English | Telugu

ఒక పన్ను మిస్ అయ్యింది..అది సెట్ అయ్యాకే నా చెల్లి పెళ్లి..కామెడీ పోస్ట్ తో రవి కౌంటర్! 


ప్రియాంక సింగ్ బుల్లి తెర మీద మంచి ఫేమస్ పర్సన్. బిగ్ బాస్ - 5 లో పాల్గొని ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది. ఇకపోతే కొద్దిరోజులుగా ప్రియాంకాసింగ్ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టే తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన హల్దీ ఫంక్షన్ ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఎల్లో కలర్‌ లెహంగాలో పెళ్ళికూతురిలా ముస్తాబైన ఫొటోస్ ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది ప్రియాంక.

ఇవన్నీ చూసి ఆమె పెళ్లి చేసుకోబోతుందంటూ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇంకేముంది అందరూ కంగ్రాట్స్‌ ప్రియాంక అంటూ విషెస్‌ పోస్ట్ చేస్తున్నారు. నిజంగానే పెళ్లా లేదంటే ఏదైనా షూటింగ్ కి సంబంధించిన ఫొటోసా అనే ప్రశ్నలు కూడా వచ్చాయి. ఐతే ఇప్పుడు యాంకర్ రవి ఒక ఇంటరెస్టింగ్ పోస్ట్ ఒకదాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పెట్టి అందరిని షాక్ అయ్యేలా చేసాడు " నా చెల్లి పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది..ఎందుకంటే ఈ ఎత్తు పళ్ళల్లోంచి ఒక పన్ను మిస్ అయ్యింది. అది సెట్ చేసాక పెళ్లి చేస్తాం" అంటూ పెట్టిన ఒక కాప్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇక ఈ ఇన్స్టాగ్రామ్ వీడియోలో ప్రియాంకాసింగ్ ఎత్తుపళ్లతో ఉన్న ఫిల్టర్ వాడి మంచి ఫన్ క్రియేట్ చేసింది. ఇక నెటిజన్స్ ఈ వీడియోకి కామెంట్స్ చేశారు. ప్రియాంకాసింగ్ పెళ్లి అంటూ వస్తున్న వార్తలకు, రూమర్స్ కి భలే చెక్ పెట్టారు అంటూ కామెంట్ చేసారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.