English | Telugu

Jayam serial: ఒకే గదిలో పారు, రుద్ర.. డోర్ పగలగొట్టి గంగ లోపలికి వెళ్లడంతో!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం' (Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-187 లో.. రిసార్ట్ లో పారు, రుద్ర ఉన్నారని తెలిసి వంశీతో కలిసి గంగ అక్కడికి వెళ్తుంది. అక్కడ ఒకే గదిలో పారు, రుద్ర ఉన్నారని గంగ తెలుసుకొని టెన్షన్ పడుతుంది. వాళ్ళ డోర్ లాక్ అయిపోయిందని వంశీ, గంగ అక్కడికి వెళ్ళి తీయడానికి ప్రయత్నిస్తుంటారు.

కాసేపటికి గంగ డోర్ ని ఒక్క పంచ్ తో బద్దలుకొడుతుంది. దాంతో తను వెళ్ళి ఎదురుగా ఉన్న రుద్ర వొళ్ళో పడుతుంది. అలా వాళ్ళిద్దరిని చూసి పారు కుళ్ళుకుంటుంది. ఇక వంశీ అక్కడి నుండి పారిపోతాడు.

కాసేపటికి గంగ చేతికి గాయం అయిందని చెప్పడంతో రుద్ర భోజనం తినిపిస్తాడు. అదే విషయం ఇషిక, వీరులకి పారు ఫోన్ చేసి చెప్తుంది. ఇక ఇషిక ఫోన్ చేసి నువ్వు అలా ఉంటే వాళ్ళిద్దరు దగ్గరవుతారు. దూరం ఉంటేనే ఇలా ఉంది.. దగ్గరైతే ఇంకా మనం వాళ్ళని ఆపలేమని పారుతో ఇషిక, వీరు చెప్తారు. ఇక వాళ్ళు ఏం చేస్తున్నారో అనే టెన్షన్ తో వాళ్ళిద్దరి దగ్గరికి పారు వెళ్తుంది. గంగ తినేసాక మన గదిలో పడుకుందాం పదా అని రుద్రతో అనగానే... వద్దు నాకు కొత్త ప్లేస్ లో నిద్ర పట్టదు.. భయంగా ఉంటుంది.‌ నువ్వు నాతో పడుకోమని గంగ అంటుంది‌. నిద్రలో నేను ఫైటింగ్ చేస్తా అని చెప్పి గంగ చెప్పేసి రుద్ర, గంగ అక్కడి నుండి తమ గదిలోకి వెళ్ళిపోతారు.

ఇక ఎందుకొచ్చావంటూ బెల్టు తీసుకొని కొట్టడానికి వస్తాడు రుద్ర. నా మీద నమ్మకం లేదా.. ఆడది, అసూయ ఇద్దరు ఒకే చోట పుట్టారని నిన్ను చూస్తుంటే తెలుస్తుందని గంగని బెల్టుతో సరదాగా కొడుతుంటాడు రుద్ర. ఇక కాసేపటికి ఇద్దరు హగ్ చేసుకుంటారు.

మరోవైపు వంశీ, సూర్య అందరు కలిసి సరదాగా మాటాడుకుంటారు. గంగ వదిన అక్కడికి వెళ్ళి డోర్ ని కొట్టగానే అది బద్దలైపోయిందని వంశీ చెప్తాడు. దాంతో అందరు నవ్వుకుంటారు. అప్పుడే శకుంతల వస్తుంది. ఆమెని చూసి సూర్య వెనకాల దాక్కుంటాడు వంశీ. వెనుకాల దాక్కుంటే నాకు తెలియదా వంశీ అని శకుంతల అంటుంది. ఆ తర్వాత జరిగింది తెలుసుకుంటుంది శకుంతల.

మరోవైపు గంగని బాక్సింగ్ లో ఛాంపియన్ చేయాలని ప్రయత్నిస్తుంటాడు రుద్ర. గంగ వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగుండాలని గంగ కష్టపడుతుంది. ఇషిక, వీరు కలిసి గంగ, రుద్రలని విడగొట్టాలని ప్రయత్నిస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu: శ్రీవల్లిని ఏకిపారేసిన నర్మద, ప్రేమ.. స్పృహలోకి వచ్చిన రామరాజు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu )'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-388 లో.. అమూల్యతో ప్రేమ, నర్మద మాట్లాడతారు. శ్రీవల్లి చేసిన పనికి అసలు వదలకూడదని ప్రేమ అంటుంది. నాకు మాటిచ్చారని అమూల్య అనగానే అది తిన్నింటి వాసాలు లెక్కపెట్టి నీ జీవితం నాశ చేస్తే ఇంకా మాటని పట్టుకొని వేలాడటం ఏంటి అమూల్య అని ప్రేమ కోపంగా అంటుంది. ఇప్పుడు నిజం చెప్తే శ్రీవల్లి వదిన జీవితం నాశనం అవుతుంది‌. నాన్న ఏరి కోరి తెచ్చిన సంబంధం.. తను ఇలా చేసిందంటే నాన్న తట్టుకోగలడా అని అమూల్య అంటుంది. 

Brahmamudi : చక్రవర్తిని కాపాడిన రాజ్.. గడువులోగా మినిస్టర్ నిజం చెప్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -948 లో..... మినిస్టర్ కి రాజ్ ఫోన్ చేస్తాడు‌. డాక్టర్ చక్రవర్తిని తీసుకొని నీ భార్య దగ్గరికి వెళ్తున్నాను.. అతను నీ గురించి నిజం చెప్పేస్తాడని రాజ్ అంటాడు.  రాజ్ అలా అనగానే మినిస్టర్ భయపడతాడు. చక్రవర్తి ని దాచిన ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ చక్రవర్తిని చూసి రిలాక్స్ అవుతాడు. అప్పుడే రాజ్ ఫోన్ చేసి నా ప్లాన్ చేంజ్ చేసుకున్నాను.. నీకు హెల్ప్ చేసిన నర్సు నీలవేణి దగ్గరికి వెళ్లి సాక్ష్యం సంపాదిస్తానని రాజ్ అనగానే మళ్ళీ  నీలవేణి దగ్గరికి వెళ్తాడు మినిస్టర్.