English | Telugu

Karthika Deepam2 : కార్తీక దీపంలో కొత్త హీరో.. దీపని తిట్టేసిన జ్యోత్స్న!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -175 లో... కాంచన, కార్తీక్‌ల ముందు జ్యోత్స్న.. తాళి పట్టుకుని నిలబడుతుంది. ఇప్పుడే ఈ క్షణమే తాళి కడతావా లేక.. చావమంటావా అంటు జ్యోత్స్న విషం బాటిల్ తియ్యడంతో.. బిత్తరపోతారు తల్లీకొడుకులు. ఈ క్రమంలోనే.. జ్యోత్స్న ఏంటి ఈ పిచ్చి పని అంటూ కాంచన.. కార్తీక్ తిడుతున్నా.. జ్యోత్స్న మాత్రం విషం బాటిల్ ఒక చేతిలో.. తాళి బొట్ట మరో చేతిలో పట్టుకుని.. రెచ్చిపోతుంది. దాంతో కార్తీక్ నచ్చజెప్పలనే.. ఇటు ఇవ్వు తాళి.. కడతానని అందుకుంటున్నట్లుగా జ్యోత్స్న దగ్గరకు వెళ్తాడు. థాంక్యూ బావా అర్థం చేసుకున్నావ్ ఇదిగో తాళి, కట్టెయ్ అని జ్యోత్స్న అనేలోపు.. జ్యోత్స్న చేతిలోని విషం బాటిల్‌ని చేత్తో తీసి పారేస్తాడు కార్తీక్. దాంతో అది ఓ మూలకు పడి పగిలిపోతుంది. వెంటనే తాళి ఉన్న జ్యోత్స్న చేతిని ఒకవైపుకు తోస్తాడు. ఆ తాళి ఎగిరి.. కొయ్యబొమ్మలపై పడుతుంది. జ్యోత్స్న ఆశ్చర్యంగా చూసే లోపు కార్తీక్ ఒక్కటి పీకుతాడు.

ఆ దెబ్బకు జ్యోత్స్న కిందపడిపోతుంది. బావా అని ఆవేశంగా కిందపడే వేలు చూపిస్తుంది జ్యోత్స్న. నోరుముయ్.. మాట్లాడావంటే రెండో చెంప కూడా పగలుతుంది. పెళ్లి అంటే ఆటలుగా ఉంది నీకు.. మీ తాతేమో ఇంటికి రావద్దు అంటాడు. నువ్వేమో తాళి కట్టు అంటున్నావ్.. ఏంటి తాళి కట్టకపోతే చస్తావా? ఎవరిని బెదిరిస్తున్నావ్? అందరూ బెదిరించే వాళ్లే అంటాడు కార్తీక్. నాకు ఇప్పుడు అర్థమవుతుంది బావా.. నువ్వు నా మెడలో తాళి కట్టను అన్నావంటే.. నీ మనసులో నేను లేనని‌ జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్నా ఏంటి ఆ మాటలు అంటుంది కాంచన. నిజమే అత్తా.. నీ కొడుకు మనసులో నేను లేను.. ఆ దీప ఉందని జ్యోత్స్న అంటుంది. నోటికి వచ్చినట్లు వాగవంటే అని కార్తీక్ ఆవేశంగా మళ్లీ కొట్టడానికి వెళ్తాడు. కార్తీక్ ఆగు అని కాంచన అరుస్తుంది. నేను అన్నది నిజం కాకపోతే.. నా మెడలో తాళి ఎందుకు కట్టనటున్నావో చెప్పమని జ్యోత్స్న అంటుంది. మా అమ్మలాగే నిన్ను కూడా అనాథను చేయడం ఇష్టం లేక.. మన పెళ్లి అయితే తాత నిన్ను కూడా దూరం చేసుకుంటాడు తప్ప.. కలుపుకోడని కార్తీక్ అంటాడు. కార్తీక్ మాటలకు జ్యోత్స్న ఆలోచనలో పడుతుంది. నిజమే.. నేను ఇప్పుడు ఇలా పెళ్లి చేసుకుంటే ఆస్తి నాకు రాదు.. తాత దూరం పెడితే ఎలా? అని ఆలోచించుకుని.. సరే బావా.. లాగిపెట్టి కొట్టావ్ కదా.. నాకు ఇప్పుడు బుర్ర బాగా పనిచేస్తుంది. నేను ఇంటికి వెళ్లిపోతాను.. అందరి అంగీకారంతోనే పెళ్లి చేసుకుందామనేసి జ్యోత్స్న వెళ్లిపోతుంది. మరోవైపు జ్యోత్స్న వెళ్తూ వెళ్తూ దారిలో గౌతమ్‌ని కలుస్తుంది. గౌతమ్ ఎవరో కాదు.. గతంలో జ్యోత్స్నకు పెళ్లి చేసుకుందామని జ్యోత్స్న కుటుంబం ముందే ప్రపోజ్ చేసిన వ్యక్తి.

