English | Telugu

మెగా ఛీఫ్ రేస్ లో నిలిచిన కంటెస్టెంట్స్ వీళ్లే!

బిగ్ బాస్ సీజన్-8 లో ఎనిమిదో వారం కంటెస్టెంట్స్ మధ్య మెగా ఛీఫ్ కోసం టాస్క్ లు కొనసాగాయి. ఇందులో నాలుగు టీమ్ ల నుండి నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడ్డారు.

పానిపట్టు యుద్ధంలో నిఖిల్ టీమ్ గెలిచింది. ఇక బిగ్ బాస్ ఇచ్చిన చివరి ఛాలెంజ్ 'తాడో పేడో'. ఈ ఛాలెంజ్‌లో గెలవడానికి మీరు చేయాల్సిందల్లా వివిధ స్థలాల్లో ఉన్న చిన్న చిన్న తాడు ముక్కలను సేకరించి దానితో పెద్ద తాడును తయారు చేసుకొని దాని సహాయంతో ఒక వైపు ఉన్న లక్కీ బాక్స్‌ను మీవైపు లాక్కోవాలి.. ఎవరు లాక్కుంటారో వాళ్లు విజేతలు అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. అలానే ఈ టాస్కులో గెలిచిన వాళ్లు వాళ్ల టీమ్ లీడర్‌కి రెండు డైస్ రోల్ చేసే అవకాశంతో పాటు రెండు ఎల్లో కార్డ్స్ ఇచ్చే అవకాశం లభిస్తుంది.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇక ఈ టాస్కులో తేజ, రోహిణి, నిఖిల్, గౌతమ్.. పోటీ పడ్డారు. ఎప్పటిలానే ఏదో ఆకలితో ఉన్న చిరుతలా చకచకా టాస్కు ఆడేసి గెలిచేశాడు నిఖిల్.

ఇక తమకి వచ్చిన రెండు ఎల్లో కార్డ్స్‌ను ఒకటి రెడ్ కి.. ఇంకొకటి గ్రీన్ టీమ్‌కి ఇచ్చేసింది బ్లూ టీమ్. దీంతో రెండు టీమ్స్ వాళ్ల దాంట్లో నుంచి చెరొకరిని రేసు నుంచి తప్పించాల్సి ఉంటుంది. ఇక రెడ్ టీమ్ పెట్టిన ముచ్చటలో ప్రేరణ, యష్మీ తాము తగ్గేదేలే అంటూ ఫిక్స్ అయిపోయారు. గౌతమ్ కూడా తనకి ఉండటం చాలా అవసరం.. నామినేషన్‌లో ఉన్నా కదా అంటూ చెప్పాడు. కానీ ఇద్దరూ ఒప్పుకోలేదు.. దీంతో తప్పుకున్నాడు. మరోవైపు గ్రీన్ టీమ్ నుంచి విష్ణుప్రియ తప్పుకుంది. దీంతో అటు గౌతమ్, ఇటు విష్ణు ఇద్దరూ రేసు నుంచి తప్పుకున్నారు. అయితే తప్పుకున్న తర్వాత గౌతమ్‌కి అర్థమైన విషయం ఏంటంటే అప్పటికే తను బీబీ ఇంటికి దారేది ఛాలెంజ్‌లో ఒక స్టెప్ ముందుకొచ్చాడు. ఇప్పుడు రేసు నుంచి తీసేయడంతో చీఫ్ కంటెండర్ అయ్యే ఛాన్స్ కూడా కోల్పోయాడు. ఈ విషయం గౌతమ్‌కి గుర్తులేదు.

ఇక బీబీ ఇంటికి దగ్గరగా వచ్చి మెగా చీఫ్ కంటెండర్లుగా ఎంపికైన వారు హరితేజ, నిఖిల్, అవినాష్, నబీల్, ప్రేరణ, తేజ అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. అంటే బ్లూ టీమ్ నుంచి ముగ్గురు, గ్రీన్ నుంచి ఇద్దరూ, రెడ్ నుంచి ఒకరు మెగా చీఫ్ కంటెండర్లు అయ్యారన్నమాట. ఎల్లో టీమ్ ఒక్క టాస్కులో కూడా గెలవకపోవడంతో వాళ్ల నుంచి ఎవరూ చీఫ్ రేసులోకే రాలేదు.