English | Telugu

రాజ్, కావ్య శోభనానికి ముహూర్తం పెట్టిన‌ దుగ్గిరాల ఫ్యామిలీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'.‌ ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్‌-54 లో... సీతారామయ్య ‌గారు పంతులిని పిలిచి కొత్త జంటకి శోభనం ఫిక్స్ చేస్తారు. రాజ్ వాళ్ళ అమ్మ అపర్ణని పిలిచి అమ్మమ్మ శోభనం ముహూర్తం గురించి చెప్పగా.. అయ్యో అత్తయ్య.. రాజ్ ఇంకా భార్యగా అంగీకరించలేదు. ఆ భాధ ఇంకా అలానే ఉంది. ఇప్పుడు ఎందుకు ఈ శోభనమని అడుగుతుంది అపర్ణ. ఎవరేం చెప్పినా వినేది లేదు.. ఈ రాత్రికి శోభనం‌ జరిగితీరుతుందని సీతారామయ్య చెప్పేసి వెళ్ళిపోతాడు.

కాసేపటికి అప్పుకి కాల్ చేస్తాడు రాహుల్.. నీకొక విషయం చెప్పాలి.. మీ అక్కకి మా అన్నకి అని చెప్తుండగా అప్పు దగ్గరి నుండి కనకం ఫోన్ లాక్కుంటుంది. ఏంటి బాబు అని కనకం అడుగగా..‌ శోభనం గదిలో బెడ్ మీద పూలతో డెకరేట్ చేశామని కళ్యాణ్ చెప్పగా.. ఎంత మంచి శుభవార్త చెప్పారు బాబు అని కనకం సంతోషపడి ఫోన్ కట్ చేసి.. అప్పుతో కావ్యకి శోభనమని చెప్పేసి వెళ్ళిపోతుంది. అది జరిగే పని కాదులే అని అప్పు అనుకుంటుంది.

ఆ తర్వాత కావ్య తన‌ గదిలోకెళ్ళి శోభనం గురించి బాధపడుతుండగా అమ్మమ్మ వచ్చి... కావ్యని శోభనానికి రెడీ చేస్తానని చెప్తుంది. ఇప్పడెందుకు అమ్మమ్మ.. రాజ్ గారు నన్ను ఇంకా భార్యగా అంగీకరించలేదు. శోభనం గదికి రానిచ్చేవారైతే నేను ఈ స్టోర్ రూంలో ఎందుకుంటాను అమ్మమ్మ గారని కావ్య అంటుంది. మీ మధ్య దూరం పోవడానికే ఈ ముహుర్తం పెట్టించాం. భార్యగా నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి. తప్పదు.. ఇదే నీ ఇల్లు.. ఇక్కడే ఉండాలి.‌ఇక్కడే బతకాలి..‌ స్థిరత్వం కోసం.. అత్తవారింట్లో అస్తిత్వం కోసం.. వంశానికి ఒక వారసుడిని ఇచ్చే తొలిరాత్రి ఈ ఇంటికి నిన్ను కోడలిని చేస్తుంది. అవమానాలు, అనుమానాలు పక్కన పెట్టి శోభనానికి సిద్దంగా ఉండు.. మేం బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నామని అమ్మమ్మ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కావ్య.. ఏంటో అమ్మమ్మ గారు ఇలా చెప్పారు.. ఎలా జరిగేది అలా జరుగుతుంది.. ఆ దేవునిపై భారం వేసాను అని అనుకుంటుంది.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.