English | Telugu

మహిళల మనసు గెలుచుకున్న జూనియ‌ర్ ఎన్టీఆర్!

నందమూరి కుటుంబ సంస్కారం, మహిళలకు ఎంత గౌరవం ఇస్తారనేది 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమంతో మరోసారి ప్రజలకు తెలిసింది. ఒక్క అక్షరం, బుల్లితెర కార్యక్రమం పేరులో ఒక్క అక్షరం మార్పు చెయ్యడంతో యంగ్ టైగర్ జూనియ‌ర్‌ ఎన్టీఆర్ మహిళల మనసు గెలుచుకున్నారు. ఆయన నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

జెమినీ టీవీలో 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమం ఆగస్టు 22న మొదలైంది. మొదటి ఎపిసోడ్‌కి రామ్ చరణ్ గెస్ట్ కింద వచ్చారు. అదే రోజు చిరంజీవి పుట్టినరోజు కూడా కావడంతో తండ్రితో పాటు 'ఆచార్య' సినిమాకు సంబంధించిన విశేషాలు రామ్ చరణ్ వెల్లడించారు. అయితే, గతంలో 'స్టార్ మా'లో ఈ కార్యక్రమం ప్రసారమైనప్పుడు 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అని ఉండేది. కార్యక్రమానికి వచ్చే అతిథులను ఏకవచనంతో సంబోధించడం తనకు నచ్చలేదని, అందుకని 'కోటీశ్వరుడు'ను 'కోటీశ్వరులు' కింద మార్చమని చెప్పానని తార‌క్‌ అన్నారు.

టైటిల్ మార్పు గురించి జూనియ‌ర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ "షోకు వచ్చేవాళ్లను 'డు' అంటూ ఏకవచనంతో సంభోదించడం నాకు ఇష్టం లేదు. మహిళలు కూడా షోకు వస్తారు కాబట్టి 'ఎవరు మీలో కోటీశ్వరులు' అని మార్చాము" అని చెప్పారు. ఈ మాట మహిళల మనసులను తాకింది. తార‌క్‌ మీద వారంతా ప్రశంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.