English | Telugu
'పడమటి సంధ్యారాగం' సీరియల్‌ను సితారతో కలిసి ప్రమోట్ చేస్తోన్న మహేశ్!
Updated : Sep 14, 2022
టాలీవుడ్ స్టార్ కిడ్స్ లో సితార ఇప్పుడు టాప్ లెవెల్లో ఉంది. తండ్రి కృష్ణ గారి నటనా వారసత్వాన్ని మహేష్ బాబు కొనసాగిస్తూ వస్తే మహేష్ బాబు నట వారసత్వాన్ని సితార కొనసాగిస్తోంది. సితార మంచి డాన్సర్. సోషల్ మీడియాలో ఎప్పుడూ సందడి చేస్తూ ఉంటుంది సితార. "సర్కారు వారి పాట" ప్రమోషనల్ సాంగ్ తో అదరగొట్టింది.
ఐతే ఇప్పుడు లేటెస్ట్ గా సితార తండ్రి మహేష్ బాబు తో కలిసి ఒక సీరియల్ ప్రమోషన్ వీడియోలో మెరిసిపోయింది. సెప్టెంబర్ 19 నుంచి జీ తెలుగులో రాత్రి 8 గంటలకు ప్రసారం కాబోయే పడమటి సంధ్యారాగం సీరియల్ ప్రోమోలో తండ్రీ కూతుళ్లిద్దరూ ఎంతో క్యూట్ గా కనిపించారు. ‘‘ఇండియాకు, అమెరికాకు మధ్య దూరం వేల మైళ్లు కావచ్చు. రెండింటిని దగ్గర చేసేది అనుబంధం మాత్రమే’’ అంటూ సీరియల్ కాన్సెప్ట్ గురించి చెప్పారు మహేష్ బాబు. ప్రస్తుతం ఈ కాన్సెప్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జీ తెలుగు చానల్‌తో మహేశ్‌కు చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. గతంలోనూ 'ప్రేమ ఎంత మధురం', 'త్రినయని', 'తూర్పు పడమర' సీరియల్స్‌ను లాంచ్ చేయడం ద్వారా వాటిని ప్రమోట్ చేశాడు.