English | Telugu

ర‌ష్మీ పెళ్లి కుదిరింది.. సుధీర్ ప‌రిస్థితి?

'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌', 'ఢీ' షోల‌తో పాపులారిటీని సొంతం చేసుకుంది ర‌ష్మీ గౌత‌మ్‌. సుధీర్‌-ర‌ష్మీ జంట‌కు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. కొన్నేళ్లుగా బుల్లితెర‌పై వీరు చేస్తూ వ‌స్తోన్న హంగామాకు ల‌క్ష‌ల సంఖ్య‌లో అభిమానులు ఉన్నారు. ఆ ఇద్ద‌రూ నిజ జీవితంలో జంట‌గా మారాల‌ని ఎదురుచూస్తున్న వారి సంఖ్య కూడా త‌క్కువేమీ కాదు. తెర‌పై వీరి రొమాంటిక్ ట్రాక్ కార‌ణంగానే వారికి భారీ సంఖ్య‌లో ఫ్యాన్స్ ఏర్ప‌డ్డారు. లేటెస్ట్‌గా ఆ ఫ్యాన్స్ అంద‌రికీ షాకిచ్చింది ర‌ష్మీ. తొమ్మిదేళ్లుగా పెళ్లి ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఏమారుస్తూ వ‌చ్చిన ఆమె.. ఇప్పుడు త‌న పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది.

ఒక‌వైపు ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌తో ఆక‌ట్టుకుంటూ వ‌స్తోన్న ర‌ష్మీ.. సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోషూట్‌ల‌తో కుర్ర‌కారుని హీటెక్కిస్తోంది. విజువ‌ల్ ట్రీట్‌తో వారి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తొమ్మిదేళ్ల‌కు పైగా జ‌బ‌ర్ద‌స్త్ వేదిక‌గా సుధీర్‌తో రొమాంటిక్ ట్రాక్ న‌డుపుతూ వ‌చ్చిన ఆమె.. ఇప్పుడు సుధీర్ ఆ షో నుంచి త‌ప్పుకోవ‌డంతో సింగిల్ అయిపోయింది.

ఆ ఇద్ద‌రికీ రోజా బుల్లితెర‌పై పెళ్లి చేసి, ముచ్చ‌ట తీర్చుకున్న త‌ర్వాత‌.. చాలా షోల‌లో సుధీర్‌-ర‌ష్మీ ప‌ర‌స్ప‌రం త‌మ ప్రేమ‌ను చాటుకుంటూ త‌మ‌పై వ‌చ్చిన వ‌దంతుల‌కు మ‌రింత ఆజ్యం పోస్తూ వ‌చ్చారు. ఇటీవ‌ల 'జ‌బ‌ర్ద‌స్త్‌'తో పాటు 'శ్రీ‌దేవి డ్రామా కంపెనీ'ల నుంచి త‌ప్పుకున్న సుధీర్‌.. స్టార్ మా చాన‌ల్‌లో వ‌రుస షోలు చేసుకుంటూ పోతున్నాడు. మ‌రోవైపు ర‌ష్మీ మాత్రం జ‌బ‌ర్ద‌స్త్‌ను అంటిపెట్టుకొని ఉండిపోయింది.

9 సంవ‌త్స‌రాలుగా పెళ్లిపై స్పందించ‌ని ర‌ష్మీ, ఇప్పుడు 'శ్రీ‌దేవి డ్రామా కంపెనీ'లో పెళ్లి గురించి చెప్పి షాకిచ్చింది. ఆ షోలో 'అక్కా! బావెక్క‌డ?' అనే స్పెష‌ల్ ఎపిసోడ్ చేశారు. అందులో "తొమ్మిదేళ్లుగా అడుగుతున్నారు కదా.. ఆ ప్ర‌శ్న‌కు ఈ రోజు ఇప్పుడు స‌మాధానం చెప్ప‌బోతున్నాను. పెళ్లి కుదిరింది" అంటూ చెప్పి ర‌ష్మీ సిగ్గుల మొగ్గ‌యింది ర‌ష్మీ. జూలై 24న ప్ర‌సారం కానున్న లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.