English | Telugu

ఇండస్ట్రీ అనేది నీటి బుడగ.. ఎంతవరకు ఉంటుందో చెప్పలేము

బుల్లితెర మీద జబర్దస్త్ షోలో నూకరాజు కామెడీ వేరే లెవెల్ లో ఉంటుంది. జడ్జ్ ఇంద్రజాను అమ్మ అమ్మ అని పిలుస్తూ కామెడీ చేస్తాడు. అప్పుడప్పుడు గెటప్ శీనులా గెటప్స్ వేస్తాడు. ఐతే నూకరాజు తన ఇండస్ట్రీ జర్నీ గురించి ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చాడు. "నేను డిప్లొమా చేసేటప్పుడు యాదమ్మ రాజును, సద్దాంని పటాస్ షోలో చూస్తూ ఉండేవాడిని. నేను మా విజయవాడలో ఒక గల్లీ కమెడియన్ ని. ఐతే నేను కూడా ఇలాంటి వెళ్తే బాగుండేది కదా అనుకునే వాడిని. అలా పటాస్ ఆడిషన్స్ కి ట్రై చేసాను. కానీ సెలెక్ట్ కాలేదు. కానీ జీ తెలుగులో వచ్చే కామెడీ కిలాడీలు షోకి ఆడిషన్స్ కి వెళ్తే సెలెక్ట్ అయ్యాను. ఇక్కడ హైదరాబాద్ కి ఏదో చేసేద్దాం అని వచ్చి వారం ఉండి వెళ్ళిపోయాను. తర్వాత విజయవాడలో నా పని చేసుకుంటూ నేను ఆడిషన్స్ కి ట్రై చేస్తూ ఉండేవాడిని. నేను కొత్తగా ఇండస్ట్రీకి రావాలి అనుకునే వాళ్లకు ఒక్కటే చెప్తున్నా..మొత్తం అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి ఏదో చేద్దాం అంటే అవ్వదు. ఎందుకంటే ఇండస్ట్రీ నీటి బుడగ లాంటిది ఎప్పుడు ఉంటుందో తెలీదు ఎప్పుడు పోతుందో తెలీదు. మనం ఎప్పుడూ కష్టపడుతూనే ఉండాలి.

ఇంట్లో పని చేసుకుంటూనే కష్టపడి ఆడిషన్స్ ఇస్తూ వచ్చాను. జీ తెలుగు నుంచి పటాస్ ఆ తర్వాత జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ అలా బండి నడిపిస్తున్న. జీ తెలుగులో కామెడీ షో ఆగిపోయాక నేను మళ్ళీ విజయవాడ వచ్చి నా కూలి పనులు చేసుకున్నా. ఆ టైములో నేను బతకాలి హైదరాబాద్ లో రూమ్ రెంట్ లు కట్టాలి కాబట్టి నా పని నేను చేసుకుంటూ వెళ్ళా. నేను యాక్టింగ్ లాంటిది ఏమీ నేర్చుకోలేదు. మిడిల్ క్లాస్ వాళ్లకు రోజు సంపాదించుకోవడానికి జాబ్ చేయడానికే టైం సరిపోదు మళ్ళీ యాక్టింగ్ ప్రాక్టీస్ లు అంటే కుదరని పని. అందరినీ చూసి యాక్టింగ్ నేర్చుకున్నా అంతే. టక్ జగదీశ్ లో, మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం మూవీస్ లో చేసినప్పుడు నాకు చాలామంది సినిమా వాళ్ళు ఫోన్ చేసి బాగా చేసావ్ అన్నారు. గుమ్మడికాయంత కష్టపడినా కానీ ఆవగింజంతైనా అదృష్టం ఐతే ఉండాలి.." అంటూ చెప్పుకొచ్చాడు నూకరాజు.


Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.