English | Telugu
'హైపర్ ఆది'పై దాడి.. విరుచుకుపడిన జబర్దస్త్ కమెడియన్!
Updated : Nov 10, 2021
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది స్కిట్స్ లో తన పంచ్ డైలాగ్స్ తో ఎంతలా నవ్విస్తాడో, అదే స్థాయిలో వివాదాల్లోనూ చిక్కుకుంటూ ఉంటాడు. గతంలో తన స్కిట్స్ లో పలువురు సెలబ్రిటీలను టార్గెట్ చేయడంతో పాటు.. అనాధలపై దారుణ వ్యాఖ్యలు చేయడం వంటి వాటితో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణుని ఇమిటేట్ చేసి మరోసారి వివాదానికి తెరలేపాడు.
హైపర్ ఆది రీసెంట్ గా చేసిన స్కిట్ లో మంచు విష్ణుని టార్గెట్ చేశాడు. మా ఎన్నికల సమయంలో సీనియర్ యాక్టర్ నరేష్ తో విష్ణు అన్న 'లెట్ దెమ్ నో అంకుల్' అనే మాటతో పాటు, విష్ణు బాడీ ల్యాంగ్వేజ్ ను తన స్కిట్ లో ఇమిటేట్ చేశాడు ఆది. విష్ణు పేరు ప్రస్తావించక పోయినా ఇది విష్ణుని ఉద్దేశించి చేసినది అనే ఆడియన్స్ కి అర్థమైంది. ఈ క్రమంలో మంచు అభిమానులు ఆదిని టార్గెట్ చేశారు. అంతేకాదు, ఆది దొరికితే చితకబాదడం కోసం విష్ణు అభిమానులు వెతుకున్నారని, భయంతో ఆది అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఆదిపై దాడి జరిగిందని కూడా వార్తలొచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఈ వార్తలపై స్పందించిన ఆది.. ఆ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
దాడి వార్తలపై జబర్దస్త్ కమెడియన్ ఘాటుగా స్పందించాడు. తన గురించి ఎవరో వెతుకుతున్నారని, తనపై దాడి జరిగిందని ఇలా రకరకాలుగా కొన్ని వెబ్ సైట్స్ ఫేక్ న్యూస్ రాస్తున్నాయని మండిపడ్డాడు. డబ్బులు కోసం ఇలాంటి ఫేక్ న్యూస్ రాయకండిరా, డబ్బులు కావాలంటే నన్ను అడగండి నేనిస్తా అంటూ ఫైర్ అయ్యాడు. అసలు మీ లాంటి వాళ్లని శాంతి స్వరూప్ కి పట్టించాలి అంటూ హైపర్ ఆది తనదైన శైలిలో స్పందించాడు.