌న మాత్రం ఏకంగా బ్రేక‌ప్ చెప్పుకోవ‌డం ప‌లువురిని షాక్‌కు గురిచేసింది. వీళ్ల లాగే విడిపోయార‌నుకున్న సిరి - శ్రీ‌హాన్ బిగ్ బాస్ సీజ‌న్ త‌రువాత క‌లిసి పార్టీలు చేసుకుంటూ రూమ‌ర్ల‌కు చెక్ పెట్టారు. సిరి బ‌ర్త్ డేకి త‌న‌కు ప్ర‌త్యేకంగా విషేస్ తెలియ‌జేసిన శ్రీ‌హాన్‌ త‌మ మ‌ధ్య‌ ఎలాంటి అపోహ‌లు, అపార్థాలు లేవంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక తాజాగా సిరి గురించి ఎవ‌రికీ తెలియని విష‌యాలు చెప్పి ఆమె ఎమోష‌న‌ల్ అయ్యేలా చేశాడు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ల‌తో యాంక‌ర్ ర‌వి స‌ర‌దాగా ఓ వీడియో చేశాడు. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది.

ఇందులో సిరి గురించి శ్రీ‌హాన్ ఓ వీడియో సందేశాన్ని పంపించాడు. సిరి గొప్ప‌తనం, త‌ను ఎవ‌రి అండ లేకుండా ఎదిగిన తీరుని వివ‌రించి సిరి ఎమోష‌న‌ల్ అయ్యేలా చేశాడు. 'సిరిని అర్థం చేసుకోవ‌డానికి చాలా టైం ప‌డుతుంది. నాకిప్ప‌టికీ ప‌డుతూనే వుంది'. అంటూ చెప్పుకొచ్చాడు. 'సిరి ఏదైనా సాధించాలంటే ఎలాంటి క‌ష్టాలు వ‌చ్చినా దేన్నీ పట్టించుకోదు. త‌ను వైజాగ్ లో ఉన్న‌ప్పుడు హైద‌రాబాద్ వ‌చ్చి కొన్ని సాధించాల‌నుకుంది. యాంక‌రింగ్ చేసుకుంటూ సీరియ‌ల్స్‌, సినిమాలు చేసింది. మొన్న‌టి బిగ్ బాస్ వ‌ర‌కు మొత్తం త‌న క‌ష్ట‌మే. ఎవ‌రూ సాయం చేసింది లేదు' అని శ్రీ‌హాన్ అన‌డంతో సిరి ఒక్క‌సారిగా ఎమోష‌న‌ల్ అయింది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.