English | Telugu

'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' షూటింగ్ కంప్లీట్ చేసిన తార‌క్‌!

బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 1 హోస్ట్‌గా బుల్లితెర‌పై అడుగుపెట్టిన జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రెండోసారి 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' షోతో వ్యూయ‌ర్స్ ముందుకు వ‌చ్చాడు. త‌న‌దైన ఎన‌ర్జీతో హోస్ట్‌గా ఆక‌ట్టుకుంటున్నాడు. జెమిని టీవీలో ప్ర‌సార‌మ‌వుతోన్న ఈ షోకు సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని తార‌క్ కంప్లీట్ చేశాడు. 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' షో అన్ని ఎపిసోడ్ల‌ను తార‌క్ పూర్తి చేశాడ‌నీ, వీటిలో మ‌హేశ్‌బాబు, దేవి శ్రీ‌ప్ర‌సాద్‌, త‌మ‌న్ గెస్ట్ కంటెస్టెంట్లుగా పాల్గొన్న ఎపిసోడ్స్ కూడా ఉన్నాయ‌నీ స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి.

జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎంత‌గా త‌న స‌మ‌య‌స్ఫూర్తితో కంటెస్టెంట్ల‌ను ప్ర‌శ్న‌లు అడుగుతూ, స‌ర‌దాగా వారితో మాట్లాడుతూ ఆక‌ట్టుకుంటున్న‌ప్ప‌టికీ, అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' వీక్ష‌కాద‌ర‌ణ పొంద‌లేద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. రామ్‌చ‌ర‌ణ్‌తో చేసిన క‌ర్టెన్ రైజ‌ర్ ఎపిసోడ్‌, స‌మంత‌తో చేసిన ఎపిసోడ్‌ల‌కు వ‌చ్చిన ఆద‌ర‌ణ రెగ్యుల‌ర్ కంటెస్టెంట్ల‌తో చేసిన ఎపిసోడ్ల‌కు రాలేదు.

ఏదేమైనా ఈ షోకు హోస్ట్‌గా చేయ‌డం ద్వారా భారీ పారితోషికాన్ని అందుకున్నాడు తార‌క్‌. వ‌చ్చే ఏడాది కూడా ఈ షో సీజ‌న్‌కు ఆయ‌న హోస్ట్‌గా కంటిన్యూ అవుతాడో, లేదో చూడాలి.

సినిమాల విష‌యానికి వ‌స్తే, ఇప్ప‌టికే 'ఆర్ఆర్ఆర్' షూటింగ్‌ను కంప్లీట్ చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్‌, త‌దుప‌రి సినిమా కోసం మేకోవ‌ర్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. తార‌క్ న‌టించే ఈ 30వ సినిమాకు కొర‌టాల శివ ద‌ర్శ‌కుడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.