English | Telugu

ప్రగతి ఆంటీకి మార్కులు వేసిన దొరబాబు

ప్ర‌గ‌తి ఈ మధ్య కాలంలో దుమ్ము రేపుతోంది. ఒక‌ప్పుడు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లో క‌నిపించిన ప్ర‌గ‌తి ఆంటీ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. తెలుగులోనే కాదు.. సౌత్ భాషలు అన్నింటిలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది ప్రామిసింగ్ ఆర్టిస్ట్ అనే పేరు తెచ్చుకుంది. ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ‘ఎఫ్ 3’ లో ప్రగతి తన నటనతో అందరినీ నవ్వించేసి మరికొన్ని మూవీస్ ని గ్రిప్ లో పెట్టేసుకుంది. తర్వాత చిరంజీవి హీరోగా రాబోతున్న ‘భోళా శంకర్’మూవీలో కనిపించబోతోంది ప్రగతి. ఆమెకు హెల్త్ కాన్షియస్నెస్ చాలా ఎక్కువ. ఆమె ఎక్కువ టైం జిమ్ లోనే ఉంటారు. ముఖ్యంగా ఆమె వర్క్ అవుట్ వీడియోలు చూస్తే మైండ్ బ్లాంక్ ఐపోవాల్సిందే. ఇన్స్టా లో ఐతే రచ్చ రచ్చే. ట్రెండీ వేర్స్ లో తనకు నచ్చిన రీల్స్ ని చేసేస్తుంది. అటు బిగ్ స్క్రీన్ మీదనే కాదు బుల్లితెర‌పైన తెగ సంద‌డి చేసేస్తోంది ప్రగతి ఆంటీ. శ్రీదేవి డ్రామా కంపెనీలో మెరిసిన ప్ర‌గ‌తి ఇప్పుడ జ‌బ‌ర్ధ‌స్త్ షోలోను కనిపించి ఎంటర్టైన్ చేసింది.

సూర్యవంశం మూవీ పేరడీని కమెడియన్ నూకరాజు, దొరబాబు కలిసి చేస్తారు. ఈ స్కిట్ ఫుల్ గా న‌వ్వులు పూయిస్తుంది. ఈ స్కిట్ లో దొరబాబు పెద్ద వెంకటేష్ పాత్రలో నటిస్తాడు. "నేను నా పెద్ద కొడుకుని పోలీస్ చేశా.. రెండో కొడుకుని లాయర్ ని చేశా.. ఎందుకో తెలుసా" అని దొరబాబు అడుగుతాడు. దీనికి నూకరాజు బదులిస్తూ.. "నాకు తెలుసు మీరు ఎక్కడైనా దొరికేస్తారు" అంటూ దొరబాబు గతంలో ఒక కేసు విషయంలో పట్టుబడిన విషయం గుర్తొచ్చేలా సెటైర్ వేసేసరికి దొరబాబు తలదించుకుంటాడు ప్రగతి, ఇంద్రజ నవ్వు ఆపుకోలేకపోతారు. ప్రగతి గారికి నేను మార్కులు ఇద్దామనుకుంటున్న అని దొరబాబు కొన్ని నంబర్స్ చెప్పేసరికి ఇంద్రజ మీ ఫోన్ నెంబర్ మాకొద్దండి బాబు అంటూ ఫన్ చేస్తుంది. పరదేశిని దొరబాబు పిలిచాడన్న విషయం తెలిసేసరికి పరదేశి కొంచెం ఓవర్ ఆక్షన్ చేస్తాడు. సూర్యవంశం కామెడీ తప్ప అన్ని సినిమాల కామెడీ చేస్తున్నావ్ గా అంటూ నూకరాజు కామెడీ డైలాగ్ వేస్తాడు. పరదేశి చిన్న వెంకటేష్ అంటే అడ్జస్ట్ చేసుకున్న కానీ దొరబాబు పెద్ద వెంకటేష్ ఏంట్రా బాబు అంటూ నూకరాజు ఏడుస్తూ చెప్పే కామెడీ టైమింగ్ కి అందరూ పడీ పడీ నవ్వుతారు. ఇలా ఈ వారం జబర్దస్త్ మంచి కామెడీని అందించనుంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.