English | Telugu

మ‌న‌సులో కోరిక బ‌య‌ట‌పెట్టిన రోజా.. పంచ్ వేసిన హైప‌ర్ ఆది

రాజ‌కీయాల్లో య‌మ బిజీగా వుంటూనే జ‌బర్ద‌స్త్ కామెడీ షోకు కూడా టైమ్ ని కేటాయిస్తూ హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు సీనియ‌ర్ న‌టి రోజా. జ‌బర్ద‌స్త్ కామెడీ షోకు సింగ‌ర్ మ‌నోతో క‌లిసి జ‌డ్జ్ గా వ్య‌వ‌హరిస్తున్న రోజు త‌న‌దైన పంచ్ ల‌తో కంటెస్టెంట్ ల‌ని చెడుగుడు ఆడేస్తున్నారు. అయితే అలాంటి రోజాపై కూడా ఒక‌రు పంచ్ లు వేస్తూ ఆట‌ప‌ట్టిస్తున్నారు. న‌వ్వులు పూయిస్తున్నారు. అత‌నే హైప‌ర్ ఆది. హీరోయిన్ గా రోజా ఎంత‌టి పాపులారిటీని సొంతం చేసుకున్నారో ఇప్ప‌టికీ అదే స్థాయి పాపుల‌రిటీని మెయింటైన్ చేస్తూ హంగామా చేస్తున్నారు.

తెలుగు, త‌మిళ భాష‌ల్లో వున్న టాప్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించి ఔరా అనిపించిన రోజా ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో కొన‌సాగుతూనే జ‌బర్ద‌స్త్ కామెడీ షోలోనూ ఓ వెలుగు వెలుగుతున్నారు. ఈ నేప‌థ్యంలో తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలో రోజా.. మ‌హేష్ బాబుపై చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడున్న హీరోల్లో రోజా ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే హీరో మ‌హేష్ బాబు. తాజా ప్రోమోలో త‌న‌పై రోజా కామెంట్ లు చేసింది. ఇదే ప్రోమోలో రోజా హోమ్ టూర్ కు సంబంధించిన వీడియోని చూపించారు.

Also Read:మ‌రో ఐట‌మ్ సాంగ్ లో పూజా హెగ్డే!?

ఈ వీడియోలోనే రోజా .. మ‌హేష్ బాబుపై ఆస‌క్తిక‌ర కామెంట్ లు చేశారు. న‌గ‌రిలో వున్న ఎమ్మెల్యే రోజా నివాసానికి హైప‌ర్ ఆది అండ్ టీమ్ హోమ్ టూర్ కి వెళ్లారు. హాలులో వున్న వెంక‌టేశ్వ‌ర స్వామి ఫొటో చూసిన హైప‌ర్ ఆది.. "ఆయ‌న‌ని ఏం కోరుకుంటార‌మ్మా?" అని రోజాని అడిగాడు. కృష్ణ‌గార‌బ్బాయి మ‌హేష్ బాబు తో క‌లిసి సినిమా చేయాల‌ని ఉంద‌ని త‌న మ‌న‌సులోని కోరిక‌ని బ‌య‌ట‌పెట్టింది. వెంట‌నే హైప‌ర్ ఆది పంచ్ వేశాడు. `కృష్ణ‌.. రామ అనుకోక ఎందుకండి మ‌న‌కీ కృష్ణ‌గారి కొడుకు` అని ఆది పంచ్ వేయ‌డంతో రోజా .. ఆదిని ఎడ‌మ‌చేత్తో కుమ్మేసింది. ప్ర‌స్తుతం ఈ ప్రోమో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ తాజా ఎపిసోడ్ ఈ గురువారం రాత్రి ప్ర‌సారం కానుంది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.