English | Telugu

మోనితను కోర్టుకు లాక్కొచ్చిన వంటలక్క!?

మోనిత నాటకానికి ఫుల్ స్టాప్ పడే రోజు వచ్చినట్టుంది. 'కార్తీకదీపం' సీరియల్‌లో శనివారం ఇచ్చిన ముగింపు చూస్తే... మోనితను దీప కోర్టుకు లాక్కొచ్చినట్టు అర్థమవుతోంది. మొత్తం మీద భర్త కార్తీక్‌కు శిక్ష పడకుండా, పతి ప్రాణాలను వంటలక్క కాపాడినట్టు తెలుస్తోంది. అసలు ఏమైంది? అనేది వివరాల్లోకి వెళితే...

దీపను మోనిత ఏం చేస్తుందోనని కార్తీక్ కంగారు పడుతుంటే, అదేమీ పట్టించుకోకుండా విధి నిర్వహణలో భాగంగా అతడికి ఏసీపీ రోషిణి కోర్టుకు తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. మరోవైపు మోనితను ఫాలో అవుతూ వెళ్లిన దీప, చివరికి మోనిత చేతికి చిక్కుతుంది. గన్ తీసుకుని దీపకు మోనిత గురి పెడుతుంది.

కట్ చేస్తే... కోర్టులో కార్తీక్ మీద మోపిన అభియోగాలపై విచారణ జరుగుతుంది. మోనితను కార్తీక్ గర్భవతి చేశాడని, ఆమె తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసేసరికి చంపేశాడని, అతడికి శిక్ష విధించాలని న్యాయవాది వాదిస్తాడు. సాక్ష్యాలు అన్నీ కార్తీక్ కి వ్యతిరేకంగా ఉంటాయి. అతడి తల్లి మాత్రం 'నా మనస్సాక్షి ప్రకారం నా కుమారుడు నిర్దోషిగా బయటకొస్తాడు' అని నమ్మకంగా ఉంటుంది.

దీపకు గన్ గురి పెట్టిన మోనిత... చంపేస్తానని బెదిరిస్తోంది. దీప ఏమాత్రం కంగారు పడకుండా ఒకటి, రెండు అని అంకెలు లెక్కపెడుతూ మోనిత చేతిలో గన్ లాక్కుంటుంది. దాంతో దీప కాళ్ళ మీద పడిన మోనిత... తనను వదిలేయమని, ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటుంది. 'నువ్వు బతికుంటే నా భర్త ప్రాణాలకు ప్రమాదం. నిన్ను చంపేస్తా' అని దీప భయపెడుతుంది. దాంతో ఎపిసోడ్ దాదాపుగా ముగిసింది. అయితే, నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం రాబోతోందనేది చూపించిన ప్రోమోలో అసలు మేటర్ ఉంది.

'వాదోపవాదనలు ముగిశాయి' అని న్యాయమూర్తి తీర్పు ప్రకటించే సమయంలో దీప కోర్టులోకి ఎంటర్ అవుతుంది. తనను తాను కార్తీక్ భార్యగా న్యాయమూర్తికి పరిచయం చేసుకుంటుంది. 'మీరు తీర్పు ఇచ్చే ముందు మరో ముఖ్యమైన సాక్షిని అనుమతించండి' అని కోరుతుంది. అందుకు, జడ్జ్ సరేనని అంటారు. కోర్టులోకి వస్తున్నది ఎవరనేది చూపించలేదు. కానీ, అందరూ షాక్ అవ్వడం, అంతకు ముందు దీప గన్ తీసుకుని మోనితకు గురి పెట్టడం గుర్తు చేసుకుంటే... మోనితను దీప కోర్టుకు లాక్కొచ్చినట్టు అర్థమవుతోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.