English | Telugu

Jayam serial: ప్రాణాపాయ స్థితిలో గంగ.. మినిస్టర్ మాటలతో రుద్ర ఎమోషనల్!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-147 లో.. రుద్ర చేస్తున్న ఫుడ్ ఫెస్టివల్ కి గెస్ట్ గా మినిస్టర్ వస్తాడు. ఫుడ్ టేస్ట్ చెయ్యాలని అనుకుంటాడు. అప్పుడే గంగ వచ్చి అందులో విషం ఉందని చెప్తుంది. ఎవరే నువ్వు అని పారు ముసుగు తీస్తుంది. గంగని చూసి అందరు షాక్ అవుతారు. నువ్వేంటి ఇక్కడ అని రుద్ర అడుగుతాడు. ఇలా వేషం మార్చుకొని మాయ చెయ్యడం నీకు అలవాటే కదా అని శకుంతల కోప్పడుతుంది.

ఆ తర్వాత ఇందులో విషం ఉందని గంగ అంటుంటే నీకెలా తెలుసు అని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. ఒక రౌడీ ఫోన్ మాట్లాడుతుంటే విన్నానని గంగ చెప్తుంది. ఆపు ఇక అని రుద్ర కోప్పడతాడు. మీరు నమ్మాలంటే ఏం చెయ్యాలని ఆ విషం ఉన్న ఫుడ్ ని గంగ తీసుకుంటుంది. కాసేపటికి కింద పడిపోతుంది వెంటనే గంగని రుద్ర హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు.

మరొకవైపు ఇషిక, పారు, వీరు డిజప్పాయింట్ అవుతారు. గంగని హాస్పిటల్ కీ తీసుకొని వెళ్ళాక తనకి ఏం కాకూడదని డాక్టర్ కి చెప్తాడు రుద్ర. గంగని ఆ సిచువేషన్ లో చూసి రుద్ర రిగ్రెట్ ఫీల్ అవుతాడు. గంగ మాటలు నమ్మాల్సింది, తప్పు చేశానని రుద్ర బాధపడతాడు. మరొకవైపు ఫుడ్ ఫెస్టివల్ లో ఫుడ్ లో పాయిజన్ గురించి మీడియా వాళ్ళు శకుంతలని అడుగుతారు. ఈ విషయం వదిలేయండి అని వీరు కవర్ చేస్తాడు.

ఆ తర్వాత గంగ బానే ఉంది కానీ విషం బాడీ లో స్ప్రెడ్ అయింది. తను మినీ కోమాలో ఉందని డాక్టర్ చెప్పగానే రుద్ర షాక్ అవుతాడు. గంగని చూసి రుద్ర బాధపడుతుంటే.. అప్పుడే మినిస్టర్ సూర్య ప్రతాప్ వస్తాడు. మీ పెద్దనాన్న అంతా చెప్పాడు. గంగ నీ భార్య అవ్వడం నీ అదృష్టం.. నమ్మకం కలిగించడానికి తన ప్రాణం పణంగా పెట్టింది. అలాంటి వాళ్ళని మిస్ చేసుకోవద్దు.. నేను మళ్ళీ వచ్చినప్పుడు మీరు కలిసి ఉండాలని, అతను చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.