English | Telugu
హిమతో పెళ్లికి రెడీ.. ఏర్పాట్లలో నిరుపమ్!
Updated : Jun 17, 2022
`కార్తీక దీపం` ఈ శుక్రవారం 1380వ ఎపిసోడ్ లోకి ఎంటరైంది. ఈ రోజు విశేషాలేంటో చూద్దాం. ఎపిసోడ్ ప్రారంభంలో... `ఈ ఇంట్లో పెళ్లి పనులు మొదలు కావాలి. హిమని నేను పెళ్లి చేసుకుంటున్నాను. ముందు మీరు వెళ్లి షాపింగ్ చేయండి.. ఆ తరువాత అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లి హిమ లేని సమయంలో వాళ్లకి విషయం చెప్పండి` అని స్వప్న, సత్యలకు ఆర్డర్స్ వేస్తాడు నిరుపమ్. తను చెప్పినట్లే స్వప్న, సత్యలు పనులు ప్రారంభిస్తారు.
కట్ చేస్తే.. సౌందర్య ఉదయాన్నే లేచి.. దీప, కార్తీక్ ల ఫొటో ముందు నిలబడి `పెళ్లిరోజు శుభాకాంక్షలు పెద్దోడా.. దీపా.. ఈ రోజు ఏంటో చాలా రోజుల తరువాత ప్రశాంతంగా నిద్రపట్టింది` అంటుంది. ఇదే సమయంలో స్వప్న, సత్యలు వచ్చి నిరుపమ్ అన్న మాటల్ని చెవిన వేస్తారు. `ఇంట్లో పెళ్లి పనులు మొదలు పెట్టాలని.. పసుపు కొట్టమని చెప్పాడని, హిమని నిరుపమ్ పెళ్లి చేసుకుంటానన్నాడని, తనని తీసుకుని మీరు అక్కడికే వచ్చేయండని చెప్పి స్వప్న, సత్యలు వెళ్లిపోతారు. విషయం విని సౌందర్య, ఆనందరావులు ఆనందపడతారు.
కట్ చేస్తే.. జ్వాలకు నిరుపమ్ ఫోన్ చేస్తాడు. నువ్వు మా ఇంటికి రావాలంటాడు. మీరు పిలవాలే గానీ రాకుండా వుంటానా డాక్టర్ సాబ్ అంటుంది జ్వాల. అయితే ఓ అరగంట ఆగి రమ్మని చెబుతాడు అలాగే అంటుంది జ్వాల. జ్వాల రాగానే హిమకు క్యాన్సర్ అని, హిమని తప్ప నేను మరెవరిని పెళ్లి చేసుకోలేనని , ఈ జన్మకు తనే నా భార్య అని చెప్పేస్తానని ప్రిపేర్ అవుతుంటాడు నిరుపమ్. ఆ తరువాత ఏం జరిగింది? .. నిరుపమ్ చేస్తున్న హడావిడి హిమ, జ్వాలలకు తెలిసిందా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.