English | Telugu

Podharillu: చక్రితో రిసెప్షన్ కోసం రెడీ అయిన మహా.. మాధవ హ్యాపీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు(Podharillu)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-44 లో.. మహా తన గదిలో ఉండగా చక్రి లోపలికి వచ్చి రిసెప్షన్ కి రెడీ అవ్వమని చెప్తాడు. నేను రాను.. మీ వాళ్ళకి అసలు నిజం ఎందుకు చెప్పలేదని మహా అంటుంది. ఇప్పుడు చెప్పే సిచువేషన్ లేదు.. మీరు ఈ ఒక్కసారి నా మాట వినండి అని చక్రి రిక్వెస్ట్ చేస్తుంటాడు‌. కానీ తన మాట వినదు. ఇదంతా ఇష్టం లేదని మీ వాళ్ళతో చెప్తానని చక్రితో మహా అంటుండగా మాధవ వస్తాడు.

ఏమైందమ్మా అని అడుగుతాడు. అదేం లేదు అన్నయ్య.‌ వాళ్ళ నాన్నకి ఆరోగ్యం బాలేక అని చక్రి ఏదో చెప్పబోతుంటే అది కాదు అని మహా కోపంగా అంటుంది. దాంతో మాధవకి విషయం అర్థమవుతుంది. మీరు మా ఇంటికి మహాలక్ష్మిలాగా వచ్చారు. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు.. ఏమైనా ఇబ్బంది కల్పించామా అని మాధవ అడుగుతాడు. అదేం లేదు.. నాకు ఈ రిసెప్షన్ జరుపుకోవడం ఇష్టం లేదు.. అసలు మా పెళ్ళి ఏ పరిస్థితిలలో జరిగిందోనని మహా మొత్తం చెప్తుంది. తనకి ఇష్టం లేని పెళ్ళిని చేస్తుంటే మీ తమ్ముడు నన్ను సేవ్ చేశాడు. ఇక ఆ తర్వాత రౌడీలు వెంబడించారు.. మేము ప్రాణాలు కాపాడుకోవడానికి స్టేషన్ లోకి వెళ్తే అక్కడ మా పెళ్ళి జరిగిందని అక్కడ జరిగింది మొత్తం మాధవతో మహా చెప్తుంది. దాంతో మహా ఎమోషనల్ అవుతాడు. ఈ విషయం తెలియకుండా మిమ్మల్ని అడుగకుండా మేము తొందరపడి ఈ రిసెప్షన్ ఏర్పాటు చేశాం.. తప్పు మాదే.. మాకు ఇది అలవాటే.. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మీ ఇద్దరిని ఆశీర్వదించడానికి రాలేదు.. ఈ ఇంట్లోకి వచ్చిన ఆడపిల్ల ఉంటుందా ఉండదా‌‌.. అసలు ఎలా ఉంటుందో చూడటానికి వచ్చారంటూ వారు ఎదుర్కొన్న కష్టాలని చెప్తూ మాధవ ఎమోషనల్ అవుతాడు.

నువ్వు ఇక్కడ ఉండొద్దు.. రిసెప్షన్ కి రావొద్దు.. ఇది జరగదని చెప్పేస్తానని మహాతో చెప్పి మాధవ బయటకు వస్తాడు. ఇక ఫంక్షన్ కి వచ్చినవాళ్ళంతా ఏం జరుగుతుందా అని ఎదురుచూస్తుంటారు. ఇక మాధవ స్టేజ్ మీదకి వెళ్ళి మైక్ పట్టుకొని ఎమోషనల్ ఏదో చెప్పాలనుకుంటాడు. అంతలోనే మహా రెడీ అయి బయటకు వస్తుంది. దాంతో అంతా షాక్ అవుతారు. మాధవ, చక్రి, కేశవ, కన్నా హ్యాపీగా ఫీల్ అవుతారు. సారీ పెద్ది.. రావడానికి కాస్త లేట్ అయిందని మాధవతో మహా అనగానే సరే అన్నట్టుగా మాధవ నవ్వుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu: శ్రీవల్లిని ఏకిపారేసిన నర్మద, ప్రేమ.. స్పృహలోకి వచ్చిన రామరాజు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu )'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-388 లో.. అమూల్యతో ప్రేమ, నర్మద మాట్లాడతారు. శ్రీవల్లి చేసిన పనికి అసలు వదలకూడదని ప్రేమ అంటుంది. నాకు మాటిచ్చారని అమూల్య అనగానే అది తిన్నింటి వాసాలు లెక్కపెట్టి నీ జీవితం నాశ చేస్తే ఇంకా మాటని పట్టుకొని వేలాడటం ఏంటి అమూల్య అని ప్రేమ కోపంగా అంటుంది. ఇప్పుడు నిజం చెప్తే శ్రీవల్లి వదిన జీవితం నాశనం అవుతుంది‌. నాన్న ఏరి కోరి తెచ్చిన సంబంధం.. తను ఇలా చేసిందంటే నాన్న తట్టుకోగలడా అని అమూల్య అంటుంది. 

Brahmamudi : చక్రవర్తిని కాపాడిన రాజ్.. గడువులోగా మినిస్టర్ నిజం చెప్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -948 లో..... మినిస్టర్ కి రాజ్ ఫోన్ చేస్తాడు‌. డాక్టర్ చక్రవర్తిని తీసుకొని నీ భార్య దగ్గరికి వెళ్తున్నాను.. అతను నీ గురించి నిజం చెప్పేస్తాడని రాజ్ అంటాడు.  రాజ్ అలా అనగానే మినిస్టర్ భయపడతాడు. చక్రవర్తి ని దాచిన ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ చక్రవర్తిని చూసి రిలాక్స్ అవుతాడు. అప్పుడే రాజ్ ఫోన్ చేసి నా ప్లాన్ చేంజ్ చేసుకున్నాను.. నీకు హెల్ప్ చేసిన నర్సు నీలవేణి దగ్గరికి వెళ్లి సాక్ష్యం సంపాదిస్తానని రాజ్ అనగానే మళ్ళీ  నీలవేణి దగ్గరికి వెళ్తాడు మినిస్టర్.