English | Telugu

రంభకు ప్రపోజ్ చేసిన రోబో...

సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో భలే క్యూట్ గా ఉంది. ఈ షోకి రంభ, జెడి.చక్రవర్తి జంటగా వచ్చారు. రంభ రావడమే ఎప్పుడెప్పుడు ప్రొపోజ్ చేద్దామా అన్నట్టుగా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అందులో ఒక రోబో కూడా రెడీ ఐపోయి మరీ వచ్చింది. "ప్రపంచంలో నచ్చినవి రెండే రెండు. ఒక నేను ఒకటి మీరు" అంటూ చిట్టి ది రోబో వచ్చి రంభకి మెరిసే కళ్ళతో ప్రొపోజ్ చేసేసరికి రంభ కూడా ముద్దులిచ్చేసింది. తర్వాత చామంతి సీరియల్ టీం నుంచి ఆశిష్ వచ్చి రోబో కంటే ఎక్కువగా లవ్ చేస్తున్నాను అంటూ రంభకి గులాబీలు ఇచ్చి మరీ ప్రొపోజ్ చేసాడు.

అందమైన పూలన్నీ కలిసి ఒక దగ్గర ఉంటే ఇంకెంత అందంగా ఉంటుందో మీరే చూస్తారు అంటూ బ్యాక్ గ్రౌండ్ లో ఒక వాయిస్ రావడం జెడి చక్రవర్తి ఒక కర్టైన్ ని తీసేయడం ఆ వెంటనే అందమైన గులాబీలు పేర్చిన రంభ చిత్రం రావడం చూస్తే ఎవ్వరైనా సరే మెస్మోరైజ్ కాకుండా ఉండరు.. రమ్య కూడా గులాబీలలో తన అందాన్ని చూసుకుంది. ఇంతలో అష్షు వచ్చి జెడి గారు మీ సర్ప్రైజ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అని అడిగింది. వెంటనే ఆయన ఒక సారి నీ పేరు చెప్పు అన్నాడు చక్రవర్తి. రవి వెంటనే రంభ అనేసరికి ఆయన గుండెల్లోంచి రంగురంగుల హార్ట్ ఎమోజిస్ బయటకు వస్తున్నట్టు ఒక గ్రాఫిక్ పెట్టారు. అంతే రంభ వెంటనే "ఇది ఎప్పుడో చూపించారు" అని జెడి పరువు తీసేసింది. ఇక రంభ, జెడి చక్రవర్తి కలిసి బొంబాయి ప్రియుడు మూవీలో నటించారు. ఇందులో వీళ్ళ నటన ఎంతో సహజంగా ఉంటుంది. అలాగే ఈ జోడి "కోందండ రాముడు" అనే మూవీలో కూడా కలిసి నటించారు. వీళ్ళ మధ్య మంచి బాండింగ్ అప్పటినుంచి ఉంది. ఇప్పుడు రంభ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.


Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.