English | Telugu

బిగ్ బాస్ లో ఈ సారి కెప్టెన్సీ పదవి లేదు.. హౌస్ లో ముగ్గురు ఛీఫ్ లు వాళ్ళెవరంటే!

బిగ్ బాస్ హౌస్ లో రెండో రోజు గొడవలతో, టాస్క్ లతో ఫుల్ కంటెంట్ దొరకింది. అయితే ఈసారి హౌస్ లో కెప్టెన్లు లేరంటూ ముందే బిగ్‌బాస్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కెప్టెన్లు కాకుండా ఆ ప్లేస్‌లో ముగ్గురు చీఫ్‌లు ఉంటారని బిగ్‌బాస్ చెప్పాడు.

ఇక సీజన్ గ్రాండ్ లాంఛ్ టైమ్‌లో విన్ అయిన మూడు బడ్డీ జంటలకి మొదటి టాస్కు పెట్టాడు బిగ్‌బాస్ . "పట్టుకొని ఉండండి వదలకండి" అంటూ పెట్టిన ఈ టాస్క్ ప్రకారం.. ఒక కేజ్‌లో రంగు రంగుల తాళ్లు ఉన్నాయి. వాటిని ఎక్కువసేపు పట్టుకోవాల్సి ఉంటుంది. అయితే పట్టుకున్న వాళ్ల తాడును స్పిన్నింగ్ వీల్‌లో వచ్చే కలర్ బట్టి సంఛాలక్ కట్ చేస్తుంటాడు. చివరి వరకు ఎవరు ఉంటారో వాళ్లే విన్నర్. ఇక ఈ గేమ్‌లో బేబక్క, యష్మీ గౌడ, నబీల్, నిఖిల్, నైనిక, శేఖర్ బాషా పాల్గొన్నారు. ఇందులో చివరి వరకు నిలబడి నిఖిల్ విన్నర్ కావడంతో హౌస్‌కి మొదటి చీఫ్ అయిపోయాడు.

మొదటి టాస్కులో ఓడపోయిన ఐదుగురు కంటెండర్లకి బిగ్ బాస్ మరో అవకాశం ఇచ్చాడు. కోన్ గేమ్ అంటూ పెట్టిన రెండో టాస్కులో నైనిక అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చింది. ఈ టాస్కులో గెలిచి హౌస్‌కి రెండో చీఫ్ అయిపోయింది. అయితే ఈ టాస్కుకి కిరాక్ సీత సంచాలక్‌గా చేసింది. ఆ సమయంలో తనని పక్కకెళ్లి ఆడుకోమంటూ నిఖిల్ అనడం తనకి నచ్చలేదంటూ గేమ్ అయిపోయిన తర్వాత మణికంఠతో చెప్పింది సీత. అప్పటికే నిఖిల్‌తో గొడవ అవ్వడంతో.. నువ్వు సైలెంట్‌గా ఉండకు ముఖం మీదే చెప్పెయ్ అంటూ సీతతో మణికంఠ అన్నాడు.

మిగిలిన నలుగురిలో ఒకరిని చీఫ్‌గా సెలక్ట్ చేయాలంటూ అప్పటికే చీఫ్‌లు అయిన నిఖిల్, నైనికలను కోరాడు బిగ్‌బాస్. ఇక్కడే అసలు గేమ్ స్టార్ట్ అయింది. మిగిలిన నలుగురిలో గేమ్ పరంగా చూసుకుంటే నబీల్, శేఖర్ బాషా బాగా ఆడారు. బేబక్క అయితే అసలేం ఆడలేదు. యష్మీ కూడా ఫర్లేదు కాబట్టి యష్మీని చీఫ్‌గా సెలక్ట్ చేద్దామంటూ నైనికతో నిఖిల్ అన్నాడు. నైనిక మాత్రం నబీల్ బాగా ఆడాడంటూ చెప్పింది. కానీ కన్విన్స్ చేసేసి మరీ సింపుల్‌గా యష్మీని సెలక్ట్ చేయించేశాడు నిఖిల్.

నేను సరిగ్గా టాస్కులో పర్ఫామ్ చేయలేదు.. కానీ నాలో ఏం చూసి మీరు నన్ను సెలక్ట్ చేశారో నాకు తెలియదు. చీఫ్‌లుగా ఉండటానికి మీరు అర్హులని ఈ నిర్ణయంతో తెలిసింది. ఇదంతా నా అదృష్టం ఏమో అంటూ చెప్పుకొచ్చింది యష్మీ. ఇక్కడే మిగిలిన కంటెస్టెంట్లకి కాలింది. తను సరిగా ఆడలేదని తనే ఒప్పుకున్నా కూడా యష్మీని చీఫ్‌గా ఎలా సెలక్ట్ చేశారంటూ తగులకుంది సోనియా ఆకుల. తనకంటే అన్ని విధాలా టాస్కుల్లో, మాట్లాడటంతో అన్నింట్లో నబీల్ బెస్ట్ అంటూ సపోర్ట్ చేసింది. యష్మీ అసలు చాలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించింది. చాలా విషయాల్లో ఆమె కంటే నబీల్ బెస్ట్ అంటూ వాయిస్ రెయిజ్ చేసింది సోనియా. దీంతో తన గురించి ఎందుకు లాగుతన్నావంటూ యష్మీ కూడా గొడవకి దిగింది. కానీ యష్మీ వైపు చూడకుండా నిఖిల్, నైనికలకి పాయింట్ టూ పాయింట్ ఇచ్చిపడేసింది సోనియా ఆకుల. చీఫ్ అంటే ఏదో అదృష్టం వల్ల ఇవ్వడం కాదు ఎవరు అర్హులో వాళ్లకి ఇవ్వాలి.. ఇక్కడ ఫ్రెండ్ షిప్‌ను చూడటం కరెక్ట్ కాదంటూ సోనియా ఫైర్ అయ్యింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.