English | Telugu

అరియానా న‌డుముకు నాగ్ మార్కులు.. చైతూ కౌంట‌ర్‌!

బిగ్‌బాస్ నాన్ స్టాప్ షో ఓటీటీలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. గ‌త నెల 26న మొద‌లైన ఓటీటీ షో 24 గంట‌ల నాన్ స్టాప్ ఎంట‌ర్‌టైన్మెంట్ అనే కాన్సెస్ట్ తో డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎప్ప‌టి లాగే బిగ్‌బాస్ సీజ‌న్ లో సండే ఫండే చేసేందుకు కింగ్ నాగార్జున షోలోకి ఎంట్రీ ఇవ్వ‌డం తెలిసిందే. బిగ్‌బాస్ నాన్ స్టాప్ లోనూ సండే రోజున హౌస్ లో సంద‌డి చేస్తున్నారు నాగార్జున‌. ఫ‌స్ట్ ఎలిమినేష‌న్ టైమ్ రావ‌డంతో షోలోకి వ‌చ్చేశారు. అనుకున్న‌ట్టుగానే ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయిపోయింది. అయితే ముమైత్ కాకుండా స‌ర‌యు ఎలిమినేట్ అవుతుందేమోన‌ని త‌ను ఏడ్చేసింది.

ఇదిలా వుంటే నాగ్ వారియ‌ర్స్ . ఛాలెంజ‌ర్స్ మధ్య డ్యాన్స్ ఛాలెంజ్ పెట్టారు. ఈ రెండు టీమ్ ల నుంచి ఒక్కో కంటెస్టెంట్ ను సెలెక్ట్ చేసుకుని డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. అలా యాంక‌ర్ శివ‌ - తేజ‌స్వి, అరియానా - ఆర్జే చైతూ - అఖిల్ - బిందు మాధ‌వి, అషు రెడ్డి - స్ర‌వంతి జోడీగా ఏర్ప‌డి డ్యాన్స్ చేశారు. అయితే ఈ నాలుగు జోడీల్లో ఆర్జే చైతూ - అరియానాల డ్యాన్స్ హాట్ టాపిక్ గా మారింది. ఆర్జే చైతు - అరియానా డాన్స్ కి నాగార్జున మార్కులేసాడు. అయితే దీనికి చైతూ కౌంట‌ర్ వేయ‌డం ఆక‌ట్టుకుంది.

అరియానాకు తొమ్మిది మార్కులు ఇచ్చారు. అర్జే చైతూకి ఎనిమిది మార్కులే ప‌డ్డాయి. దీంతో ఆర్జే చైతూ కౌంట‌రేశాడు. మీరు మార్కులు ఇచ్చింది అరియానా డ్యాన్స్ కా? న‌డుముకా ? స‌ర్ అని అడిగేశాడు. క‌రెక్ట్ గా చెప్పావ్ .. అరియానా న‌డుముకే అన్న‌ట్టుగా నాగ్ సెటైర్ వేశాడు. తేజ‌స్వితో డ్యాన్స్ చేసేందుకు యాంక‌ర్ శివ తెగ క‌ష్ట‌ప‌డ్డాడు. తేజ‌స్వీ మాస్ స్టెప్పుల‌తో దుమ్ములేపేసింది. అయితే యాంక‌ర్ శివ చేసిన ధైర్యానికి నాగ్ 9 మార్కులు వేశారు. తేజ‌స్వికి కూడా తొమ్మిది మార్కులు ప‌డ్డాయి. దీంతో వారియ‌ర్ టీం ఛాలెంజ‌ర్స్ పై గెలిచింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.