English | Telugu

Podharillu: గాయత్రీ మాటకి పెద్ద రచ్చ.. ఆ అమ్మాయి ఇంట్లో చక్రి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -08 లో..... మాధవకి వచ్చిన సంబంధం వాళ్ళు ఇంటిని చూడడానికి వస్తామని చెప్తారు. దాంతో వాళ్ళు ఇంటికి ఉన్న చిన్న చిన్న రిపేర్ లు చేద్దామని అనుకుంటారు. ఆ విషయం గాయత్రి ఫ్రెండ్ గాయత్రికి చెప్తుంది. మీ బావకి సంబంధం ఖాయం అయిందట అందుకే ఇల్లు రిపేర్ అంట అని అనగానే అది చెడగొట్టలని కావాలనే వాళ్ళ అమ్మకి వినపడేలా మాట్లాడుతుంది. ఇల్లు రిపేర్ చేస్తున్నారా అది కేసులో ఉంది కదా అంటుంది తాయారు. అదే మాట వాళ్ళ అన్నయ్య కూడా వింటాడు.

వెంటనే నారాయణ ఇంటి మీదకి గొడవకి వెళ్తాడు. ఇది కేసులో ఉందిని అంటాడు. నారాయణకి కోపం వస్తుంది. వాళ్ళని కొట్టబోతుంటే తన కొడుకులు ఆపుతారు. మరొకవైపు భూషణ్ కి మహా సపోర్ట్ చెయ్యలేదేని కోపంగా ఉంటాడు. నాదే తప్పు అంటావా.. నేను నీ భర్తని.. ఏం చేసిన కరెక్ట్ అనాలని భూషణ్ అనగానే ఇంకా మనకి పెళ్లి కాలేదని మహా అంటుంది. అలా భూషణ్ కి ప్రతీది వ్యతిరేకంగా మహా మాట్లాడుతుంటే భూషణ్ కి కోపం వస్తుంది. ఆ తర్వాత మాధవకి గాయత్రి జున్ను తీసుకొని వస్తుంది. మా అమ్మ గొడవ చేసినట్లుందని అంటుంది. అయినా ఇల్లు రిపేర్ గురించి నాకే తెలియదు కానీ మీకెలా తెలుసని గాయత్రిని చక్రి అడుగుతాడు.

ఆ తర్వాత నేను ఒక అమ్మాయిని చూసానని కన్నాకి చక్రి చెప్తాడు. ఆ అమ్మాయి మళ్ళీ ఎదురుపడితే బాగుండు అని చక్రి అనుకుంటాడు. అప్పుడే తన ఓనర్ ఫోన్ చేసి.. డ్రైవర్ కావాలని ఒకరు ఫోన్ చేశారు.. రేపు ప్రొద్దున వెళ్ళమని అతను చెప్తాడు. తరువాయి భాగంలో డ్రైవర్ కావాలని ఫోన్ చేసింది భూషణ్ వాళ్లే.. చక్రిని చూడగానే భూషణ్ వద్దని చెప్తాడు. ఈ అమ్మాయి ఇక్కడే ఉంది.. ఎలాగైనా నేను ఇక్కడే ఉండాలని చక్రి అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.