Read more!

English | Telugu

ఇదేం ట్విస్ట్ బాబోయ్‌.. వంట‌ల‌క్క కొత్త ట్విస్ట్‌

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న ఫ్యామిలీ డ్రామా `కార్తీక దీపం`. చిత్ర విచిత్ర‌మైన మ‌లుపులు.. షాకిచ్చే ట్విస్ట్‌ల‌తో సాగుతున్న ఈ సీరియ‌ల్ 1203వ ఎపిసోడ్‌లోకి ఎంట‌రైంది. సోమ‌వారం ఎపిసోడ్‌లో వంట‌ల‌క్క అలియాస్ దీప ఊహించ‌ని షాక్ ఇవ్వ‌బోతోంది. శనివారం ఎపిసోడ్‌లో డాక్ట‌ర్ బాబు ఇంటికి వచ్చిన మోనిత రేపు మా బాబు బార‌సాల మీరు త‌ప్ప‌కుండా రావాలి అని పిల‌వ‌డం.. కార్తీక్‌, సౌంద‌ర్య నో అని చెప్ప‌డం.. వెంట‌నే దీప `మోనిత నీ ఏర్పాట్లు చేసుకో.. వీళ్లంద‌రినీ తీసుకుని వ‌చ్చే బాధ్య‌త నాది అని చెప్పి షాకిచ్చ‌యింది.

ఆ త‌రువాత మోనిత‌ని ద‌గ్గ‌ర‌కు తీసుకుని చెప్పాను క‌దా మోనిత నీకు ఊహించ‌ని క్లైమాక్స్ ఇవ్వ‌బోతున్నాను` అని షాకిస్తుంది. దీప మాట‌లు విన్న మోనిత‌కు మైండ్ బ్లాంక్ అవుతుంది. దీప ఇచ్చిన స‌మాధానంతో అయోమ‌యంలో ప‌డిపోయిన మోనిత అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. దీప మాట‌ల‌కు ఓ ప‌క్క కంగారు.. మ‌రో ప‌క్క అయోమ‌యానికి గురైన సౌంద‌ర్య‌, ఆనంద‌రావు దీప ఇలా ప్ర‌వ‌ర్తిస్తుందేంట‌ని మ‌ద‌న ప‌డుతుంటారు. ఆనందారావు అయితే దీప‌ని చూసి బాధ‌ప‌డుతుంటాడు.

ఇదిలా వుంటే దీప త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి వార‌ణాసి కారులో రెస్టారెంట్‌కి వెళుతుంది. అక్క‌డ పిల్లలు ఏది ఆర్డ‌ర్ చేస్తే అది ఇప్పిస్తాన‌ని చెబుతుంది. అంతే కాకుండా ఈసారి త‌న నిర్ణ‌యం మార్చుకోన‌ని పిల్ల‌ల‌కు హింట్ ఇస్తుంది. ఆ త‌రువాత పిల్ల‌ల‌ని ఇంటికి పంపించేసి తాను ఎక్క‌డికో వెళ్లిపోతుంది. విష‌యం తెలిసి సౌంద‌ర్య‌, ఆనంద‌రావు షాక్‌కు గుర‌వుతారు. ఇంత‌కీ దీప ఎక్క‌డికి వెళ్లింది? .. ఏం చేయ‌బోతోంది? .. మోనిత‌కు దిమ్మ‌దిరిగే షాక్ ఇవ్వ‌బోతోందా?  లేక త‌న‌ని ప్రేమిస్తున్న ప్రేక్ష‌కుల‌కే షాక్ ఇవ్వ‌నుందా అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ ఖ‌చ్చితంగా చూడాల్సిందే.