English | Telugu

నూకరాజు మీద మనసు పడిన ప్రేమ ఫన్నీ జాతకం ఫుల్ ఎంటర్టైన్ !


"నవరాత్రి ధమాకా" పేరుతో ఇటీవల ప్రసారమైన షో ఆద్యంతం నవ్వులతో ముంచెత్తింది. ఈ షోకి గెస్టులుగా ప్రేమ, సంఘవి వచ్చారు. హోస్ట్ గా రవి, సిరి హన్మంత్ చేశారు. ఇక ఈ షోలో నూకరాజు, పంచ్ ప్రసాద్ చిలక జోస్యం చెప్పేవారిగా చేసిన స్కిట్ అద్భుతంగా పండింది. ఇందులో ప్రేమ జాతకం చెప్పాలంటూ చిలకతో ఒక కార్డు తీయించి " నూకరాజు అనే అతని మీద మీరు మనసు పడ్డారు. అతన్ని మీరు ప్రేమిస్తున్నారు..అతను లేకపోతే మీరు ఆత్మహత్య చేసుకుంటారు " అంటూ తనకు హీరోయిన్ ప్రేమ అంటే ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పాడు నూకరాజు.

ఇక సంఘవి జాతకం చెప్తూ " రవి అనే అతను మీమీద కన్నేశాడు. ఆ రవిని తప్పించుకునే పరిష్కారం ఏమిటి అంటే నూకరాజుని మీరు ఒక్కరోజైనా పెళ్లి చేసుకోవాలి" అని రాసుంది ఈ కాగితంలో అంటూ చెప్తాడు. సంఘవి నవ్వేస్తుంది.. తర్వాత "చెప్పు తల్లి నూకరాజు మీద మీ అభిప్రాయం" అంటూ ప్రేమను అడిగేసరికి "బాగున్నాడు, నచ్చాడు, పెళ్లి చేసుకుంటాను" అంటుంది ప్రేమ..."ఐతే నూకరాజు వస్తే ఒక ముద్దిస్తారా " అని అడుగుతాడు. "అంత సీను లేదులే" అని చెప్పి నవ్వేసింది ప్రేమ.

ఇక ఫైనల్గా నూకరాజుకి ఫన్నీ జాతకాన్ని చెప్పి రచ్చ రవి ఎంటర్టైన్ చేసాడు. "ఎందుకో..నువ్వు మళ్ళీ గ్యాప్ తీసుకుంటే బెటర్ అనిపిస్తోంది " అని ఆది రచ్చ రవికి చెవిలో చెప్పేసరికి "నేను గ్యాప్ తీసుకోవడానికి రాలేదు బ్రో...అందరికీ గ్యాప్ ఇద్దామని వచ్చా" అంటూ పంచ్ వేసాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.