English | Telugu

కామెడీ స్టార్స్ ధ‌మాకాలో కెఏ పాల్ వ‌ర్సెస్ వ‌ర్మ‌

హాస్య ప్రియుల్నిక‌డుపుబ్బా న‌వ్విస్తున్న కామెడీ షో `కామెడీ స్టార్స్ ధ‌మాకా`. గ‌త కొన్ని నెల‌లుగా స్టార్ మాలో ప్ర‌తీ ఆదివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ప్ర‌సారం అవుతున్నఈ షో మంచి ఆద‌ర‌ణ పొందుతూ రేటింగ్ ప‌రంగానూ దూసుకుపోతోంది. ఈ షోకు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు, డ్యాన్స్ మాస్ట‌ర్ శేఖ‌ర్ వీజే న్యాయ నిర్ణేత‌లుగా, ఇక యాంక‌ర్ గా దీపిక పిల్లి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. టీమ్ లీడ‌ర్లుగా ముక్కు అవినాష్‌, హ‌రి, అదిరే అభి, ధ‌న్ రాజ్‌, టిల్లు వేణు, అప్పారావు టీమ్ లీడ‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ ఆదివారం జూన్ 5న ప్ర‌సారం కానున్న లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని తాజాగా విడుద‌ల చేశారు. ఈ ఎపిసోడ్ లో అప్పారావు, అదిరే అభి, స‌త్య‌, ధ‌న్ రాజ్‌, టిల్లు వేణు, హ‌రి, యాద‌మ్మ‌రాజులు కామెడీ స్కిట్ ల‌తో అద‌ర‌గొట్టేశారు. అయితే ఈ అంద‌రి కంటే ముక్కు అవినాష్ చేసిన `కెఏ పాల్ వ‌ర్సెస్ వ‌ర్మ స్కిట్ ఓ రేంజ్ ఓ పేలిన‌ట్టుగా తెలుస్తోంది. హ‌రి డైరెక్ట‌ర్ గా యాద‌మ్మ రాజు హీరోగా చేసిన స్కిట్ కూడా న‌వ్వులు పూయించింది. ఇక ధ‌న్ రాజ్‌, టిల్లు వేణు క‌లిసి చేసిన స్కిట్ కూడా ఆక‌ట్టుకుంది.

అయితే ముక్కు అవినాష్ చేసిన కెఏ పాల్ వ‌ర్సెస్ వ‌ర్మ స్కిట్ షోకు ప్ర‌ధాన హైలైట్ గా నిలిచింది. వ‌ర్మ డైరెక్ట‌ర్ గా కేఎ పాల్ హీరోగా సినిమా చేస్తే ఎలా వుంటుంద‌ని ముక్కు అవినాష్ స్కిట్ చేశాడు. 'ఈ మ‌ధ్య డేంజ‌ర‌స్ అనే సినిమా తీశాను చూశావా?' అని ముక్కు అవినాష్ అడిగితే కేఏ పాల్ పాత్ర‌లో క‌నిపించిన జ‌బ‌ర్ద‌స్త్ రాము `నువ్వు తీసిన సినిమాలే డేంజ‌ర‌స్ ఇంకా చూట్ట‌మేంటీ?.. నేనే కాదు నువ్వు కూడా చూడ‌వు' అంటూ పంచ్ వేశాడు.

ఆ త‌ర్వాత‌, `మొన్న‌టికి మొన్న రాజ‌మౌళి గారు ఫోన్ చేశారు. స‌ర్ `ట్రిపుల్ ఆర్` త‌రువాత ఫోర్ ఆర్ తీస్తున్నా అన్నారు. నేను ఒక విష‌యం స్ప‌ష్టంగా చెప్పా.. ఫోర్ ఆర్ తీస్తే మాత్రం ర‌ష్యా ప్ర‌ధాన మంత్రి, చైనా ప్ర‌ధాన మంత్రి, ఉత్త‌ర కొరియా ప్ర‌ధాన మంత్రిని పెట్టండి నేను కూడా చేస్తా అని చెప్పా` అన‌గానే 'నాలుగు రాడ్లు' అని అవినాష్ అన‌డం.. 'మీరు కూడా చేయండి, అప్ప‌డు ఐదు రాడ్లు' అని మ‌రో వ్య‌క్తి అన‌డం న‌వ్వులు పూయిస్తోంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.