English | Telugu

మోనితను కార్తీక్‌ చంపాడని అనుకుంటున్న సౌందర్య!

మోనితను కార్తీక్ హత్య చేయలేదని, తానే హత్య చేశానని ఏసీపీ రోషిణి దగ్గరకు సౌందర్య వెళ్లిన సంగతి తెలిసిందే. 'ఈ రోజు హైదరాబాద్ వచ్చిన మీరు, నిన్న హత్య ఎలా చేశారు?' అని రోషిణి లాజిక్ తీస్తుంది. ఆ తర్వాత ఈరోజు ఎపిసోడ్ ప్రారంభమైంది.

'మీరు చాలా తెలివైనవారు. నేను ఈ హత్య చేయలేదని కనిపెట్టగలిన మీరు, నా కొడుకు కూడా చేయలేద‌ని ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు?' అని రోషిణిని సౌందర్య ప్రశ్నిస్తుంది. అప్పుడు రోషిణి 'ఎందుకంటే నేను కార్తీక్ కన్నతల్లిని కాదు కాబట్టి. పోలీస్ అధికారిని కాబట్టి' అని సమాధానం ఇస్తుంది. 'ఈ హత్యను ఎవరైనా కళ్లారా చూశారా?' అని మళ్ళీ సౌందర్య ప్రశ్నిస్తుంది. 'మీ వియ్యపురాలు భాగ్యం అక్కడే ఉందట' అని రోషిణి సమాధానం. 'కళ్లారా చూసిందా? చెవులారా విందా?' - మళ్ళీ సౌందర్య ప్రశ్న.

"ఇది కోర్టు కాదు. నేను మీతో వాదిస్తూ కూర్చోలేను. మీరు కోడలి తరపున పోరాడిన ఉత్తమ అత్త అట కదా. మరి, మీ కొడుకు వేరే ఆడదానితో హద్దులు లేని స్నేహం చేస్తుంటే... చూస్తూ ఎలా ఊరుకున్నారు? ఇప్పుడు ఆ ఆడదాన్నీ మీ కొడుకు తల్లిని చేసి, చంపేసి, చిద్విలాసంగా నవ్వుతూ మెట్టవేదాంతం చెబుతున్నాడు" అని రోషిణి గట్టిగా చెబుతుంది. అప్పుడు మోనిత ఆడిన పన్నాగాన్ని సౌందర్య బయటపెడుతుంది.

మోనితది కృత్రిమ గర్భధారణ అని, కావాలంటే మాతృశ్రీ సంతానసాఫల్య కేంద్రంలో పనిచేసే పల్లవిని అడగమని రోషిణికి సౌందర్య చెబుతుంది. అక్కడ నుండి విచారణ చేయమంటుంది. దాంతో రోషిణి షాక్ అవుతుంది. అయినా... నమ్మదు. సౌందర్య వెళ్లిన తర్వాత మోనితకు కడుపు చేసి, పెళ్లి చేసుకోమని బలవంతం చేయడంతో చంపేశాడని అనుకుంటుంది. మరోవైపు పోలీస్ స్టేషన్ లో కార్తీక్ కు రత్నసీత అని లేడీ కానిస్టేబుల్ టీ అందిస్తుంది. ఏమైనా కావాలంటే తనతో చెప్పమని, ఏర్పాటు చేస్తానని అంటుంది.

రోషిణితో మాట్లాడిన తర్వాత దీప దగ్గరకు వెళ్లిన సౌందర్య... కోడలు, పిల్లల్ని తనతో పాటు ఇంటికి తీసుకువెళుతుంది. భాగ్యం కూడా సౌందర్య ఇంటికి వెళుతుంది. అందరూ ఎమోషనల్ అవుతారు. ఆ తర్వాత 'ఇప్పుడు చెప్పు ఏం జరిగింది?' అని సౌందర్య అడగటంతో కార్తీక్ కు చూపించిన వీడియో అందరికీ చూపిస్తుంది దీప. హిమ మరణానికి తానే కారణం అన్నట్టు మోనిత చెబుతున్న మాటలు వినబడుతుంటే 'చంపేసే ఉంటాడు... మోనితను కార్తీక్ చంపేసి ఉంటాడు' అని సౌందర్య షాక్ అవుతుంది. అక్కడితో నేటికి శుభం కార్డు వేశారు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.