English | Telugu

Illu Illalu Pillalu: అపాయింట్‌మెంట్ లెటర్ తీసుకున్న సాగర్.. ఇంటికి వచ్చిన రామరాజు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-389 లో... సాగర్ తన మామ శ్రీనివాస్ రావుతో కలిసి ఒక ఏజెంట్ ని కలుస్తారు. అతను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానంటే అతనికి ఇరవై లక్షల డబ్బు కావాలని చెప్తాడు. దాంతో సాగర్ డబ్బు ఇవ్వడానికి సంకోచిస్తాడు. నేను కేవలం మా మావయ్య కోసం గవర్నమెంట్ జాబ్ కావాలని అనుకుంటున్నానని సాగర్ అంటాడు. అతనికి డబ్బు ఇస్తాడు. అతను వెంటనే సాగర్ కి అపాయింట్‌మెంట్ లెటర్ ఇస్తాడు. అది చూసి సాగర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు.

మరొకవైపు రామరాజు డిశ్చార్జ్ అయి వస్తున్నాడని భాగ్యం దిష్టి తియ్యడానికి గుమ్మడికాయ రెడీ చేస్తుంది. రామరాజు ని తీసుకొని అందరు వస్తారు. భాగ్యం దిష్టి తియ్యాలని చెప్పగానే వేదవతి దిష్టి తీస్తుంది. అమూల్య బయటకు వస్తుంది. కావాలనే విశ్వ ఇక్కడ ఏం చేస్తున్నావే అని చెంపపై కొడుతాడు. అదంతా వాళ్ళు చూస్తారు. చందు, ధీరజ్ కోపంగా వెళ్తుంటే వేదవతి ఆపుతుంది. తిరుపతి వెళ్లి నా మేనకోడలిపై చేయి వేశావో నీ సంగతి చెప్తానని వార్నింగ్ ఇస్తాడు. నా భార్య నా ఇష్టం అని తిరుపతి అంటాడు. ఎవరినో కొడితే మనకేంటి అని వేదవతి పిలుస్తుంది.

ఆ తర్వాత ప్రేమకి కొరియర్ వస్తుంది. కొరియర్ ఓపెన్ చేసి చూడగా అందులో పోలీస్ ఎగ్జామ్ హాల్ టికెట్ ఉంటుంది. అది చూసి ప్రేమ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడున్న సిచువేషన్ లో ఇంట్లో చెప్పడం కరెక్ట్ కాదని ప్రేమ అనుకుంటుంది. ఆ లెటర్ ఏంటి ప్రేమ అని శ్రీవల్లి అడుగుతుంది. నీకెందుకు అని నర్మద ఎంట్రీ ఇస్తుంది. నర్మద కొట్టిన చెంపదెబ్బ గుర్తుచేసుకొని శ్రీవల్లి భయపడుతుంది.

ఆ తర్వాత అందరు హాల్లో కూర్చొని ఉంటారు. సాగర్ ఎక్కడ అని నర్మదని రామరాజు అడుగుతాడు. అప్పుడే సాగర్ తనకి ఇచ్చిన అపాయింట్‌మెంట్ లెటర్ తో వస్తాడు. రామరాజుని చూసి జేబులో పెట్టుకుంటాడు. ఎక్కడికి వెళ్ళావ్ రా మీ నాన్న డిశ్చార్జ్ అవుతుంటే లేవని వేదవతి అంటుంది. కొంచెం వర్క్ ఉందని సాగర్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu: శ్రీవల్లిని ఏకిపారేసిన నర్మద, ప్రేమ.. స్పృహలోకి వచ్చిన రామరాజు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu )'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-388 లో.. అమూల్యతో ప్రేమ, నర్మద మాట్లాడతారు. శ్రీవల్లి చేసిన పనికి అసలు వదలకూడదని ప్రేమ అంటుంది. నాకు మాటిచ్చారని అమూల్య అనగానే అది తిన్నింటి వాసాలు లెక్కపెట్టి నీ జీవితం నాశ చేస్తే ఇంకా మాటని పట్టుకొని వేలాడటం ఏంటి అమూల్య అని ప్రేమ కోపంగా అంటుంది. ఇప్పుడు నిజం చెప్తే శ్రీవల్లి వదిన జీవితం నాశనం అవుతుంది‌. నాన్న ఏరి కోరి తెచ్చిన సంబంధం.. తను ఇలా చేసిందంటే నాన్న తట్టుకోగలడా అని అమూల్య అంటుంది. 

Brahmamudi : చక్రవర్తిని కాపాడిన రాజ్.. గడువులోగా మినిస్టర్ నిజం చెప్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -948 లో..... మినిస్టర్ కి రాజ్ ఫోన్ చేస్తాడు‌. డాక్టర్ చక్రవర్తిని తీసుకొని నీ భార్య దగ్గరికి వెళ్తున్నాను.. అతను నీ గురించి నిజం చెప్పేస్తాడని రాజ్ అంటాడు.  రాజ్ అలా అనగానే మినిస్టర్ భయపడతాడు. చక్రవర్తి ని దాచిన ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ చక్రవర్తిని చూసి రిలాక్స్ అవుతాడు. అప్పుడే రాజ్ ఫోన్ చేసి నా ప్లాన్ చేంజ్ చేసుకున్నాను.. నీకు హెల్ప్ చేసిన నర్సు నీలవేణి దగ్గరికి వెళ్లి సాక్ష్యం సంపాదిస్తానని రాజ్ అనగానే మళ్ళీ  నీలవేణి దగ్గరికి వెళ్తాడు మినిస్టర్.