నాకు ఒక ఛాన్స్ ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇప్పుడు ప్రాణం అంటున్న బావ లాగిపెట్టి కొట్టాడంటున్నావ్.. మీ అమ్మాయిలు ఎప్పుడూ ఇంతే.. దూరం పెట్టేవాళ్ల కోసమే పరితపిస్తారంటు గౌతమ్ అంటాడు. చూడు గౌతమ్.. ఏదో ఫ్రెండ్‌వి.. దారిలో కనిపించావు.. మనసులో భారం దించుకోవాలని జరిగింది నీకు చెప్పానంతే కానీ.. నీ లిమిట్స్‌లో నువ్వు ఉండు.. ఏది ఏమైనా నేను మా బావని దక్కించుకుని తీరతానంటూ అక్కడి నుంచి జ్యోత్స్న ఆవేశంగా కారు దాకా వెళ్తుంది. జ్యోత్స్న నేను నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నా.. మీ బావ నిన్ను కొట్టాడంటే మీ బావ మనసులో నువ్వు లేనవనే కదా.. ఒకసారి ఆలోచించు అంటూ వెంటబడతాడు. జ్యోత్స్న వినదు. చూడు గౌతమ్.. మా బావతోనే నేను తాళి కట్టించుకుంటాను. త్వరలోనే పెళ్లి కార్డ్ పంపిస్తాను రెడీ ఉండు అనేసి కారులో వెళ్లిపోతుంది. చూద్దాం నీ ప్రేమ గెలుస్తుందా.. నా ప్రేమ గెలుస్తుందా అనేది అని గౌతమ్ అనుకుంటాడు. ఇక నరసింహాను చూసి.. తనని ఎత్తుకునిపోతున్నాడనే భయంతో శౌర్యకు జ్వరం వస్తుంది. దీప బాధగా బయటే కూర్చుని ఉంటే.. అనసూయ.. లేచి ముఖం కడుక్కోవే అని అంటుంది. దీప లేచి ముఖం కడుక్కుంటూ.. మెడలో తాళి చేతికి తగలకపోవడంతో గుర్తొచ్చి.. మళ్లీ ఏడుస్తుంది. మన ఆడవాళ్లకు ఓ వీక్‌నెస్‌లా మారిపోతుంది తాళి. శరీరంలో ఓ భాగం అయిపోతుందని దీప అనగానే.. నీ బాధ నాకు అర్థమవుతుంది దీపా.. కానీ ఇక వదిలెయ్.. వాడి సంగతి నేను చూసుకుంటానులే దీపా.. జరిగింది మరిచిపోమని అనసూయ చెప్తుంది. నువ్వు శౌర్యకు మందులు తే.. నేను ఆ నర్సిగాడికి ఇవ్వాల్సింది ఇచ్చే వస్తానని అనసూయ చెప్పేసి దీప వెళ్లిపోతుంది. అయినా ఆ నరసింహా అత్తయ్యకు కనిపించాలి కదా.. పారిపోయి ఉంటాడులే.. నేను వెళ్లి శౌర్యకు మందులు తీసుకొద్దామని దీప బయలుదేర్తుంది. అయితే అటే వచ్చిన జ్యోత్స్న.. కారు ఆపి.. దీపతో గొడవకు సిద్ధమవుతుంది. తెగించావే.. నా బావ ఉన్నాడుగా టాబ్లెట్స్ తెమ్మనకపోయావా? మెడలో తాళి ఏదే అంటూ దీప మాట్లాడిన ప్రతీ మాటకు వ్యతిరేకంగా మాట్లాడుతూ అరవడంతో చుట్టూ జనాలు వస్తారు. అప్పుడే దీప గురించి.. అక్కడున్న వాళ్లందరికి తప్పుడు మాటలు చెప్తూ రచ్చ చేస్తుంది జ్యోత్స్న. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.