English | Telugu
దసరాకు నా పెళ్లి.. అందరూ ఆహ్వానితులే!
Updated : Sep 4, 2022
బుల్లితెర మీద కనిపించే యాంకర్ రష్మీ అంటే ఆడియన్స్ ఫుల్ క్రేజ్ ఉంది. సుధీర్ తో ఆన్ స్క్రీన్ లవ్ ట్రాక్ అంటే ఇంకా ఇష్టం. ఐతే ఇప్పుడు ఎవరి దారి వాళ్ళు చూసుకునేసరికి అందరూ రష్మిని పెళ్ళెప్పుడు..పెళ్ళెప్పుడు అంటూ అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు రష్మీ గౌతమ్ ఆన్సర్ ఇచ్చేసి అందరికీ షాకిచ్చింది.
ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ లో తన పెళ్లిపై ఒక క్లారిటీ ఇచ్చింది రష్మీ. ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను స్కిట్ లో ఒక సీనియర్ ఆర్టిస్ట్ వచ్చి "రష్మీ త్వరగా పెళ్లి చేసుకో వయస్సు అయిపోతోంది" అని అనేసరికి రష్మీ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. "అన్నట్టు చెప్పడం మర్చిపోయా.. నెక్స్ట్ మంత్ నా పెళ్లి" అని చెప్పింది. ఎవరితో అని అడిగేసరికి వచ్చే నెల దసరా ఈవెంట్ ఉంది కదా.. ఆ ఈవెంట్ లో నా పెళ్లి. మన పెళ్లిళ్లన్నీ ఈవెంట్లలోనే జరుగుతాయి .. బయట జరగవ్" అంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక స్కిట్ ఫైనల్ లో గెటప్ శీను కూడా రష్మీ మీద పంచ్ డైలాగ్ వేస్తాడు .."రష్మీ నువ్వు కూడా పెళ్లి చేసుకో ..ఇల్లరికం ఉంటె ఎంత బాగుంటుందో తెలుసా..ఎంచక్కా ఉండొచ్చు" అనేసరికి రష్మీ కూడా ఏం అనాలో తెలీక అలా సైలెంట్ గా ఉండిపోతుంది. రష్మీ జబర్దస్త్ తో ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. సోషల్ మీడియాలో కూడా బాగా ఆక్టివ్ గా ఉంటుంది.