English | Telugu

Karthika Deepam2 : వీడియో చూసిన కార్తీక్...ఇంట్లోవాళ్ళంతా దీపపై ఫైర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '(karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -130 లో... స్వప్న ప్రియుడు కాశీకి యాక్సిడెంట్ అయితే.. జోత్స్న పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. అదే దారిన వస్తున్న దీప.. కాశీ ప్రాణాలను కాపాడుతుంది. హాస్పిటల్‌లో చేర్పిస్తుంది. అదే హాస్పిటల్ కి శౌర్యని తీసుకొస్తాడు కార్తీక్‌. కాశీ దగ్గర ఉన్న ఫోన్‌తో దాసుకి ఫోన్ చేస్తాడు కార్తీక్. అయితే తన కొడుక్కి యాక్సిడెంట్ అయ్యిందని తెలియగానే కంగారుగా హాస్పిటల్‌కి వస్తాడు. దీపే తన కొడుకుని కాపాడిందని తెలియడంతో.. జన్మజన్మలకు నీకు రుణపడి ఉంటానంటూ దాస్ ఎమోషనల్ అవుతాడు.

మరోవైపు దీప సాయం చేసిన వీడియో వైరల్ కావడంతో.. నర్స్ ద్వారా ఆ వీడియో చూస్తాడు కార్తీక్. పక్కనే ఉన్న దాసు.. ఆ వీడియో చూడటంతో.. తన కూతురు ఇంత క్రూరంగా పెరిగిందేంటని బాధపడుతుంటాడు. కాసేపటికి దీప, కార్తీక్‌ల సంబాషణలో కార్తీక్ అని దీప పిలిచేసరికి నా మేనల్లుడు కూడా ఇంతే ఉండొచ్చని దాస్ అనుకుంటాడు. ఇంతలో వైరల్ అవుతున్న వీడియో చూసిన జోత్స్న.. దీన్ని ఖచ్చితంగా బావ చూసి ఉంటాడు. నా లెక్క ప్రకారం.. దీప హాస్పిటల్‌లో ఉంది కాబట్టి అక్కడే ఉండి ఉంటాడని కార్తీక్‌కి ఫోన్ చేస్తుంది జ్యోత్స్న. కానీ అది పట్టించుకోడు కార్తీక్మ చెప్పు జోత్స్నా అని అని కార్తీక్ అనడంతో.. తన కూతురు జోత్స్నతోనే కార్తీక్ మాట్లాడుతున్నాడని కనిపెట్టేస్తాడు దాసు. అంటే కార్తీక్.. నా మేనల్లుడు అని లోలోపల సంతోషపడతాడు. నా కూతురు జాలిలేనిదానిలా పెరిగితే.. నా మేనల్లుడు మాత్రం నలుగురుకి సాయం చేస్తున్నాడు అని అనుకుంటాడు.


నా సొంత రక్తం పరాయిది అయ్యింది.. పరాయి మనిషి బంధువు అయ్యింది. విధిరాత అంతే ఇదేనేమో.. కొందరికి మంచితనం పుట్టుకతో వస్తే.. కొందరికి పెంపకంతో వస్తుంది. నన్ను చూస్తుంటే నా సొంతమనిషిని చూసినట్టే ఉందమ్మా అని దీప గురించి అనుకుంటాడు దాసు. నా వాళ్లందర్నీ కాలం నా దగ్గరకు తీసుకొచ్చి పరిచయం చేస్తుంది. తెలియకుండానే నా కూతుర్ని కలిశాను.. తెలియకుండా నా మేనల్లుడ్ని కలిశాను. అలాగే తెలియకుండానే మా అమ్మ దూరం చేసిన దశరథ్ అన్నయ్య కూతుర్ని కూడా కలుస్తానా? అని అనుకుంటాడు దాసు. ఇక జోత్స్న వీడియో చూసిన కార్తీక్.. ఇంటికి వెళ్లి మరీ అందరి ముందు క్లాస్ పీకుతాడు. తనని తిడుతూ దీపని పొగుడుతుంటే జోత్స్న మరింత కోపంగా ఉంటుంది. ఇక సుమిత్ర వాళ్ళు కూడా దీపకే ఓటేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.