English | Telugu

శేషు ఫామిలీ మెంబెర్స్‌ని మా ఆఫీస్ లో పనిచేయమనండి!

ఇటీవల ఎటు చూసిన బుల్లితెర మీద మల్లెమాల, జబర్దస్త్.. ఇవే హాట్ టాపిక్స్. ఇక ఈ రెండు అంశాలకు సంబంధించి కిరాక్ ఆర్పీ ఎన్నో కామెంట్స్ చేసాడు. దానికి ఆటో రాంప్రసాద్, ఆది కౌంటర్ అటాక్స్ ఇచ్చారు. అదిరే అభి కూడా మాట్లాడాడు. ఇక ఇప్పుడు షేకింగ్ శేషు లైన్ లోకి వచ్చేసి ఆర్పీ బండారం బయటపెట్టాడు. "అసలు నీ అనుభవం ఎంత.. అంత పెద్ద మనుషుల్ని, లైఫ్ ఇచ్చిన స్టేజిని నానా మాటలు అనడానికి" అంటూ విరుచుకుపడ్డాడు. "డైరెక్టర్ ని కావాలంటూ మూవీ స్టార్ట్ చేసావ్. మూవీ ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే 20 లక్షలు ఖర్చుపెట్టావు. ఈ విషయం గురించి ప్రొడ్యూసర్ నిలదీసేసరికి తోక ముడిచావ్." అంటూ ఫైర్ అయ్యాడు. ఇక ఈ విషయం గురించి ఆర్పీ మీద కంప్లైంట్ కూడా ఫైల్ చేసినట్లు చెప్పాడు.

శేషు కామెంట్స్ కి ఆర్పీ స్పందించాడు. "స్టోరీ లైన్ నచ్చేసరికి అరుణాచలం గారు మూవీని ప్రొడ్యూస్ చేస్తాం అన్నారు. నాగబాబు గారు, చక్రవర్తి గారు కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అనుకోని పరిస్థితుల కారణంగా మూవీ మిడిల్ డ్రాప్ అయ్యింది" అన్నాడు ఆర్పీ. "అంతా ఓకే అనుకున్నాకే ఆఫీస్ తీసుకున్నా. ఐనా జబర్దస్త్ లో నేను స్కిట్స్ వేసే టైంకి శేషు అక్కడ లేడు. జబర్దస్త్ పై రెండు మూడు సార్లు మాత్రమే అతన్ని కలిసాను" అన్నాడు. "మరి శేషుకి నా విషయంలో వేలు పెట్టి కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏమిటి?" అని ప్ర‌శ్నించాడు.

"శ్యాంప్రసాద్ రెడ్డికి తొత్తు కాబట్టి శేషు అలా మాట్లాడుతున్నాడు" అంటూ విరుచుకుపడ్డాడు. "మూవీ స్టార్ట్ చేసాక ఎంతోమంది వస్తారు కాబట్టి ఆఫీస్ తీసుకున్నా.. శేషుకు నచ్చకపోతే ఆయన ఇల్లు ఇస్తే అక్కడే ఆఫీస్ పెట్టుకుంటా. వాళ్ళ ఫామిలీ మెంబెర్స్ ని మా ఆఫీస్ లో పనిచేయమనండి" అంటూ ఆర్పీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు జబర్దస్త్ లోపల ఏం జరుగుతోంది. ఇన్నేళ్ల నుంచి మౌనంగా ఉన్న కమెడియన్స్ ఒక్కొక్కరుగా ఎందుకు ఇలా మాటల యుద్ధాలకు దిగుతున్నారు. శ్యాంప్రసాద్ రెడ్డిని ఆర్పీ ఎందుకు అంతలా టార్గెట్ చేసాడు? అసలు దీని వెనుక జరుగుతున్న కుట్ర ఏమిటి.. ఆర్పీ వెనక ఉన్నది ఎవరు?.. అనే ప్రశ్నలు ఇండస్ట్రీ మొత్తం వినిపిస్తున్నాయి.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.