English | Telugu

Karthika Deepam 2 : కార్తీక పౌర్ణమి రోజున కార్తీక్, దీపలు ఒక్కటయ్యేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -210 లో......జ్యోత్స్న గుడికి వెళ్తుంది. తనని చూసి కార్తీక్ కోప్పడుతుంటాడు. ఉండమంటే ఉంటాను లేదంటే వెళ్ళిపోతానని జ్యోత్స్న అనగానే.. సరే ఉండు అని కాంచన అంటుంది. ఆ తర్వాత కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టతను దీప చెప్తుంది. ఆ తర్వాత శౌర్య బాగుండాలని దీప మొక్కుకొని కోనేటిలో వదులుతుంది. శౌర్య ఆరోగ్యం బాగుండాలని కార్తీక్ దీపం వదులుతాడు. జ్యోత్స్న మాత్రం కార్తీక్ జీవితం నుండి దీప వెళ్ళాలని కోరుకొని దీపం వదులుతుంది. ఆ తర్వాత కార్తీక్, దీప కోనేటీలో వదిలిన దీపాలు ఒక్క దగ్గరికి వస్తాయి.

దాంతో జ్యోత్స్న విడగొట్టాలని రాయి విసరబోతుంటే కార్తీక్ చూసి ఆపబోతుంటాడు. ఆ రాయి కాస్త జ్యోత్స్న వదిలిన దీపానికి తాకుతుంది. ఇక నీ బుద్ది మారదన్నట్లు జ్యోత్స్నకి క్లాస్ తీసుకుంటాడు కార్తీక్. ఆ తర్వాత అందరు ఇంటికి వచ్చాక కార్తీక్ దీప దగ్గరికి వచ్చి.. మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదామా అంటూ మాట్లాడతాడు. నాలాగా అందరికి దూరంగా మీరు ఉండడం ఇష్టం లేదని దీప అంటుంది. ఇన్ని రోజులు మీకు ఎలా హెల్ప్ చెయ్యాలంటూ కారణం వెతుకున్నేవాడిని కానీ అలా ఇప్పుడు లేదు.. మీరు నా కళ్ళ ముందే ఉన్నారని కార్తీక్ అంటాడు. కార్తీక్ అటువైపు తిరిగి మాట్లాడుతుంటే.. కార్తీక్ కాళ్ళు మొక్కుతుంది దీప. మీరు భర్తగా రావడం నా అదృష్టమని దీప అనుకుంటుంది.

మరొకవైపు పారిజాతానికి జ్యోత్స్న తన బాధని చెప్పుకుంటూ బాధపడుతుంది. నీకు ఆస్తులున్నాయి ఇంకేంటి అన్నట్లు పారిజాతం మాట్లాడుతుంది. నా బావ కూడా కావాలని అంటుంది. మరొకవైపు దాస్ కి ఒకతను ఫోన్ చేసి.. నువ్వు చెప్పిన అతను చనిపోయాడంట.. వాళ్ళింట్లో వాళ్లు ఊరు వదిలి వెళ్లిపోయారని అతను అంటాడు. కనీసం పేరు అయిన చెప్పు అనగానే.. కుబేరుడు అని చెప్తాడు. ఆ తర్వాత కుబేర్ స్కెచ్ ఆర్ట్ ని పట్టుకొని చూస్తుంటే.. కాశీ వస్తాడు. అది చూసి ఏంటని అడిగితే దాస్ చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.