English | Telugu

గెలిచిన లక్షని తన యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ కే అన్న రష్మీ...

సిక్స్త్ సెన్స్ సీజన్ 6 ఈ వారం భలే హుషారుగా సాగింది. ఇందులో రష్మీని కొన్ని ప్రశ్నలు వేసాడు ఓంకార్. "ఒక ఐలాండ్ లో ఉండిపోతే నీకు కంపెనీ ఎవరు ఉంటే బాగుంటుంది" అనుకుంటారు అనేసరికి "సుధీర్ ఉంటే బాగుండు" అని అనుకుంటాను అని చెప్పింది. తర్వాత "మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అని అడిగేసరికి నేను బ్రహ్మాజీ గారు బాయ్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్" అని చెప్పింది..."మీ బాయ్ ఫ్రెండ్ కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏమిటి .." అంటే ఏం చెప్తారు అని ఓంకార్ అడగడంతో "మనిషి కన్ఫ్యూషన్ లో ఉండకూడదు..ఏది అనుకుంటాడో అదే చెప్పాలి..అదే చేయాలి... అదే ముఖ్యమైన క్వాలిటీ ..." అని చెప్పింది. " మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అంటే ఏం చేయాలి" అని అడిగేసరికి " ఒక స్ట్రీట్ యానిమల్ ని అడాప్ట్ చేసుకోవాలి. నా గుడ్ బుక్స్ లో రావాలి అంటే అదే చాలా తేలికైన దారి. వైజాగ్ లోని దువ్వాడలో ఒక యానిమల్ షెల్టర్ కట్టాను. అది పూర్తిగా కాలేదు ఇంకా.

ఐతే ఈ రెండు మూడేళ్ళలో దాని మీద ఫుల్ కాన్సంట్రేషన్ పెట్టాలి అనుకుంటున్నా..ఐతే ఆ షెల్టర్ లో మాత్రం 14 వీధి కుక్కలు ఉన్నాయి" అని చెప్పింది. తర్వాత గేమ్ లో భాగంగా ఎగ్ బ్రేక్ చేసి లక్ష రూపాయలు గెలుచుకుంది రష్మీ. ఈ డబ్బులు నా బంబుల్ బడ్డి యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కి ఖర్చు చేస్తాను అని చెప్పింది. అలాగే తన గేమ్ లో భాగంగా తనకు అవసరమైన సలహాలు ఇచ్చినందుకు బ్రహ్మాజీకి ఆ లక్ష రూపాయల్లో సగం ఇస్తాను అని ఒప్పుకుంది రష్మీ. ఇలా ఈ గేమ్ పూర్తి చేసింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.