English | Telugu

Karthika Deepam 2: కూతురిని మార్చడానికి శ్రీధర్ రివర్స్ డ్రామా.. దీప ఎమోషనల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం-2 (Karthika Deepam 2)'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-588 లో.. శ్రీధర్, స్వప్న, కావేరి ముగ్గురు మాట్లాడుకుంటారు. కాశీ గురించి శ్రీధర్ ఇండైరెక్ట్ గా మాట్లాడతాడు. అమ్మా స్వప్న నీ మెడలో ఉన్న తాళిని తీసి పక్కన పెట్టమ్మ అని శ్రీధర్ అనగానే స్వప్న షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నారు నాన్న అని స్వప్న అనగానే.. నీకు స్వేచ్ఛ ఉంది. నువ్వు విడాకులు తీసుకొని దూరంగా ఉంటానని అనుకున్నప్పుడు తాళి మాత్రం ఎందుకని రివర్స్ డ్రామా ప్లే చేస్తాడు శ్రీధర్.

మీరొకటి అర్థం చేసుకోవాలి నాన్న అని స్వప్న అనగానే.. భర్తగా ఓడిపోయాను.. తండ్రిగా ఓడిపోయాను.. మనిషిగా ఓడిపోయాను.. చెప్పమ్మ ఏం అర్థం చేసుకోవాలి.. ఏం చెప్పినా అర్థం చేసుకుంటానని శ్రీధర్ అనగానే... కానీ పెద్దమ్మ అర్థం చేసుకోలేదు నాన్న అని స్వప్న అంటుంది. ఇదే ప్రశ్న నువ్వు పెద్దమ్మను అడగగలవా నాన్న అని అనేసి స్వప్న వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కావేరి, శ్రీధర్ మాట్లాడుకుంటారు.

మరోవైపు దీప, కార్తీక్ ఇద్దరు ఎమోషనల్ అవుతారు. దీప కడుపలో పెరుగుతున్న బిడ్డని చంపుకోవాలా లేక సుమిత్రని కాపాడుకోవాలా అని దీప సతమతమవుతుంది. కార్తీక్ ఏం చెప్పలేకపోతాడు. మరోవైపు జ్యోత్స్నకి పారిజాతం అన్నం తినిపిస్తుంటుంది. దశరథ్ అంత సీరియస్ అవుతాడని అనుకోలేదని పారిజాతం అంటుంది. నిజంగా డాడీని చూస్తే భయమేసిందని జ్యోత్స్న అనగానే దశరథ్ సాధుజంతువులా ఉంటాడనుకున్నా.. నాన్న మాట వినేవాడు అనుకున్నాను కానీ ఒక్కసారిగా దశరథ్ కి శివన్నారాయణ పూనాడే అని పారిజాతం అంటుంది.

అప్పుడే శివన్నారాయణ వస్తాడు. ఏంటి తినిపిస్తున్నావని అడుగగా దశరథ్ తిట్టాడని ఏం తినలేదండి అని పారిజాతం అనగానే సరే ఏం చేద్దామని అనుకుంటున్నావని శివన్నారాయణ అంటాడు. రిపోర్ట్స్ లాస్ట్ టైం లాగా రాకపోతే ఏం చేస్తారని పారిజాతం అనగానే ఎందుకు వస్తాయి.‌. నిన్ను చూస్తే నాకు డౌట్ వస్తుందని శివన్నారాయణ అంటాడు. ఏదో తెలియక వాగానని పారిజాతం కవర్ చేస్తుంది. ఈ సారి రిపోర్ట్స్ సరిగ్గా రాకపోతే దశరథ్ ఏం చేస్తాడో తెలియదని చెప్పి శివన్నారాయణ వెళ్ళిపోతాడు. ఇక పారిజాతం, జ్యోత్స్న కలిసి ఒక ప్లాన్ ఆలోచిస్తారు.

మరోవైపు అనసూయ, కాంచన మాట్లాడుకుంటారు. తర్వాత దీపని పిలుస్తుంది కాంచన. ఎలాగైనా దీపని టిఫిన్ చేయమని కాంచన చెప్తుంది. ఇక కార్తీక్ కి ఇస్తుంది కాంచన. ఆ తర్వాత తప్పనిసరిగా దీప టిఫిన్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu: శ్రీవల్లిని ఏకిపారేసిన నర్మద, ప్రేమ.. స్పృహలోకి వచ్చిన రామరాజు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu )'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-388 లో.. అమూల్యతో ప్రేమ, నర్మద మాట్లాడతారు. శ్రీవల్లి చేసిన పనికి అసలు వదలకూడదని ప్రేమ అంటుంది. నాకు మాటిచ్చారని అమూల్య అనగానే అది తిన్నింటి వాసాలు లెక్కపెట్టి నీ జీవితం నాశ చేస్తే ఇంకా మాటని పట్టుకొని వేలాడటం ఏంటి అమూల్య అని ప్రేమ కోపంగా అంటుంది. ఇప్పుడు నిజం చెప్తే శ్రీవల్లి వదిన జీవితం నాశనం అవుతుంది‌. నాన్న ఏరి కోరి తెచ్చిన సంబంధం.. తను ఇలా చేసిందంటే నాన్న తట్టుకోగలడా అని అమూల్య అంటుంది. 

Brahmamudi : చక్రవర్తిని కాపాడిన రాజ్.. గడువులోగా మినిస్టర్ నిజం చెప్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -948 లో..... మినిస్టర్ కి రాజ్ ఫోన్ చేస్తాడు‌. డాక్టర్ చక్రవర్తిని తీసుకొని నీ భార్య దగ్గరికి వెళ్తున్నాను.. అతను నీ గురించి నిజం చెప్పేస్తాడని రాజ్ అంటాడు.  రాజ్ అలా అనగానే మినిస్టర్ భయపడతాడు. చక్రవర్తి ని దాచిన ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ చక్రవర్తిని చూసి రిలాక్స్ అవుతాడు. అప్పుడే రాజ్ ఫోన్ చేసి నా ప్లాన్ చేంజ్ చేసుకున్నాను.. నీకు హెల్ప్ చేసిన నర్సు నీలవేణి దగ్గరికి వెళ్లి సాక్ష్యం సంపాదిస్తానని రాజ్ అనగానే మళ్ళీ  నీలవేణి దగ్గరికి వెళ్తాడు మినిస్టర్.